శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(15/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(15/5/15.)

.ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండంగ గుహల్గల్గవో,

చీరానీకము వీధులం దొరకదో , శీతామృత స్వచ్ఛ వా:

పూరం బేరులం బారదో, తపసులం బ్రోవంగ నీవోపవో?

చేరం బోవుదురేల రాజుల జనుల్ ? శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీకాళహస్తీశ్వరా! నీ భక్తులకు ఊరూర ప్రజలు శివార్పణమని భిక్ష సమర్పిస్తున్నారు కదా ! 

నివసించడానికి గుహలు ఉండనే ఉన్నాయి కదా ! కట్టుబట్టలు వీధుల్లో లభిస్తాయి కదా ! స్వచ్ఛమైన , తియ్యనైన చల్లని త్రాగునీరు సెలయేరుల్లో ప్రవహిస్తూ దాహార్తిని తీరుస్తోంది కదా ! తాపసులను కాపాడటానికి ఎలాగు నువ్వున్నావు గదా !

మరి వీటన్నింటినీ కాదని మూర్ఖులైన జనం రాజుల పంచన చేరుతున్నారెందుకో ప్రభూ ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!