శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి...7/5/15.

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.........ధూర్జటి...7/5/15.

.

చావంగాలము చేరువౌటెరిగియుం చాలింపగా లేక, త

న్నే వైద్యుండు చిక్త్సబ్రోవగలడో, ఏమందు రక్షించునో, 

ఏ వేల్పుల్ కృపజూతురోయనుచు, ని న్నింతైన చింతింపడా

జీవశ్రాద్దము చేసికొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీకాళహస్తీశ్వరా!

జీవించియుండగా తన యొక్క శ్రాద్దమును తానే చేసికొనిన,సన్యాసి కూడా

మరణించే రోజులు దగ్గఱ పడినా,ఆశవదలక,యే వైద్యుడు తనను రక్షించునో,

యే మందు తనకు రోగమును పోగిట్టునో యే దేవతను మ్రొక్కితే 

తన ప్రాణము నిల్చునో అని అలోచిస్తూ 

నిన్ను ఏ మాత్రమును తలచుకొనడు గదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!