Sunday, January 7, 2018

-అరవం అంటే కరవం - -

-అరవం అంటే కరవం -

-

శ్రీనాధుడికి అరవ పిల్లలు అంటే, యెంత ఇష్టమో... 

హాస్య ధోరణిలో చెప్పినఈ చాటువు చూడండి... 

ఇదిగో, మీరు ఏమైనా తిట్టాలన్నా, ఇరికించాలన్నా ... శ్రీనాధుడినే పట్టుకోవాలి.

చదివే ముందు అదే నియమం.

.

మేత కరిపిల్ల; రణమున మేకపిల్ల 

పారుబోతు తనమున పందిపిల్ల 

ఎల్లపనులను చెరుపంగ పిల్లిపిల్ల 

అందమున కోతిపిల్ల , ఈ అరవ పిల్ల

.

అరవం అంటే కరవం అనే కదా మీ భావన.

సంగీత త్రిముర్తులు మా ప్రాంతం వారే,

వ్యాకరణం రాసిన పరవస్తు చిన్నయసురి మా ప్రాతం ,

తెలుగు పేపర్లన్ని మా ప్రాంతం,తెలుగు సినిమాలన్ని మా ప్రాంతం ,

ఆఖరికి మీరు వుంటున్న ఆంధ్ర కూడా మా ప్రాంతంలో అత్మాహుతి ఫలితమే.

ఇంతటితో ఆగుతానా

********************

ఆసియాఖండం లో హైయె పేయ్డ్ స్టార్ సూపర్ స్టార్ రజనికాంత్,

ఆస్కార్ అవార్డ్ ఏ ఆర్ రెహమాన్ మా ప్రాంతం

ఎన్ని సున్నాలో గుర్తుకు రావటం లేదు అన్ని కోట్లు 2G స్కాము మా ప్రాంతం .

ఇక కరిపిల్ల --వాణిశ్రీ ,రాజశ్రీ ,రోజా,శారద వీరందరు కరి పిల్లలే ,

వీరి అందం మైనపు బొమ్మలకుందా?

.

ఇక కరి పిల్లాడు పెద్ద లిస్టే ఇస్తా!

రజనికాంత్ ,విజయకాంత్,విజయ్,విషాల్ వీరికున్న మార్కెట్ 

అలాగే

ఇళయరాజా,మణిరత్నం,బాలచందర్,శంకర్ వీరిని తలదన్నే మగాడెవరు?

.

ఇక ఆయసం వస్తోంది ,ముందు వీటికి జవాబిస్తే ,తరవాత సంగతి చూద్దాం.

.

శ్రీనాధుడు ఎలాగు లేడు కాబట్టి,

మీ నాధుదు,గారిని అడిగి జవాబు చెప్పండీ.

.

హ హ హ హి హి హి

.

కొంచెం మార్పు చేసిన పద్యం నా వద్ద వున్నది 

.

తిండికి కరిపిల్ల పోరున మేక పిల్ల 

పారుబోతు తనంబున పంది పిల్ల 

ఎల్లా పనులను చెరుపంగ పిల్లి పిల్ల 

అందమున కోతి పిల్ల ఆ అరవ పిల్ల

.

No comments:

Post a Comment