శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(17/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(17/5/15.)

.

నీ భక్తు ల్పదివేల భంగుల నిను న్సేవింపుచున్ వేడగా

లోభంబేటికి , వారి కోర్కులు కృపాళుత్వంబునం దీర్పరా

దా భవ్యంబు దలంచి చూడు ,పరమార్ధంబిచ్చి పొమ్మన్న ,నీ

శ్రీ భండారములో గొఱంతపడునా? శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీ కాళహస్తీశ్వరా ! నీ భక్తులు వేలవేల విధాలుగా నిన్ను సేవిస్తూ , పరి పరి విధాల 

.

ప్రార్ధిస్తుంటే దయతో వారి వారి కోర్కెలను తీర్చకుండా పిసినారితనం గా

.

ప్రవర్తిస్తున్నావెందుకు ? వారి పుట్టుక , పుణ్యాలను చూచి వారికి మోక్షమిచ్చి

పొమ్మన్ననీ ధనాగారానికి లోటు ఏర్పడదు కదా స్వామీ !

మొదలన్ భక్తులకిచ్చినాడవు గదా !

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!