పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 7 /5/15. )


.
పోతనామాత్యుని ...భాగవత పద్యాలు .!( 7 /5/15. )
.
.చేతులారంగ శివుని బూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబులోనుగా దలపడేని...
గలుగనేటికి దల్లుల కడుపు చేటు
.

తెలుగువారికి ఉగ్గుపాలతో రంగరించి పోసే పద్యాలలో ఈ పద్యమొకటి . భగవద్భక్తీ , మంచి నడవడికా లేనివాని జీవితం వ్యర్థమని వక్కాణిస్తుందీ పద్యం .
.
జీవితాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ఆతని నామాన్ని పెదవులపైనుండి తప్పించకుండా , నమస్కారం చేయడానికి ఎత్తిన చేతులను దించకుండా ,
ఆ పరమాత్ముడు సృష్టించిన జీవులపై అపారమైన కరుణతో ,
సత్యాన్నే పలుకుతూ ( సత్యమనంతం బ్రహ్మా అని కదా సూక్తి –వేదోక్తి కూడా ? )
తనకు భగవంతుడొసగిన జీవితాన్ని సార్థకం చేసుకునే వాడి జన్మే జన్మ .
మిగిలిన వారు పుట్టినా , పుట్టకపోయినా లోకాలకొచ్చిన నష్టమేమీ లేదు — ఇది పోతన్న నమ్మకం . నిజమే కదా .
.
ఈ పద్యంలోని అందమంతా పోతన వాడిన పదాలలో ఉంది . అందరికీ అర్థమయ్యేలా నాలుగు పంక్తులలో బ్రహ్మ సత్యాన్ని బోధించే వారు అరుదు . అసలు లేరేమో ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!