శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(14/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(14/5/15.)

.

.దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే

కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే

వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే

చింతింపన్వలె నీపదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!

.

భావం:

శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, 

స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే,

శరీరము ముసలితనముచే శిధిలము కాక ముందే, 

తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!