శుభోదయం....!

.
.
శుభోదయం....!
.
పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ , నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను , గాళి గొల్వను , బురాణింపన్ దొరంకొంటి మీ
...
దెట్టే వెంట జరింతు దత్సరణి నా కీవమ్మ ! యో యమ్మ ! మేల్
పట్టున్ నాకగుమమ్మ ! నమ్మితి జుమీ బ్రహ్మీ ! దయాంభోనిధీ.!
.
(పోతనామాత్యుడు.)
.
తలపై పుట్ట పెరిగింది వాల్మీకికి . ఆ వాల్మీకిగా నేను పుట్టలేదు . వ్యాస భగవానుని లాగా పడవలో పుట్టలేదు . కవికులతిలకుడై కాళిని కొల్చిన కాళిదాసునూ కాదు . అయినా భాగవతాన్ని తెలుగు భాషలో రచించడానికి పూనుకున్నాను . అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను . నాకు మార్గాన్ని నిర్దేశించి , చేయూత నిచ్చి నడిపించవమ్మా . నీవే తప్ప ఇతఃపరంబెరుగను తల్లీ . అనుగ్రహించవమ్మా . నిన్నే నమ్ముకున్నానమ్మా ! చదువుల తల్లి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!