Thursday, January 18, 2018

చెన్నపట్నం చూడరా బాబు ! ( మా నాన్నగారి డైరీ నుండి.)

చెన్నపట్నం చూడరా బాబు !

( మా నాన్నగారి డైరీ నుండి.)


వైద్యాలూ అక్కడ వున్నవి. రామేశ్వరాది యాత్రలకు, తిరుపతి యాత్రకు, చెన్నపట్నం వచ్చి తీరాలి గదా!


ఈ రోజులలో సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యపట్న మే కాకుండా తెలుగు అరవ టాకీలకు హాలీవుడ్ కూడాను చెన్నపట్నం. కంపెనీ మేనేజర్లు, మెంబర్లు, డై రెక్టర్లు, అర్టు డై రెక్టర్లు, మ్యూజిక్ డై రెక్టర్లు, యాక్టర్లు, తారలు, తారలతో, వుండే పక్షీంద్రాది హంగుజనం! వీరేమిటి, వారేమిటి, అదో మహాప్రపంచం. అదీ కాకుండా రేడియో ఒకటి వచ్చింది. ఇవి ఇల్లా వుంటోంటే పులిమీద పుట్ర అన్నట్లు బై రాగి టిక్కెట్లు వచ్చి పడ్డాయి. జేబులో పదిరూపాయలు వున్నవారు ఎలాగో చెన్నపట్నం వచ్చి పడాల్సిందే. కిస్టమస్ లో జరిగే కాన్ఫరెన్సులకు లెఖ్కేమిటి? ఆంధ్రదేశంలో ఏ కాన్ఫరెన్సు ఎక్కడ నెగ్గకపోయినా చెన్నపట్నంలో నెగ్గి తీరుతుంది. సంగీతసభలు, ప్రదర్శనాలు, స్వదేశవస్తు ప్రదర్శనాలూ! ఇవన్నీ యిలా వుంచి సర్వకాల సర్వావస్థలయందు వర్తకం వుండితీరింది గదా!


చదువుల కోసం తక్కువ వస్తున్నారా చెన్నపట్నం! 

చెన్నపట్నం చదువు చెన్నపట్నం చదువే! మెడికల్ కాలేజీలు, ఇంజనీరిగ్ కాలేజి, లా కాలేజీ లున్నాయి. రాయలసీమవారంతా చెన్నపట్నం రావలసిందేగదా.


కాని నేను చదువుకొనే రోజులకున్నూ ఇప్పటికిన్నీ చెన్నపట్నం చాలా మారిపోయింది. 1915లో పిచ్చి పిచ్చి హోటళ్ళు వుండేవి చెన్నపట్నం నిండాను. సత్యరాజాచార్యులవారు దేశయాత్రకు వెళ్ళినప్పుడు చూచిన దుడ్డు పుచ్చుకుని భోజనం వేయబడును అనే రకం హోటళ్ళు, ఎండిపోయిన పచ్చిపప్పు, చెండాలపు వాసనకొట్టే నెయ్యి, ఏవో కూరముక్కలు నాలుగు ఉడకబెట్టి ఇంత ఉప్పూ, కారం చల్లిన శాకాలూ, నిన్నటి పప్పు ఇవ్వాళ వేసిన సంబారూ, వీటన్నిటికన్న సిరోమాణిక్యంలా కన్నడ తైరు! అందుకనే, విక్టోరియా హాష్టల్లో సీట్లకోసం పొట్టుపొట్టయి పోయే వారట.


కాఫీ హోటళ్ళు లో ఇడ్డేన్లమీద నెయ్యి వేసేవారు కాదట. కావలిస్తే పుష్కరం రోజుల్నించి పకోడీలు వేయిస్తున్న నువ్వులనూనె (లేకపోతే ఆముదం అనుకోండి) అలాంటిది ఇడ్దేన్ మీద వేసుకునేవారు. కాఫీ తప్పకుండా జిడ్డు ఆముదం. ఆ పరమ దౌర్భాగ్యపు కాఫీని ఎత్తి తాగాలని దేబ్బలాడేవారు అయ్యరు. అక్కణ్ణించి తెలుగు విద్యార్థులు గ్రేట్ వార్డిక్లేరు చేశారట. అన్నంలో వేసిన నెయ్యిని వాసనచూట్టం, అయ్యర్ పళ్ళు మైలు దూరంలో పడేటట్లు పెఠేల్మని కొట్టడం, మంచి నెయ్యి వెయ్యకపోతే ఇడ్డెన్లు వాడి ముఖాన వేసి రుద్దడం, శుభ్రంగా కడుపునిండేటట్టు కాఫీ కరచీ త్రాగడం. అయ్యరు ఆ అన్నాడా, ఆ కాఫీకప్పు అతని నోట్లోవేసి కడుపు లోపలికి దూర్చడమే.


దెబ్బలాటకు తెలుగు కుర్రాళ్ళకి క్రాఫులు బాగా పనికివచ్చేవిట. అరవ వాళ్ళని హతమార్చడానికి కుడుములు బాగా దొరికేవట. కన్నడ తైరు వేశాడా, ఆ తైరూ అన్నం యావత్తు అయ్యర్ని తలంటేవారుట.

అప్పణ్ణించిటండీ చెన్నపట్నంలో నిజమైనమార్పులు రావడం ప్రారంభించాయి


No comments:

Post a Comment