Wednesday, January 31, 2018

వివేకచూడామణి ! (2వ భాగం .)

వివేకచూడామణి !

(2వ భాగం .)


-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు. 

-

కాలం, దేశం, కారణం :

ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల, దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు.

ఉదయం తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి; తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న పుడుతుంది. దానికి సమాధానం దొరికే వరకు మనసుకు శాంతి ఉండదు - ఎందువల్ల - ‘మనం భూమిమీద ఉన్నాం కాబట్టి, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది కాబట్టి, సూర్యుడు తానున్న చోటనే కదలకుండా ఉన్నందువల్ల, (ఈ మూడు ప్రశ్నలే కాక ‘ఎవరు’ ఏమిటి?’ అనే ప్రశ్న సాధారణంగా ఎదురవుతుంటుంది. అది నామ, రూపాలకు సంబంధించిన ప్రశ్న. ‘రాముడు ఎవరు?’ అని అడిగినప్పుడు పేరు తెలుసుకాని రూపం తెలియదని అర్థం; ‘అతను ఎవరు?’ అన్నప్పుడు రూపం తెలుసుకాని, పేరు తెలియదని అర్థం. ‘అది ఏమిటి?’ అన్నప్పుడు రూపం, పేరు కూడా స్పష్టంగా తెలియలేదని అర్థం).

‘రాముడు ఉన్నాడు’ అని మనం చెప్తే సరిపోదు. ‘ఎప్పుడు ఉన్నాడు?’ ‘ఎక్కడ ఉన్నాడు?’ ‘ఎందుకు ఉన్నాడు?’ అనే ప్రశ్నలు వెంటనే పుడతాయి. ఉదయం


భార్య మీద కోపంతో ఉడికిపోతున్న మనసు, రాత్రికి ప్రశాంతంగా అనురాగంతో నిండిపోతుంది. ఎందుకు? (ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు). దేశ నియమం, కాల నియమం, కారణ నియమం ఈ మూడు ఈ దృశ్య ప్రపంచానికి ప్రధాన లక్షణాలు. (Basic Qualities).

ఈ రోజు మన ఇంట్లో ఉన్న బల్ల, మంచం పది సంవత్సరాల క్రిందట అడవిలో ఒక చెట్టు. 100 ఏళ్ళ క్రిందట అది మరొక చెట్టు విత్తనం. మనకు ఇప్పుడు మహాసముద్రంగా కనపడే నీరు, ఒకప్పుడు నదీ ప్రవాహం. అంతకు ముందు అది వర్షం. అంతకు ముందు అది మేఘం. అంతకు ముందు అది వేరొక సముద్రం. ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, ఈ దృశ్యప్రపంచం సదా మార్పులు చెందుతూ, ఇప్పుడు మనకు కనిపించే విధంగా పూర్వం లేదని, ఇక ముందు కూడా ఈ విధంగా ఉండదని మనం చెప్పగలం.

మార్పు, మార్పు, మార్పు – ఇది ఈ దృశ్యప్రపంచ ప్రధాన లక్షణం. ఈ మార్పు ఒక బాహ్య ప్రపంచానికే కాక, అంతఃప్రపంచంలో కూడా ఉంటుంది. ఒకప్పుడు కోపం, ఒకప్పుడు శాంతం, ఒక చోట ద్వేషం, ఒక చోట రాగం, విజయం సాధించటం వల్ల ఆనందం, ఓడిపోవటం వల్ల దుఃఖం, ఇవన్నీ మనకు అనుభవమే. ఈ దేశ, కాల, కారణాలతో నిమిత్తం లేని, ఈ మార్పులేని ప్రపంచాన్ని మనం ఊహించటం కూడా కష్టం.

(ఇంకావుంది.)


Tuesday, January 30, 2018

వివేకచూడామణి (1) .

వివేకచూడామణి (1) .

-

శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు. 

-

దృశ్యప్రపంచం :

మనకందరకి పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు – అన్ని వేళలలో, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులపై ఒక నిర్దిష్ట జ్ఞానం ఉంటుంది. కనబడే ప్రతి వస్తువునకు ఒక రూపం, ఒక పేరు ఉంటుంది. పేరు తెలిస్తే రూపం ఊహించవచ్చు. రూపం చూసినప్పుడు పేరు జ్ఞాపకం వస్తుంది. ఏ రూపానికైనా పేరు లేకపోతే, ఏదో ఒక పేరు పెట్టి, ఆ పేరుతో దాని గురించి చెప్తాం. ఈ సూత్రం, కనిపించే వస్తువులేకే కాక, వినిపించే శబ్దాలకు, నాలుకకు తెలిసే రుచులకు, ముక్కుకు తెలిసే వాసనలకు, శరీరానికి తగిలే స్పర్శలకు వర్తిస్తుంది. పంచేంద్రియాలకు అనుభవమయ్యే వివిధ గుణాలకు (స్పర్శలకు) ఆ గుణాలు గల వస్తువులకు వేరు వేరు పేర్లు పెట్టి వ్యవహరిస్తుంటాం. ఆ పేరుతో ఆ గుణాలుగల వస్తువును నిర్దేశించగలుగుతాం.

‘కుర్చీ కుడి పక్కన ఉన్న బల్ల మీద ఉన్న ఎర్రని పుస్తకం తీసుకురా’, అని చెప్పినప్పుడు, ఆ గదిలో ఎన్ని వస్తువులు ఉన్నా, ఎంతటి చిన్నపిల్లవాడైనా ఆ పుస్తకాన్ని తెచ్చి ఇవ్వగలుగుతాడు. కుర్చీ వేరు, బల్ల వేరు, కుడి వేరు, ఎడమ వేరు, ఎరుపు వేరు, పుస్తకం వేరు, తేవటం వేరు, ఇవ్వటం వేరు- కాని ఈ పేర్లేవీ వస్తువుల మీద వ్రాసి లేవు. అవి చిన్నప్పటి నుంచి, పెద్దవారి నుంచి వినటంవల్ల, ఆ వస్తువుకు, ఆ పేరుకు ఒక అవినాభావ సంబంధం మన మనసులో ఏర్పడింది.


అందువల్ల ఒకరి మనసులో ఏర్పరచుకున్న రూపాలను నామాలద్వారా వేరొకరికి చెప్పటం జరుగుతున్నది. అప్పుడు ఈ రెండవవాడు, తన మనసులో ఏర్పరచుకున్న రూప, నామ, సమన్వయాన్ని బట్టి ఒక భావం ఏర్పరచుకుంటాడు. ఆ భావానికి అనుగుణంగా తాను ప్రవర్తిస్తాడు.

ఈ వివిధత్వాలన్నింటినీ సమన్వయపరచి, ఒకే వాక్యంలో ఇమిడ్చి, మన మనసులోగల భావాన్ని పరులకు వ్యక్తపరచటానికి ఒక భాషను వాడుతున్నాము, మాటలను వాడుతున్నాం. మాట – వాక్కు అంటే ఏంటి? ఒక శబ్దమో, కొన్ని శబ్దాల కలయికో ఒక మాట అవుతున్నది. ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం వెనక ఒక భావం ఉంటుంది. ఆ భాషకు ఒక ‘లిపి’ ని కూడా జోడిస్తే, ఆ మాటను చూడగలం, వినగలం. ‘పుస్తకం’ అని వ్రాస్తే, దానిని వాచకంగా, ‘పుస్తకం’ అని అంటాం. దాని అర్థం అందరు చదువుకోవటానికి ఉపయోగపడి కాగితాలతో కుట్టి, అచ్చు వేయబడ్డ వస్తువు అని అర్థం చేసుకోగలం. ఆ అర్థం ద్వారా ఎదుటి మనిషి మనసులో ఉన్న ‘పుస్తకం’ అనే భావాన్ని మనసులో ఏర్పరచుకోగలం. ఒక భావాన్ని ఒక మనసు నుంచి మరొకరి మనసులోకి ప్రవేశించేటట్లు చేయటానికి ఈ ప్రక్రియలన్నీ అవసరం. వ్రాయటంలో లోపమున్నా, ఉచ్చరించటంలో లోపమున్నా, వినటంలో లోపమున్నా, అర్థం చేసుకోవటంలో లోపమున్నా, భావ ప్రసారం దెబ్బతింటుంది. ఒకరి మనసులో ఉన్న రూపం ఒకటి, ఇంకొకరు తన మనసులో ఏర్పరచుకున్న చిత్రం వేరొకటి కావచ్చు.

ఇది ఒకరి భావాలను ఇంకొకరు అర్థం చేసుకోవటంలో లోపమే కాక, తనంతట తాను స్వయంగా చూసిన వాటిలో కూడా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు భావాలను ఏర్పరచుకోవచ్చు. ఒక పోలీసు అధికారి దొంగలకు భయంకరమైన వ్యక్తిగా, కన్నకొడుకుకు ఆదర్శవంతమైన మహాపురుషుడిగా, భార్యకు కొరకరాని కొయ్యగా, తల్లికి పనిలో సతమమవుతూ భోజనం కూడా మరచిపోతున్న చిన్న పిల్లవాడిలాగా, క్రింది అధికారులకు కఠోరమైనవాడిగా, పై అధికారులకు అత్యాశకు పోయే డాంభికుడిగా కనపడవచ్చు. వారి వారి మనసులోని భావాలను అనుసరించి, అతని రూపం కూడా వారికి ఆ విధంగా కనపడుతుంది.


ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరూ యథా తథంగా చూడటంలేదు. ఇంద్రియాలు అందజేసే వార్తలను మనసు, తన మనోభావాలకు అనుగుణంగా, (ఈ దృశ్యప్రపంచం) తనలో ఒక భావనాప్రపంచంగా ఏర్పరచుకుంటుంది. ప్రతి వ్యక్తి తన మనసులో ఏర్పడిన ఈ భావనాప్రపంచాన్నే చూస్తుంటాడు. తాను మనసులో ఏర్పరచుకున్న భావనాప్రపంచమే నిజమైన ప్రపంచమని అనుకుంటుంటాడు.

మనం ఈ దృశ్యప్రపంచాన్ని చూడటమే కాక, ఇందులో ప్రవర్తిస్తూ ఉంటాం. కాళ్ళతో నడవటం, చేతులతో పనులు చేయటం, నోటితో మాట్లాడటం, ఇవన్నీ బాహ్యప్రపంచంలో మనం చేసే పనులు. మనసుతో ఆలోచించటం, బుద్ధితో విమర్శించటం ఇవి అంతఃప్రపంచంలో చేసే పనులు. ఈ పనులన్నీ మనం ఇష్టపూర్వకంగా చేస్తుంటాం. కొన్ని పనులు మన ఇష్టం లేకుండానే జరుగుతుంటాయి. ఊపిరి పీల్చటం, గుండె కొట్టుకోవటం, రక్తప్రసారం, అన్నం జీర్ణమవ్వటం మొదలైనవి. మనం ఇష్టపూర్వకంగా చేయగలిగే పనులకు ఉపయోగపడే అవయవాలనే కర్మేంద్రియాలు అంటారు. అవి కాలు, చేయి, నోరు మొదలైనవి. అదే విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు – కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మనకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలుగ చేసేవి ఈ పది ఇంద్రియాలు మాత్రమే. ఈ దశేంద్రియాల వెనుక (శరీర, మనోబుద్ధుల వెనుక కూడా) ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి వల్లనే ఈ ఇంద్రియాలన్నీ పని చేస్తుంటాయి. మన శరీరంలో జరిగే మిగిలిన అయిష్ట పూర్వకమైన పనులు కూడా ప్రాణశక్తి వల్లనే జరుగుతాయి. ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఈ జగత్తులో సృష్టి జరుగుతున్నది.

ప్రకృతిలో మరి కొన్ని శక్తులు ఉన్నాయి. గాలి వీచటం, వర్షం కురవటం, నదులు ప్రవహించటం, తుఫానులు, భూకంపాలు ఇటువంటివన్నీ ప్రకృతి శక్తులు.


ఇంకా వుంది .

Monday, January 29, 2018

ముద్ద బంతి పూవు లో మూగ కళ్ళ ఊసులకు యాభయ్యేళ్ళు !!

ముద్ద బంతి పూవు లో మూగ కళ్ళ ఊసులకు యాభయ్యేళ్ళు !!

-

(31-1-1964న విడుదలై నేటికీ తెలుగు వారి హృదయాల్లో ఆడుతోంది) ఆ తరానికి చెందిన ప్రేక్షకుల్ని అడగండి 'మూగమనసులు' గురించి ఎన్నో చెబుతారు. మధురమైన జ్ఞాపకాల్ని పంచుకొంటారు.

ఆ జ్ఞాపకాల్లో గోదావరి గట్టు .. ఆ గట్టు మీద చెట్టు ..చెట్టు కొమ్మన పిట్ట.. పిసరంత పిట్టమనసులో దాగున్న మొత్తం ప్రపంచం ఇవన్నీ మనకి కనిపిస్తాయి. 

అల్లరి పిల్ల గౌరి. అమ్మాయిగారు రాధ, పదవ నడిపే గోపి - ఈ ముగ్గురూ మూగమనసులతో చెప్పే ఊసులూ, బాసలూ మన హృదయాలు వినిపిస్తాయి.

గోపి మరి జన్మ ఎత్తి , తన తో పాటు మళ్ళీ జన్మించిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకొని , హనీ మూన్ కోసం గోదావరి మీద లాంచీ లో ప్రయాణిస్తూ "ఈ నాటి ఈ బంధమేనాటిదో .." అని పాట అందుకుంటే ప్రేక్షకులు సైతం మరో జన్మ ఎత్తిన ఫీల్ తో ఆ పాటను ఎంజాయ్ చేసారు. 

గత జన్మలో సుడిగుండం లో తమ పడవ మునిగి పోయిన సంఘటన గుర్తుకొచ్చిగోపి కలవర పడితే హాల్లో జనం ఆత్రుత పడ్డారు. పడవ నడుపుతూ అమ్మాయి గారికి గోపి పాట నేర్పినప్పుడు సావిత్రి తో పాటు ప్రేక్షకులంతా మూకుమ్మడి గా "నా పాట నీ నోట పలకాల సిలకా "అంటూ శ్రుతి కలిపారు. ఏయన్నార్ ని ఆట పట్టిస్తూ జమున "నీ ముక్కు మీద కోపం .." అని పాడినప్పుడు , 

"గౌరమ్మా నీ మొగుడెవరమ్మా " అని ఏయన్నార్ జమునని ఆట పట్టించినప్పుడు జనం బలే బలే అనుకొన్నారు. అమ్మాయి గారిని మనసులోనే మౌనం గా ఆరాధించిన గోపి ఆమెకు అంపకాలు పెట్టె వేళ -"ముద్ద బంతి పూవులో" అని ఏయన్నార్ పాట అందుకుంటే 'అయ్యో వెర్రివాడా' అని జనం జాలి పడ్డారు. భర్తను కోల్పోయి పుట్టింటికి రాధమ్మ తిరిగొస్తే -"పాడుతా తీయగా ..' అని గోపి పాడిన జోల పాట 50సంవత్సరాలు గడిచినా నేటి కీ ఆ తరం ప్రేక్షకుల హృదయాల్ని జొగొడు తూనే ఉంది. చిత్రం ఏమిటంటే రెండు జన్మల కథ అయిన మూగమనసులకు తెర వెనుక పునాదులైన ఆదుర్తి లేరు .. ఆత్రేయ లేరు .. ముళ్ళపూడి లేరు .. దాశరథి, కొసరాజు లేరు .. మహదేవన్ లేరు .. తెర మీద మూల స్తంభాలైన సావిత్రి, అక్కినేని లేరు. జమున మాత్రమె మిగిలారు.

'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు .. ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు " అనుకొంటూ , ఆ సినిమా లో లాగే ఏయన్నార్, సావిత్రి , ఆదుర్తి, ఆత్రేయ, మహదేవన్ లాంటి వాళ్ళు మళ్ళీ జన్మించాలని ఆ తరం ప్రేక్షకులు కోరుకొంటున్నారు

Saturday, January 27, 2018

సుందరకాండ విశిష్టత !

సుందరకాండ విశిష్టత !

-

ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. 

ఇది రామాయణంలో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. 

హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునికి తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు.


సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి అనేక కారణాలున్నాయి. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు. శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.

భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు. అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. 

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ.


సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.

పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. 

మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలినీ యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. 

ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి. ఆమెయే సౌందర్యము. 

అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు. అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము: సంక్షేప రామాయణం, శ్రీరామావతారము, సీతాకళ్యాణము, సీతారామోయోః సుఖజీవనము, నాగపాశము విమోచనము, ఆదిత్య హృదయము, రావణవధ, బ్రహ్మకృత రామస్తుతి, పట్టాభిషేకము.

ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు.


పెద్దనామాత్యుని నాయిక వరూధిని !

పెద్దనామాత్యుని నాయిక వరూధిని.!

.

"మృగమదసౌరభవిభవ

ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ

స్థగితేతర పరిమళమై

మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్".!

.

“కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము 

ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే 

గాలితెమ్మెర … అలా …వీచిందిట!”

.

పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది.

.

(వడ్డాది పాపయ్య గారి వరూధిని.)

అగ్నిమీళే పురోహితమ్‌' -భగవంతుడు !

అగ్నిమీళే పురోహితమ్‌' -భగవంతుడు !

.

భారతీయ తత్వ దర్శనం ప్రకారం భగవంతుడు ఎక్కడో వేరే లోకంలో ఒక రూపంతో ప్రత్యేకంగా ఉండడు.


భారతీయ దైవానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా లేదు.


అటువంటి దైవం గురించి ఎవరో ఒక మనిషి లేదా ప్రవక్త చెప్పలేదు. నేను చెప్పిందే నిజమని ఎవరూ చెప్పలేదు.


దైవాన్ని ఎవరికి వారే తెలుసుకోమన్నారు.


ఒక భారతీయుడు అఖండ ప్రకృతిలో ఉన్న అనంతమైన శక్తిలో దైవాన్ని దర్శిస్తాడు.


అందుకే వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో మొదటి సూక్తం 'అగ్నిమీళే పురోహితమ్‌' అంటూ అగ్నిని స్తుతించడంతో ప్రారంభమవుతుంది.


భారతీయ దైవాలు మిగిలిన మతాల్లోలాగా కేవలం

ఊహాత్మకం (Abstract) కాదు. అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మడం కాదు.


ఎక్కడో ఒక గ్రంధంలో రాసారు కాబట్టి మనం కూడా ఉన్నారనే భావన చేయడం కాదు.


కళ్ళెదురుగా ఉండే వాస్తవం. అదే ప్రకృతి దర్శనం.


భారతీయ సంస్కృతిలో ప్రధానంగా పూజలందుకొనే


శివుడు, విష్ణువు, దుర్గ వంటి వారందరూ కూడా ప్రకృతి శక్తులే.

ఉదయ రాగం - - వానే తాయి... తాయిరే యశోద. ని వానే తాయి. తాయి రే యశోద ని వానే తాయి..

Morning Raga .... ఉదయ రాగం !


నాకు చాల ఇష్టం .. మణి శర్మ నిజం గా మనకు ఉన్న మంచి రత్నం ..

my fav fusionsong forever...

-

తాయి రే యశోద ని వానే తాయి - రచన పరమపూజ్య శ్రీ స్వామి జగద్విఖ్యాత.


తాయి రే యశోద ని --- వానే తాయి... తాయిరే యశోద. ని వానే తాయి.

తాయి రే యశోద ని వానే తాయి..


మధుకర వన్-ధన –గోపికర చన్-ధన

గోపి మనో-ధన ని వానే తాయి.

హరి --- గోపిమనోహర-- ని వానే తాయి 

హరి --- గోపిమనోహర-- ని వానే తాయి.


గోకుల బృందాఆఆఆఆఆఆ గోవింద చంద్రాఆఆఆఆఆఆ

తాయి రే యశోద ....ని వానే తాయి. ( 2 ). 

హరి ---- తాయి రే ----యశోద ని వానే తాయి.

హరి ---- తాయి రే ----యశోద ని వానే తాయి.


మురళీ మనోహరా – ఆనంద సుందరాఆఆఆఆ

తాయి రే యశోద ---ని వానే తాయి.

హరి---- తాయి రే ----యశోద ని వానే తాయి. ( 2 )


" తాయి రే తాయి - మే వానే "

తాయి రే తాయి - నే వానే


తాయి రేరేరేరేరేరేరేరేరేరేరే ఆమ్మ తాయి రేరేరేరేరేరేరేరేరేరేరే

తాయి రేరేరేరేరేరేరేరేరేరేరే .... ఓ " ఆమ్మ "

( తా .... యి .....రేరేరేరేరేరేరేరేరేరేరే )


తాత్పర్యము: --


ఓ మాతా యశోదా! దయయుంచి రావమ్మా! వచ్చి నీ కుమారుడు ఏమి చేస్తున్నాడో చూడు. కృష్ణుడు పూర్తిగా అల్లరివాడైపోతున్నాడు.


ఓ తల్లీ యశోదా ! నీ కృష్ణుడు తేనె కంటే తియ్యనివాడు, అంతటిపరిశుద్ధుడు, అంతటి స్వచ్చమైన వాడు. అతని కౌగిలి మొత్తం శరీరాన్నే పులకింపజేస్తుంది. అతడి పాదాలను స్పృశించినంతటనే శ్రీమహా విష్ణువు పాదాలను తాకిన అనుభూతి కలుగుతుంది.


ఆ యువకిశోరము తన మధురమురళీ గానముతో సదా దివ్యసంగీతాన్ని ఆలపిస్తున్నాడు. ఆ గానమాధుర్యము గోపికలను ఎంతగా ఆకర్షిస్తూ ఉన్నదంటే, మేమందరమూ మాచేతుల్లో ఏ పని ఉన్నా సరే, ఆవల పడవేసి, అతని వద్దకు పరుగుతీస్తున్నాము. మమ్మల్ని ఆకర్షించడానికి అతడు కొన్ని సార్లు తుంటరి సంగీతాన్ని, కొంటె పల్లవులనూ గానం చేస్తుంటాడు. అది మమ్మల్ని ఉడికిస్తూండటంతో మేము అతని వెంబడి పిచ్చివాళ్ళవలె పరుగులు తీస్తున్నాము.


అతడు మురళి వాయించడం ప్రారంభించగానే, కేవలం గోపికలే కాదు మొత్తం ప్రపంచమే అతడి ఆకర్షణకు గురవుతోంది. అతడి మురళీ గానంవినగానే, గోపికల మదితలపుల్లో శాంతి వెల్లివిరిసి, వారి గుండెల్లో ప్రేమానురాగాలు, భక్తిభావాలూ పొంగి పొర్లుతాయి.


కృష్ణుడు ఒళ్ళంతా గంధం పూసుకొని మధుర పరిమళంతో విరాజిల్లుతున్నాడు. ఆ దివ్య పరిమళం గోపికలను, ఇతరులనే కాకుండా, గోవులూ, లేగలు వంటి పశువులతోపాటుగా ప్రతియొక్కర్నీ ఆకర్షిస్తూంది. అతడిని కలిసేందుకు అతడియొద్దకువచ్చిన ప్రతివారూ, స్వర్గధామం లాంటి ఆ నందకిశోరుని మేను వెదజల్లే దివ్యపరిమళాన్ని ఆఘ్రాణిస్తున్నారు. మొత్తం బృందావనమే ఆ మధురపరిమళానికి తన్మయత్వం చెందుతోంది. ఈ స్వర్గానుభూతుల సుగంధ పరిమళాలతోనూ, తులసి, కదంబకేళి మొక్కల సహజమైన సువాసనలతో బృందావనమంతా స్వర్గభూమిని తలపిస్తోంది.


గోకుల బృందాఆఆఆఆఆఆ గోవింద చంద్రాఆఆఆఆఆఆ


కృష్ణుడు ఎంతో అందమైనవాడు, దయామయుడు, అమాయకుడు. ఈ లక్షణాలవల్ల అతడు గోపీ మానస చోరుడై, గోపికలతో ఆడుతూ,పాడుతూ, వారు స్నానం చేస్తున్నప్పుడు వారి దుస్తుల్ని దాస్తూ, వారి అవ్యాజమైన హద్దులెరుగని ప్రేమను పరీక్షిస్తున్నాడు. తన నాయకత్వ లక్షణాలతో అతడు గోవులమందకు నాయకుడై, అవి ఆపదల్లో ఉన్నప్పుడు వాటిని సంరక్షిస్తున్నాడు. ఇంద్రుడు బలగర్వముతో ప్రచండ మలయమారుతాన్ని సృష్టించి గోకులాన్నంతటినీ ధ్వంసం చేయగా, కృష్ణుడు తన అద్భుతమైన మహిమా శక్తితో గోవర్ధనపర్వతాన్ని చిటికెనవేలుతో ఎత్తి, గొడుగులాగా దాని క్రింద ఆబాలగోపాలాన్నీ, గోవులమందనూ రక్షించాడు. అప్పటినుండీ కృష్ణుడు మన గోవిందుడయ్యాడు.


తారాలోకంలో అనేక తారలమధ్య ప్రశాంతంగాచల్లని ధవళకాంతులనిచ్చే నిండుపున్నమి జాబిల్లి లాగా, బృందావనంలో అతడు, దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ మెరిసిపోతున్నాడు. కాబట్టి నీ కొడుకు గోకుల చంద్రుడయ్యాడు.... మాతా! గోకులాన్ని మాత్రమేకాదు, మొత్తం విశాలవిశ్వాన్నే రక్షించగల రక్షకుడిగా నీ కుమారుణ్ణి నీవు మలిచావు. గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలందర్నీ దానికిందచేర్చి కాపాడి తన మహిమలను అద్భుతంగా చేసి చూపించాడు.


మురళీ మనోహరాఆఆఆఆ – ఆనంద సుందరాఆఆఆఆ:


యశోద మాతా! నీ కృష్ణుడు సదా మురళితో దివ్యగానాన్నిఆలపిస్తుంటాడు. తన మనోహరమైన మురళినుంచి వెలువడే మృదుమధుర గానంతో అతడు అనంతవిశ్వాన్నేగాక స్వర్గధామాన్ని కూడా పరవశింపజేస్తున్నాడు. కాబట్టి మాతా! మేము గోపికలము, అతణ్ణి మురళీ మనోహరా అని పిలుస్తున్నాము.


కృష్ణుడితో రాసలీలనృత్యాలనాడేందుకు గోపికలమైన మేము ఎంతగానో ఇష్టపడతాము. నీ కుమారుడి ముగ్ధ మనోహర సుందరరూపాన్ని కీర్తిస్తూ మేము పరవశులై అతడితో నృత్యం చేస్తుంటే అతడి అందం మమ్మల్ని అతడికి దూరంగా వెళ్ళనీయడంలేదు. అంతటి అందగాడు నీ కుమారుడు. మేము ఆ కృష్ణ భగవానుడి అనంతమైన అనుగ్రహానికిపాత్రులైన గోపికలము. అతడు మమ్మల్ని అంతగా అశీర్వదించాడు. కృష్ణుడి యందు మాకు గల భక్తికి ఇది తార్కాణము.


" తాయి -రే-యశోద ని వానే తాయి. "


ఇక్కడ తాయి అంటే తల్లి అని అర్థం.


అయితే ఇందులో మొత్తం మూడు విధములైనటువంటి తాయిలు ఉన్నాయి. మొదటి తాయికి అర్థం తల్లి.


అయితే అలంకారశాస్త్రం ప్రకారం యిక్కడ రెండోవ తాయి యొక్క అర్థం పూర్తిగా మారిపోయింది.


రెండో తాయి యొక్క అర్థం


అమ్మా! తనను తాను కాపాడుకుంటూ, సర్వ జగత్తునూ సంరక్షించే సమర్థతగల దేవదేవుడూ, ప్రతియొక్కరిచేతా ప్రేమించబడుచున్న కృష్ణుడి లాంటి ప్రేమమూర్తిని, అద్భుతమైన పుత్రుణ్ణి పొందిన నీవు నిజంగా అదృష్టవంతురాలవు.


మూడో తాయికి, అర్థం.


అమ్మా! నీవు చాలా గొప్ప ప్రతిష్టగల తల్లివి. నీవు కృష్ణుడిని ఎంత గొప్పగాతీర్చిదిద్దావంటే, అతడొక మహోన్నత వ్యక్తిత్వంతో నీ చేతులలో పెరిగి, తన మంత్రోచ్చాటన శక్తిచే అతడు ప్రజలకు ప్రేమనూ, శాంతినీ భగవద్గీత ద్వారా అనంతవిశ్వానికీ పంచి, భక్తిప్రపత్తులను విశ్వమంతటా వ్యాపింపజేశాడు.


మాతా! అటువంటి మహనీయుడిని పుత్రుడిగా బడసి ఈ ప్రపంచానికి అందించినందులకు, అచంచల భక్తి, ప్రేమనిండిన హృదయంతో మేము హృదయపూర్వకంగా నీకు వందనాలు సమర్పిస్తున్నాము యశోదమ్మ.


Friday, January 26, 2018

అయ్యప్ప' -

అయ్యప్ప' -

( రాజా రవి వర్మ చిత్రం .)

-

హరివరాసనమ్ విశ్వమోహనమ్

హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్

అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్

హరిహరాత్మజమ్ దేవమాశ్రయే


శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా


-

అయ్య (= విష్ణువు), అప్ప (= శివుడు) అని పేర్ల సంగమంతో 'అయ్యప్ప' నామం పుట్టింది.

మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు.

కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. 

శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. 

"అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు

-

ఇరుముడి-

-

రెండు అరలువున్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకుని, మోసుకుపోతుంటారు. ఇరుముడిలో1. నేతితో నింపిన కొబ్బరికాయ 2. రెండు కొబ్బరి కాయలు 3. వక్కలు 4. తమలపాకులు 5. నాణాలు 6. పసుపు 7. గంధంపొడి 8. విభూతి 9. పన్నీరు 10. బియ్యం, 11. అటుకులు, 12. మరమరాలు, 13. బెల్లం/అరటిపళ్ళు 14. కలకండ 15. అగరువత్తులు 16. కర్పూరం 17. మిరియాలు (వావర్‌ దర్గాకోసం) 18. తేనె 19. ఎండు ద్రాక్ష 20. తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను 'ఇరుముడి'గా కట్టుకునే ఉత్సవాన్ని'కెట్టునిరా' లేదా 'పల్లికెట్టు' అంటారు.

-

Thursday, January 25, 2018

నమ్మితే నమ్మండీ-నవ్వితే నవ్వండి.!

నమ్మితే నమ్మండీ-నవ్వితే నవ్వండి.!

-

మన తెలుగును యింగ్లీసోడు కాపీ చేశాడని,


ఇంగ్లీషుకు తల్లి,తండ్రి తెలుగేనని అంటున్నారు


శంకరనారాయణగారు.


మీరు నమ్మితే నమ్మండీ -నవ్వితే నవ్వండి.


యింగ్లీషువాడు boy బాయ్ అని కలవరిస్తాడు 

అది మన అబ్బాయి నుంచి పుట్టిందే.


'మనిషి' అనే దాన్ని వాళ్ళు man she

గా మార్చి వాడుకుంటున్నాడు


.బైరన్నని బైరన్ అంటున్నాడు,


అలకసుందరుడిని మార్చి అలెగ్జాండర్అన్నాడు,


మన తలారి స్వాములను టయిలర్ సామ్యుల్అనిపెట్టుకున్నాడు


.మన 'నరము' అనే పదమే 'nerve'గా మారింది.


యింగ్లీషువాడి సొమ్మేం పోయింది?


ఎప్పుడూ చలికి వణుకుతూ సరిగ్గా పలకడం చేతకాక తెలుగు

భాషను పీకి పాకాన పెట్టాడు


తెల్లవాడి తాడుతెగా మన'త్రాడు'నుthreadగామార్చేసుకున్నాడు.


మన 'కాసు'ను cashగా చేసుకున్నాడు.'


ఎవ్వని చె జనించు ఆంగ్ల మెవ్వని లోపలనుండు లీనమై '.అని పాడుకుంటే చాలు పదహారణాలఆంధ్రుడు ఆరడుగుల తెలివెన్నెల తెలుగువాడు కనిపిస్తాడు.


యిలా చెప్పడం యింగ్లీషు వాడి చెవిలో పువ్వులు పెట్టడం అంటారా?


మన పువ్వులోనుంచి పుట్టిందే వాడి flowerగా మారింది.


మనం పంపుతున్నాం అంటాం యింగ్లీషువాడు pumpచేస్తానంటాడు.


మన 'వీలు;ను బట్టే యింగ్లీషువా will గామారింది.


యింగ్లీషులోని irk మన 'ఇరకాటం' లోనుంచి వచ్చిందే.


మనం పోరా 'బడుద్దాయ్'అని తిడుతుంటే 

ఆ మాటను తన అక్షరాల్లో వ్రాసుకొని bad అనే మాటను తయారుచేసుకున్న్నాడు.


మనంలక్ష,లక్ష అని కలవరిస్తుంటే మేలుకున్న 

తెల్లవాడు lakh అనేశాడు.


మన 'మణి' నుంచి పుట్టిందే వాడి money.


'క్రూరమైనవాళ్ళు' అని మనం తిడుతుంటే విని cruel

అనే మాటను తయారుచేసుకున్నాడు.


మన వాహనాల నుంచి పుట్టిందే వాళ్ళ vehiclesఅనే మాట


మన ఒంట్లు ను one,two మన పందికొక్కును 'bandikoot అన్నాడు.


మన ముంగీసనుmangoose అన్నాడు.


గోదామును 'godown మార్చుకున్నాడు.coin యే మన 'కాణీ'


మన 'మడ్డి' వాడి mud అయింది.


మన 'నారింజ' తెల్లవాడి నోట్లో బడి orange అయింది.


మన 'ఆపేక్ష' వాడి affection గా మారింది


మన 'గోనె' లోనుంచి పుట్టిందే gunny


ఇంగ్లీషుకు తండ్రి లాంటివాడు(భాషా పిత) కాబట్టే మన తెలుగువాడికి యింగ్లీష్ అంటే అంత యిష్టం.


యిదంతా సరదాకి హాస్యావధాని శంకరనారాయణ గారు వ్రాశారు.


మన తెలుగు వాళ్ళెందుకు యింగ్లీషు అంటే పడిచస్తారు?


అన్న ప్రశ్నకు సమాధానంగా యింత చెప్పుకొచ్చారు.పితృ వాత్సల్యం కదా!

-

Wednesday, January 24, 2018

కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం! (విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. )

కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం!

(విజయవిలాసం-కర్త చేమకూరవేంకటకవి. )


క్లుప్తంగా కథ:


ద్వారకనుండి గదుడనేవాడు పాడవులను దర్శించటానికి వస్తాడు. ఆప్పుడు అర్జునునితో శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్ర సౌందర్యన్ని వర్ణిస్తాడు.


కానన్ సుభద్రకున్ సమంబు గాఁగ నే మృగి విలో

కనన్ ; నిజంబు గాఁగ నే జగంబునందుఁ జూచి కా

కానన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః

కన న్మనోఙ్ఞ రేఖ లెన్నఁగాఁ దరంబె గ్రక్కనన్?

.

ఆమె అద్భుత సౌందర్యాన్ని గురించి విన్న అర్జునుడు ఆమెపై మరులుకొంటాడు. పాండవులు తమలో తాము ఒక నియమాన్ని ఏర్పరచుకున్నారు. అదేమిటంటే ద్రౌపతి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వద్ద ఉండేటట్టుగానూ ఆ సమయంలో మిగిలిన వారు వారి ఏకాంతతకు భంగం కలిగించ రాదని, ఒకవేళ అలా భంగం కలిగించితే వారు ఒక సంవత్సరకాలం దేశాటన చేయ్యాలని నియమం. ఒక వృద్ధ బ్రాహ్మణుని గోసంరక్షణార్ధం అర్జునుడు ఆ నియమాన్ని ఉల్లంఘించి అన్నగారైన ధర్మరాజు మందిరంలో ఉన్న తన శస్త్రాస్త్రాలను తెచ్చుకొని నియమ భంగం చేస్తాడు. నియమోల్లంఘన జరిగింది కాబట్టి అర్జునుడు భూప్రదక్షిణకి బయలుదేరతాడు. అన్నగారు వారించినా ఒప్పుకోలేదు. ఆ సాకుతో ద్వారకకు వెళ్ళి సుభద్రని చేపట్టాలని అర్జునుని ఆలోచన. తనవెంట ధౌమ్యుని తమ్ముడి కొడుకు మిత్రుడు ఐన విశారదుడు, మరికొంత పరివారంతో భూప్రదక్షిణకి బయలుదేరాడు.


అలా బయలుదేరిన అర్జునుడు గంగానదీతీరానికి చేరాడు. గంగాతీరం చేరిన అర్జునుడు గంగాభవానిని స్తుతించి ఆ రోజుకి గంగాతీరాన విశ్రమిస్తాడు. ఆ గంగలో ఉన్న ఉలూచి అనే నాగ కన్య అర్జునిపైన ఎన్నేళ్ళుగానో మరులు కొంది. ఆమె కోరిక తీరే సమయం ఆసన్నమయింది. గంగాతీరాన్న విశ్రమించిన అర్జునుని చూసి"రాజసము తేజరిల్లు నీరాజుఁ గూడి ఇంపుసొంపులు వెలయ గ్రీడింపవలదే" అని అనుకొని అతనిని తన నాగలోకానికి తీసుకొని పోయింది. అక్కడ అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. ఉలూచి అతనికి తన కోరిక వెల్లడించింది. "భూమి ప్రదక్షిణము సేయఁ బోయెడివానిన్ గామించి తోడి తేఁ దగవా? మగువ ! వివేక మించుకైన వలదా ?" అని అడిగాడు. ఎన్ని విధాల చెప్పినా ఆమె మాట వినలేదు. తనను చేపట్టకపోతే ప్రాణత్యాగం చేస్తా అని...

-

చెఱకువిలుకాని బారికి వెఱచి నీదు

మఱుగుఁ చేరితిఁ; జేపట్టి మనుపు నన్నుఁ;

బ్రాణదానంబు కన్నను వ్రతము గలదే?

యెఱుఁగవే ధర్మపరుఁడవు నృపకుమార !

-

అన్నది.

ఆవిధంగా అతనిని ఒప్పించిన ఉలూచికి ఇలావంతుడనే కుమారుడు పుట్టాడు. (ఇదంతా ఒకే రాత్రిలో జరిగింది). మరునాడు ఉదయం తన మిత్రులంతా ఎదురు చూస్తారని వెళ్ళకపోతే వారు కలత చెందుతారని ఉలూచికి నచ్చచెప్పి అక్కడనుండి బయలుదేరి మిత్రులని కలిసి తన భూప్రదక్షిణ ప్రారంభిస్తాడు. అవిధంగా తిరుగుతూ దక్షిణ భారతంలో పాండ్యదేశరాజధాని ఐన మణిపురానికి చేరుకున్నాడు. ఆ రాజ్యానికి రాజు మలయధ్వజుడు. ఆతనికి ఒక కుమార్తె ఉన్నది పేరు చిత్రాంగద. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన అర్జునుడు విశారదునితో పెండ్లికి రాయబారం పంపుతాడు. అర్జునుడు అల్లుడిగా చేసుకునేందుకు మలయధ్వజుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అలావారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోతుంది. కాలక్రమేణా చిత్రాంగద గర్భందాల్చి బబ్రువాహనుడికి జన్మమిస్తుంది. కుమారుని అచ్చట్లు ముచట్లు తీరాక అర్జునుడు మరల తన భూప్రదక్షిణకు బయలుదేరాడు. అలా తిరుగుతూ సౌభద్ర నదిలో శాపగ్రస్తులైన మొసళ్ళకు శాపవిమోచనం కలిగించి అక్కడనుండి పశ్చిమాన్న ఉన్న ద్వారకా నగరానికి చేరుకున్నాడు.


అక్కడికి చేరుకున్నాక అర్జునుడూ శ్రీకృష్ణుని తలచుకొన్నాడు. శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యక్షమయి అతనికి సాధువేషంలో రైవతక పర్వతం మీద ఉండమని అదేశిస్తాడు. మరునాడు అక్కడ ఒక గొప్ప సన్యాసి వచ్చి ఉన్నాడని ద్వారక ప్రజలంతా వస్తారు. బలరామ శ్రీకృష్ణులు కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. అప్పుడు బలరాముడు అర్జునుని నిజమైన సన్యాసిగా భావించి తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ద్వారకకు చేరుకున్నాడు. బలరాముడు అతని సేవకై సుభద్రని నియమిస్తాడు. సుభద్ర ఆ కపట సన్యాసికి సేవలు చేస్తుండగా ఒకనాడు ఆమెకు శకున శాస్త్రం చెప్తాడు. మాటల్లో ఒకనాడు సుభద్ర...

మీ రింద్రప్రస్థముఁ గని

నారా? పాండవులఁ జూచినారా ? సఖులై

వారందఱు నొకచో ను

న్నారా? వీరాగ్రగణ్యు నరు నెఱుఁగుదురా?

.


ఎగు భుజంబులవాఁడు, మృగరాజ మధ్యంబు

పుడికి పుచ్చుకొను నెన్నడుమువాఁడు

నెఱివెండ్రుకలవాడు, నీలంపు నికరంపు

మెఱుఁగుఁ జామనచాయ మేనివాఁడు

గొప్ప కన్నులవాఁడు, కోదండ గుణ కిణాం

కములైన ముంజేతు లమరువాఁడు

బరివి గడ్డమువాఁడు, పన్నిదం బిడి దాఁగ

వచ్చు నందపు వెను మచ్చవాఁడు

.

గరగరనివాఁడు, నవ్వు మొగంబువాఁడు

చ్గూడఁ గలవాఁడు, మేలైన సొబగువాఁడు,

వావి మేనత్తకొడుకు కావలయు నాకు

నర్జునుండు పరాక్ర మొపార్జునుండు.

.

అని అడిగింది.


ఆమె మనసును గ్రహించిన అర్జునుడు తనే అర్జునుడని అసలు విషయం బయటపెడతాడు.

.

నీకై తపంబు జేసెద

నీ కైవడి; దాఁపనేల? యే నర్జునుఁడన్

లోకోత్తర శుభలగ్నం

బో కోమలి! నేడు కోర్కులొడఁగూర్పఁ గదే !

.

అన్నాడు.


తన నిజరూపం తెలియచేసిన ఆర్జునుడు తనని గాంధర్వ వివాహం చేసుకోమని సుభద్రని అర్ధించాడు. సుభద్ర అందుకు ఒప్పుకోలేదు. పెద్దల సమక్షాన్నే కళ్యాణం అని చెప్పివేసింది. చేసేదిలేక ఆమెను వదిలి వేసాడు. పెళ్ళివరకు ఇద్దరు విరహ తాపాన్ని అనుభవించారు. చంద్రుణ్ణి తిట్టుకున్నారు. మన్మధుడిని తూలనాడారు. బలరామునికి ఈ విషయం ఇంకా తెలియదు. అంతా శ్రీకృష్ణుని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. సరైన సమయం చూసి శ్రీకృష్ణుడు వారికి దొంగపెళ్ళి జరిపించాడు. వారి ఆనందానికి అంతులేదు. అంత సుభద్రని తీసుకొనివెళ్ళే సమయంలో యాదవ వీరులు అతనిని అడ్డగించారు. సుభద్ర సారధ్యం చెయ్యగా అర్జునుడు వారందరిని ఓడించి ఇంద్రప్రస్థం చేరుకున్నారు. సుభద్ర వివాహం సంగతి బలరామునికి తెలిసింది. కోపంతో మండి పడ్డాడు. శ్రీకృష్ణుడు జరిగినది బలరాముని కి చెప్పి వారిని శాంతపరిచాడు. వారందరు కలిసి ఇంద్రప్రస్థం చేరి దంపతులను ఆశీర్వదించారు. మరల వారిద్దరికీ ఐదురోజుల పెండ్లి జరిపించారు. వారి ప్రేమకు అనురాగానికి గుర్తుగా అభిమన్యుడు జన్మించాడు.


ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ముఖ్యంగా విజయ నామధేయుడైన అర్జునుని భూప్రదక్షణ, ఉలూచి, చిత్రంగద, సుభద్రలతో వివాహం వరకు వివరించినా కథ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. చక్కని తేట తెలుగు పద్యాలతో ఉండే ఈ కావ్యం, అందరు తప్పక చదవాల్సిన పుస్తకం.


నటి కృష్ణకుమారి కన్నుమూత!

నటి కృష్ణకుమారి కన్నుమూత!

-

హీరోయిన్‌ కృష్ణకుమారి - అన్ని విధాలా అందకత్తె. తర్వాతి రోజుల్లో అభినయానికి కూడా పేరు తెచ్చుకున్నా, అప్పట్లో అందర్నీ ఆకట్టుకున్నవి ఆమె అందచందాలే. అదే గుర్తు చేస్తూ వ్యాఖ్యలు సాగాయి. వంపుసొంపులు వుంటే చాలు హీరోయిన్లకు అద్భుత అభినయం అక్కరలేదని (సినీ)జనుల అభిప్రాయం అనే వెక్కిరింత యిప్పటికీ వర్తిస్తుంది.


-అలనాటి అందాల నటి, నాటి దక్షిణాది సూపర్ స్టార్లందరి సరసనా హీరోయిన్ గా నటించిన కృష్ణకుమారి(84) కన్నుమూశారు. 

-

కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన వారు. అయితే వారి కుటుంబం పశ్చిమబెంగాల్ లోని నైహతీకి వలస వెళ్లింది. కృష్ణకుమారికి మరో వెటరన్ నటి షావుకారు జానకి అక్క వరస అవుతుంది. ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమాతో కృష్ణకుమారి తొలిసారి తెరపై అగుపించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.


‘పాతాళభైరవి’లో ఆమె గంధర్వకాంతగా కనిపిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్, జగ్గయ్య తదితర నాటి స్టార్ల సరసన ఆమె హీరోయిన్ గా నటించారు. తెలుగులో సుమారు 130 సినిమాల్లో నటించిన కృష్ణకుమారి, తమిళంలో ముప్పై సినిమాల వరకూ నటించారు. వివాహానంతరం ఆమె తెరకు దూరమయ్యారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆపై తెరపై నుంచి మాయమయ్యారు.


బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను ఆమె వివాహమాడారు. వీరికి ఒక కుతూరు ఉంది. పిచ్చిపుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, చిక్కడూ దొరకడు, బందిపోటు, మానవుడు దానవుడు.. కృష్ణకుమారి నటించిన విజయవంతమైన చిత్రాలు. నటిగా ఆమె అనేక అవార్డులను పొందారు.


మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న కృష్ణకుమారి.. రాష్ట్రస్థాయిలోనూ నంది అవార్డులు దక్కించున్నారు. కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు కూడా అందుకున్నారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ సంస్థ నుంచి జీవన సాఫల్య పురస్కారం కూడా పొందారు.

-

Tuesday, January 23, 2018

గోరుతొ పోయెదానికి......గొడ్డలి ఎందుకు!!

గోరుతొ పోయెదానికి......గొడ్డలి ఎందుకు!!


"డాక్టర్!..నేను మంచం మీద పడుకున్నప్పడు, నా మంచం కింద ఎవరో వున్నట్టు అనిపిస్తొంది చాల ఇబ్బందిగా వుంది...దయచేసి నన్ను కాపాడండి !! అన్నాడు మన "జగ నారాయణ షూన్యం" !!

.

"ఏం ఫర్వా లెదు...నేనున్నానుగా .....

ఇది చాలా ప్రమాదకరమైన రోగం .....రూ. 2,00,000 అవ్వుద్ది ...

డబ్బు తీసుకుని రేపు రా !!"

అన్నాడు కార్పొరేట్ ఆసుపత్రి పెద్ద దాక్టర్ ధనంజయరావు .

""జగ నారాయణ షూన్యం" !! ..నొరెళ్లబెట్టా డు !!

.

20 రోజుల తరువాత ధనంజయరావు కి మన 

" "జగ నారాయణ షూన్యం" కనిపించాడు, 

రోడ్దుమీద "ఏం వోయ్ .....మళ్లీ రాలెదు...ఎలా వుంది నీ రోగం" అన్నడు.


"ఆయ్ ...తగ్గిపోనాదండి " అన్నడు మన " "జగ నారాయణ షూన్యం" ...


"అవునా ..ఎలా " అన్నడు డాక్టర్ .


"ఆయ్....మా పక్కింట్లొ కార్పెంటర్ వున్నాడండి ....వాడికి నా రొగం


గురుంచి చెప్పానండి ....ఓస్ ..ఇంతెనా ...అని, నా మంచం కోళ్లు


4 కోసెసాడండి ...అప్ప టినుండి నాకు బానే వుందండి ....


రూ.50 పుచ్చు కున్నా డండి!!


వెంగళప్ప - అల్లవుద్దీన్ దీపం !

వెంగళప్ప కి సముద్రం ఒడ్డున అల్లవుద్దీన్ దీపం దొరికింది.


రాచ్చసుడు "ఎదైనా 3 వరాలు కోరుకో మరి" అన్నాడు .


మనవాడు వెర్రెక్కిపోయాడు !!!


"నాకు పేద్ద ...కారు కావా లి"...."వాకే" అన్నాడు రాచ్చసుడు .


"రెందో కోరిక??"


వూం !!...నాకు పేద్ద బంగళా , భోళ్డు డబ్బూ , భోళ్డు బంగారం ...కావాలన్నాడు .."


సరే, మూడవ కోరిక కూడా కోరుకొ, నేను వళతాను" అన్నాడు రాచ్చసుడు .


ఇంకా....ఇంకా...ఏమిటంటంటే ...నన్ను కాలేజి అమ్మా యి లు అందరూ "లైక్" చెయ్యాలి అన్నాడు .


"ఓస్ అంతేనా ...సరే " అని మన రాచ్చసుడు వెంగళప్ప ని


"క్యాడ్బర్రిఎ చాక్లేట్" కింద మార్చేసి మాయమైపోయాడు!!.

శుభరాత్రి - సుభాషితం !

శుభరాత్రి - సుభాషితం !

-

కురుక్షేత్రంలో కౌరవులందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరకెళ్ళి


కృష్ణా....

'' ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ''

'' నీ కడుపు మంట చల్లారిందా '' అన్నది.

'' నేనేం చేశాను '' అన్నాడు కృష్ణుడు.

'' చేయాల్సిందంతా చేసి.... నా కుమారులందరినీ చంపి .....నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా ''. అన్నది ఆవేశంతో ఊగిపోతూ.

'' నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు '' అన్నాడు కృష్ణుడు.

'' అంటే కారణం నేనా '' కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి.

'' ముమ్మాటికీ నువ్వే '' అన్నాడు కృష్ణుడు.

'' నేనా? ఎలా? '' గాంధారి మొహంలో ఆశ్ఛర్యం.

'' ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కాపురం చేశావు.

వందమంది పిల్లల్ని కన్నావు గానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? వాళ్ళేం చేస్తున్నారు? అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా?

వాళ్ళు తోటి వారిని ప్రేమిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? అని ఒక్కనాడైనా పరీక్షించావా?

నీ పిల్లల ఆలోచనలు, అలవాట్లు మంచివా? చెడ్డవా? అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా? అన్నాడు కృష్ణుడు.

'' లేదు '' అంది గాంధారి.

'' నీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లలను నువ్వు సరిగ్గా పెంచి ఉంటే ఈ నాడు కురుక్షేత్రం జరిగేదీ కాదు,

కౌరవులందరూ పోయేవారూ కాదు.

ఇది నీ స్వయంకృతాపరాధమే '' అన్నాడు కృష్ణుడు.


నేడు చాలామంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా గాంధారి, దృతరాష్ట్రుల్లా ప్రవర్తిస్తూ 

'' చదువులు చంపేస్తుంది '' అంటూ తప్పును చదువుల తల్లిమీద తోసేస్తున్నారు.


'' ప్రైవేటు పాఠశాలలు '' అన్న విత్తనాలను ప్రభుత్వాలు ప్రజల మీద చల్లేస్తే 

వాటికి కావాల్సినంత నీరు (విద్యార్థులను చేర్పింది) పోసింది ఎవరు?? మనం కాదా??

వాటికి కావల్సినంత ఎరువులు (ఫీజులు కట్టింది) చల్లింది ఎవరు?? మనం కాదా??

అవి ఎండిపోకుండా, వాడిపోకుండా పగలనక, రాత్రనకా దాన్ని (ట్యాూషన్లు , స్పెషల్ క్లాసులు అంటూ) రక్షిస్తున్నది ఎవరు?? మనం కాదా??


ఏ ప్రైవేటు పాఠశాలైనా

ఏ ప్రైవేటు కళాశాలైనా

ఇంట్లో ఉన్న మన పిల్లల్ని మన అనుమతి లేకుండా బలవంతంగా లాకెళ్ళి చదువు చెప్పిస్తున్నారా??

పరిచయమున్న ప్రతి ఒక్కరినీ ఒకటికి పదిసార్లు ఏ స్కూల్ బావుందని అడిగి, లక్షలకు లక్షలు పోసి మరీ మనమేగా మన పిల్లలను చేర్పిస్తున్నది.

ప్రైవేటు పాఠశాలలు పెట్టే ప్రతి అడ్డమైన కండీషన్లకూ గంగిరెద్దుల్లా తలూపుతున్నది మనం కాదా??

కాస్త చదువుకునే పిల్లలైతే

కుదిరితే ఉదయం ఆరుగంటలకంతా ట్యూషన్ కు పంపుతాం

కుదరకుంటే సాయంత్రం ఆరునుండి రాత్రి తొమ్మదిదాకా ట్యూషన్ లో పడేస్తున్నాం

చదువులో కాస్త వెనకబడిన పిల్లలనైతే ఏకంగా హాస్టల్లలో కుక్కేస్తున్నాం.


పిల్లల పరిస్థితి ఎలా తయారయ్యిందీ అంటే.....

స్కూల్లో ఉన్నా చదవాలి

ఇంట్లో ఉన్నా చదవాలి

ట్యూషన్లో ఉన్నా చదవాలి

చివరికి సెలవురోజుల్లోనూ చదవాలి.

పిల్లల్ని చదువుల యంత్రాలుగా తయారుచేస్తున్నది మనం కాదా??


చేయాల్సిన తప్పంతా మనం చేసి 

పెట్టాల్సిన ఒత్తిడంతా పిల్లలపై మనం పెట్టి

ప్రైవేటు పాఠశాలను ఆడిపోసుకోవడం ఎంత వరకు సమంజసమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి.


ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం??

పిల్లల భవిష్యత్తు బావుండాలనే కదా అని మనల్ని మనం సమర్థించుకోవడం అందమైన ఆత్మవంచనే అవుతుంది.

చదువు పేరుతో పిల్లల్ని పిండే కొద్దీ చివరకు మిగిలేది పిప్పే.


చదువుకున్నవాడి అదృష్టం బావుండి ఉద్యోగం వస్తే మనం అనుకున్నట్టు వాళ్ళ భవిష్యత్తుకు ఢోకా లేదు.

పొరపాటున ఏ ఉద్యోగమూ రాకపోతే అడుక్కోవడానికి కూడా పనికిరానివాడిగా తయారు చేసిన వాళ్ళం మనమే అవుతాం..... అవుతున్నాం.....

ఎందుకంటే నేటి విద్యార్థుల్లో నూటికి తొంభైతొమ్మిది మందికి చదువు తప్ప (క్రీడలుగానీ, కళలుగానీ) మరేమీ రాదు.... మనమేమీ నేర్పే ప్రయత్నమూ చెయ్యలేదు..... చెయ్యట్లేదు.


ఒక్కమాటతో ప్రపంచాన్ని మార్చే శక్తి నాకు లేకపోవచ్చు.

ఇందులోని నా ఏ ఒక్కమాటైనా

ఏ ఒక్క తల్లి ఆలోచననైనా మార్చగలిగితే

ఏ ఒక్క తండ్రి ప్రవర్తనైనా మార్చగలిగితే

ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్నైనా కాపాడగలిగితే

అంతకన్న మహాభాగ్యం మరొకటి లేదు...!

-

Monday, January 22, 2018

మురిపించే అందాలే అవి నన్నే చెందలే.! (అభిసారిక ... )

మురిపించే అందాలే అవి నన్నే చెందలే.!

(అభిసారిక ... )

కొన్ని (అంది, అందని)అందాలను,

అందమైన అనుభవాలను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేం.

చిన్ననాటి జ్ఞాపకాలు

అమ్మచేతి గోరుముద్దలు

కన్నెపిల్లల వాలు చూపులు

తొలిరాత్రి తమకాలు.

ఇలా, మధురమైన కొన్ని సంఘటనలు వాటి తాలుఖు జ్ఞాపకాలు, అజన్మాంతం మన స్మృతి పథంలో మెదులుతూ అనునిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.

ఇటువంటి మధురమైన జ్ఞాపకాల్లో

తోలిరేయిది ఓ మధుర ప్రస్థానం.

ఏదో జరుగుతుందని మరేదో జరగబోతుందని ఇంకేదో జరగాలని

ఓ కన్నెపిల్ల పడే ఆరాటం. తన కన్నుల్లలోని తమకం. విచ్చుకునే పెదవులు, బిగుసుకునే నడుము, నాట్యమాడే ఊహలు wowww ఆ అందం... ఆ ఆరాటం... ఆ అతిశయం, 

అంతా ఇంతా కాదు.

నిజానికి ప్రతీ స్త్రీ జీవితంలోను ఇదో మధురమైన సన్నివేశం.

తనువు మనసు ఏకమై, తమకంలో తరించిపోయే భావావేశం

అప్పటివరకు ఆమో వికసిస్తున్న 

గులాబీ మాత్రమే. విచ్చుకుంటున్న ఆమె (పూ)రేఖులకు పరిపూర్ణమైన యవ్వన, సుఖాన్ని... రుచి చూపించే తియ్యని రేయది.

పొద్దుతిరుగుడు పువ్వులాగా

మగడి, కౌగిలింతలో ముడుచుకు పొయ్యే మతైన క్షణమది.

తాకిళ్ళతో మొదలై, 

తను మథనంతో వేడేక్కి

ఇరు స్పర్శల మైకంతో,

సన్నని చిరుజల్లులా

గాడాలింగన చుంబనాలతో

మధుపెదవుల పంటిగాట్లతో

ఆపాదమస్తకం పులకించి పరవశించిపోతూ శృంగార మాలికలా ప్రేమామృత దీపికలా అణువణువు అల్లుకుపోయే

మహాద్భుత సన్నివేశమది.

యస్..

అతడు కొరకాలి, ఆమె ఆపాదమస్తకం కొరకాలి, సన్నని తన పంటిగాట్లు ఆమె అణువణువునా వికసించాలి.

నిమిషంలోనో రెండు నిమిషాలలొనే ముగించేది కాదు. ప్రణయ కార్యమంటే!

ఆమె తనువూ, మనసు ఏకమై

పురివిప్పిన మయూరంలో, ఉప్పొంగే వెల్లువలా,

తియ్యని ఆ తాక్కిళ్లకు, వెచ్చని ఆ కౌగిలింతలకు ఆమె కన్నులు 

అరమోడ్పులై, ఆమెలోని 

అణువణువు, అంగాంగమూ

వికసించి విరబూసే వరకు

ఆమె కరములు వీడక, 

నడుమును వదలక,

మనసెరిగిన మన్మధునిలా

అలుపెరగని శ్రామికునిలా

మాటల మత్తుతో

చేతల బిగువతో

నిజమైన స్నేహితునిలా

మేసులుతూ, ఆమె తనువును, మనసును ఏకకాలమందు ,సొంతం చేసుకొని.

నిస్వార్దమైన మమమతో,

సరిసమానమైన గౌరవంతో, భాద్యతాయుతమైన ప్రేమతో

మత్తుగా.. లాలించే... మగవాణ్ణి

తదనుగుణంగా నడుచుకునే స్త్రీని ఎవరు మాత్రం మర్చిపోగలరు. మరేవరు మాత్రం విడిచి ఉండగలరు! :)

-నవ్వు నవ్వించు - నవ్వుతూ జీవించు - -

-నవ్వు నవ్వించు - నవ్వుతూ జీవించు -

-


*సందేహం* జోక్!


అనుకున్న ప్రకారం శేషు, భవాని పార్క్ లో కలుసుకున్నారు.


"నేను రాత్రంతా మన గురించి ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాను భవానీ..." అన్నాడు శేషు.


"ఏమిటది...? త్వరగా చెప్పు...?? అంది భవాని.

"మనిద్దరం కలసి కొన్ని రోజులు ఎక్కడైనా గడుపుతాం. ఒక వేళ అప్పుడు మనకు సరిపడదనీ, పొరబాటు చేశామనీ అనుకుంటే ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు..." అన్నాడు శేషు ఆవేశంగా.

"ఆలోచన బాగానే వుంది కాని ఆ తర్వాత పొరబాటును ఎవరు పెంచుకుంటారు?" అనుమానంగా అడిగింది భవాని.


.....


....

*మందుబాబు* జోక్


దేవదాసు బాగా తాగేసి ఇంటికొచ్చాడు. అర్ధరాత్రి కావడంతో భార్యకు అనుమానం రాకుండా, వాసన తెలియకుండా ఓ అద్దం ముందు నిలబడి నోటికి ప్లాష్టర్ అతికించి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్నే భార్య వచ్చి


"మీరు రాత్రి బాగా తాగొచ్చారా?" అనడిగింది.


"అబ్బే...నేనసలు తాగలేదు..." అన్నాడు దేవదాసు.

"మరి ఈ ప్లాస్టర్ ఎవరు అతికించారు...?" కోపంగా అడిగింది అద్దానికి అతికించి ఉన్న ప్లాష్టర్ చూపిస్తూ.

---


*ఆటలో ఆనందం!* జోక్


ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో రాజయ్య పేషెంటుగా ఉన్నాడు. డాక్టరు రోజూ రాజయ్య దగ్గరకొచ్చి ఒక పది రూపాయలు నోటు, ఒక రూపాయ నాణెం చూపించి ఏది కావాలో తీసుకో అంటున్నాడు. రాజయ్య మాత్రం ఎప్పుడూ రూపాయి నాణెం మాత్రమే తీసుకుంటూ ఉంటాడు.


ఓ రోజు అలాగే నోటు, నాణెం చూపించి "ఏదో ఒకటి తీసుకో" అన్నాడు. రాజయ్య నాణెం తీసుకున్నాడు. డాక్టరు వెళ్ళిపోయాక ప్రక్కనున్న నర్సు రాజయ్యను "రాజయ్యా...! రోజూ డాక్టరు గారు నోటు, నాణెం చూపించినప్పుడు నోటువిలువ ఎక్కువ కనుక అది తీసుకోవచ్చుగా...! అనడిగింది.


"అమ్మా! రూపాయి నాణెం కంటే, పదిరూపాయలు నోటు విలువెక్కువని నాకూ తెలుసు కానీ, నేను నోటు తీసుకుంటే నాకు పిచ్చి తగ్గిపోయిందని డాక్టరుగారు రోజూ ఈ ఆట ఆడటం మానేస్తారుగా..." అన్నాడు రాజయ్య.


.....


*ఆయన ఇల్లెక్కడ...?* జోక్


ఓ పల్లెటూరి వ్యక్తి పనిమీద హైదరాబాద్ వెళ్ళాడు. తీరా అక్కడికెళ్ళాక అతనికి సిన్మా యాక్టర్ల ఇళ్ళు చూడాలనిపించి ఫిలిం నగర్ వెళ్ళాడు. అక్కడ ఒకతన్ని పిలిచి "బాబూ...! చిరంజీవి ఇల్లెక్కడ...?" అనడిగాడు.


"రాజేంద్రప్రసాద్ ఇంటిప్రక్కన..." అని చెప్పేసి వెళ్ళిపోయాడతను. మళ్ళీ ఇంకొక అతన్ని ఆపి "ఏవండీ...! రాజేంద్రప్రసాద్ ఇల్లెక్కడ...?" అనడిగాడు.


"ఆ మాత్రం తెలీదా...! చిరంజీవి ఇంటి ప్రక్కనే... అతనూ వెళ్ళిపోయాడు. పల్లెటూరి వాడికి చిర్రెత్తుకొచ్చింది. ఎవడూ సరిగ్గా సమాధానం చెప్పట్లేదని మరోక అతన్ని ఆపి "సారూ...! చిరంజీవి ఇల్లు, రాజేంద్రప్రసాద్ ఇల్లు ఎక్కడో కాస్త వివరంగా చెబుతారా..." అన్నాడు తెలివిగా.

"భలే వాడివే! ఇందులో వివరించాడనికేముంది? వాళ్ళిద్దరి ఇళ్ళూ ప్రక్క ప్రక్కనే" అనేసి అతనూ వెళ్ళిపోయాడు. పల్లెటూరాయన ఇంకెవర్ని అడగలేదు.

----


*ఆ మూత గట్టిగా బిగించండి! * జోక్


పరమ గయ్యాళిగా పేరుపడిన శ్యామూల్ రాజు భార్య చనిపోయిందని శవపేటికలో తీసుకెళ్తున్నారు. శ్మశానానికి చేరుకునేంతలో శవపేటిక మూత ఊడింది. దాన్ని బిగించ బోతుండగా చిన్నగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినబడింది.


తీరా చూస్తే ఆవిడ కొనూపిరితో ఉంది. పొరబాబు గ్రహించి ఆమెను మళ్ళీ వెనక్కి తెచ్చారు. 

ఆ తర్వాత ఒక ఐదేళ్ళు బతికి ఓరోజున కాలం చేసింది. మళ్ళీ ఆమె శవాన్ని శవపేటికలోకి చేరుస్తున్నారు. గొంతు సవరించుకుని పనివాళ్ళతో శ్యాముల్ రాజు అన్నాడు... "ఆ తలుపు చెక్కలు కాస్త గట్టిగా బిగించండి"


....

రసానుభూతి!


-

శుభోదయం -రసానుభూతి!

-


"రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్యశబ్దాన్


పర్యుత్సుకీ భవతి యత్సుఖితోపి జంతుః


తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం


భావ స్థిరాణి జననాంతర సౌహృదాని!


(కాళిదాసు, దుష్యంతుని నోట పలికించిన శ్లోకమిది.)

..


ఒక రమ్యమైన దృశ్యాన్ని చూసినప్పుడో, మధురమైన సంగీతాన్ని


విన్నప్పుడో, మనిషి ఆనందం పొందుతూనే, ఒకోసారి ఏదో తెలియని


వేదనకు లోనవుతాడు.


అలాంటి సందర్భాలలో, మనసు లోతులలో దాగిన యే పూర్వజన్మ


స్మృతులో, అనుభూతులో, తనకి తెలియకుండానే ఉత్తేజితమవుతాయి


కాబోలు!


రసానుభూతిని యింతకన్నా రమ్యంగా వర్ణించే పద్యం మరొకటి నాకు


తెలీదు!

-


Sunday, January 21, 2018

నా హృదయమందు! (దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఊర్వశి” నుంచి.)

నా హృదయమందు!

(దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఊర్వశి” నుంచి.)


నా హృదయమందు …

నా హృదయమందు విశ్వవీణాగళమ్ము

భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు;


దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె

నంగి చుక్కలమెట్లపై వంగి వంగి

నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు.


వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ

కురియు జడులు జడులు గాగ, పొరలి పారు

కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ;

కలదు నాలోన క్షీరసాగరము నేడు!


దారిదొరకని నా గళద్వారసీమ

తరగహస్తాల పిలుపుతొందర విదల్చు!

మోయలేనింక లోకాలతీయదనము!

ఆలపింతు నానందతేజోంబునిధుల!


ప్రేయసి! చలియింపని నీ

చేయి చేయి కీలింపుము

చలియించెడు నా కంఠము

నిలిచి నిలిచి పాడగా!


ఊర్వశి! ఊర్వశి! నాతో

ఊహాపర్ణాంచలముల


----------------------------

Saturday, January 20, 2018

కోహం రండే?

కోహం రండే?

-

కాళిదాసు గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి


కాదేమో. ఉపమాలంకార ప్రయోగంలో ఆయనకి ఆయనే సాటి. అందుకే


ఆయన గురించి చెప్పేటప్పుడు "ఉపమా కాళిదాసః" అంటారు.


కాళిదాసు గురించి ఎన్నో కధలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన


విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకడని కొంతమందీ, భోజ రాజు


ఆస్థానంలో ఉండేవాడని కొంతమందీ అంటారు.


భోజ రాజు ఆస్థానంలో కాళిదాసు తో పాటు భవభూతి, దండి అని


ఇద్దరు కవులు ఉండేవారు. ఈ ముగ్గురూ ఎవరికి వారే సాటి. అలాంటిది


ఒకసారి వాళ్ళ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే చర్చ బయల్దేరింది,


విషయం చినికి చినికి గాలి వానై భోజ రాజు దగ్గరకు వెళ్ళింది. ఆయన


కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేక చేతులెత్తేసాడు. ఇక మనం


ఆ కాళీ మాతనే అడిగి తెలుసుకుందాం అని ముగ్గురూ కాళీ మాత


ఆలయానికి బయలుదేరారు,కాళిదాసు నాలుక పై బీజాక్షరాలు వ్రాసి


ఆయని కవిగా తీర్చిదిద్దింది సాక్షాత్తూ ఆ కాళీ మాతే. తప్పకుండా నేనే


గొప్ప కవి అని తీర్పు చెప్తుంది అని మనసులో అనుకుంటూ


ఆనందపడసాగాడు కాళిదాసు. ముగ్గురూ ఆలయానికి చేరుకుని తమ


వివాదాన్ని నివేదించి అమ్మ ఏం చెప్తుందో అని ఆసక్తిగా ఎదురు


చూస్తున్నారు.


ఇంతలో అమ్మవారి విగ్రహం నుండి మాటలు వెలువడ్డాయి


"కవిర్దండీ కవిర్డండీ భవభూతీ పండితః" అని ఆగింది కాళీ మాత


అంటే దండి కవి, భవభూతి పండితుడూ అని వాళ్ళ ఇద్దరి గురించీ


చెప్పింది కానీ కాళిదాసు గురించి అస్సలు చెప్పలేదు. ఒకపక్క దండీ,


భవభూతీ మురిసిపోతుంటే కాళిదాసు మాత్రం నిశ్చేష్టుడయ్యాడు.


తనని కవిని చేసి ఆశీర్వదించిన అమ్మ ఇలా అవమానిస్తుందని


ఊహించని కాళిదాసు పట్టరాని కోపంతో


"కోహం రండే?" అని గట్టిగా కాళీ మాతనే అడిగాడు.


(అంటే నేనెవరినే ...(రండ అనేది ఒక బూతు మాట) )


కాళిదాసు ఇలా అనేసరికి దండీ, భవభూతీ నిశ్చేష్టులై అలాగే నిలబడి


పోయారు.


వెంటనే కాళీ మాత "త్వమేవాహం త్వమేవాహం కాళిదాసో


త్వమేవాహం" (అంటే నువ్వే నేను, ఓ కాళిదాసా) అని బదులిచ్చింది.


తను చేసిన తప్పు గుర్తించిన కాళిదాసు ఎంతో సిగ్గుపడి తనని


క్షమించమని వేడుకుంటూ కాళికా దేవిని ఎన్నో రకాలుగా కీర్తించాడు.


అయినా పిల్లవాడు తప్పు చేస్తే ఏ తల్లైనా కోపం తెచ్చుకుంటుందా?


సాక్షాత్తూ అమ్మవారే కాళిదాసు గొప్పతనం గురించి చెప్పటంతో


మిగిలిన ఇద్దరికీ అది ఒప్పుకోక తప్పలేదు,


ఇదండీ ఈ రోజు కధ.


-

దాశరథీ శతకము ! -

దాశరథీ శతకము !

-


దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన 

భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు. గోపన్న ఆత్రేయస గోత్రుడు . కాంమాంబ యాతని తల్లి, తండి... లింగన మంత్రి.


దాశరథీ శతకం లోని పద్యాలు . అమృతపు తునకలు , 

పాల తారికలు , పూతరేకులు పనసతొనలు వంటి 

ఈ పద్యాల మాధుర్యం తెలిసిన ఈ వయసు లో ఆ నాటి చేష్టలు పసితనపు తప్పిదాలు కాక మరేమిటి అనిపిస్తుందిప్పుడు.


1. శ్రీ రఘురామ ! చారు తులసీదళదామ ! శమక్షమాదిశృం

గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమాలలామ ! దు

ర్వార కబంధరాక్షసవిరామ ! జగజ్జన కల్మషార్ణవో

త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ!


ఓ రామచంద్రా ! దయాసముద్రుడా ! అందమైన తులసీదళమాలలను ధరించినవాడా ! శాంతి , ఓర్పు మొదలైన సద్గుణముతో శోభించువాడా !. ముల్లోకములచేత కొనియాడబడెడి శౌర్యలక్ష్మీ సమేతుడా ! దుర్వారపరాక్రముడైన కబంధాసురుని పరిమార్చినవాడా ! లోకములందలి సమస్త జనులను పాపసముద్రమునుండి తరింపచేయు తారకనాముడా ! భద్రగిరి యందు కొలువుతీరిన దశరధకుమారా ! జయము.


2. రామ! విశాలవిక్రమ పరాజిత భార్గవరామ! సద్గుణ

స్తోమ ! పరాంగనా విముఖ సువ్రత కామ! వినీలనీరద

శ్యామ ! కకుత్థ్స వంశ కలశాంబుధిసోమ ! సురారిదోర్బలో

ద్దామ విరామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !


ఓ రామచంద్రా ! గొప్పపరాక్రమ శాలియైన పరశురాముని ఓడించిన వాడవు. సుగుణ రాశివి. పరస్ర్తీలను కామించని వ్రతము గలవాడవు. నీల నీరదశ్యాముడవు. కకుత్థ్స వంశమనెడి పాలసముద్రమునందు పుట్టిన చంద్రుడవు. రాక్షస పరాక్రమమును అణచినవాడవు నైన ఓ భద్రగిరి రామా !


3.అగణిత సత్యభాష ! శరణాగతపోష ! దయాలసజ్ఝరీ

విగతసమస్తదోష ! పృధివీసురతోష ! త్రిలోకపూతకృ

ద్గనధురీ మరంద పదకంజ విశేష మణిప్రభాధగ

ద్దగితవిభూష ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !


శ్రీ రామచంద్రా ! అగణిత సత్యవాక్యపరిపాలకుడా !శరణాగత రక్షకుడా ! దయచే సమస్త పాపములను పోగొట్టెడి వాడవు. పృధివీసురలకు ఆనందము కల్గించువాడా ! ముల్లోకములను పవిత్రము చేయు ఆకాశగంగ నీ పదాబ్జములందు ఆవిర్భవించినది. విశేషమైన మణిమయకాంతులతో ప్రకాశించెడి ఆభరణములను ధరించినవాడా. నీవే మాకు రక్ష.


4.రంగదరాతిభంగ ! ఖగరాజతురంగ ! విపత్పరంపరో

త్తుంగ తమ:పతంగ ! పరితోషితరంగ ! దయాంతరంగ ! స

త్సంగ ! ధరాత్మజాహృదయ సారసభృంగ ! నిశాచరాబ్జమా

తంగ ! శుభాంగ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !


శ్రీరామచంద్రా ! చెలరేగెడి శత్రువులను సంహరించువాడా ! గరుడవాహనా.! ఆపద లనెడి భయంకరమైన కారుచీకట్లను పారద్రోలెడి సూర్యుని వంటివాడా ! సంతోషపెట్టబడిన భూమండలము కలవాడా ! మంచివారిని అభిమానించెడి వాడా ! దయాంతరంగుడవు. జానకీదేవి యొక్క హృదయకమలమునకు తుమ్మెద వంటివాడా ! రాక్షసులనెడి పద్మములకు మత్త మాతంగము వంటివాడా ! భువనమోహనమైన రూపముకలవాడా !


5. శ్రీద ! సనందనాది మునిసేవితపాద ! దిగంతకీర్తి సం

పాద ! సమస్త భూతపరిపాలవినోద ! విషాదవల్లికా

చ్ఛేద ! ధరాధినాథ కులసింధు సుధామయపాద ! నృత్తగీ

తాది వినోద ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిథీ !


శ్రీదాశరథీ ! సమస్త సంపదలను ఇచ్చువాడా ! సనకసనందనాది మునులచేత సేవించబడు పాదములు కలవాడా ! దిగంతవ్యాప్తమైన కీర్తి కలవాడా ! సమస్త భూతరాశిని కాపాడుట యందు ఆనందమును పొందెడివాడా ! దు:ఖములను తొలగించువాడా ! రాజవంశమనెడి సముద్రము నందు ఆవిర్భవించిన చందమామా ! నృత్తగీతాది వినోదా ! శ్రీ రామచంద్రా ! శరణు !

-

వశిష్ఠుని విందు !

వశిష్ఠుని విందు !

-

విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు.


ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి


ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక,


విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం


స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ


దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను.


కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు.


కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో,


విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు.


వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ


అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి


వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు


చెయ్యమంటాడు.


వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి,


ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు


చేస్తుంది.

ఆర్.కె.నారాయణ్ !

ఆర్.కె.నారాయణ్ !

-


ఆర్.కె. నారాయణ్ గా సుప్రసిద్ధుడైనా రాసిపురం కృష్ణస్వామీ అయ్యర్ నారాయణస్వామి (అక్టోబర్ 10, 1906 – మే 13, 2001) ఒక భారతీయ రచయిత. ఆయన భారత దేశములోని ఒక కాల్పనిక పట్టణములో ఉన్న మనుషులు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక  నవలలు వ్రాసాడు. ఆంగ్ల భాషలో భారతసాహిత్య రంగం యొక్క ప్రారంభ దశకు చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో అయన ఒకడు. ముల్క్ రాజ్ ఆనంద్ మరియు రాజా రావు మిగిలిన ఇద్దరు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియ చేసిన వ్యక్తిగా ఆయినకు పేరు ఉంది. భారత దేశానికి చెందిన ఆంగ్లభాష నవల రచయితలలో అతి గొప్పవారిలో ఒకరిగా అయిన భావించబడుతున్నాడు.


తన గురువు మరియు మిత్రుడైన గ్రహం గ్రీన్ సహాయంతో నారాయణ్ వెలుగులోకి వచ్చారు. ఆయన వ్రాసిన మొదటి నాలుగు పుస్తాకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహం గ్రీన్ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో స్వామీ అండ్ ఫ్రెండ్స్ , ది బాచేలర్ అఫ్ ఆర్ట్స్ , ది ఇంగ్లీష్ టీచర్  అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్తకాలు ఉన్నాయి. 1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన  ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మరియు 

సాహిత్య అకాడెమీ పురస్కారం గెలిచిన ది గైడ్ నారాయణ్ వ్రాసిన ఇతర నవలలలో కొన్ని. ది గైడ్ నవల హిందీ, ఆంగ్ల భాషలలో, బ్రాడ్వేలో చిత్రముగా తీయబడింది.


నారాయణ్ వ్రాసిన కథలలో అనేకము మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణములో జరుతాయి. మొదటి సారిగా ఈ పట్టణము స్వామి అండ్ ఫ్రెండ్స్ నవలలో పరిచయం చేయబడింది. ఆయన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యదార్ధ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారి సామాన్య జీవితములోని హాస్యమునూ, సాదాసీదాతనాన్నీ బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్ తో ఆయినని పోలుస్తారు. నారాయణ్ చిరుకథలు వ్రాసే శైలిని గయ్ డే ముపస్సంట్ శైలితో పోల్చడుతుంది. వీరిద్దరకి కథాంశాలని తీసేయకుండా కథని తగ్గించే సామర్థ్యం ఉంది. అయితే వచనము మరియు పద ప్రయోగాలలో చాలా సాదాగా ఉండేవారని నారాయణ్ మీద విమర్శలు ఉన్నాయి.


అరవై ఏళ్ళకు పైబడిన రచయిత వృత్తిలో నారాయణ్ కు అనేక పురస్కారాలు మరియు గౌరవాలు అందాయి. రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ నుండి AC బెన్సన్ మెడల్ మరియు భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ని నారాయణ్ అందుకున్నారు. ఆయన భారత శాసనసభ యొక్క పై సభ అయిన రాజ్యసభ కు ప్రతిపాదించబడ్డారు.


అర్.కే. నారాయణ్ మెడ్రాస్  (ప్రస్తుతం చెన్నై అని పిలబడుతున్నది), మెడ్రాస్ ప్రెసిడెన్సి, బ్రిటిష్ ఇండియా లో జన్మించారు. అయిన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానపోధ్యాయుడు. నారాయణ్ తన విద్యాజీవితములో కొంత కాలం తండ్రి పాఠశాలలో గడిపారు. ఉద్యోగ రీత్యా అయిన తండ్రి తరచు బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్ తన బాల్యములో కొంత బాగాన్ని అమ్మమ్మ పార్వతి రక్షణలో పెరిగారు. ఈ సమయములో, ఒక నెమలి మరియు అల్లరిదైన ఒక కోతి ఆయినకు ఆప్తమిత్రులుగాను నెస్తగాళ్లుగాను ఉండేవి.


అయిన అమ్మమ్మ ఆయినకి కుంజప్ప అని ముద్దుపేరు ఇచ్చారు. అయిన కుటుంబీకుల మధ్య ఈ పేరు నిలబడి పోయింది. ఆమె నారాయణ్ కు గణితం, పురాణాలు, భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు సంస్కృతం నేర్పించారు. అయిన తమ్ముడు అర్.కే. లక్ష్మణ్  ప్రకారం, కుటుంబీకులు అందరు సహజంగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. నారాయణ్ మరియు అయిన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబీకులు సహించే వారు కాదు. అమ్మమ్మతో ఉన్నప్పుడు, నారాయణ్ వరుసుగా అనేక పాఠశాలలో చదివారు. వాటిలో కొన్ని పురసవాకం లోని లుతేరన్ మిషన్ స్కూల్, సి.ఆర్.సి. హై స్కూల్ మరియు క్రిస్టియన్ కాలేజీ హై స్కూల్. నారాయణ్ ఒక పుస్తాకాల పురుగు. ఆరంభ దశలో అయిన డికెన్స్, వోడ్ హౌస్, ఆర్థర్ కోనన్ డోయల్, థామస్ హర్డి వ్రాసిన పుస్తాకాలని చదివేవారు. వయస్సు పెన్నెండు ఉన్నప్పుడు, నారాయణ్ ఒక స్వాతంత్ర పోరాట సభలో పాల్గొన్నారు. దాని కొరకు అయిన మావయ్య చే మందలించబడ్డారు; వారి కుటుంబం రాజకీయానికి అతీతంగా ఉండి, అన్ని ప్రభుత్వాలు చెడ్డవి అని భావించేది.


నారాయణన్ తండ్రి మహారాజ యొక్క కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు  మారారు. పాఠశాల అందున్న మంచి పుస్తకాలు కలిగిన గ్రంథాలయం మరియు తన తండ్రిగారి యొక్క గ్రంథాలయం అందుబాటులో ఉండటంతో, పుస్తకాలు చదవటంలో ఆయనకు ఆసక్తి ఏర్పడి,స్వయంగా తానే వ్రాయటం కూడా అలవాటు చేసుకున్నారు. ఉన్నత పాఠశాల ముగించినాక, నారాయణన్ విశ్వవిద్యాలయమునకు ప్రవేశ పరీక్ష వ్రాసి సఫలీకృతుడు కాలేక, ఇంటిలోనే చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, పిమ్మట 1926 సంవత్సరములో పరీక్షలో సఫలీక్రుతుడయినాక మైసూరు మహారాజ కళాశాలలో చేరారు. బేచలర్ పట్టా పొందడానికి నారాయణ్ నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇది మామూలుకంటే ఒక సంవత్సరము ఎక్కువ. మాస్టర్ డిగ్రీ (M.A.) చదవడం వల్ల సాహిత్యంలో ఉన్న అయిన ఆసక్తి తగ్గిపోతుందని ఒక మిత్రుడు చెప్పడంతో, కొంత కాలం అయిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసారు; అయితే, ప్రధాన ఉపాధ్యాయుడు ఆయినని వ్యాయమ ఉపాధ్యాయుడు స్థానములో పని చేయడమని చెప్పినప్పుడు, అయిన ఆ ఉద్యోగాన్ని మానేశారు. తనకు తగిన వృత్తి రచయిత వృత్తి అని ఈ అనుభవం వల్ల నేర్చుకొని, అయిన ఇంట్లోనే ఉండి నవలలు వ్రాయడం ప్రారంబించారు. మొట్ట మొదటిగా ప్రచురించబడిన అయిన రాత, డెవెలప్మెంట్ అఫ్ మారిటైం లాస్ అఫ్ 17థ్-సెంచురీ ఇంగ్లాండ్ అనే పుస్తకము యొక్క గ్రంథ పరిచయం. తదుపరి, అయిన   ఆంగ్ల భాష వార్తాపత్రికలు, సంచికలకు స్థానిక కథలు అప్పుడప్పుడు వ్రాయడం ప్రారంబించారు. రాయడం ద్వారా సంపాదన ఎక్కువ రానప్పడికి, (మొదటి సంవత్సరం అయిన సంపాదన తొమ్మిది రూపాయిలు మరియు పన్నెండు అణాలు), ఆయినకి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. ఆయినకు అవసరాలు బాగా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని అయిన ఎన్నుకున్నందుకు అయిన కుటుంబము, మిత్రులు ఆయినకు సహకరించి గౌరవించారు. 1930లో నారాయణ్ తన మొదటి నవల స్వామి అండ్ ఫ్రెండ్స్ ని వ్రాసారు. అయితే, అయిన మావయ్య దానిని ఎగతాళి చేసారు.అనేక ప్రచురణకర్తలు ఆ నవలని తిరస్కరించారు. ఈ పుస్తకములోనే నారాయణ్, దేశము యొక్క సామాజిక వాతావరణాన్ని చూపించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించారు; ఇది కలోనియల్ పాలన యొక్క పరిమితులని విస్మరించింది. అదే సమయములో బ్రిటిష్ వారి సమయములో మరియు స్వాతంత్రం తరువాత ఏర్పడిన అనేక సామాజిక-రాజకీయ మార్పులని బట్టి ఈ పట్టణం కూడా మారుతూ వచ్చింది.


1933లో  కోయంబతూర్  లో తన సోదరి ఇంట్లో విశ్రాంతి తీస్కుంటున్న కాలములో, నారాయణ్ ప్రక్కనే నివసిస్తున్న ఒక 15 వయస్సుగల అమ్మాయిని కలిశి ఆమెతో ప్రేమలో పడ్డారు. అనేక జ్యోతిష మరియు ఆర్ధిక పరమైన అడ్డంకులు ఏర్పడినా, నారాయణ్ ఆ అమ్మాయి తండ్రి యొక్క ఆమోదం పొంది, ఆమెని వివాహం చేసుకున్నారు. వివాహం పిమ్మట, నారాయణ్ ది జుస్టిస్ అనే ఒక మదరాస్ పత్రికకు విలేకరి అయారు. అది బ్రామిన్-కాని వారి ప్రయోజనాలు మీద శ్రద్ధ చూపిస్తున్న ఒక పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహ్మిణ్ అయ్యార్ ఉండడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా అయిన అనేక రకమైన జనాలు, సమస్యలతో పరిచయం ఏర్పడింది. అంతకు మునుపు, నారాయణ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ నవల యొక్క వ్రాతప్రతి ని ఆక్స్ ఫోర్డ్ లోని ఒక మితుడుకు పంపించి ఉన్నారు. ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహం గ్రీన్ కు చూపించారు. గ్రీన్ ఆ పుస్తకముని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్తకము చివరిగా 1935లో ప్రచురించబడింది. ఆంగ్లం మాట్లాడే ప్రేక్షకలకు సులువుగా ఉండే విధముగా పేరుని క్లుప్తం చేసుకోమని నారాయణ్ కు గ్రీన్ సలహా ఇచ్చారు. ఆ పుస్తకము అర్ధ-స్వయచరిత్ర లాగ ఉండి, అయిన బాల్యమునుంది అనేక సంఘటనలు ఆధారంగా వ్రాయబడింది. పుస్తకము గురించి మంచి విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉంది. నారాయణ్ యొక్క మరుసటి నవల ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ (1937), కొంత వరకు అయిన కళాశాల అనుబవం స్పూర్తి తో వ్రాయబడింది. ఒక తిరగబడే బాలుడు ఒక సర్దుకోకలిగిన ఎదిగిన వ్యక్తిగా గా మార్పు చెందే పరిస్థితిని గురించి ఈ పుస్తకము వివరిస్తుంది;ఈ నవల కూడా గ్రీన్ సిఫార్సు మేరకు మరొక ప్రచురణకర్త చే ప్రచురించబడింది. అయిన వ్రాసిన మూడో నవల ది డార్క్ రూం (1938), లో గృహ, సంసార అపశ్రుతులు గురించి, వివాహ సంబంధంలో మగవాడిని హింసకుడు గాను స్త్రీని బాధితురాలుగాను చిత్రీకరించబడింది. 1937లో నారాయణ్ తండ్రి చనిపోయారు. తరువాత ఆదాయం లేకపోయే సరికి, నారాయణ్ మైసూర్ ప్రభుత్వం నుండి ఒక కమిషన్ ని ఒప్పుకోవలసి వచ్చింది.


తన మొదటి మూడు పుస్తకాలలో, సమాజములో ఆమోదించబడిన కొన్ని ఆచారాల కు సంబందించిన సమస్యల గురించి నారాయణ్ వ్రాసారు. మొదటి పుస్తకములో, నారాయణ్ విద్యార్థుల దురవస్థ గురించి, తరగతి గదులలో కొట్టడం గురించి, వాటి వల్ల పిల్లలలకు అనుబవించే అవమానాల గురించి వ్రాసారు. రెండవ పుస్తకములో, హిందూ వివాహాలలో, జాతకాలు చూడడం గురించి, దాని వల్ల పెళ్ళికూతురు, పెళ్లికోడుకలకు ఏర్పడే మాన్సీక క్షోబ గురించి నారాయణ్ వ్రాసారు. మూడవ పుస్తకములో, భర్త యొక్క చేష్టలు, మనోభావాలతో భార్య పడే కష్టాల గురించి నారాయణ్ వ్రాసారు.


1939లో టైఫాయిడ్  వల్ల రాజం చనిపోయింది. ఆమె మరణం నారాయణ్ ని లోతుగా బాదించడంతో, చాల కాలం అయిన దుఃఖంలో ఉన్నారు; మూడేళ్ళే నిండిన హేమలత అనే తమ కూతురు గురించి ఆయినకు చింతగా ఉండేది. ఈ మరణం అయిన జీవితములో గణనీయమైన మార్పు తెచ్చింది. ఇదే అయిన మరుసటి నవల అయిన  ది ఇంగ్లీష్ టీచర్ కు స్పూర్తి గా నిలిచింది. ఈ పుస్తకము, అయిన మొదటి రెండు పుస్తకాల లాగే స్వయచరిత్ర లాగ ఉంది. మరియు, అనుకోకుండానే, స్వామి అండ్ ఫ్రెండ్స్ , ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ తరువాత ఈ పుస్తకము మూడు పుస్తకాల సేకరణ ని పూర్తి చేసింది. తర్వాతి బేటీలలో ది ఇంగ్లీష్ టీచర్ దాదాపు పూర్తిగా ఒక స్వయచారిత్ర అని అంగీకరించారు. అయితే, పాత్రలకు వేరే పేర్లు పెట్టబడ్డాయి మరియు మాల్గుడి యొక్క పరిసరాలు మార్చబడ్డాయి; నవలలో వివరించబడిన భావాలు రాజం మరణ సమయములో తన యొక్క భావాలే అని కూడా ఆయినా వివరించారు.


కొంత మేరకు విజయం సాదించడంతో నారాయణ్ 1940లో ఇండియన్ తాట్ అనే ఒక పత్రిక ప్రారంబించారు. కార్ సేల్స్ మాన్ అయిన తన మావయ్య సహాయంతో, మద్రాస్ నగరములో మాత్రం ఒక వేయికు పైగా చందాదరులని నారాయణ్ సంపాదించకలిగారు. అయితే, నారాయణ్ దీనిని నడపలేకపోవడంతో, ఈ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఒక సంవత్సరము లోపలే ఈ పత్రిక మూతపడింది. మాల్గుడి డేస్ అనే అయిన మొదటి చిరుకథల సేకరణ నవంబర్ 1942లో ప్రచురించబడింది. తరువాత, 1945లో ది ఇంగ్లీష్ టీచర్  ప్రచురించబడింది. ఈ మధ్యలో యుద్ధం కారణంగా ఇంగ్లాండ్ తో సంబందాలు తెగిపోవడంతో, నారాయణ్ తన సొంత ప్రచురణ సంస్థ ని ప్రారంబించారు. దీనికి మళ్ళి ఇండియన్ తాట్ పుబ్లికేషన్స్ అనే పేరు పెట్టారు; ఈ ప్రచురణ సంస్థ విజయవంతమై, ఈ నాటికి అయిన మనవరాలు చే నడపబడుతూ ఉంది. శీగ్రంలోనే, న్యు యార్క్ నుండి మాస్కో వరకు పాటకులు పెరిగే సరికి, నారాయణ్ నవలలు బాగా అమ్మడం మొదలయింది. 1948లో అయిన మైసూర్ శివార్లలో సొంత ఇల్లు కట్టడం ప్రారంబించారు ; ఆ ఇల్లు 1953లో పూర్తీ అయింది.


ది ఇంగ్లీష్ టీచర్ తరువాత నారాయణ్ వ్రాత శైలిలో మార్పు వచ్చి, అయిన మునుపటి నవలలలో కనిపించిన సగం-స్వయచరిత్ర లాగ కాకుండా ఎక్కువ కల్పనాశక్తితో కూడిన భావ్యముగా మారింది. అయిన మరుసటి నవలైన Mr. సంపత్ ఈ మారిన శైలిలో వ్రాసిన మొదటి నవల. అయితే, ఇది కూడా కొంత మేరకు ఆయిన సొంత అనుభవాల మీద ఆధార పది ఉంది. ముఖ్యంగా, సొంత పత్రిక ప్రారంబించిన అయిన అనుబవాలు; జీవితచరిత్రలోని సంఘటనలని కలపటం ద్వారా అయిన తన అధివరకటి నవలలకంటే బిన్నమైన శైలిని ప్రదర్శించారు. అతి తోరలోనే, అయిన యొక్క మాస్టర్ పీస్ అని భావించబడే ది ఫైనాన్షియల్ ఎక్స్పెర్ట్ అనే నవలని ప్రచురించారు. ఈ నవల 1951 సంవత్సరపు అత్యుత్తమ అసైలన పుస్తకముగా కొనియాడబడింది. ఆర్ధిక విషయాలలో ఒక మేధావి అయిన మార్గయ్య అనే ఆయినకు సోదరడు ద్వారా చుట్టమైన వ్యక్తి యొక్క యధార్థ కథ ఆధారంగా ఈ నవల రాయబడింది. అయిన మరుసటి నవలైన వెయిటింగ్ ఫర్ ది మహాత్మా మాల్గుడి కు మాహాత్మ గాంధి వస్తున్నట్లు ఒక కల్పిత సంగటన మీద ఆధారపడి వ్రాయబడింది. కథానాయకుడు మహాత్మా యొక్క ప్రసంగాలని వినడానికి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ గురించి అతనికి కలిగే ప్రేమ భావాలు గురించినదే ఈ కథ. భార్తి అనే పేరుగల ఆ స్త్రీ, భారత దేశము యొక్క మనవీకరణ అయిన  భారతి యొక్క వ్యంగానుకరణ. భారత స్వాతంత్ర ఉద్యమం గురించిన కొన్ని ముఖ్య సంఘటనలు ఈ నవలలో ఉన్నప్పటికీ, ఈ కథ ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తి యొక్క జీవితం గురించినది. నారాయణ్ యొక్క తనదైన వ్యంగామైన శైలిలో రాయబడింది.


1953లో అయిన నవలలు మొదటి సారిగా యునైటెడ్ స్టేట్స్ లో ప్రచురించబడ్డాయి. మికిగన్ స్టేట్ యునివెర్సిటీ ప్రెస్ వీటిని ప్రచురించారు. తరువాత 1958లో వారు ప్రచురణ హక్కులని వైకింగ్ ప్రెస్ కు అమ్మేశారు. నారాయణ్ యొక్క రచనలు ఎక్కువగా సామాజిక వ్యవస్థలు, అభిప్రాయాలలో ఉన్న వ్యతిరిక్తములని వెలుగులోకి తేసే విధముగా ఉన్న, ఆయినా ఒక సామ్ప్రదాయవాదినే; ఫెబ్రవరి 1956లో, నారాయణ్ తన కూతురు వివాహాన్ని పూర్తీ సాంప్రదాయ బద్దంగా అన్నిహైందవ ఆచరాలని పాటించి జరిపారు.కూతురు వివాహం తరువాత, నారాయణ్ అప్పుడప్పుడు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా, రోజుకు కనీసం 1500 పదాలైన రాయడం కొనసాహించారు. ది గైడ్ అనే నవల, అయిన 1956లో రాక్ఫెల్లెర్ ఫెలోవ్శిప్ మీద యునైటెడ్ స్టేట్స్ ను సందర్చినప్పుడు రాయబడింది. యు.ఎస్.లో ఉన్నప్పుడు, నారాయణ్ తన రోజు దిన చెర్యలుని ఒక డైరీలో రాసేవారు. అదే అయిన వ్రాసిన మై డేట్ లెస్ డైరీ అనే పుస్తకానికి ఆధారమయింది.దాదాపు ఈ సమయములో, ఇంగ్లాండ్ సందర్శించిన నారాయణ్, మొదటి సారిగా తను మిత్రుడు, గురువైన గ్రహం గ్రీన్ ని కలిశారు. భారత దేశానికి తరిగి వచ్చిన తరువాత, ది గైడ్ ప్రచురించబదింది; ఈ పుస్తకమే నారాయణ్ యొక్క రాత శైలికి అద్దం పట్టేలా ఉంది. సందిగ్ద పదాలు వ్యక్తీకరణాలు మరియు ఒక విడికథ లాంటి ముగింపు వంటి అంశాలని ఆ నవల కలిగి ఉంది. ఈ పుస్తకం మూలాన ఆయినకు 1958లో సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.


అప్పుడప్పుడు, నారాయణ్ తన ఆలోచనలాను వ్యాసాల రూపంలో వేలుబరిచారు. వీటిలో కొన్ని వార్తాపత్రికలలో, సంచికలలో ప్రచురంయ్యాయి. మిగిలినవి ప్రచురించ బడలేవు. నెక్స్ట్ సండే (1960) అయిన రాసిన ఇటువంటి వ్యసాలయోక్క సేకరణ మొదటి సారిగా ఒక పుస్తకములాగా ప్రచురించబడింది. ఆ తరువాత కొంత కాలములోనే, అయిన 1956 యునైటెడ్ స్టేట్స్ సందర్శన అనుభవాలను వివరించే మై డేట్ లెస్ డైరీ  ప్రచ్రించబడింది. ది గైడ్ వ్రాసిన అనుబవం గురించి ఒక వ్యాసం కూడా ఈ సేకరణ లో ఉంది.


నారాయణన్ యొక్క తదుపరి నవల థ మాన్-ఈటర్ అఫ్ మాల్గుడి 1961 సంవత్సరములో ప్రచురించబడింది. సామ్ప్రదాయాక్ హాస్య కళారూపం కలిగి ఉండి, సున్నితమైన నియంత్రణ కలిగి ఉన్న శైలి అని ఈ పుస్తమ విమర్శకులు విమర్శించారు.ఈ పుస్తక విడుదల అనంతరం, నిమ్మశము లేకుండా ఉన్న నారాయణ్ మళ్ళి పయనించడం ప్రారంబించి, యు.ఎస్. మరియు ఆస్ట్రేలియాను సందర్శించారు. అయిన అడిలైడ్, సిడ్నీ, మెల్బోర్న్ లలో భారతీయ సాహిత్యం గురించి ఉపన్యాసాలు ఇస్తూ మూడు వారాలు గడిపారు. ఈ పర్యటనకు ఆస్ట్రేలియన్ రైటర్స్ గ్రూప్ నిధులు ఇచ్చింది. ఈ సమయానికల్లా, నారాయణ్, సాహిత్య పరంగానూ, ఆర్ధిక పరంగానూ గణనీయమైన వియ్యం సాదించారు. అయిన మైసూర్ లో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఎనిమిది కిటికీలకు తగ్గకుండా ఉన్న గదిలో రాసే వారు; వివాహం తరువాత కోయంబతూర్ లో స్తిరపడ్డ తన కూతురుని కలవడానికి, అప్పట్లో భారాత దేశములో విలాస వస్తువైన కొత్త మెర్సిడెస్-బెంజ్కారులో వెళ్ళేవారు. భారత దేశములోను, విదేశాలలోనూ విజయం సాదించిన తరువాత, నారాయణ్ ది హిండు , ది అట్లాంటిక్ వంటి పత్రికలకు, వార్తాపత్రికలకు రాయడం మొదలుపెట్టారు.


1964లో నారాయణ్ తన మొదటి పౌరాణిక పుస్తకమైన గాడ్స్, డేమన్స్ అండ్ అతేర్స్ ని ప్రచ్రించారు. ఇది హిందూ పురాణాలనుండి అనువాదించబడిన మరియు మళ్ళి వ్రాయబడిన చిన్న చిన్న కథలు కలిగిన ఒక సేకరణ. అయిన ఇతర పుస్తకాల లాగే, ఈ పుస్తకానికి కూడా, అయిన తమ్ముడైన అర. కే. లక్ష్మణ్ బొమ్మలు గీచారు. కొన్ని ఎన్నుకోబడిన కథలని మాత్రమె ఈ పుస్తకములో చేర్చారు. శక్తివంతమైన ప్రధాన పాత్రధారులు ఉన్న కథలని మాత్రమె అయిన ఎన్నుకున్నారు. అప్పుడే, పాటకులకు సందర్భం తెలియక పోయినా, కథ యొక్క ప్రభావం స్థిరంగా ఉంటుంది.పుస్తకము ప్రచురణ తరువాత మళ్ళి నారాయణ్ విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఒక మునుపటి వ్యాసములో అమెరికన్ లు అయిన దగ్గిరనుండి ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలని ఎదురుచూసేవారని రాశారు. ఈ పర్యటన సమయములో, స్వీడన్-అమెరికా కు చెందిన నటి గ్రేట గార్బో ఇదే విషయాన్ని అడిగేవారు, అయిన తనకు ఆ విషయాలు ఏమి తెలియవని చెప్పినా కూడా.


నారాయణ్ యొక్క తదుపరి నవల, 1967లొ ప్రచిరించబడిన ది వెండార్ అఫ్ స్వీట్స్ . ఈ నవల రాయడంలో కొంత మేరకు అయిన యొక్క అమెరికా పర్యటనలు ఆయినకు స్పూర్తిగా ఉండి. ఈ నవలలో భారత దేశానికి మరియి అమెరికా కు చెందిన అతిగా ప్రవర్తించే పాత్రలు, వారి మధ్య ఉన్న అనేక సాంసృతిక విబెదాలతో ఉన్నారు. ఈ పుస్తకము అయిన బాణి అయిన హాస్యం మరియు కథ చెప్పే విధానం ఉన్నప్పటికీ, లోతు లేని పుస్తకమని విమర్శించబడింది.ఆ సంవత్సరం, నారాయణ్ ఇంగ్లాండ్ కు వెళ్ళారు. అక్కడ మొదటి సారిగా యునివెర్సిటీ అఫ్ లీడ్స్ నుండి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు.తదుపరి కొన్ని సంవత్సరాలు అయిన స్థిమితంగా ఉన్నారు. 1970లో అయిన తన తదుపరి పుస్తకమైన ఎ హార్స్ అండ్ టూ గొట్స్ అనే చిరు కథల సేకరణ ని ప్రచురించారు. ఈ మధ్య, నారాయణ్ కు 1938లో మరణిస్తున్న తన మావయ్యకు చేసిన ఒక వాక్ధానం గురించి గుర్తు వచ్చి, అయిన కంబ రామాయణం ని ఆంగ్లంలో అనువాదం చేయడం మొదలు పెట్టారు. ఇదు సంవత్సరాల పని తరువాత ది రామాయణ 1973లో ప్రచురించబడింది.ది రామాయణ ప్రచురించిన వెనువెంటనే, నారాయణ్ మహాభారత అనే సంస్కృత కావ్యము యొక్క సంఘటిత అనువాదం చేసే పఅనిని ప్రారంబించారు. ఈ కావ్యాన్ని రాస్తూ ఉండగానే, అయిన ది పెయింటర్ అఫ్ సైన్స్ (1977) అనే మరొక పుస్తకాన్ని ప్రచురించారు. ది పెయింటర్ అఫ్ సైన్స్ ఒక నవల కంటే కొద్దిగా పొడుగుగా ఉండి, నారాయణ్ యొక్క ఇతర పుస్తకాల కంటే విబిన్నంగా ఉండి. ఈ పుస్తకములో, అదివరకు ఎప్పుడు లేని విధముగా అయిన శృంగారం వంటి కొన్ని సంగతులని ప్రస్తావించారు. ఐతే, ప్రధాన పాత్రదారి యొక్క పాత్ర మాత్రం, అయిన యొక్క ఇదువరకటి పాత్రలలాగే ఉంది. ది మహాభారత 1978లో ప్రచురించబడింది.


కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగ ప్రచారము కొరకు ఒక పుస్తకము రాసేపనిని నారాయణ్ కు అప్పగించింది. నారాయణ్ రాసినవాటిని, ఒక పెద్ద ప్రభుత్వ ప్రచురణలో బాగంగా ప్రభుత్వం 1970ల ఆఖరిలో ప్రచురించింది. ఐతే నారాయణ్ దానితో తృప్తి చెందక, ది ఎమేరాల్డ్ రూట్ (ఇండియన్ థాట్ పబ్లికేషన్స్, 1980) అనే పేరుతొ దానిని పునఃప్రచురణ చేసారు. స్థానిక చరిత్ర, పారంపర్యం మీద ఆయినకు ఉన్న వ్యక్తిగత అబిబ్రాయాలు ఈ పుస్తకములో ఉన్నాయి. అయితే, పాత్రలు, సృష్టిలు లేకుండ ఉన్నందున, ఈ పుస్తకము అంట ఆసక్తికరంగా లేదు.అదే సంవత్సరం, అయిన అమెరికన్ అకాడెమి అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ యొక్క గౌరవ సభ్యుడుగా ఎంపికయ్యారు. రాయల్ సొసైటీ అఫ్ లిటేరేచర్ వారి AC బెన్సన్ మెడల్ ని గెలుచుకున్నారు.దాదాపు ఇదే సమయములో, నారాయణ్ నవలలు మొదటి సారిగా  చైనీస్ భాషలో అనువాదిన్చాబడ్డాయి.


1983లో నారాయణ్ తన తదుపరి నవలైన  టైగర్ ఫర్ మాల్గుడి ని ప్రచ్రించారు. ఇది ఒక పులి మరియు మనుషులతో దానికి ఉన్న సంబందాలు గురించిన కథ. 1986లో ప్రచురించబడిన అయిన తదుపరి నవల టాకటివ్ మాన్ , మాల్గుడి కు చెందిన పాత్రికేయుడు కావాలని ఆకాంక్షిస్తున్న ఒక వ్యక్తీ గురించిన కథ. ఈ సమయములో, అయిన రెండు చిరు కథల సేకరణలను ప్రచురించారు: ఆసలు పుస్తకము తో మరి కొన్ని కథలుతో కూడిన ఒక సవరించిన ప్రచురణ అయినమాల్గుడి డేస్ (1982) మరియు అండర్ ది బన్యాన్ ట్రీ అండ్ ఆథర్ స్టోరీస్ , అనే ఒక కొత్త సేకరణ. 1987లో అయిన  ఎ రైటర్స్ నైట్మెర్ అనే ఒక పుస్తకము పూర్తీ చేసారు. దీంట్లో కుల వ్యవస్థ, నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రేమ, కోతులు గురించిన వివిధ అంశాల మీద వ్యాసాల ఉన్నాయి. 1958 నుండి అయిన వార్తాపత్రికలలో మరియు సంచికలలో రాసిన వ్యాసాలు ఈ సేకరణలో ఉన్నాయి.


మైసూర్ లో ఒంటరిగా ఉన్నప్పుడు, అయినకు వ్యవసాయం మీద ఆసక్తి పెరిగింది. ఒక ఎకరా పంటపొలం కొని, అయిన వ్యవసాయం చేసారు. ప్రతి రోజు మధ్యానం అయిన మార్కట్ కు నడచి వెళ్ళేవారు. ఏదైనా కొనటానికంటే కూడా జనాలతో కలిసి ఉండటానికోసమే అయిన అలాగా వెళ్ళేవారు. అలాంటి మధ్యాన నడక సమయములో, అడుగడుకుకి ఆగి కోట్ల యజామ్నులతో మరియు ఇతరాలతో మాట్లాడేవారు. బహుశా, తన తదుపరి పుస్తకాలకు విషయాలు సేకరిస్తూ ఉండేవారేమో.


1980లో నారాయణ్, సాహిత్యములో అయిన సాదనలకోసం భారత దేశపు శాశన సభ యొక్క పై సభ అయిన రాజ్య సభ కు ప్రతిపాదించబడ్డారు. తన మొత్త ఆరు-సంవత్సరాల పదవికాలములో అయిన ఒకే ఒక సమస్య మీద – పాఠశాల పిల్లల దురవస్థ, ముఖ్యంగా పుస్తకాల యొక్క అధిక బరువు మరియు పిల్లల సృజనాత్మకత మీద విద్యా వ్యవస్థ యొక్క దుష్ప్రభావం – తన పూర్తీ శ్రద్ధ చూపించారు. ఈ సమస్యనే అయిన తన మొదటి నవలైన స్వామి అండ్ ఫ్రెండ్స్ లో ముఖ్యంగా వ్రాసారు. అయిన చేసిన తొలి ప్రసంగంలో ఈ ప్రత్యేక సమస్య గురించి ప్రస్తావించారు. దాని మూలంగా, పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రొఫ్. యష్ పాల్ నేతృత్వంలో ఒక కమిటి ఏర్పాటు చేయబడింది.


1990లో అయిన తన మరుసటి నవలైన ది వరల్డ్ అఫ్ నాగరాజ్ ని ప్రసురించారు. ఇది కూడా మాల్గుడిలో జరిగే కథ. ఈ నవలలో నారాయణ్ యొక్క పెరుగుతున్న వయస్సు కనిపిస్తుంది. చాలావరకు కథ వివరాలని వదిలిశారు. అదే ముందైతే వివరాలన్నీ వ్రాసేవారు. ఈ నవల రాయడం పూర్తీ అయిన తరువాత, నారాయణ్ ఆరోగ్యం క్షీణించి, అయిన తన నివాసాన్ని, కూతురు కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మదరాస్ కు మార్చారు. మదరాస్ కు మారిన కొన్ని సంవత్సరాల తరువాత, 1994లో అయిన కూతురు కాన్సర్ వ్యాధి సోకి మరణించగా, అయిన మనవరాలు బువనేష్వారి (మిన్నీ) ఆయినని చూసుకోవడం ప్రారంబించింది. అలాగే, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్ ని కూడా తనే నిర్వహించింది. తరువాత నారాయణ్ తన ఆఖరి పుస్తకమైన గ్రాండ్మతర్స్ టెల్ ని ప్రచురించారు. ఈ పుస్తకము ఒక స్వయచరిత్ర నవల. ఇది అయిన ముత్తవ్వ గురించిన కథ. తన భర్త వివాహం అయిన వెంటనే పారిపోవడంతో, ఆమె ఆయినని వెతకటానికి సుదూర ప్రాంతాలకు పయనం చేసింది. అయిన బాలుడుగా ఉన్నప్పుడు అయిన అమ్మమ్మ ఆయినకు ఈ కథని వివరించింది.


తన ఆఖరి సంవత్సరాలలో, సంభాషణ అంటే ఎప్పుడు ఇష్టపడే నారాయణ్, దాదాపు ప్రతిరోజూ సాయంత్రం, ది హిండు ప్రచురణకర్త అయిన ఎం. రామ్ తో గడిపేవారు. కాఫీ త్రాగుతూ, రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ, అర్ధరాత్రి దాటే వరకు గడిపేవారు. జనాలని కలవడం మరియు వారితో మాట్లాడటమంటే ఎంతో ఇష్టపడే అయిన, భేటీలు ఇవ్వడం మానేశారు. బెతీల మీద ఆయినకు ఉదాసీనత రావడానికి కారణము, అయిన టైం కు ఇచ్చిన భేటీనే. ఆ భేటి తరువాత అయిన కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపవలసి వచ్చింది. ఎందుకంటే అయిన ఫోటోలు తీయదానికోసం అయిననని ఊరంతా తిప్పారు. ఆ ఫోటోలని చివరికి ఆ వ్యాసములో అసలు వాడలేదు కూడా.


2001 మే లో నారాయణ్ ఆసుపత్రిలో చేరారు. ఆయినని వెంటిలేటర్ లో పెట్టడానికి కొన్ని గంటలు ముందు, అయిన ఒక తాత గురించిన కొత్త కథ, తన మరుసటి నవల రాయడం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అయిన ఎప్పుడు నోట్ పుస్తకాలని ఎన్నుకోవడం గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు కాబట్టి, తనకు ఒక పుస్తకం తెచ్చి పెట్టమని ఎన్. రామ్ ని అయిన కోరారు. అయితే, నారాయణ్ ఆరోగ్యం నయం కాలేదు. తన నవలని అయిన అసలు ప్రారంబించనే లేదు. అయిన చెన్నైలో తన 94వ వయస్సులో మే 13, 2001 నాడు మరణించారు.


నారాయణ్ యొక్క రచనా శైలి సరళంగాను నటన లేకుండాను, సహజంగానే హాస్యస్పోరకంగా ఉండేది.ఆయిన రచన సామాన్య జనాల మీద కేంద్రీకరించి, పాటకులకు వారి పొరుగింటి వారు, కసిన్ లు వంటి వారిని తలిపిస్తుంది. అందువల్ల పాటకులు పుస్తక విషయాల తో ఎకోబవించడానికి ఎక్కువ అవకాసం ఉంటుంది. తన దేశములోని సమకాలపువారి లాగ నవల రచనలో అప్పుడు ఉన్న బాణికి అనుకూలంగా తమ రచనా శైలిని మార్చుకోకుండా అయిన భారత సమాజములోని చిక్కులని తనదైన సరళమైన శైలిలో వ్రాయగాలిగారు. అయిన మెళుకువతో కూడిన సంభాషణ శైలిని వాడారు. పాత్రల స్వబావాలకు అనుగుణంగా అయిన సున్నితమైన తమిళ్ భాష చాయలతో కూడిన సంభాషణలు అయిన రచనలో ఉండేవి.విమర్శకలు నారాయణ్ ని భారత చెకోవ్ అని పరిగణించారు. వాళ్ల ఇద్దరి రచనలోని సరళత్వం మరియు దుఃఖరమైన సందర్పాలలో చూపించే సున్నితమైన అందం మరియు హాస్యం వంటి అంశాల వల్ల ఇద్దరిని పోల్చేవారు. ఇతర ఏ భారతీయ రచయితలకంటే నారాయణ్ కు చెకోవ్ తో ఎక్కువ పోలికలు ఉన్నట్లు గ్రీన్ భావించారు. ది న్యూ యోర్కేర్ కు చెందిన ఆంటనీ వెస్ట్ ప్రకారం నారాయణ్ రచన నికోలాయి గోగోల్ యొక్క వాస్తవికత రచన లాగా ఉందని భావించారు.


నారాయణ్ వ్రాసిన చిరుకథలు అయిన వ్రాసిన నవలలు లాగే అంతే మనోహరంగా ఉన్నాయని, చాలా చిరుకథలు పది పేజీలకంటే తక్కువే ఉన్నాయని, చదవటానికి కూడా అంతే సమయం తీసుకుంటుందని పులిట్జేర్ ప్రైజ్ గ్రహీత ఝంపా లహిరి భావించారు. నవల రచయితలు వందలాది పేజీలలో ఇవ్వడానికి ప్రయాశాపడే దానిని, శీర్షిక వాక్యానికి ముగింపుకు మధ్య నారాయణ్ పాటకులుకు ఇస్తున్నారు: పాత్రల యొక్క జీవితాల గురించి పూర్తి అవగాహన. నారాయణ్ యొక్క ఈ గుణగణాలు, సామర్ధ్యాలు వల్ల లాహిరి ఆయిన్ని ఓ. హెన్రీ, ఫ్రాంక్ ఓ’కానర్, ఫ్లన్నేరి ఓ’కానర్ వంటి చిరుకథల పితామహులుతో పాటు జత కట్టారు. లాహిరి ఆయిన్ని గుయ్ డే మపస్సంట్ తో కూడా పోల్చారు. కథని పోగొట్టకుండా ఉపాఖ్యానాన్ని తగ్గించే సామర్థ్యం ఇద్దరికీ ఉంది. ఇద్దరూ ఒక రకమైన మధ్య తరగతి జీవితం గురించి, ఎక్కడ వదలకుండా, జాలి చూపకుండా రాసారు.


నారాయణ్ రచనలు ఎక్కువ వర్ణనాత్మకంగా ఉండి, తక్కువ విశ్లేషనాత్మకంగా ఉందని విమర్శకలు మాట; విడిగా ఉండి చూసే ఆచరణ కలిగిన ఈ వస్తుగత దోరణి వల్ల నిజమైన మరియు యదార్థము తో కూడిన కథలు అయిన చెప్పకలిగారు.అయిన వైకరి మరియు జీవితం మీద ఆయినకు ఉన్న మనోభావం వల్ల అయిన తనదైన బాణిలో పాత్రలని వారి చేర్యలని కలప కలిగింది. సామాన్యంగా జరిగే సంఘటనలని కూడా పాటకుల మదిలో ఒక సంభందం ఏర్పరిచేలా చేసింది.]అయిన రచనా శైలికి ముఖ్యంగా దోహదం చేసింది అయిన సృష్టించిన, గుడ్డి నమ్మకాలు, సాంప్రదాయాలు పాటిస్తున్న మాల్గుడి అనే ఒక చిన్న సామాన్య పట్టణం.


నారాయణ్ యొక్క రచనా శైలి తరచూ విల్లియం ఫాక్నర్ తో పోల్చబడుతుంది. ఇద్దరి రచనలు సామాన్య జీవితములో హాస్యం మరియు శక్తిని వేలుగులోగి తెచ్చింది. అదే సమయములో దయకలిగిన మానవత్వాన్ని కూడా చూపించినది.ఇద్దరి మధ్య పోలికలు ఇంకా కూడా ఉన్నాయి. ఇద్దరి రచనలు సమాజం యొక్క అవసరాలని వ్యక్తిగత చిక్కులతో ముడిపెట్టే సామర్థ్యం కలిగి ఉన్నాయి.కతాంశాలని అభిగవించే విధానము ఇద్దరిది ఒకటేనైనా, వారి మార్గాలు విబిన్నంగా ఉండేవి; ఫాక్నర్ రచన అలంకారయుక్తంగా ఉండి, అపరితమైన వచనాలు కలిగి ఉండేది. నారాయణ్ రచన చాలా సాదాగా మరియు యదార్ధంగా ఉండి అదే సమయములో అన్ని కదాంశాలని కలిగి ఉండేది.


మాల్గుడి, నారాయణ్ సృష్టించిన ఒక కల్పిక, అర్ధ-నగర వాతావరణం కలిగి ఉన్న దక్షిణ భారత పట్టణం. అయన ఈ పట్టణాన్ని సెప్టెంబర్ 1930న విజయదశమి నాడు సృష్టించారు. ఆ రోజు కొత్త యత్నాలు మదలుపెట్టడానికి మంగళప్రథమైన రోజు. ఆ రోజుని అయిన కొరకు అయిన అమ్మమ్మ ఎన్నుకున్నారు. అయిన తరువాత భేటిలలో అయిన జీవితచరిత్ర వ్రాసిన సూసన్ మరియు ఎన్.రామ లతో చీప్పినట్లు ముందు అయిన మదిలో ఒక రైల్వే స్టేషను కనిపించిందని, తరువాత నెమ్మదిగా మాల్గుడి అనే పేరు అయిన మదిలో వచ్చినట్లు అయిన చెప్పారు. రామాయణా రోజుల నుండి ఉన్న నిష్కళంకమైన చరిత్ర కలిగి ఉన్న ఒక పట్టణముగా మాల్గుడి సృష్టించబడింది. లార్డ్ రామ ఈ పాత్తనం మీదుగా వెళ్లారని రాయబడింది; బుద్ధా కూడా పయనమధ్యలో ఈ పట్టణాన్ని సందర్శించినట్లు రాయబడింది. నారాయణ్ ఈ పట్టణానికి కచ్చితమైన బౌగోళిక హద్దులు ఎప్పుడు పెట్టలేదు. కథలో వచ్చే సంగాతనలకు అనుగుణంగా వూరి యొక్క రూపురేఖలను మార్చి, బవిష్యత్తు కథలకు రంగం సిద్దం చేసేవారు. నారాయణ్ రచనకు సంబందించిన పండితుడైన డా జేమ్స్ ఎం. ఫెన్నేలీ, నారాయణ్ వ్రాసిన అనేక పుస్తకాలు, కథలనుండి మాల్గుడి యొక్క రేఖాచిత్రాన్ని రూపొందించారు.


భారాతదేశములో మారుతున్న రాజకీయ పరిణామాల బట్టి మాల్గుడి కూడా మారుతూ వచ్చింది. 1980లలో, భారత దేశములో దేశీయవాదం గట్టిగా పెరుగుతున్న తరుణములో, పట్టణాలకు, ప్రాంతానాలు బ్రిటిష్ పేర్లని మార్చేయడం మరియు బ్రిటిష్ కు సంబందించిన స్తాలాలని తొలగించడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయములో మాల్గుడి మేయోర్ మరియు నగరసభ, చాలా కాలముగా ఉన్న ఫ్రెడరిక్ లాలీ యొక్క విగ్రహముని తీసి వేశారు. ఫ్రెడరిక్ లాలీ మాల్గుడిలో స్థిరపడ్డ ప్రర్రంభ నివాసులలో ఒకరు. అయితే, భారత స్వాతంత్ర ఉద్యమాన్ని లాలి గట్టిగా సమర్ధించేవారని హిస్టారికల్ సొసైటీస్ ఆధారాలు చూపినప్పుడు, ముందు వారు చేసిన చేర్యాలని నగరాసభ ఉపసంహరించుకోవలసి వచ్చింది. మాల్గుడిని బట్టేర్సీ, ఈస్టన్ రోడ్” లకంటే ఎక్కువ ప్రాబల్యం చెందినదని గ్రీన్ వర్ణించారు. మాల్గుడి ని ఫాక్నర్ యొక్క యోక్నపటాఫ కౌంటీ తో పోల్చవచ్చు. మరియు, ఫాక్నర్ మాదిరిగానే, నారాయణ్ రచనలని చూసినప్పుడు, అనేక కథలు, నవలల ద్వారా పట్టణానికి మరింత నిర్వచనం లబిస్తుంది.


నారాయణ్ ముందు బయట పడింది, గ్రహం గ్రీన్ సహాయం తోన్. గ్రీన్, స్వామినాథన్ అండ్ టేట్ ని చదవగానే తనంతట తనే ఆ పుస్తకానికి నారాయణ్ యొక్క అజేంట్ లాగ వ్యవహరించారు. అంతే కాక, ఆయినే ఈ నవల పేరుని తగిన విధముగా స్వామి అండ్ ఫ్రెండ్స్ గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషించారు. అంతే కాక, నారాయణ్ యొక్క మరుసటి కొన్ని పుస్తకాలకు ప్రచురణకర్తలని ఒప్పించడంలో కూడా ముఖ్య పాత్ర పోచించారు. నారాయణ్ యొక్క మొదటి నవలలు వాణిజ్యంగా గొప్ప విజయం సాదించకపోయినా, ఆ కాలపు ఇతర రచయితలు దృష్టికి అయిన వచ్చారు. సోమేర్సేట్ మామ్ 1938లో మైసూర్ కు వచ్చినప్పుడు నారాయణ్ ని చూడాలని కోరారు. కాని నారాయణ్ ని చాలా మందికి తెలియకపోవడంతో, ఆయిన్ని కలవలేక పోయారు. తరువాత మామ్ నారాయణ్ వ్రాసిన ది డార్క్ రూం చదివి అబినందనలు తెలియచేస్తూ నారాయణ్ కు లేఖ వ్రాసారు. నారాయణ్ రచన మీద ఆసక్తి చూపించిన మరొక సమకాలపు రచయిత ఇ. ఎం. ఫోర్స్తర్,. అయిన కూడా నారయణ్ మాదిరిగానే నిస్సారమైన హాస్యస్ఫోరకంగా రాస్తారు. అందువల్ల దక్షిణ భారతీయ ఇ. ఎం. ఫోర్స్తర్ అని నారాయణ్ పిలవబడుతారు. పాటకులు, ఇతర రచయితల మధ్య నారాయణ్ ప్రసిద్ధి చెందినా, అయిన స్థాయికి తగిన విధముగా అయిన రచనలు విస్లేషించబడలేదు.


కొంత కాలం తరువాత నారాయణ్ కు యునైటడ్ స్టేట్స్ లో విజయం లభించింది. మికిగన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెస్ అయిన పుస్తకాలని ప్రచురించడం ప్రారంబించింది. అయిన మొట్టమొదటి సారి ఆ దేశానికి రాక్ ఫెల్లెర్ ఫౌండేషన్ వారి ఫెలోషిప్ మీద వెళ్ళారు. అక్కడ మికిగన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ కలిఫోర్నియా, బెర్క్లీ వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు ఇచ్చారు. ఈ తరుణములో జాన్ అప్డైక్ అయిన రచనను గమనించి, నారాయణ్ ని  చార్లెస్ డికెన్స్ తో పోల్చారు. ది న్యూ యోర్కేర్ లో ప్రచురించబడిన నారాయణ్ రచన మీద విశ్లేషణలో అప్డైక్ ఆయిన్ని నశించిపోతున్న రచయితల జాతికు చెందిన రచయిత గా వర్ణించారు- ఒక పౌరుడు అయిన రచయిత; తన పాత్రలతో పూర్తిగా అనుసంధానమైన రచయిత, మానవత్వ విలువల మీద పూర్తీ విశ్వాసం ఉన్న రచయిత.


అనేక నవలలు, వ్యాసాలు, చిరుకథలు వ్రాసిన నారాయణ్, భారత రచనని ప్రపంచానికి చాటి చీప్పిన వ్యక్తిగా పేరొందారు. ఇరవయ్యవ శతాబ్దముకు చెందిన అత్యుత్తమ రచయితలో ఒకరిగా అయినన బావించబడుతున్నారు. అయిన రచనని రమణీయామని, హానిలేనదని, హితమైనదని విమర్శకులు వర్ణించారు. పిమ్మట వచ్చిన రచయితలు, ముఖ్యంగా భారతీయ రచయితలు, నారాయణ్ రచనని ఒక సాదాసీదా రచన అని, తక్కువ పతజాలం కలిగిందని, సంకుచిత దృష్టి కలిగిందని విమర్శించారు. శశి తరూర్ అభిప్రాయం ప్రకారం, నారయాణ్ కథలో పాత్రలు, జెన్ ఆస్టిన్ కథలలో మాదిరిగానే ఉన్నారని, ఇద్దరు సమాజములో ఒక చిన్న విభాగం గురించే వ్రాసేవారని విమర్శించారు. ఐతే, ఆస్టన్ యొక్క వచనము ఈ పాత్రలని సాధారణమైన పరిస్థితికి వెలుపల తీసుకువేళ్ళింది. కాని నారాయణ్ రచన అలాగ చేయలేదు. శశి దేష్పాండే కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. అయిన నారాయణ్ రచన సాదాసీదాగా మరియు బోళాగా ఉందని అభిప్రాయపడ్డారు. భాష మరియు పదవినియోగంలో సాదాతనం, పాత్రల ప్రవర్తన మరియు భావము లో చిక్కులు లేని విధంగా ఉంది అని చెప్పారు.


నారాయణ్ మీద ఉన్న సామాన్య అభిప్రాయం ఏమంటే, అయిన తనను గాని తన రచనలను గాని భారతదేశము యొక్క సమశ్యలు, రాజాకీయాల్లలో కలుపుకోలేదు. ఇదే అభిప్రాయాన్నే వి. ఎస్. నైపాల్ కూడా రాసారు. అయితే, నారాయణ్ రచన సాదాగా ఉండి, రాహకీయాలలో ఆసక్తి లేకుండా ఉన్నప్పటికీ, అయిన కథని కళాత్మకంగాను అటువంటి అంశాలని పూర్తిగా తప్పించకుండా చాకచక్యంగా రాసేవారని, పదాలు పాటకుల మదిలో ఆడే లాగ ఉండేదని ది న్యూ యోర్కేర్ కు చెందిన వ్యాట్ మాసన్ అభిప్రాయపడ్డారు. నారాయణ్ తన పాత్రలకు సంబందించిన వరకు మాత్రమె రాజకీయ అంశాలని రాసేవారని అదే ముల్క్ రాజ్ ఆనంద్ ఆ తరుణములో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సమశ్యలు గురించి వివరంగా రాసేవారని ఆంధ్ర యూనివర్సిటీ యొక్క పూర్వ ఉప కులపతి శ్రీనివాస అయ్యంగార్ చెపుతున్నారు. నారాయణ్ బ్రిటిష్ పాలనని పూర్తిగా వదిలేసి, తన పాత్రల యొక్క వ్యక్తిగత జీవితాల మీదనే కేంద్రీకరించడం కూడా ఒక రాజకీయ స్పందనే, అనగా, బ్రిటిష్ పాలన యొక్క ప్రభావమునుంది పూర్తి స్వేచ్చ, అని పాల్ బ్రియన్స్, మాడేరన్ సౌత్ ఏషియన్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ అనే తన పుస్తకములో వ్రాసారు.


ప్రాశ్చాత్య దేశాలలో నారాయణ్ రచనలోని సరత్వం బాగా కొనియాడబడింది. నారాయణ్ రచన హాస్యరసప్రధానమైనదని మరియు మానవ చేర్యలయోక్క బ్రమ మరియు అస్థిరత్వం తో కూడిన దృశ్యం కలిగి ఉంటదని అయిన జీవితచరిత్ర రచయితలలో ఒకరైన విల్లియం వాల్ష్ వ్రాసారు. పలుమార్లు బూకర్ ప్రతిబాతితురైన అనితా దేశాయ్ నారాయణ్ రచనని దయలేక పోవడం, కొంటితనాలే అతి పెద్ద పాపాలుగా ఉండి “దయతో కూడిన యధార్ధమని” వర్ణించారు. వ్యాట్ మసన్ అభిప్రాయం ప్రకారం, నారుయన్ రచనలో వ్యక్తి ఒక్క ప్రైవేట్ తత్త్వం కాదు కాని ఒక్క బహిరంగ తత్త్వం అనే భావం వ్యక్తమవుతుంది. ఈ భావం నూతనమైనదని అందువల్ల ఇది అయిన సొంత భావమని చెప్పొచ్చు. అయిన రచన భారత దేశపు ఆంగ్ల భాష నవల రచనలలో అతి విసేశామైనవాతిలో ఒకటి. ఈ నూతన భావముతో, అయిన ప్రాచీన హైందవ కోణంతో కూడిన ఆంగ్ల రచనలని ప్రాశ్చాత్య పాటకలకు పరిచయం చేసారు. “అయిన సంఘటనలు గురించి సంపాదకీయాలు రాయరు కాని తన సొంత భావాలని వివరిస్తారు” అని వాల్ట్ విట్మాన్ ని ఉద్దేశించి ఎడ్మండ్ విల్సన్ చెప్పిన అభిభ్రాయం నారాయణ్ కు కూడా వర్తిస్తుందని మాసన్ అభిప్రాయం.


తన సాహిత్య జీవితములో అనేక బిరుదులని నారాయణ్ గెలుచుకున్నారు. ఆయినకు లబించిన మొదటి పెద్ద బిరుదు, ది గైడ్ కొరకు 1958లో బహుకరించబడిన సాహిత్య అకాడెమీ అవార్డు ఆరు సంవత్సరాలు తరువాత, గుణతంత్ర దినం సందర్పుముగా ఆయినకు పద్మ భూషణ్ బిరుదు ఇవ్వబడింది. 1980లో ఆయినకు రాయల్ సొసైటీ అఫ్ లిటరేచర్ వారు AC బెన్సన్ మెడల్ బహుకరించారు. అయిన ఆ సొసైటి లో ఒక సభ్యుడు. 1982లో ఆయినని అమెరికన్ అకాడెమి అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ వారు గౌవరవ సబ్యుడుగా ఎన్నుకున్నారు.పలుమార్లు అయిన సాహిత్యానికి నోబెల్ బహుమతి కు ప్రతిపాతించబడ్డారు కాని ఆ బిరుదుని ఎప్ప్దుడు గెలవేలేదు.


యూనివెర్సిటీ అఫ్ లీడ్స్ (1967), యూనివెర్సిటీ అఫ్ మైసూరు (1976) మరియు ఢిల్లీ యూనివెర్సిటీ (1973) ఆయినకి గౌరవ డాక్టరేట్ లు ఇచ్చి గౌరవించాయి. అయిన సాహిత్ర జీవిత చివరిలో, అయిన భారత సాహిత్యానికి చేసిన సేవకు గాను నారాయణ్ భారత పార్లిమెంట్ యొక్క రాజ్య సభకు ఆరు సంవత్సరాల కాలానికు నియమితలయ్యారు. అయిన మరణించడానికి ఒక సంవత్సరము ముందు, 2000లో ఆయినకు భారత దేశపు రెండవ అతి గొప్ప పౌరుల బిరుదైన పద్మ విభూషణ్ బహుకరించబడింది.


తన సాహిత్యం ద్వారా భారత దేశాన్ని బయిట ప్రపంచానికి తెలియబరచిందే నారాయణ్ యొక్క అతి గొప్ప సాధన. ఆంగ్ల భాషలో భారత సాహిత్యరంగానికి చెందిన ముగ్గురు గొప్ప రచయితలలో ఆయినా ఒకరు.ముల్క్ రాజ్ ఆనంద్ మరియు  రాజా రావు మిగిలిన ఇద్దరు. మాల్గుడి మరియు ఆ పట్టణ నివసులలతో తన పాటకులు ఆసక్తిగా ఎదురుచూసే అంశాలని అయిన అందించారు. భారత దేశములోనే అత్యుత్తమ నవల రచయితలలో ఒకరిగా భావించబడుతున్నారు. ఒక చిన్న పాటి భారత పట్టనముని నమ్మసఖ్యే విడములోను పరీక్షాత్ములోను తన పాటకుల ముందు తెచ్చారు. మాల్గుడి కేవలం ఒక్క కల్పితా పట్టణం మాత్రమె కాదు. అనేక పాత్రలతో, వారి యొక్క విచిత్ర ప్రవర్తనలతో నిండి ఉన్న ఒక పట్టణం. జరుగుతున్న కథ తమ ఇంటి ఇరుగు పొరుగులో జరుగుతున్నట్లే పాటకులుకు ఉండేది.

-

నవలలు

స్వామి అండ్ ఫ్రెండ్స్ (1935, హమిష్ హమిల్టన్)

ది బేచలర్ అఫ్ ఆర్ట్స్ (1937, థామస్ నెల్సన్)

ది డార్క్ రూం (1938, ఏయర్)

ది ఇంగ్లీష్ టీచర్ (1945, ఏయర్)

Mr. సంపత్ (1948, ఏయర్)

ది ఫినాన్శియల్ ఎక్స్పెర్ట్ (1952, మెత్యున్)

వెయిటింగ్ ఫర్ ది మహాత్మా (1955, మేత్యున్)

ది గైడ్ (1958, మేత్యున్)

ది మాన్-ఈటర్ అఫ్ మాల్గుడి (1961, వైకింగ్)

ది వెండార్ అఫ్ స్వీట్స్ (1967, ది బోడ్లీ హెడ్)

ది పాయింటర్ అఫ్ సైన్స్ (1977, హీనేమన్)

ఎ టైగర్ ఫర్ మాల్గుడి (1983, హీనేమన్)

టాకటివ్ మాన్ (1986, హీనేమన్)

ది వరల్డ్ అఫ్ నాగరాజ్ (1990, హీనేమన్)

గ్రండ్మోతర్స్ టెల్ (1992, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్

కల్పన-కానిది

నెక్స్ట్ సండే (1960, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

మై డేట్లెస్ డైరీ (1960, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

మై డేస్ (1974, వైకింగ్)

రిలక్టన్ట్ గురు (1974, ఓరియంట్ పేపర్బాక్స్)

ది ఎమేరాల్డ్ రూట్ (1980, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

A రైటర్స్ నైట్మెర్ (1988, పెన్గుయిన్ బుక్స్)


పౌరాణికాలు

గాడ్స్, డేమన్స్ అండ్ అతర్స్ (1964, వైకింగ్)

ది రామాయణ (1973, చాట్టో & విన్డస్)

ది మహాభారత (1978, హీనేమన్)

చిరుకథల సేకరణలు

మాల్గుడి డేస్ (1942, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

యాన్ అస్ట్రాలజర్స్ డే అండ్ అతర్ స్టోరీస్ (1947, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

లాలీ రోడ్ అండ్ అతేర్ స్టోరీస్ (1956, ఇండియన్ థాట్ పుబ్లికేషన్స్)

ఎ హార్స్ అండ్ టూ గొట్స్ (1970)

అండర్ ది బన్యన్ ట్రీ అండ్ అతర్ స్టోరీస్ (1985)

ది గ్రండ్మోతర్స్ టెల్ అండ్ సేలేక్టేడ్ స్టోరీస్ (1994, వైకింగ్)


అనుసరణలు

నారయంబ్ రచించిన ది గైడ్ అనే పుస్తకము గైడ్ అనే పేరుతొ విజయ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రముగా తీయబడింది. ఆంగ్ల భాషలోనూ ఐది విడుదల అయింది. అయితే, చిత్రం తీయబడిన విధము మరియు పుస్తకములో రాసినాట్లు కాకుండా కథని మార్చడం నారాయణ్ కు నచ్చలేదు; అయిన లైఫ్ పత్రిక లో “ది మిస్ గైడెడ్ గైడ్” అనే పేరుతొ చిత్రాన్ని విమర్శిస్తూ ఒక వ్యాసం రాసారు. ఈ పుస్తకము ఒక బ్రాడ్వే నాటిక లాగ హర్వే బ్రెట్ మరియు పట్రిషియ రైన్హార్ట్చే తీయబడింది. ఈ నాటికను 1968లో జియా మొహ్యిద్దిన్ ప్రధాన పోత్ర్ పోషిస్తూ, రవి శంకర్ సంగీతం అందిస్తూ హడ్సన్ థియేటర్ లో ప్రదర్శించబడింది.


Mr. సంపత్ అనే అయిన నవల మిస్ మాలిని అనే పేరుతొ, పుష్పవల్లి మరియు కొత్తమంగళం సుబ్బు నటులుగా తమిళ చిత్రముగా తీయబడింది. పద్మిని, మోతిలాల్ నటులుగా జెమిని స్టూడియోస్ హిందీ లోను ఈ చిత్రాన్ని తీసారు.మరొక నవలైన ది ఫైనాన్షియల్ ఎక్సేర్ట్ బ్యాంకర్ మర్గయ్య అనే పేరుతొ కన్నడములో చిత్రముగా తీయబడింది. స్వామి అండ్ ఫ్రెండ్స్ , ది వెండార్ అఫ్ స్వీట్స్ మరియు నారాయణ్ రచించిన ఇతర కొన్ని చిరు కథలని నటుడు-దర్శుకుడైన శంకర్ నాగ, మాల్గుడి డేస్ అనే పేరుతొ టెలివిషన్ సిరీస్ గా తీసారు. వీటితో నారాయణ్ సంతృప్తి చెంది, పుస్తకాలలో వ్రాసినట్లే కథలని ఉంచడం గురించి నిర్మాతలని నారాయణ్ మెచ్చుకున్నారు.


— ( వికీపీడియా సౌజన్యంతో )


ఆర్.కె.నారాయణ్  తెలుగు అనువాద కథలు – నవలలు చదవాలనుకునేవాళ్ళు దిగువున ఇస్తున్న లంకెలను నొక్కగలరు


1.కథ పేరు – వర్షం – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


2.కథ పేరు – బెడిసికొట్టిన ప్రేమ – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


3.కథ పేరు – గుడ్డి కుక్క – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


4.కథ పేరు – లీలాస్నేహితుడు – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


5.కథ పేరు – అర్ధ రూపాయి విలువ (గమనిక:ఒక పేజి లేదు ఇందులో) – స్రవంతి సాహిత్య పత్రికలో ప్రచురణ


6.కథ పేరు – నిజం (గమనిక:ఆఖరి పేజి లేదు ఇందులో) – ప్రగతి వార పత్రిక లో ప్రచురణ 


7.నవల పేరు – స్వామి మిత్రులు ( తెలుగు అనువాదం స్వామి అండ్ ఫ్రెండ్స్ ) – వాసిరెడ్డి సీతాదేవి అనువాదం


8.నవల పేరు – మాటకారి ( తెలుగు అనువాదం ) – చతుర లో మే 2011 ప్రచురణ


9.కథ – మెరుపు మనిషి

----