Thursday, April 24, 2014

హంపి  సుందరి....మా స్వప్న సుందరి...

అసలు నాయకుడు మధ్యలో ఉన్నాడు..... .

చిదంబర రహస్యం అంటే ఏమిటి?


.

చిదంబర రహస్యం అంటే ఏమిటి? 

పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది.ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.

Wednesday, April 23, 2014

వెన్నెల మల్లి విరి పందిరిలోన ....wmv

” వెన్నెల పందిరిలోన

చిరునవ్వుల హారతులీనా
పండు వెన్నెల మనసు నిండా వెన్నెలా
కొండపైనా కోనాపైనా కురిసే వెన్నెలా…విరిసే వెన్నెలా ”
అంటూ వెన్నెలను చూసి మురిసిపోయే ఈ పాట ‘దేవులపల్లి’ రచన ! ‘అద్దేపల్లి రామారావు’ స్వరపరిచిన ఈ పాటను ‘బంగారు పాప’ చిత్రానికి ఎ.ఏమ్.రాజా,సుశీల పాడారు

పగలే వెన్నెల జగమె ఉయల
ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు ఈ పాట. అంత అద్భుతమైన సంగీతం, సాహిత్యం, గాత్రం...
వెరసి ఈ పాట.. పాడింది S.జానకి గారు.
రాసింది మన తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత అయిన Dr.C నారాయణ రెడ్డి గారు. 
ఈ మృదుమధురమైన భావాలని...వింటుంటే హాయిగా మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. అసలు మన మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి పాటలు వింటే చాలు. మనసుకు స్వాంతన కలుగుతుంది.
పగలే వెన్నెలా... జగమే ఊయలా... 
కదిలే వూహలకే కన్నులుంటే...

పగలే వెన్నెలా... జగమే ఊయలా... 

నింగిలోన చందమామ తొంగి చూచే.. 
నీటిలోన కలువభామ పొంగి పూచే.. 
ఈ అనురాగమే జీవన రాగమై... 
ఈ అనురాగమే జీవన రాగమై... 
ఎదలో తేనెజల్లు కురిసిపోదా.... 

పగలే వెన్నెలా...జగమే ఊయలా...

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే.. 
మురళిపాట విన్న నాగు శిరసునూపే.. 
ఈ అనుబంధమే మధురానందమై... 
ఈ అనుబంధమే మధురానందమై... 
ఇలపై నందనాలు నిలిపిపోదా...

పగలే వెన్నెలా....జగమే ఊయలా... 

నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే...
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే... 
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే... 
మనసే వీణగా ఝన ఝన మ్రోయగా... 
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా...

పగలే వెన్నెలా....

Tuesday, April 22, 2014

మట్టిగొట్టుకు పోతావు...'

మట్టిగొట్టుకు పోతావు...'

'ఇంత చిన్న దానికి అంత పెద్ద మాటాలు ఎందుకండి ?'

'అబ్బే... నేను చెప్పేదీ...'

'ఈ మధ్య మీకు మరీ కోపం ఎక్కువైందండి... లేకపోతే, ఇంత తీవ్రంగా స్పందిస్తారా?'

'అదికాదు....'

'పోన్లెండి, మీకూ నాకు తిట్ల ఋణం ఉండి ఉంటుంది, అలా సరిపెట్టుకుంటాను...'

'చెప్పేది వినకుండా వేదాంతం ఏవిటయ్యా బాబూ ! ఇక్కడ (నార్త్ లో) సన్నటి దుమ్ము ఎక్కువ. గాలి గారికి మన మీద దయ కలిగినప్పుడల్లా, పెద్ద గాలి దుమారం లేస్తుంది(వీళ్ళు దాన్ని లూ అంటారు ). దానికి సమయం, సందర్భం ఉండవు. 'ఊ....' అని గట్టిగా శబ్దం వినబడగానే దాక్కోవాలి, బాల్కనీ లో సామాన్లు లోపల పెట్టేసుకోవాలి. లేకపోతే, బొక్కెనలు, మగ్గులు, బట్టలు, చివరికి బక్క ప్రాణి అయిన మీరూ.... గాలి వేగానికి గాల్లో ఎగురుతారు. లేకపోతే....మట్టి కొట్టుకు పోతారు. అందుకే గాలి దుమారం విషయంలో జాగ్రత్త తీసుకోండి ! ఇదీ నేను చెప్పేది.'

ద గ్రేట్ స్టుపిడిటి

ద గ్రేట్ స్టుపిడిటి


నా కిప్పుడు జనం కావాలి.

పల్లకీలో ఎక్కించి,.
ఒహోం ఒహోం అంటూ మోసుకెల్లే
బలిసిన భుజాలు లాంటి జనాలు.

రెండు మెతుకులు కూడు కోసం,
కుక్కల్లా  కాళ్లు నాకే విశ్వాసం గల జనాలు.

పొదుగుల నుండి రక్తం పిండుతున్నా
ప్రతిఘటించడం చాతకాని బర్రెల్లాంటి జనాలు.

రెండు కాగితాలకు,  ఓ క్వార్టర్ మందుకో
తనను తానమ్ముకునే వేశ్యల్లాంటి జనాలు,

నాకిప్పుడు జనం కావాలి.

మనుషులమనే మరిచిపోయిన
గాడిదల్లాంటి, గొర్రెల్లాంటి, పాముల్లాంటి, నక్కల్లాంటి
ఇంకా ఇంకా కొన్ని జంతువుల్లాంటి జనాలు
అసలు నేను మనిషిననే సంగతే మరిచిన జనాలు
మనిషనేవాడిని తలుచుకోవాలంటేనే,
సిగ్గుతో తలలొంచుకునేటట్లు బతికే జనాలు.

నాకిప్పుడు జనం కావాలి.

కళ్లుండి చూడని జనాలు,
మెదడుండి ఆలోచించని జనాలు,
కాళ్లూ చేతులూ వుండి
పనిచేయని సోమరి జనాలు.
బతుకంటే ఏంటో తెలియని జనాలు,
బతకడం చేతకాని జనాలు,

బీజమూ లేక, అండమూ రాక
కొత్త సృష్టికి నోచుకోలేక, ఆవిరైపోయే
నపుంసకుల్లాంటి జనాలు కావాలి.

నాకిప్పుడు జనం కావాలి.
నేననుకొనెట్లు మాత్రమే ఆడగల
బొమ్మల్లాంటి జనాలు కావాలి నాకిప్పుడు.

x

సూర్యాస్తమయ వర్ణన :(శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి) .

ధూర్జటికవీంద్రుని అసమాన ఊహాసౌందర్యానికి అద్దంపడుతున్న పద్యం.

.

సూర్యాస్తమయ వర్ణన :(శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి)

.

ప్రాగ్వధూమణి చిమ్మఁ బశ్చిమదిక్కాంత

పట్టిన చెంగల్వబంతి యనగ,

కాలవిష్ణుం డంధకారదైత్యుని వ్రేయఁ

చరమాద్రి బడిపోవు చక్ర మనగ,

దినమహీరుహమునఁ దేజోమయంబుగా

పండి రాలిన పెద్దపండనంగ,

దివినుండి దేవదానవ యుద్ధ రక్తార్ద్ర

మై నేలఁగూలు రథాంగ మనగ,

పద్మినీసంగమశ్రాంతిఁ బరిహరింప

నపరజలనిధి జలకంబు లాడఁబోవు

కరణి, నెఱసంజ చందురుఁగావి పచ్చ

డంబు ధరఁ బెట్టి, భానుబింబంబుఁ గ్రుంకె!

విశ్లేషణ: Satyanarayana Piska గారు.

అస్తమిస్తున్న సూర్యబింబమును చిత్రవిచిత్రంగా ఉత్ప్రేక్షించాడు ఈ కవి.... తూర్పుదిక్కు అనే వధూమణి విసరగా, పశ్చిమదిక్కు అనే కాంత పట్టుకున్న ఎఱ్ఱని బంతి; కాలమనే విష్ణువు అంధకారమనే అసురునిపై ప్రయోగించగా, అస్తాద్రి వెంబడి పోతున్న సుదర్శనచక్రం; పగలు అనే చెట్టుకు తేజోమయంగా పండి రాలిపడుతున్న పెద్దపండు; దేవదానవ యుద్ధసమయములో రక్తముతో తడిసి, దివినుండి భువికి జారిపడుతున్న రథచక్రం అన్నట్టుగా అస్తమిస్తున్న రవిబింబం గోచరిస్తున్నదట! అంతేకాదు. పద్మినీసంగమం వల్ల కలిగిన అలసటను పోగొట్టుకోవడం కొరకు పడమటిసముద్రములో జలకేళి ఆడబోతూ, కట్టుకున్న కావిరంగు వస్త్రాలను ఒడ్డుమీద పెట్టి సముద్రములో మునుగుతున్నట్లుగా ఉన్నదట ఆ భానుబింబం..... ఎంత అద్భుతమైన వర్ణన!

Monday, April 21, 2014

"శ్రీకాళహస్తి మాహాత్మ్యము" లో మదిరాపానంతో మత్తెక్కిన శబరదంపతుల చేష్టల వర్ణన-

"శ్రీకాళహస్తి మాహాత్మ్యము" లో మదిరాపానంతో మత్తెక్కిన శబరదంపతుల చేష్టల వర్ణన

.

మాటలాడఁ దలంచి మఱచిపోయెడివారు,

నడవఁబోవుచుఁ దొట్రుపడెడువారు,

యూరకుండెదమని యుండనోపనివారు,

లేచెదమని లేవలేనివారు,

పనిలేనిపని బట్టబయలు దిట్టెడివారు,

పాడనేరకయును పాడువారు,

యెదురైనవారికి నెల్ల మ్రొక్కెడివారు,

వ్రీడావిహీనులై యాడువారు,

చాలఁ ద్రావియు మగుడఁ జేసాచువారు,

దొడరి యుపదంశ భాండముల్దొడుకువారు

నైరి, మృగయాధిదేవత దైవతయాత్రయందుఁ

పానములు చేసి శబరదంపతులు రతుల !

(శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి)

.విశ్లేషణ..Satyanarayana Piska

మృగయాధిదేవత దైవతయాత్రలో సురాపాన గారు.ము చేసిన శబరదంపతుల చేష్టలను అతి సహజంగా వర్ణించినాడు ధూర్జటి కవీంద్రుడు.... వారు ఏదో మాటాడవలెనని తలచి, అది మరిచిపోతున్నారు. నడవబోయి తూలిపడుతున్నారు. నిశ్శబ్దంగా ఉండాలనుకొని కూడా ఉండలేకపోతున్నారు. లేవాలని ప్రయత్నించి కూడా, లేవలేకపోతున్నారు. పనిలేకపోయినా ఊరికే ఇతరులను తిడుతున్నారు. పాడటం చేతకాకపోయినా, రాగాలు తీస్తున్నారు. ఎదురుపడినవారందరికి నమస్కరిస్తున్నారు. సిగ్గువిడిచి గంతులు వేస్తున్నారు. నిండుగా త్రాగికూడా మళ్ళీ చేయి చాపుతున్నారు. నంజుడుకుండలను ఒడిసి పట్టుకుంటున్నారు...

ధూర్జటికి రూపక, ఉత్పేక్షలు ఎంత సులభములో, స్వభావోక్తి కూడా అంతే సులభం. పై వర్ణన త్రాగినవారి చేష్టలను ఎంతో సహజంగా కళ్ళకు కట్టిస్తోంది కదూ!

శ్రీరాముడు పూర్వభాషి

Jaji Sarma.

.


శ్రీరాముడు పూర్వభాషి. అంటే పెద్దవారు కనపడినా, చిన్నవారు కనబడినా ముందే ఆయనే పలకరించే వారు. మనము ఎప్పుడైతే రామాయణ, భారత, భాగవతములను మన పిల్లల చేత చదివించటం మానేసామో అప్పటి నుండే మన సంస్కృతి నుండి దూరమవుతూ వస్తున్నాము. ఆ పురాణాలు మనకు జీవితంలో కావలసినవి అన్నీ ఇచ్చాయి. మనమే తీసుకోవటం మానేశాము

గజేంద్ర మోక్షం పద్యాలు.

గజేంద్ర మోక్షం పద్యాలు.

.


కరి దిగుచు మకరి సరసికి

కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్

కరికి మకరి మకరికి కరి 

భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !!

.


కలడందురు దీనుల యెడ

కలడందురు భక్త యోగి గణముల పాలం

గలడందురన్ని దిశలను

కలడు కలండనెడు వాడు కలడో లేడో !!

.


లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వడు 

ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!

.


ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?

ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం

బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా

డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!

.


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్

రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!

.


అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!

.


సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే

పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో

పరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహి యై !!

.


అడిగెద నని కడు వడి జను

అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్

వెడ వెడ జిడి ముడి తడ బడ 

నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!

Friday, April 18, 2014

లలాట లిఖితం

లలాట లిఖితం

.

ఇది నా స్వంత రచన కాదు. చిన్నప్పుడు విన్నది ఇప్పుడు నలుగురికీ చెప్పాలని రాస్తునాను. మీలో కొందరికి ఇది ఇదివరకే తెలిసి ఉండవచ్చు.

నారద మునికి ఎలాగైనా తండ్రిగారైన బ్రహ్మను గద్దె దింపి తాను పరమపిత అనే బిరుదు కొట్టేద్దామని మహా కోరికగా ఉండేది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. త్రిలోక సంచారికదా ఒక సారి భూలోక సంచారం చేస్తూ ఒక స్మశానం మీదుగా వెళుతుండగా అతని కాలికి ఒక పుర్రె తగిలింది. పరిశీలనగా దానివైపు చూస్తే ఆ పుర్రెయొక్క నొసటి భాగాన ఊర్ధ్వలోక ప్రాప్తి అని రాసి ఉంది. హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం శవాన్ని దహనం చెయ్యాలి. అలా చేస్తే పుర్రె ఉండదు, మరి పుర్రె ఉన్నాదీ అంటే ఆ ప్రేతానికి దహన సంస్కారాలు జరుగనట్లే, దహనమే జరుగని ప్రేతానికి ఊర్ధ్వలోక ప్రాప్తి ఏమిటీ,? దొరికేడు మా నాన్న, ఈ దెబ్బతో అతగాడిని గద్దె దించి నేను కూర్చుందును అనుకుంటూ తన బలం ద్విగుణీక్రుతం చేసుకుందుకు ముందస్తుగా కైలాసానికి వెళ్ళి శంభో శంకర, చూసేవా మా నాయనగారి తెలివిలేని రాతలు అంటూ ఆపుర్రెను శివునకు చూపించేడు. అవును నారదా మీ నాన్న ముసిలివాడవుతునాడు సుమా అంటూ శివుడు చెప్పగానే నారదుడు రెట్టించిన ఉత్సాహంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకు కూడా ఆ పుర్రె చూపించి అతని చేత కూడా బ్రహ్మ ముదుసలి అన్న మాట అనిపించుకుని సత్యలోకం చేరుకుని తండ్రిని నిలదీసేడట దహన సంస్కారమే లేని వీనికి ఊర్ధ్వ లోక ప్రాప్తి ఎలా?? అని. బ్రహ్మ చిరునవ్వుతో "కుమారా నీవే స్వయంగా ఊ పుర్రెను కైలాసానికీ వైకుంఠానికీ తీసుకెళ్ళి ఇక్కడికి తెచ్చేవు కదా మరి ఊర్ధ్వలోక ప్రాప్తి లేదని ఎలా అనుకుంటునావు అని అడుగగా నారదుడు తెల్ల మొహం వేసేడట. అదీ భోగట్ట. అంచేత నొసటిరాతను తప్పించ ఎవరి తరం??

స్నేహితుడు..

స్నేహితుడు..

ఒంటరితనంలోనూ, గెలుపూ, ఓటమిలోనూ సదా నిలిచి ఉండేది స్నెహితుడే! కళ్ళల్లో నీరు నిలిచినపుడు ఒక స్నేహహస్తం తడికన్నుల్ని తుడుస్తుంది. ఆపదలు ఎదురైనప్పుడు అది అభయహస్తమై చేయి పట్టి నడిపిస్తుంది. కంటికి రెప్పలా కాపాడేది, కలిమిలోనూ లేమిలోనూ వీడకుండా తోడైఉండేది నిజమైన నెస్తమే! అవసరానికి ఆదుకునే మిత్రుడు దెవుడిచ్చిన వరం. "యది సుహృద్దివ్యౌషధై: కింఫలం" ఒక ఉత్తమ స్నేహితుడుంటే ఔషధాల అవసరం లేదనేది బర్తృహరి సుభాషితం.

ఆనాటి సమాజం తనను ఉపేక్షించి వెలివేస్తే- తనకో గుర్తింపు, ఉనికీ కలిగించిన దుర్యోదనుడి శ్రేయం కోసం కర్ణుడు తుది శ్వాస వరకూ జీవించాడు.

చాలా సంవత్సరాల తరవాత కనిపించిన బాల్యమిత్రుడైన కుచేలుడి కాళ్ళు కడిగి నెత్తిమీద చల్లుకున్నాడు కృష్ణుడు.

అలా కర్ణుడు, కృష్ణుడు స్నేహానికి ప్రతిరూపాలుగా నిలిచారు నేటికీ.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

 
 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

              సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

              రామనామ వరానన ఓం నమ ఇతి 


కల్మషమైన చిత్తము, పాపిష్టి సంపాదనతో జీవించడం, ఆచరించవలసిన కర్మలను నిర్వర్తించకపోవడంతో పాటు నిషిద్ధ కర్మలకు పాల్పడడం మనుష్యులకు దుఃఖాన్నిస్తాయి. 


అయితే తరుణోపాయం ఉంది. భక్తిరేవ గరీయసీ! భక్తి ఒక్కటే మార్గం. అందుకే శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు "పిబరే రామరసం ... - ఓ జిహ్వా, రామరస పానం చేయవే" అని ఉపదేశించారు. 


భగవన్నామ సంకీర్తన అన్నప్పుడు శ్రీ రామనామమే ఎందుకు జ్ఞాపకం వస్తుంది? 


శ్రీరామ శబ్దం జగత్తులొనే మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని కాళిదాసు మహాకవి అన్నాడు. ఔషధం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అమృతం అమరజీవనం ఇస్తుంది. శ్రీరామనామామృత పానంతో అమరత్వం సిద్ధిస్తుంది. అసలు శ్రీరామతత్త్వం మన మనసులోనే ఉంది. 


అష్టాక్షరి (ఓం నమోనారాయణాయ) లో "రా" శబ్దము, పంచాక్షరి (ఓం నమశ్శివాయ) లో "మ" శబ్దం తీసుకోగా రామశబ్దం ఏర్పడింది. రేడు మంత్రాలలొని శక్తిని కలుపుకున్న శక్తి రామనామానికి ఉంది. అంతేకాదు, శ్రీరామనామం త్రిమూర్త్యాత్మకమైనది. రామశబ్దం అద్వైతపరంగా కూడా పరబ్రహ్మతత్త్వాన్నే సూచిస్తుంది.


శ్రీరాముని రామాయణానికి పరిమితం చేసి దశరథుని కుమారునిగా, సీతాపతిగా చూసినా ఆ పురుషోత్తముడు శాంతిస్వరూపుడు. శ్రీరాముని వైరాగ్య దృష్టి అసమానము. ఆయన ప్రేమస్వరూపుడు. రామాయణ కావ్యంలోని తాత్త్విక రహస్యాలకు అంతులేదు. ఆ కావ్యంలో చెప్పినదంతా ప్రతి జీవి కథ. ప్రతి పాత్ర ద్వారా, ప్రతి కాండ ద్వారా మానవజాతికి మహత్తర సందేశం అందుతున్నది. 


కల్మష నాశనం చేసే రామనామం జననమరణాల వాళ్ళ జనించే వివిధ భయాలను, శోకాలను హరించి వేస్తుంది. సకల వేదాలు, ఆగమాలు, శాస్త్రాలకు సారభూతమైనది శ్రీరామనామము. రామాయణంలో ఏ సన్నివేశం చూసినా సకల శాస్త్ర నిగమ సారమే కనిపిస్తుంది. 


జగత్పాలకమైనది రామనామం. రామనామంతో పునీతమైతే అపవిత్రమైనదన్తో ఏదీ ఉండదు. అటువంటి రామనామామృతాన్ని పాణం చేయడానికి కుల, జాతి, మత వ్యవస్థలు ఏవీ అవరోధాలు కావు. 


కావలసినది భక్తి. రావలసినది ఆర్తి. 


మనం తరించాలి. ఇతరులను తరింపజేయాలి.

x

ఎవరివయా..నువ్వెవరివయా

Himaja prasad

ఎవరివయా..నువ్వెవరివయా

చల్ల గాలినే పిల్లనగ్రోవిగ మెల్ల మెల్లగా ఊదే స్వామీ.. ఎవరయ్యా నువ్వెవరివయా.. అంతేలేని ఆకాశానికి ఆవల ఉన్నావు ఎంతో ఎంతో దగ్గరగా నా అంతరంగాన ఉన్నావు.. గల గల పారే సెల ఏరులలో వినిపించునయా నీ మురళి అశాంతి నిండిన జగాన నేడు ప్రశాంతి నొసగును ఆ రవళి

Thursday, April 17, 2014

రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!

రాగమయి రావే.. ' ఎన్నిసార్లు రావాలి? నేన్రాను పో!

ఒకానొక దుష్ట సంవత్సరం విపరీతంగా పాడబడ్డ పాట.. 'రాగమయి రావే! అనురాగమయి రావే!'. ఒకళ్ళ తరవాత మరొకళ్ళు.. రేషన్ షాపు దగ్గర 'క్యూ' కట్టినట్టు వరసలో నిలబడి మరీ పాడారు. ఓ నలుగురు పాడంగాన్లే నాకు విసుగొచ్చేసింది. ఈ వెధవలు పిలిస్తే 'రాగమయి' రావడం మాట అటుంచి.. దడుపుడు జొరంతో పారిపొయ్యే ప్రమాదం తీవ్రంగా ఉంది!

చిత్రమేమంటే మహాగాయకుడు ఘంటసాల సినిమా కోసం పాడిన మట్టి రికార్డ్ మూడున్నర నిమిషాలే! కానీ మావాళ్ళు ఘంటసాల కన్నా బాగా పాడేద్దామని ఉత్సాహపడేవాళ్ళు. అంచేత ఒరిజినల్ పాటలో లేని కొత్త సంగతులు వేసి.. తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రాగాలు సాగదీస్తూ పది నిమిషాలకి పైగా పాడేవాళ్ళు.

చివురులు మేసిన చిన్నారి కోయిల.. ' చరణం ఆ నాటి 78 rpm రికార్డులో లేదు.

మరొక్కసారి విని ఆనందిచండి.

మేలిమి బంగారం మన సంస్కృతి.

మేలిమి బంగారం మన సంస్కృతి.

శ్లోll

అపహాయ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః

తే హరేః ద్వేషిణః పాప్మాః ధర్మార్థం జన్మ యద్ధరేః.

.

తే.గీ.ll

చేయ వలసెడి కర్మంబు చేయఁ బోక.

కృష్ణ కృష్ణంచు జపియించుకృష్ణ భక్తుఁ

డరయ దేవుని శత్రువు. పరమ పాపి.

ధర్మ సంస్థాపనకె జన్మ దాల్చె హరియె. 

.

భావము:-

స్వధర్మ కర్మలను విడిచిపెట్టి కేవలము కృష్ణ కృష్ణ యనుచు కూర్చొనువారు శ్రీహరిని ద్వేషించు వారు. పాపులు అగుదురు. ఎందుచేతనంటే ఆ హరి యవతారములెత్తినది ధర్మ రక్షణమునకే గాని ఊరకనే కాదు కదా! 

స్వధర్మానికి దూరముగా ఉంటూ భగవన్నామ జపము చేయుచూ కాలము వ్యర్థపుచ్చుట యుక్తము కాదని గ్రహించ వలెను. స్వధర్మాచరణము చేయుచూ భగవాన్నామ స్మరణ చేయుచూ కర్మఫలమా పరమాత్మకే అర్పింప దగును.

ఈ క్రింది శ్లోకము మేలిమి బంగారం మన సంస్కృతి 29. గా చెప్పఁబడి యున్ననూ ఇచ్చట పునరుక్తమైనది.

.

శ్లో:-

పరోపకారాయ ఫలంతి వృక్షా: 

పరోపకారాయ దుహంతి గావ:

పరోప కారాయ వహంతి నద్య: 

పరోపకారార్థమిదం శరీరం.

.

గీ:-

పరుల కొఱకని వృక్షము ఫలములిచ్చు.

పరుల కొఱకని ధేనువు పాల నిచ్చు.

పరుల కొఱకని నదులిల పారుచుండు.

పరులకుపకారములుఁ జేయఁ బ్రతుక వలయు.

.

భావము:-

చెట్లు పరులకుపకరించుట కొఱకే ఫలించుచుండును. ఆవులు పరులకుపకరించుట కొఱకే పాలనిచ్చును. నదులు పరుల కుపకరించుట కొఱకే ప్రవహించు చుండును. పరుల కుపకారము చేయుటయే యీ శరీరము కలిగి యున్నందులకు ప్రయోజనము.

పరోపకార బుద్ధి మనలో మనమేమీ తక్కువ కాదు అనే విధంగా చేస్తూ ఉండవలెను.


x

అర్థానా మార్జనే దుఖం,

శ్లో. అర్థానా మార్జనే దుఖం, ఆర్జితానాం చ రక్షణే 

ఆయే దుఃఖం , వ్యయే దుఖం ధిర్థాః కష్టసంశ్రయాః.

.

క. ధన సంపాదన దుఃఖము.

ధన రక్షణ దుఃఖమయము ధన మొచ్చు నెడన్,

ధనమది ఖర్చగు వేళను

మనకౌనది దుఃఖ ప్రదము. మది గనుడయ్యా.

.

భావము. ధనాన్ని సంపాదించటంలో దుఃఖం , సంపాదించిన దానిని రక్షించటంలో దుఃఖం .ఆదాయంలో దుఃఖం , వ్యయంలో దుఖం. అయ్యో సంపదలు ఎన్నో కష్టాలను ఆశ్రయించుకొని ఉంటాయి కదా!

వ్రాసినది చింతా రామ కృష్ణా రావు.

x

ఈ వారం కవిత::: కవి-

@ Patwardhan M.V.

 ఈ వారం కవిత::: కవి--వింజమూరి వెంకట అప్పారావ్ 
కవితలు చాలా మంది రాస్తారు.అయితే చూడగానే ఇంతేనా అనిపించినా దిగితేనే కానీ లోతు తెలియని విధంగా రాయడం మాత్రం మహా కవుల లక్షణం.గొప్ప సామాజిక స్పృహతో కూడిన కవిత.చిన్న పదాల్లోనే పెద్ద అర్థాన్ని చెప్పాడు. 

కచ్చగా రాసా నేనొక కవిత---ఇక్కడే కవి ప్రతిభ తెలుస్తుంది.కచ్చగా అంటూ ఎత్తుకున్నాడు.ఎవరి మీద,ఎందుకు అనేది చెప్పలేదు.అలా పఠితల ఊహలకు కొన్ని వదిలివేయడమే మహా కవుల లక్షణం.కప్పి చెప్పేదే కవిత్వం. కవికి సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కచ్చ ఉంది.

కసి గా తీసుకొచ్చి చదువుతా---ఈ వాక్యంలో కవి తన కవితకు పాఠకులు/శ్రోతలను నిర్ణయించుకుంటున్నాడు.ఇక్కడ శ్రోతలు ఎవరో కాదు.అన్యాయాయాలూ,అక్రమాలూ చేసే వారే !ఇలా స్పష్టంగా తన పాఠకులను నిర్ణయించుకోవడమూ ఉత్తమ కవి లక్షణమే! 

వినకపొతే మీ అందర్ని నరుకుతా--ఇక్కడ బయటకు తన కవితను వినక పోతే అని ధ్వనిస్తున్నా నిజానికి తాను చెప్పిన లేదా వెలిబుచ్చిన అంశాలను,అవగతం చేసుకొని మారకపోతే అని నర్మగర్భితంగా చెపుతున్నాడు.నరకుతా -అనడం ద్వారా తాను సమాజాభ్యుదయం కోసం సాయుధ విప్లవానికి సిధ్ధమేనని సందేశం ఇస్తున్నాడు.

అది విని బతికితె మళ్ళీ చదువుతా.. 
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..///ఈ వాక్యం మొత్తం కవితకు ఆయువుపట్టు.గొప్ప భావాన్నో,ఉద్వేగాన్నో వెలిబుచ్చేటప్పుడు పునరావృత్తి అందాన్నిస్తుంది. పునరావృత్తి ప్రధానంగా జానపద కవిత్వ లక్షణం, ఇక్కడ కవి తాను మళ్ళీ మళ్ళీ చడువుతా అనడం ద్వారా తన ప్రయత్నాలకు ఎన్ని ఆటంకాలెదురైనా వెనుకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞా పూర్వకంగా చెపుతున్నాడు.

నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో వచ్చిన అతి కొద్ది గొప్ప కవితల్లో వింజమూరి వెంకట అప్పారావ్ గారి ఈ కవిత ఒకటి.కవికి అభినందన లు.ఈ కవి ఇలాంటి ఉత్తమ శ్రేణి కవితలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను. 

పెద్దన చాటువులుపెద్దన చాటువులు

పెద్దన చాటువులు

కావ్యాలు రాయటానికి పెద్దనకి ఇవన్నీ కావాలట

నిరుపహతిస్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు క

ప్పుర విడె మాత్మ కింపయిన భోజన మూయల మంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరకిన గాక యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే ?!

రాయల మరణానంతరము చెప్పిన పద్యాలు

ఎదురైనచోఁ తన మద కరీంద్రము డిగ్గి 

  కేలూఁత యొసఁగి యెక్కించుకొనియె

కోకట గ్రామాద్యనేకాగ్రహారంబు

లడిగిన సీమల యందు నిచ్చె

మను చరిత్రం బందుకొను వేళఁ పురమేగ

పల్లకి తన కేలఁ బట్టి యెత్తె

బిరుదైన కవి గండ పెండేరమున కీవ 

  తగుదని తానె పాదమునఁ తొడిగె

ఆంధ్ర కవితా పితామహ! అల్లసాని

పెద్దన కవీంద్ర యని నన్నుఁ బిలుచునట్టి

కృష్ణరాయలతో దివికేఁగ లేక

బ్రతికి యున్నాఁడ జీవాచ్ఛవంబ నగుచు!

"కృష్ణ రాయల నిర్యాణా నంతరము కళింగ పాలకుడగు గజపతి

కన్నడ రాజ్యము పైకి దండెత్తి రాగా పెద్దన క్రింది సీస పద్యమును 

విరచించి పంపెననియు, దానిని చదువుకొని యాతడు సిగ్గిలి మరలి 

పోయె ననియు నొక యైతిహ్యము ప్రచారములో గలదు"

రాయ రావుతు గండా  రాచ యేనుఁగు వచ్చి

      యారట్ల కోటఁ  గోరాడు నాఁడు

సంపెట నర పాల సార్వ భౌముఁడు వచ్చి

      సింహాద్రి జయశీలఁ జేర్చు నాఁడు

సెల గోలు  సింహంబు చేరి ధిక్కృతిఁ గాంచు

      తల్పులఁ గరుల  డికొల్పునాఁడు

ఘనతర నిర్భర గండ పెండర మిచ్చి

      కూఁతు రాయని కొనగూర్చు నాఁడు

నొడ లెఱుంగక సచ్చితో? యుర్వి లేవొ?

చేరఁ జాలక తల చెడి జీర్ణ మైతొ?

కన్నడం   బెట్లు సొచ్చెదు? గజపతీంద్ర?

తెఱచి నిలు  కుక్క సొచ్చిన తెఱఁగు దోఁప.

(తెనాలి రామకృష్ణుడి విమర్శకు పాలైన "అమవస నిశి" పద్యం)

కలనాటి ధనము లక్కర

గలనాటికి దాచ కమల గర్భుని వశమా

నెల నడిమి నాటి వెన్నెల

యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

 తిరుపతి వేంకటా కవుల చాటువులు 

దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినార మీ

మీసము రెండు భాషలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ

మీసము దీసి మీ పద సమీపములన్ దలలుంచి మ్రొక్కమే !!

ఆనొథెర్ పోం ఇన్ థైర్ ఉసూల్ ఇర్రెవెరంత్ స్త్య్లె:

తద్దినము బెట్టువారల తమ్ముల బలె

బద్దెపున్ గవులకు వెన్‌క గద్యపుంగవు

లుంద్రు; స్త్రీ శూద్ర జనులకు నుపకరింత్రు

వారు పిట్ట కవిత చెప్పువారు గాక!

అష్టావధాన శతావధానములన్న

నల్లేరు పై బండి నడక మాకు

.

.

.

.

చదువు నేర్పించెను చర్ల బ్రహంఅయ శాశ్త్రి

వంట నేర్పించె గద్వాల రాజు

ఏనుగులెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స

న్మానము లందినాము బహుమానములన్ గ్రహియించినర ...

..................................................

................................ నీ కృపనన్ సరస్వతీ

ఒక చరణంబు నేను మరి యొక్కటతండు .............

...........

...........

...........

అవధాన ప్రక్రియ గురించి వారి అభిప్రాయములు

కవన మటన్న గష్ట మది కల్గుట యబ్బుర మందు నాశుగా

గవనము జెప్పుటన్న మరికష్టము యందును వృత్త భేదముల్

కవనము జెప్ప దప్పులెటు కల్గక యుండును దాని నెన్ను కా

కవులకు మొట్లు సత్కవుల కంజలి బంధ మొనర్తు రుత్తముల్

ఏయే సంగతు లేరి కిష్టమగునో ఏ వృత్తమెవ్వారికిన్

శ్రేయంబౌనొ యటుల్ ముదంబు నచల చ్చిత్తంబు సొంపారగా

వేయింగన్నుల ప్రోడబాస బ్రకృ తోర్వీ భాషయు న్నేర్చి వి

ద్యాయత్తంబు శతావధానమును జేయన్ మెప్పు రాకుండునే

ఇదివరనే వధానము లనేకములం బొనరించితిన్ ముదం

బొదవగ నందు మైమరచి యుండగ నెంతటి వానికేని గూ

డదు గడనెక్కి యెప్పుడు హుటాహుటి నాడ గలానికేని గుం

డె దిగులు ప్రాణసంకటము డిందునె దొమ్మరి కాటకాటకున్ 

దొమ్మరిసాని యెంతయును దుడ్కుమెయిన్ గడనెక్కి యాడు పో

ల్కిమ్మది బల్కి కల్మి కడు గీరితికై యవధానముం బొన

ర్చు మ్మనుజుండు..."

(చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి, 'అష్టావధానమంటే?', 

 త్రిలింగ, 12 ఆగస్ట్ 1935).

భక్తిలో రకాలు?

భక్తిలో రకాలు?

1 శ్రవణ భక్తి :

సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.

2 కీర్తనా భక్తి :

భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.

3 స్మరణ భక్తి :

భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

4 పాదసేవన భక్తి :

భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.

5 అర్చన భక్తి :

ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.

6 వందన భక్తి :

వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.

7 దాస్య భక్తి :

ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.

8 సఖ్య భక్తి :

సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

9 ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి :

ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు

Wednesday, April 16, 2014

వాక్కు అంటే ఏంటి?

మహాభారతంలోని ఆదిపర్వమునందలి చతుర్థాశ్వాసంలో వాక్కు, సత్యవాక్కుల గురించిన ప్రస్తావన వస్తుంది. ఎటువంటి మాటలు మాట్లాడాలి?! వాక్కు అంటే ఏంటి? అన్న అనేకప్రశ్నలకి సమాధానాలు ఈ సందర్భంలో లభిస్తాయి.

చ. నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.

భావం. తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్నిగురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.

క. వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం

దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.

భావం. వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.

Monday, April 14, 2014

శ్రీరామ భజనలు చేసే చోట ప్రత్యక్షమయ్యే చిరంజీవి!

శ్రీరామ భజనలు చేసే చోట ప్రత్యక్షమయ్యే చిరంజీవి!

యత్రాస్తి భోగో నహి మోక్షః యత్రాస్తి మోక్షోనమి తత్ర భోగః

శ్రీమారుతీస్సేవనం తత్పరాణం | భోగశ్చ మోక్షశ్చ కరస్థఏవ ||

అంటే, కేవలం భోగాలలోనే ఉంటే మోక్షంరాదు. ఇక ముముక్షువులకయితే భోగాల ప్రసక్తి లేదు. కొందరు దేవతలు కేవలం భోగాలను మాత్రమే ఇస్తారు. మరి కొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ "ఆంజనేయస్వామి" వారు అటు భోగాన్ని, ఇటు మోక్షాన్ని రెంటిని ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువు, చింతామణిగా చెప్పుకోవచ్చని అర్థం.

ఏకోదేవ స్సర్వద శ్రీ హనుమా | నేకోమంత్ర శ్రీహనుమత్ర్పకాశః |

ఏకోమూర్తి శ్రీహనూమత్స్యరూపా | చైకం కర్మ శ్రీహనుమత్సపర్యా ||

సత్య పదార్థమైన బ్రహ్మము ఒకడే, ఆయనే హనుమా. ఒకటే మంత్రం ఉంది అది శ్రీ హనుమాను మంత్రమే. ఒకటే మూర్తి ఉంది ఆయనే హనుమ. ఇక మనం చేయవలసింది ఒకటే అది హనుమంతుని సేవా, వారి పూజ అని పరాశరుడు మైత్రేయునికి బోధించినట్లు తెలుస్తుంది.

ఆంజనేయం మహావీర | బ్రహ్మవిష్ణు శివాత్మకం

బాలార్క సదృశాభాసం | రామదూతం సమామ్యహమ్ ||

హనుమ అంటే బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారకుడని, వీరుడంటే బ్రహ్మవేత్త అని, రామదూత అంటే శ్రీరాముని స్వరూప కథనము చేయువాడని, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.

ఇంకా ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో! ఆ యింట్లో హనుమంతుని ప్రభావంవల్ల "మహాలక్ష్మి" స్థిరముగా ఉంటుంది.

ఏనాడో గడచిన రామాయణ గాధలోని శ్రీ ఆంజనేయ స్వామివారు ఇంకా బ్రతికి ఉంటారా..! అని ఎవ్వరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. వారి "చిరంజీవత్వాన్ని" నిరూపించుకొనుటకు తగు నిదర్శనాలు ఉన్నాయి. పాండవులలో బలశాలియైన భీమునకు హిమవత్పర్వతంలో దర్శనమిచ్చి తనతోకను ఒకసారి కదల్చిచూడమని చెప్పినట్లు వారి చిరంజీవత్వము నిరూపించుటకు సూచించు తగు ప్రమాణాలు కలిగిన ప్రత్యక్ష దైవం ఆయన...!

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.

అంటే శ్రీ ఆంజనేయస్వామి వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో! అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారని భక్తుల గాఢ నమ్మకం.

Saturday, April 12, 2014

శివాలయాల్లో ఎందుకు ప్రదక్షిణం చేయరాదు?

శివాలయాల్లో ఎందుకు ప్రదక్షిణం చేయరాదు?


మహేశ్వరుడు దేవాధిదేవుడు. అట్టి పరమేశ్వరునికి తలపై నుంచి గంగ జాలువారుతుంది. మహాశివుడ్ని అభిషేకించిన జలం ఆయన పీఠంపై జారి, ఏర్పరచిన దారి నుంచి బయటికి ప్రవహిస్తుంది. ప్రదక్షిణం చేస్తే గంగను దాటినట్టే అవుతుంది. కావున శివాలయంలో ప్రదక్షిణ సరికాదని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

"అమృతవర్షిణి అమ్మ"

గర్భమందు శిశువు కాలదన్నిననాడు

ముసిముసి నవ్వులు మురియు ముదిత!

స్తన్యంబు లిడు వేళ తనబిడ్డ బాధింప

బాల్యాంకచేష్టగా బడయు మాత!

మాట నేర్పి, పిదప మనసు నొప్పించినన్

కొండంత పట్టించుకొనని సాధ్వి!

ఇంటివాడై తన యింటికి రావల

దంచు పల్కినను దీవించు తల్లి!


సూతిమాసంబు మొదలుగ చూపుతగ్గి

చివరకు కొడుకున్ గనలేని స్థితివరకును

తనయునకు చీమకుట్టిన తల్లడిల్లు

అమ్మ అమృతప్రవర్షిణి అనవరతము.


(డా.ఆమళ్ళదిన్నె వేంకటరమణ ప్రసాద్ గారి "అమృతవర్షిణి అమ్మ" ఖండిక నుండి).

దేవకీదేవి కడుపు శోకం ....

దేవకీదేవి కడుపు శోకం ....      పోతనామాత్యుడు...ఉ.“అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ
మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా
దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో
వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.క.కట్టా; యార్గురు కొడుకులఁ
బట్టి వధించితివి; యాఁడుఁబడుచిది; కోడల్;
నెట్టన చంపఁగ వలెనే?
కట్టిఁడివి గదన్న! యన్న! కరుణింపఁ గదే.

క.పుత్రుడు నీ బ్రతుకునకును
   శత్రుండని వింటిగాన సమయింపఁ దగున్;
   పుత్రులకు నోమ నైతిని
   పుత్రీ దానంబు జేసి పుణ్యముఁ గనవే.Friday, April 11, 2014

ముళ్ళ పూడి వెంకట రమణ శతకం ——అబ్బూరి రామ కృష్ణా రావు

ముళ్ళ పూడి వెంకట రమణ శతకం ——అబ్బూరి రామ కృష్ణా రావు


1        ‘’పున్నామ నరక భయమున


కన్నా డొక గేస్తు పుత్రికా రత్నములన్


పన్నెండుగురు ను వరుసగా


విన్నావా ముళ్ళ పూడి వెంకట రమణ


 


2.     అన్నా తురుడై  తానొక


సన్నాసిని  బిచ్చ  మడుగా


సరిరా పోదామన్నాడని బిచ్చమడుగా


విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా


 


  ఆరుద్ర –కూన లమ్మ పదం 


 


౩.      కొత్త పెళ్ళాము వండు


గొడ్డు కారము మెండు


తీపి యను హజ్బెండు


వో కూన లమ్మా


 


 పూర్ణచంద్   వెలుగు రాగాలు


 


4.     “ దోమ తెరకి  ప్రాంతీయ తత్త్వం జాస్తి


బైట దోమల్ని లోపలి రానీయదు


లోపలి దోమల్ని బయటకు పోనీయదు


మధ్య లో దూరాడంటూ


నా పైన లోపలి దోమల దాడి


ఈ  “పక్క” నాది కాదా ?

గబ్బిట దుర్గా ప్రసాద్

Thursday, April 10, 2014

Jokulu..

Jokulu..

ఒకసారి ఏమయ్యి౦ద౦టే కోప౦ వచ్చిన భార్య భర్తకు ఫోన్ చేసి, “మీరెక్కడ తగలడ్డారు” అని అరిచి౦దట.


అప్పుడు మొగుడు శా౦త౦గా “నీకు జ్ఞాపక౦ ఉ౦దా! మన౦ మొదటిసారి డైమ౦డ్స్ అమ్మే దుకాణ౦లో కలుసుకున్నాము.


అప్పుడు నువ్వు అక్కడ ఒకఅ౦దమైన నెక్లెస్ ను చూసి మురిసిపోయావు, అప్పుడు నాదగ్గర డబ్బులేక నేను కొనలేదు. ఏదో ఒకరోజు ఆ నెక్లెస్ నాదవుతు౦దని నేను అన్నాను కదా!”


“అవునవును నాకిప్పటికీ ఆస౦ఘటన గుర్తు౦ద౦డీ. నిజ౦గా మీరె౦త మ౦చివార౦డీ” అ౦టూ సడన్ గా గొ౦తులో ప్రేమని౦పి మాట్లాడ్డ౦ మొదలుపెట్టి౦ది.


“పూర్తిగా విను ఆ డైమండ్ షాప్ పక్కనున్న సారా కొట్లో ఉన్నాను నేను” అన్నాడు.

............................................................................................................నాన్నమ్మ అడిగి౦ది “అబ్బాయి ఏ౦ చదువుకున్నాడు?” అని.


“ఇ౦జనీరి౦గ్ పాసయ్యాడు మాఅబ్బాయి” అ౦టూ సమాధాన౦ ఇచ్చి౦ది పెళ్ళికొడుకు తల్లి.


“ఏటిగట్టు ఇ౦జనీరా! దీపాల ఇ౦జనీరా!” అ౦ది నాయనమ్మ తనకుకూడా ఏదో తెలుసన్న పోజుతో.


ఆవిడ ఏమడిగి౦దో అర్థ౦కాక తెల్లమొహ౦ వేసారు పెళ్ళివారు. ము౦దుగా తేరుకున్న నాన్న, “మా అమ్మగారి భాషలో ఏటిగట్టు ఇ౦జనీర్ అ౦టే సివిల్ అనీ దీపాల ఇ౦జనీర్ అ౦టే ఎలెక్ట్రికల్ అని అర్థ౦” అని వివరి౦చారు.


అ౦దరూ ఒక్కసారి గొల్లుమని నవ్వారు. పెళ్ళికొడుకు నవ్వుతూ నేనుదీపాల ఇ౦జనీర్న౦డీ” అన్నాడు..

x

"అమ్మ, నాన్నల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తే మంచిది..."

నిర్ణయం...

"అమ్మ, నాన్నల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తే మంచిది..."


"ఎందుకు?" అని అతను అడగలేదు. అడిగితే చాలా విషయాలు బైటకొస్తాయి. ఆరు నెలలు ఇక్కడా, ఆరు నెలలు అక్కడ... పల్లెటూళ్ళ ఖర్చు తక్కువ... సిటీల్లో ఖర్చు ఎక్కువ. ఆ లెక్కన తానే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. ఈ గొడవ అంతటి కంటే చెరో నాలుగువేలు వేసుకుంటే ఇద్దరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుంటారు. ఈ లెక్కలు, బాధ్యతలు, ఏడుపులు, విసుక్కోవటాలు, ముఖ్యంగా కొంపలో 'ముసలివాసనా' లేకుండా వుంటుంది.


'మీకు ఇష్టమేనా?' అని ఆ తల్లితండ్రుల్ని ఎవ్వరూ అడగలేదు. సెకండ్ హాండ్ వస్తువులను అమ్మేయటానికి ఎంత తాపీగా నిర్ణయం తీసుకుంటారో అంత తేలిగ్గా ఆ వృద్ధ తల్లితండ్రుల జీవితం గురించి నిర్ణయం తీసుకోబడింది.

పాతికవేలు ఖర్చవుతుంది..."

పాతికవేలు ఖర్చవుతుంది..."

"పావుగంట పనికి పాతికవేలా?"

డాక్టరు గారు ఇరిటేటింగ్ గా చూసారు. "పని పావుగంటే... దొరికితే పదేళ్ళు జైల్లో వుండాలి... హాస్పిటల్ క్లోజ్ అవుతుంది..."

"పదిహేను వేలు తీసుకోండి సార్..."

"ఆడపిల్ల పెద్దయితే ఎంత ఖర్చో ఆలోచించు... పోనీ రెండేళ్ళు పెంచి అమ్మేయ్... పిల్లల్ని కొనుక్కునేవాళ్ళూ వున్నారు... డీల్ నేనే కుదురుస్తాను... ఇరవై పర్సంట్ కమీషన్ ఇవ్వాలి..."

అతను గబగబా లెక్కలేసుకున్నాడు. మొత్తానికి ఇరవై వేలకు డీల్ కుదిరింది... ఎల్లుండే ముహూర్తం. అమ్మ కడుపులో నిశ్చింతగా బజ్జున్న బుజ్జి తల్లికి తన ప్రాణానికి రేటు కట్టేసిన విషయం తెలీదు.

Tuesday, April 8, 2014

శ్రీ హనుమత్కుండం

శ్రీ హనుమత్కుండం

దక్షిణ మహా సముద్రం తీరం లో రామేశ్వర మహా క్షేత్రం లో ని ‘’హనుమత్కుండం ‘’గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివ రించి చెప్పాడు .

స్కంద పురాణం లో బ్రహ్మ ఖండం లో రామేశ్వర క్షేత్రం లో24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించ బడింది .అవి చక్ర తీర్ధం ,భేతాళ వరద తీర్ధం ,పాప వినాశనం ,సీతా సరస్సు ,మంగళ తీర్ధం ,అమృత వాపిక ,బ్రహ్మ కుండము ,హనుమత్కుండం ,అగస్త్య తీర్ధం ,రామ తీర్ధం ,లక్ష్మణ తీర్ధం ,జటా తీర్ధం ,లక్ష్మీ తీర్ధం ,అగ్ని తీర్ధం ,శివ తీర్ధం ,శంఖ తీర్ధం ,యమునా తీర్ధం ,గంగా తీర్ధం ,గయా తీర్ధం ,కోటి తీర్ధం ,స్వాధ్యామ్రుత తీర్ధం ,సర్వ తీర్ధం ,ధనుష్కోటి తీర్ధం ,మానస తీర్ధం .

రావణాసురుని చంపిన బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివ లింగ ప్రతిష్టాపన ను రామేశ్వరం లో చేయ సంకల్పించాడు .సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన ‘’పుల్ల ‘’గ్రామానికి దగ్గరలో ,సేతువు కు సమీపం లో ,గంధ మాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం .హను మంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహం తో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు .ముహూర్త విషయాన్ని కూడా తెలిపి ,ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞా పించాడు .

హను మంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా ,మహర్షుల అను మతి తో సీతా దేవి ఇసుక తో లింగాన్ని చేస్తే ,సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామ చంద్రుడు .ఆ లింగానికి అభిషేకం జరిపి ,పూజ కూడా చేసే శాడు .మారుతి శివ లింగాన్ని తెసుకొని వచ్చాడు .విషయమ తెలిసి బాధ పడి తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు .దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించ మని చెప్పాడు .హనుమ కు కోపం వచ్చి ‘’రామా ! నన్ను అవమానిస్తావా ?కైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు ?ఇంకో చోట ప్రతిష్ట చేయటానికోసమా నేను అంత దూరం వెళ్లి తెచ్చింది ? నాకీ జీవితం వద్దు .నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను ‘’అని దూక బోతుండగా రాముడు వారించాడు ‘’అన్నా హనుమన్నా !మనిషి తను చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు .ఆత్మ ను చూడు .దుఖం పొందటం వివేకికి తగని పని దోషాన్ని వదిలి మంచిని గ్రహించు .నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్తాపిద్దాం .ఈ రెండు లింగాలను దర్శించినా ,స్మరించినా ,పూజించినా పునర్జన్మ ఉండదు .భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివ లింగాన్ని పూజించి ,ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు .అలా కాక పోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రం లో విసిరెయ్యి ‘’అన్నాడు .

అప్పుడు హనుమ తన తోకను ఇసుక లింగం చుట్టూ బిగించి పెకలించ టానికి తీవ్ర ప్రయత్నం చేశాడు ..అది ఇసుమంత కూడా కదలలేదు .మళ్ళీ ప్రయత్నం చేసి వీలు గాక నెత్తురు కక్కు కొంటు దూరం గా పడి పోయాడు .పడిన చోట హనుమ ముక్కులు ,చెవుల ,నోటి నుండి విప రీతం గా రక్తం కారి ఒక సరస్సు గా మారింది .హనుమ స్పృహ కోల్పోయాడు .అప్పుడు రాముడు మారుతి పడి ఉన్న ప్రదేశానికి వెళ్లి ,అతని శిరస్సు ను తన ఒడిలో పెట్టు కొని సేద తెర్చాడు .అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు .

కొంత సేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది .అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతా రాములు ప్రతిష్టించారు .హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది .అదే ‘’హనుమత్కుండం ‘’.ఇది రామేశ్వరానికి కొద్ది దూరం లో ఉంది .దీని లో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు .పితృదేవత లకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు .

"ఎవరెస్ట్ శిఖరము ఎత్తెంత?"

ఎవరెస్టెత్తదియెంత?నంగ, యిరువయ్యేడ్వేలమూడడ్గుల

న్న,వెసన్ తప్పది; మూరయెక్కువనగా-నాలెక్క తప్పెట్లునాన్,

ప్రవచించెన్ మణి అయ్యరిడ్డెనులపాత్రన్ బెట్టితిన్ దానిమీ 

రు విసర్జించిరటంచు నోర్బ్రిగెడియర్ బ్రూస్మూసె; సాశ్చర్యుడై!!!

ఎవరెస్ట్ శిఖరమెక్కిన ఒకరిని "ఎవరెస్ట్ శిఖరము ఎత్తెంత?" అని అడిగారట మరొకరు. 

దానికి "27003 అడుగులు" అని శిఖరమెక్కిన అతను జవాబిచ్చాడట. 

అక్కడ మణి అయ్యర్ అనుపేరున్న ఒక హోటల్ యజమాని "లెక్క ఇంకోమూర తక్కువ చెప్పావ"న్నాడట. దానికి అతను "నాలెక్క తప్పెలా అవుతుంది?" అని అడిగితే, మణి అయ్యర్ "నేను ఆశిఖరముమీద ఇడ్లీపాత్రను పెట్టాను, మీరు దానిఎత్తును లెక్కలోకి తీసుకొనలేదు" అని చెప్పాడట. దానికి అక్కడే ఉన్న "బ్రిగేడియర్ బ్రూస్" అనే ఆయన ఆశ్చర్యంతో నోరుమూసుకొన్నాడట.

Monday, April 7, 2014

రామాయణ కల్పవృక్షం అర్థం కావాలంటే ఏమేమి కావాలి?

శ్రీరామ నవమి సందర్భం గా రామపరమైన అంశాల కోసం అంతర్జాలం లో వెతుకుతుంటే, విశ్వనాథ వారి కల్పవృక్షం పై శ్రీపతి అనే ఆయన వ్రాసిన ఈ వ్యాసం కనబడింది. రామభక్తి పరాయణులు, కవిసామ్రాట్ అభిమానులూ అయిన మిత్రుల కోసం కాపీ చేసి, ఇక్కడ పెడుతున్నాను, రచయితకు కృతజ్ఞతలతో ::: 

రామాయణ కల్పవృక్షం అర్థం కావాలంటే ఏమేమి కావాలి?

________________________________________

"రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం దక్కిందంటే అది ఒక మహాద్భుత రచన అయిఉండాలి. కనుక అది మనం కూదా చదవాలి" అన్న ఆలోచన తో మొదలయ్యింది ప్రస్థానం. పుస్తకం కొనుక్కుని చదివితే అర్థం అవదా అని ఒకప్పుడనిపించేది. తీరా కొనడానికి ప్రయత్నించేసరికి తెలిసింది అది పుస్తకం కాదని పుస్తకాలు అని. కొంపదీసి తక్కువ అంచనా వేశామా ఏమిటి అనిపించింది.

అదృష్టం కొద్దీ కొన్నేళ్ళు బజార్లో ఆపుస్తకాలు దొరక్కపోవటం వల్ల (లేదా ఎక్కడదొరుకుతాయో నేను సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల) కొంచం సమయాభావం అవ్వటం, ఆలోపు అక్కడక్కడ వ్యాసాల్లో, రచనల్లో రామాయణ కల్పవృక్ష ప్రస్తావన రావటం, నా అజ్ఞానం కొద్దిగా తగ్గి, ఆ కావ్యం పట్ల కించిత్ గౌరవ భావం పెరగటం, శ్రధ్ధ కలిగిన తర్వాత వెదకగా కోటీ లో ఒకానొక షాపులో బాలకాండం ఒక్కటీ దొరికిటం తో మలి అడుగు పడింది అనుకున్నా.

తీరా పుస్తకం కొన్నాకా నా పరిస్థితి "అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి" అన్న చందంగా తయారయ్యింది. అప్పటికి నాకింకా పద్యాల పేరున పైత్యం రాయడం కలలో కూడా వచ్చి ఉండదు. మొత్తానికి ఏమైతేనే భాగవతం లో పద్యాలని చదువుకున్నాం కదా అట్లానే ఇదీ చదివేద్దాం. అర్థం అయిపోతుంది అనుకుంటూ మొదలెట్టా... గ్రీకు లాటిన్ అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఆదెబ్బకి రెండువిషయాలు అర్థం అయ్యాయి (అనిపించింది). ఒకటి -విశ్వనాథను పాషాణపాక ప్రభువనెందుకన్నారో. రెండు - కల్పవృక్షం చదువుదామన్న క్రేజే గానీ చదవటానికి, అర్థం చేసుకోటానికి నాకు అంత పరిపక్వత లేదని. ఆదెబ్బకి పుస్తకం మూసేసి అటకెక్కించేశా. విశ్వనాథ నవలలు తీశా.. బహు బాగా అర్థం అవసాగాయి. దాంతో ఒకటి తేల్చేసుకున్నా. పద్యాలు మనకబ్బవురా అబ్బయి అని. ఇది జరిగి దాదాపు పదహారేళ్ళు దాటి ఉంటుంది.

ఇంటర్లో సంస్కృతమయ్యాక మళ్ళీ ఎట్లా ఏర్పడిందో రుచి తెలియదు గానీ పద్యాలు కొంచం కొంచం అర్ధం అవసాగాయి. దాంతో అటకమీదనుంచీ తీసి మళ్ళీ కొన్ని పదుల పద్యాలు చదివా. పోతనగారి ఎఫెక్టో, మన బుర్ర కెపాసిటీనో గానీ భారతం లో పద్యాలు గానీ, కల్పవృక్షం పద్యాలు గానీ అంతగా అర్థం కాలేదు. కాకపోతే ధారుణి రాజ్య సంపద మొదలైన పద్యాలు రాగాలాపనలో బాగున్నాయని కొన్నింటిని కంఠస్థ పట్టి కాలీజీలో కొంచం ఫోజు కొట్టా. అంతటితోనే సరి. మళ్ళీ పుస్తకాలు యథాస్థానం ప్రవేసించాయి. శొభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని కూడా అన్నా.. ఈ సారి.

అన్నట్టుగానే నాన్నగారితో అవధానాలకి వెళ్ళటం, సరదాగా ఉందనిపించటంతో పుస్తకాన్ని మళ్ళీ తీశా. ఈ సారీ అదే రిజల్టు. వయసు పెరిగినకొద్దీ అవగాహన కలిగి అర్థం అయిపోతుంది అని భావించానేగానీ అంతకుమించి సాధన ఏమీ చేయలేదు. ఇక దీనికీ మనకీ రామ్రాం అనుకున్నా. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి గోదావైభవ కావ్యాన్ని, దాని రహస్యప్రకాశాన్ని చదివా. అద్భుతం అనిపించింది. ఇన్నాళ్ళుగా నేనెటువంటి అనుభూతికోసం ఎదురుచూస్తున్నానో అది దక్కింది అనిపించి. ఒక మూడేళ్ళు ఆపుస్తకాన్ని ఆసాంతం చదువుకుని ఆనందించాక బోయి భీమన్న గారిని అనుకోకుండా చదవటం నా పయనంలో ఒక అనుకోని మలుపు.

భద్రాచల యాత్ర రాముడి ఆత్మీయతని పరిచయం చేస్తే అసంకల్పిత ప్రతీకార చర్యగా భావాలు ఒక పద్యం లాంటి వాటితో రావడం ఇంకొక మజిలీ. తోచింది రాసి అబ్బో అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నప్పుడు బ్లాగన్నదై పరిచయమవ్వడం. అప్పటిదాక నూతిలో కప్పమాదిరి ఉన్నవాణ్ణి ప్రపంచాన్ని తెలుసుకోవడం మరొకమజిలీ...దాని పర్యవసానం కొంచం వ్యాకరణం, చందస్సు నేర్చుకుని చదివితే రమాయణ కల్పవృక్షం అర్థం అవుతుందేమో అని కొంచం ఇంగితం కలగటం..ఆ దిశగా ప్రయత్నం చేయటం.....

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఏ జన్మ లో చేసుకున్న పున్నెమో మంచిపద్యం లో వడలి మందేస్వర రావుగారి గురించి తెలుసుకోవడం, ఆపై "ఇదీ కల్పవృక్షాన్ని ఆస్వాదించగలగటం" అటుపై మొన్నీమధ్య విశ్వనాథ పుస్తకాలని కొనడానికి వెళితే నా కష్టాన్ని గమనించి విశ్వనాథ వారే కరుణించారన్నట్టుగా "కల్పవృక్ష రహస్యములు" పుస్తకం దొరికింది.

తన కావ్యానికి తానే వ్యాఖ్యాన్నందిచారని తెలిసిన మరుక్షణం నా ఆనందనికి అవధులు లేవు. నన్ను కరుణించటానికే అని నేననటానికి గల కారణం విశ్వనాథ వారు ఒక్క బాలకాండకు మాత్రమే వ్యాఖ్యానన్నందిచారు. (దురదృష్టవశాత్తు మిగిలిన కాణ్డలకు వారి వ్యాఖ్యానం లేదు).

కల్పవృక్షమెందుకు అంతటి బృహత్తర రచనో తనమాటల్లో తానే వ్యక్తపరిచారు. ఎంతో అరుదైన భాష్యాన్నందిచారు. ఆ మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆశ్చయకరమైన విషయమేమిటంటే ఇటువంటి పుస్తకం లిస్టులో అమ్మకానికి ఉందని విశాలాంధ్రవారు చెప్పలేదు, విశ్వనాథ మనవళ్ళవద్దనున్న కేటలాగ్ లో కూడా ప్రస్తావనలేదు, కానీ విమర్శ గ్రంథాల సెట్టు కొంటే దాన్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నారు (పాత పుస్తకం మాదిరిగా ఉంటుంది. స్టాక్ క్లియరెన్సులో భాగంగానో ఎమో).

విశ్వనాథ విమర్శ గ్రంథాల సెట్టు కొనుక్కోవడం నాకే తెలియకుండా నాకునేను చెసుకున్న గొప్ప సాహయమేమో అని అనిపించింది..

చదివావా అంటే చదివాననిపించుకోవటానికేముంది? ఒక్క బిగిన చదివేయచ్చు కానీ కల్పవృక్షం అర్థమవ్వాలంటే చందస్సు, వ్యాకర్ణము, నిఘంటువు వంటివి ఉంటే సరిపోదు, తెలుగు తెలియాలి, తెలుగుదనం తెలియాలి, తెలుగు సంస్కృతి తెలియాలి, ఆ తీయని మకరందాన్ని ఆస్వాదించే విధానం కూడా తెలియాలి అప్పుడే దాని హృదయం ఆవిష్కృతమౌతుంది అన్న నిజం నిఖార్సుగా తెలిసొచ్చింది. అసలైన తెలివొచ్చింది. మనసు నిండింది.

ఆల్రెడీ "ఇదీ కల్పవృక్షం" చదివినవారికి ఈ పుస్తకం ఇంకోక దర్పణం. విశ్వనాథని తెలుసుకోడానికి. పుస్తకంలోని మధురానుభూతులు..... మచ్చుక్కి కొన్ని [వారి వ్యాఖ్య నీలం రంగులో]

(1) పుత్రకామేష్టి సందర్భంగా అగ్నిదేవుడు రాజుచేతిలోపాయసము పెట్టే సందర్భములో వారి వ్యాఖ్యానము

ముదిపృదాకువు సెజ్జమునులు జోదిళ్ళీయ

హాళిమై గూర్కు సుమాళి యొకడు

ప్రామింకు చిట్టచివళ్ళలో నసురుల

దోరించునట్టి కటారి యొకడు

ప్రామఱ్ఱి క్రీనీడ బాఠమ్ము ముసలులౌ

మునులచే జదివించు పోఱడొకడు

పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై

కాలివ్రేల్చీకెడు కందొకండు

పసిమియై గాలికిని రాలిపడిన యొక్క

నలుసు నివ్వరిముల్లైన వెలుగొకండు

స్థూలమై వచ్చి వచ్చి తా సూక్ష్మమగుచు

జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె

(అ) పృదాకువు - సర్పము. ముది పృదాకువు - ఆదిశేషువు

జోదిళ్ళు- నమస్కారములు

ఆదిశేషువనే సయ్యపై మునులు నంస్కరించుచుండగా నిద్రపోవునొక యొయ్యారి. ఇతడు విరాణ్మూర్తి

(ఆ) ప్రామినుకు - వేదములు

ప్రామిన్కు చిట్తచివళ్ళు - వేదాంతములు. అక్కడ రాక్షసులను సమ్హరించు ఖడ్గధారి.

విరాణ్మూర్తికన్న ఈ ఖడ్గధారి తక్కువరూపముకలవాడు

(ఇ)ప్రాత మఱ్ఱి చెట్టుకింద వృధ్ధులౌ ఋషులచేత పాఠమ్ములను వల్లెవేయించీ పోఱడు- బాలుడు. ఇతని మూర్తి మరియు చిన్నది

(ఈ)పాలవెల్లి కరళ్ళపై క్షీరసముద్ర తరంగములమీద తన కాలి వ్రేలు చీకెడి కందు-పసివాడు.

(ఉ) మరల వరిముల్లంతవాడు

విరాట్స్వరూపంతో మొదలెట్టి తగ్గుతూ తగ్గుతూ వచ్చి రాజు చేతిలో పాయసంలో ప్రవేశించాడు. అంతటి స్వామి ఇంతగా అయ్యాడని అర్థం. పరమేశ్వరుడు అణోరణీయాన్, మహతోమహీయాన్ కద"

చెప్పదలుచుకున్న విషయాన్ని సాపేక్షికంగా, పథకం ప్రకారంగా (planned గా అని నా ఉద్దేశం).. భావప్రసక్తి చేయటం, పద్య రచన దానిని పరిపుష్ఠిచేయటం అందులోనూ "జోదిళ్ళు", "ప్రామిన్కు చిట్టచివళ్ళు", "పోఱడు (తెలంగాణ యాస కూడానేమో)", కాలి వ్రేల్చీకెడు కందు" వంటి తెలుగు పదాల పోహళింపు మామూలుగా చదివేసుకుంటూ పోతే వాటి అందం సొబగూ, అర్థం ఔతాయా?

(2) రామయణంలో రామ జననమయ్యక ఒక పద్యముంటుంది. దానిని కనీసం ఒక 10 సర్లైనా చదివి ఉంటా. ప్రత్యేకంగా ఏమీ అర్థం కాక ముందుకి వెళ్ళిపోయా కుడా....

వెలికి గొనిపోకుడీ బిడ్డబిట్టలారు

సంజవేళల నంచు గౌసల్య పలుక

గరుడి వైకుంఠమున భయకంపితుండు

మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు

దానికి వ్యాఖ్యానాన్నందిస్తూ "ఈ భాగమంతయూ తెలుగుల ఇండ్లలో పురుళ్ళు, పిల్లలు పెరుగుటలు వారినాడించుటలు, ఆ మహాశోభ ఉన్నది. వట్టి కావ్యకఠిన బుధ్ధులకుతెలియదు. అంతయు రసభరితముగానుండును. ఆ రసము జీవితమందున్నది. తెలుగుగృహములలోనున్నది. ఇచ్చటకవిచేసినది పద్యములు వ్రాయుట మాత్రమే. తెలుగు దేసములో నేడాదిదాటని పిల్లలను సాయంకాలమందు నారుబయతకు దీసుకొనిపోనీయరు. పిట్టలారునందురు. పూర్వము పసిపిల్లలకదియొక జబ్బువచ్చెడిది. అట్లు రామచంద్రుని గూర్చి ఎవ్వలైన ననగా గరుత్మంతుడు భయముతో తన ఱెక్కలను ముడుచుకొనెడివాడట" అన్నారు.

ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలను, చందో విశేషాలను, చారిత్రక రాజనీతి రహస్యాలను, తెలుగువారి ఆచార వ్యవహారాలను ప్రతిపాదిస్తూ తానుచేసిన బృహత్కావ్యానుగత హృదయాన్ని విహంగవీక్షణంగావిస్తారు విశ్వనాథ.

పద్యరచనపై, అందునా కల్పవృక్షంపై మక్కువగలవారి ఇంట నీరాజనాలందుకోగల మేటి పుస్తకమీ "కల్పవృక్ష రహస్యములు". విశ్వనాథవారి జయంతిని పురస్కరించుకుని వారికి కృతజ్ఞతగా నా ఈ టప...


శ్రీనాధ కవిసార్వభౌముడు--

శ్రీనాధ కవిసార్వభౌముడు--

శ్రీనాధుడికి పల్నాడు మీద మంచి అభిప్రాయం లేదు. రత్నాంబరాలూ, హేమ పాత్రాన్న భొజనమూ ఉన్నవాడికి ఏముంటుంది అక్కడ?

చిన్న చిన్న రాళు, చిల్లర దేవుళ్ళు

నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు 

పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు

కొల్లాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ తొడిగితిన్

వెల్లుల్లిన్ తిలపిష్ఠమున్ మెసవితిన్ విశ్వస్థ్థ వడ్డింపగా 

చల్లాయంబలి త్రాగితిన్ రుచుల్ దోసంబంచు పోనాడితిన్ 

తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాధుడన్.

కనీసం త్రాగటానికి మంచి నీళ్ళు కూడా దొరక లేదు కవిసార్వభౌముడికి. అందుకే:

సిరిగల వానికి చెల్లును

వరుసగ పదియారువేల వనితలనేలన్

తిరిపెమునకిద్దరాండ్రా

పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

సిరి మగసిరి ఐన శ్రీ కృష్ణుడు పదహారువేల వనితలను ఏలితే అర్ధం ఉంది, అడుక్కునేవాడికి నీకు ఇద్దరెందుకయ్యా పరమేశా, గంగను వదిలి పార్వతిని ఉంచుకోమంటున్నాడు కవి కలానికి ఉన్న విశృంఖలత్వంతో.

రసికుడు పోవడు పల్నా

డెసగంగా రంభయైన ఏకులె వడకున్

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే గుడుచున్.

అంతటి కవిసార్వభౌముడి చివరి రోజులు, పాపం:

కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి !

రత్నాంబరంబు లే రాయడిచ్చు ?

కైలాసగిరిపంట మైలారువిభుడేగె !

దినవెచ్చ మే రాజు తీర్చగలడు ?

రంభఁ గూడె తెలుంగురాయరాహుత్తుండు !

కస్తూరి కే రాజుఁ బ్రస్తుతింతు ?

స్వర్గస్థుడయ్యె విస్సనమంత్రి ! మఱి హేమ

పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు ?

భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె !

కలియుగంబున నికనుండఁ గష్టమనుచు

దివిజకవివరుల గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి !

Hai Apna Dil To Awara Na Jane Kis Pe Aye Ga ( The Legendary Hemant Kumar...This beautiful song by Hemant Kumar with mouth organ play is always haunting in my mind.The mouth organ was played by Maestro Burman's son R D Burman.
ai apna dil to awara, na jaane kispe aayega

haseenon ne bulaayaa, gale se bhee lagaayaa
bahot samazaayaa, yahee naa samazaa
bahot bholaa hain bechaaraa, naa jaane kis pe aayegaa

ajab hain diwaanaa, naa dar naa thhikaanaa
jameen se begaanaa, falak se judaa
ye yek tootaa huaa taaraa,  naa jaane kis pe aayegaa

jamaanaa dekhaa saaraa, hain sab kaa sahaaraa
ye dil hee humaaraa huaa naa kisee kaa
safar mein hain ye banjaaraa, naa jaane kis pe aayegaa

huaa jo kabhee raajee, to milaa naheen kaajee
jahaa pe lagee baazee, wahee pe haaraa
ye yek tootaa huaa taaraa, naa jaane kis pe aayegaa

దసరాకు వస్తిమనీ విసవిసలు పడక

 ఏ దయా మీ దయా మా మీద లేదు,


ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా ,

దసరాకు వస్తిమనీ విసవిసలు పడక


చేతిలో లేదనక అప్పివ్వరనక


పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,


ముప్పావలా అయితే ముట్టేది లేదు,


హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,


అయ్య వారికి చాలు ఐదు వరహాలు


పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు


జయీభవా...దిగ్విజయీభవా

 


చేతిలో లేదనక అప్పివ్వరనక


పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,


ముప్పావలా అయితే ముట్టేది లేదు,


హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,


అయ్య వారికి చాలు ఐదు వరహాలు


పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు


జయీభవా...దిగ్విజయీభవా

 ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై

వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

భూమి సింహాసనం, ఆకాశం గొడుగూ, దేవతలు సేవకులూ, వేదాలు వందిమాగధులూ,బ్రహ్మాండమే ఆకారం,లక్ష్మీ దేవి భార్య, బ్రహ్మ కొడుకూ, గంగా దేవి కుమార్తె, అయి నరాయణుడు వర్ధిల్లు గాక అంటారు పిల్లలు.

‘రామనామ స్మరణ’

  మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని

మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట!

అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక

బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. 

అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!

x

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, 

విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 

సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, 

భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

Saturday, April 5, 2014

గులేబకావళి'

1938లో అరేబియన్‌ నైట్స్‌ కథ '
గులేబకావళి' సినిమా గా తెలుగులో వచ్చింది. అయితే కథ, పాత్రల పేర్లూ అన్నీ తెలుగు జానపద కథలాగే తీర్చిదిద్దారు- విజయసింహుడు లాంటి పేర్లతో సహా. ఈ సినిమాని పారమౌంట్‌ ఫిలిం కంపెనీ బొంబాయిలో నిర్మించింది. ఇందులో విశేషం ఏమిటంటే- సినిమా చివర అందరూ కలిసి ఒక పద్యం చదువుతారు. ఆ పద్యం లో నిర్మించిన కంపెనీ పేరు(ఇంగ్లీష్ పదం) కూడా వస్తుంది...

''శివే పాహిమాం ది పారమౌంట్ఫిలిం 

సత్కీర్తివెలయ నాశీర్వదింపుమా''

( రావి కొండలరావు గారు చెప్పినది..)

Gulebakavali (1938)

Cast: Master Kameswara Rao (Tajal Mulk), Kanna Rao Bhagavatar (Jalath Simha), Venkatappaiah, Veera Raghava Reddy, Appalaswamy, Shakunthala (Gulebakavali), Rajamani (Abola), Sundari Lal (Mayavathi), Usha Rani

Dialogues and Verses: B. Ramana Murthy

Screenplay: KB Desai

Lyrics: Chaganti Raja Rao

Music: Vasantha Kumar Naidu

Cinematography: AV Wadekar

Audiography: AK Parmar

Editing: KM Ambavane, Raman Desai

Art: Ebrahim Surthi, Deva Pillai

Director: Kallakoori Sadasiva Rao

Banner: Paramount Film Company...

(ఫోటో మాత్రం రామారావు గారి గులేబకావళి లోనిదే.)

డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారు దత్తపది:

అవధాని:
డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారు

దత్తపది: 

రాక్షసి,తాటకి,హిడింబ,గయ్యాళి....పదాలతో 

.శ్రావణమాసంలో భార్య,భర్తలమధ్య అనురాగం వర్ణించాలి 

.

ఆలునుభర్తజేరి, మధురాక్షసితాంబుజగంధభాషతో 

వ్రాలుచుబల్క, శ్రావణశుభంబనినొక్కుచుతాట,కింకిణీ

లీలకులొంగబోను,సరిలే,మహిడింబము,డంబమేల?గ 

య్యాళివి మానబోవనుచు,నామెనుకౌగిటబట్టెపుట్టమై!!!

Zarurat Hai

తెలుగు దొంగరాముడు.

zarurat hai zarurat hai, sakht zarurat hai

zarurat hai zarurat hai, zarurat hai
ek shrimati ki, kalawati ki, sewa kare jo pati ki
zarurat hai zarurat hai, zarurat hai
ek shrimati ki, kalawati ki, sewa kare jo pati ki
zarurat hai zarurat hai, zarurat hai

Anarkali songs - Rajasekhara Neepai Moju Thiraledura - Akkineni Nageshwa...ఈ రోజుకి కూడా మోజు తీరని ఘంటసాల ..జిక్కి యుగళ గీతం.
మదన మనోహర సుందర నారి,
మధుర దరస్మిత నయన చకోరి…
మంద గమన జిత రాజ మరాలీ, నాట్య మయూరీ….
అనార్కలీ…., అనార్కలీ….., అనార్కలీ….
వహ్ వ….

ఆఅ..ఆ..ఆ.. ఆఅ..ఆ….ఆ

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా
ఆ..ఆ..ఆ..
రాజశేఖరా ఆ..ఆ..ఆ.. ఆఅ..ఆ….ఆ
రాజశేఖరా నీపై మోజు తిరలెదురా.. రాజసాన యేలరా…
రాజశేఖరా

మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా
మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా
మధురమైన బాధరా, మరపు రాదు ఆ ఆ ….
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన యేలరా…
రాజశేఖరా

కా నిదాన కానురా, కనులనైన కానరా
కా నిదాన కానురా, కనులనైన కానరా
ఆ..ఆ..ఆ..
జాగు సేయ నేలరా, వేగ రావదేలరా
జాగు సేయ నేలరా, వేగ రావదేలరా,
వేగరార  చేరరారా… వేగరారా  చేరరారా

Suvvi Suvvi Suvvalamma Song - Swati Mutyam Movie - Ilayaraja Songs

అండ దండా ఉంటానని ... నిను కొండ కొనకి వదిలేసడా....

ఎంత విషాదమో....

Laali Laali Song - Swati Mutyam Movie - Ilayaraja Songsఇంత మంచి  లాలి పాట...ఏ బాషలో నేను  వినలేదు...
అంతా విశ్వనాథుని  మహిమ...

అధికమాసం..(జాజి శర్మ గారు.)

అధికమాసం..(జాజి శర్మ గారు.)

లూనార్‌ సోలార్‌ హిందూ కేలండర్‌ ప్రకారం సంవత్సరానికి 12 నెలలే కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం, లేదా పురుషోత్తమ మాసం వస్తుంది. కొన్ని సందర్భాలలోనే మాసగడువు క్షీణిస్తుంది. వేదకాలం నుండే పూర్తి గణన కేలండర్‌ మనకి వుంది. జ్యోతిష్‌ వేదాంగం 14వ శతాబ్దం నాటింది. సూర్య సిద్ధాంతంగా దానినే ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట, ఆరవ శతాబ్దంలో వరాహమిహిర 12వ శతాబ్దంలో భాస్కర పరిగణించారు.

ఓసారి భగవాన్‌ నారాయణుడు ధ్యానంలో ఉండగా, నారదుడు వారి వద్దకు వేతెంచి అధికమాసానికి గల కారణాలను వివరించమన్నాడు. ప్రజల పాపాలతో బరువెక్కామని 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమంటే నారయణుడు అధిక మాసాన్ని సృష్టిం చాడట. అయితే ఈ అధిక మాసంలో పూజలూ, పునస్కారాలు నిర్వహించటంలేదని అధిక మాసం కృష్ణునికి మొరపెట్టుకుంటే, పురుషోత్తం మాసాన్ని సృష్టించి, ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయన్నారట. 

పంచాంగంలో తిధి, వాసర, నక్షత్ర, యోగ, కరణాలకు ప్రాధాన్యతవుంది. తిధి అంటే భూమి నుండి సూర్యుడు, చంద్రుడు మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకొని 12 డిగ్రీల చొప్పున 30 తిధులను చేశారు. మాసానికి రెండు పక్షాలు శుద్ధలేక శుక్లపక్షం. తిధిపేర్లు ప్రతిపద, ద్వితీయ నుండి పూర్ణిమ/ అమావస్యవరకు. అశ్వనినుండి మేష రాశివరకూ నక్షత్రాలు. ఒక్కోరాశి 2.25 నక్షత్రాలకు సమం.

ఒక్కోసారి రెండు రోజులకు ఒకేతిధి, మరోసారి ఆరోజుతర్వాత తిధికి జారుకుంటుంది. అంటే ఆ తిది సూర్యోదయాన్ని వదలుకుంది. ఒక్కోసారి సూర్యుడు ఏరాశిలోకి ప్రవేశించకపోతే దానిని అధిక మాసంగా పరిణిస్తారు. ఇలా ప్రతిమూడు సంవత్సరాలకూ జరుగుతుంది. అధికమాసం చైత్రం నుండి కార్తీకం, ఫల్గుణ మాసాల పరిధిలోకిరాదు.

సూర్యుడు ఏదైనా నెలలో రెండు రాశులమధ్య ప్రయాణిస్తే, దీనినే క్షయం అంటారు. క్షయ మాసానికి ముందు, తర్వాత కూడా రెండు అధిక మాసాలు వస్తాయి. అధిక మాసంలో పూజలు పునస్కారాలు లేకపోయినా దానాలు చేస్తే సత్ఫలితాలుంటాయి. రాగి పాత్రలో 33 తీపిపదార్థాలు వుంచి, ఆ పాత్రకు ఏడు దారపు తొడుగులను వేసి అల్లుడికి గానీ, గౌరవనీయవ్యక్తికి దానం చేయాలి. నారాయణుడిని స్మరించాలి. ఇలా చేస్తే అధికమాసం దుప్ఫలితాలుండవు.

జమున అందం ..జమునదే....

జమున అందం ..జమునదే....

  చాలా అందగత్తే..పన్ను మీద పన్నుతో..భలే అందంగా నవ్వేది.

ఏమి అందం ఏమో మా తరం కుర్రాలను వెర్రి ఎక్కించి నది..


Photo courtesy....Priya Lakshmi


సర్వజ్ఞుడు (ఈశ్వరనిందాస్తుతి)

ఖండకావ్యము:తెలుగు వెలుగు

కృతికర్త:కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఖండిక:సర్వజ్ఞుడు (ఈశ్వరనిందాస్తుతి)


సీ.చంద్రు,గురుద్రోహి జావనీయక దెచ్చి, తలమీఱు సతిచెంత నిలిపినావు,

పుట్టిల్లు పుటమార్చి,గట్టు పట్టిన శక్తి కర్థదేహంబిచ్చియాపినావు,

అవని నెల్లనుగాల్చు హాలాహలవిషంబు పట్టి కుత్తుకలోన పెట్టినావు,

కస్సు,బుస్సనిలేచు కాలసర్పంబుల కంకణాంగదశోభ గాంచినావు,


పనులనెల్ల జెఱచు గణపయ్యనింట

పెద్దకొడుకునుగా జేసి పెట్టినావు,

బళిర!శంభయ్య! వెఱ్ఱి బాబయ్యవీవు,

యెట్లు సర్వజ్ఞమూర్తివో యెఱుగజాల!!!...........................1


సీ.పౌరుషంబుడివోవ పార్థునిచేబడి పాశుపతంబిచ్చి పంపినావు,

సిగ్గెగ్గులను వీడి శిరమునెక్కిన గంగ పరమపావనిజేసి వదలినావు,

ప్రియురాలితో నీకు బ్రేమ సంధించిన శ్రీకుమారుని బూదిజేసినావు,

కాళ్ళుగడిగి నీకు కన్నబిడ్డనొసంగు దక్షుని శీర్షంబు తరిగినావు,


మేలునకు కీడు, కీడుకు మేలుజేసి, 

యజ్ఞతను జాటుకొంటివీవఱసి చూడ,

బళిర!శంభయ్య! వెఱ్ఱి బాబయ్యవీవు,

యెట్లు సర్వజ్ఞమూర్తివో, యెఱుగజాల!!!.................2


సీ.బంగారు కొండ చేపట్టి, వ్యర్థునిరీతి పునుకబిచ్చమునకు బోయినావు,

ధనదుండు నేస్తుదై నినుగొల్చియుండగ, భూతాలచెలిమిని బూనినావు,

వెండికొండ నివాసపీఠమై నిలువక, మసనాలదిఱుగాడ మఱగినావు,

అలసతి యర్థాంగియై భజియింపగ,నీడిగదాని గాంక్షించినావు,


విలువగలవన్ని కాదని విడిచిపెట్టి,

పనికిమాలినవన్ని చేపట్టినావు,

బళిర!శంభయ్య! వెఱ్ఱి బాబయ్యవీవు,

యెట్లు సర్వజ్ఞమూర్తివో, యెఱుగజాల!!!


భద్రాద్రి రఘురాము పాదసేవదరించు రామదాసుండు గారాపుబిడ్డ,

కృతిరామునకునిచ్చి కృతకృత్యుడైనట్టి పోతన్న నీముద్దు పుత్రకుండు, 

రామసంకీర్తనారక్తి ముక్తుండైన త్యాగయ్య నీప్రియతనయుడమ్మ,

కాళహస్తీశ్వరు కరుణావిశేషంబు గన్న కన్నప్ప నీకన్నకొడుకు,


కాంచికాక్షేత్రమందు శంకరుని కరుణ

నవ్యయపదంబు గైకొన్న యసదృశుండు,

వాడు చిరుతొండనంబి నీపాపడమ్మ,

తెలియ నీకెవ్వరీడమ్మ తెలుగు తల్లి!!!............................10

Friday, April 4, 2014

మాతా అన్నపూర్ణమ్మ అవస్థ...

మాతా అన్నపూర్ణమ్మ అవస్థ...

శ్రీ కొర్నెపాటి శేషగిరిరావు పంతులు గారి రచనలలో కల్పనాచాతుర్యము

....................................................................................................

సీ.రెండు నోళుల బిడ్డడుండ్రములోయని నెత్తిన నోరూని మొత్తుకొనగ 

నాల్గు నోళుల మామ నాకు నోరెమటంచు నాకటి పెల్లున నటమటింప

ఐదు నోళుల భర్త 'అన్నమో రామచంద్రా' యని యల్లాడి యాకుమేయ

ఆరు నోళులబిడ్డడా యొంటి చంటికై గొల్లున పాలని గోలసేయ

కాపురంబది పెను వల్లకాడుగాగ

అట్టి కాపురమెట్టులో మట్టు వెట్టు

గట్టు రాపట్టి పట్టెడు పొట్ట కూటి

కన్నపూర్ణామహాదేవినాశ్రయింతు!!!

విన్నారా! ఈ పద్యంలో ఓ సాధారణ గృహిణి తన సంసారాన్ని ఏ పొరపొచ్చాలు లేకుండా నెట్టుకురావడానికి ఎలా తంటాలు పడుతుందో? ఇది సాధారణ గృహిణీవిషయ వర్ణన ప్రధానం కాదు. అన్నపూర్ణా మహాదేవిని వర్ణించడం ప్రధానాంశం. ఆ వర్ణనలో దేవతాప్రకృతిలో కూడా మానవప్రకృతిని ప్రతిబింబింప జేయడం- ఇక్కడ కవిగావించిన గొప్ప కల్పనాచాతుర్యము. అందుకు ఈ పద్యములోని “నెత్తిన నోరూని మొత్తుకొనగ, అటమటింప, ఆకు మేయ,ఒంటిచంటికై” ఇత్యాది తెలుగు పలుకుబడులూ, “రెండు నోళుల బిడ్డడు,నాల్గు నోళుల మామ, మొదలుగాగల తెలుగు పదబంధాలు- ఆ అక్షర సంసార భారాన్ని వ్యక్తీకరిస్తున్నాయి

అతని గుండియ వెన్నపూసో అచ్చావు నెయ్యో!"

Koutilya Choudary

రాజు మూడవ భార్య కైకయి

భరతుడని యావిడ కుమారుడు

అతని గుండియ వెన్నపూసో

అచ్చావు నెయ్యో!"

భరతుడు, రామాయణంలో కష్టాలు పడటంలో రెండో రాముడు. ఎందుకో రామాయణంలో రాముడిని అనుసరించాలనుకోటమే కాని, ఎక్కువగా ఆలోచించను ఎప్పుడూ! నేను ఎక్కువగా తపన పడ్డది, పడేది భరతుడి గురించే!

రాముడికి ఎన్ని కష్టాలొచ్చినా ఆయనపై నిందలు మోపినవాళ్ళూ, అకారణంగా ద్వేషించినవాళ్ళూ లేరనే అనుకోవచ్చు. కాని, భరతుడు మాత్రం తాను చెయ్యని తప్పుకి, అడుగడుగునా ద్వేషింపబడ్డాడు, శంకింపబడ్డాడు. ప్రజలు, మంత్రులు, భరద్వాజుడు సైతం శంకిస్తారు. రాముడు కూడా అంతగా స్వాగతించలేకపోతాడు. తన చుట్టూ బిగుసుకున్న రాజకీయ చట్రంలోంచి బైటకు రావాలనే తపన ఎంత కనిపిస్తుందో!

రామాయణంలో కరుణరసం పొంగే ఘట్టాలు, పొంగించే పాత్రలు ఎన్ని ఉన్నా, భరతుడొక్కడే దానికి తారాస్థాయి అనిపిస్తుంటుంది. ఆ పాత్రలో ఉన్న కరుణరసాన్ని ఎక్కువగా అవగతం చేసుకున్నది, దాన్ని ఆలంబనగా చేసుకుని, ఇంకాస్త రసాన్ని పండించగలిగిన వాళ్ళల్లో భాసుడు ప్రథముడైతే, విశ్వనాథ తరువాత ఉంటాడేమో! దానికి ఆ మహాకవి సుతిమెత్తటి గుండెలోంచి పైకుబికిన పై నాలుగు మాటలు చిన్న నిదర్శనం.....

రామాయణము లోని అన్ని పాత్రల హృదయాలనూ సరిగ్గా అర్థం చేసుకుని మన ముందు ఆవిష్కరించిన కవి విశ్వనాథ వారొక్కరేనేమో అనిపిస్తుంది.

మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ । మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥

మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥

--

ఓ ధనంజయా ! నా కన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదు. దారమందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడియున్నది.

ఆంధ్ర భాషోధ్ధారక శ్రీ CP Brown.

ఆంధ్ర భాషోధ్ధారక శ్రీ CP Brown. ఈ ఫొటో 175 సంవత్సరాల క్రితం తీసినదిట...

మంథరగిరి ధారణంబు ....... కృష్ణావతారంబు

మంథరగిరి ధారణంబు ....... కృష్ణావతారంబు 

కృష్ణావతారంబు

సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై 

సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం 

గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలక వ్రాతమున్ 

సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్. 

(పోతనామాత్యుడు..)\

కృష్ణ శతకము.....

దేవేంద్రుఁడలుక తోడను

వావిరిగా ఱాళ్ళవాన వడి గురియింపన్

గోవర్థనగిరి యెత్తితివి

గోవుల గోపకుల గాచు కొఱకై కృష్ణా!

కృష్ణా!దేవేంద్రుడు కోపగించి దట్టమైన,ఱాళ్ళను వేగముగల వానగా కుఱిపించగా గోవర్థనగిరిని గొడుగు వలె చిటికినవ్రేలితో పైకెత్తి ఆవులను,ఆవులను కాచువారిని రక్షించితివి.

కృష్ణుడు మన్ను దినె ...

.కృష్ణుడు మన్ను దినె ...

“అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 

నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవుగొట్టంగ వీ 

రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం 

ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే.”

Thursday, April 3, 2014

అర్జునుడు, ఆంజనేయస్వామి మరియు పరమశివుడు.

పూర్వం ఓ కవీశ్వరుడు రాజుగారితో ఇలా అన్నాడట:

"నాకు ముగ్గురిమీద బాగాకోపంగాఉన్నది. మీరు వారికి శిక్ష వేయాలి. వారు

అర్జునుడు, ఆంజనేయస్వామి మరియు పరమశివుడు.

" "మీకోపానికి కారణమేమ?"ని రాజు కవిగారిని అడుగగా, ఆయన.................

దగ్ధం ఖాండవమర్జునేనచ వృధా దివ్యైర్ద్రుమైస్సంకులం,

దగ్ధా వాయుసుతేన హేమరుచిరా లంకాపురీ స్వర్గభూః,

దగ్ధస్సర్వసుఖాస్పదస్చ మదనో దోషాద్వృధా శంభునా,

దారిద్ర్యం ఘనమాపదాం భువినృణాం కేనాపి నో దహ్యతే!!!

ఖాండవ దహనం చేసిన అర్జునుడు...లంకను కాల్చిన హనుమంతుడు....మన్మధుని కాల్చిన పరమ శివుడు....దోషులే అని అర్ధం.

x

ఉదృతంగా ప్రవహించేటప్పుడు పెద్ద చెట్లని పెకలించి వేస్తారు. కానీ చిన్న రెల్లుగడ్డిని మాత్రం ఏమి చేయరు ఎందుకు?

ఒకరోజు సముద్రుడు తన భార్యలైన గంగ, కావేరి, సింధు, నర్మదా, కృష్ణ, గోదావరి మొదలగు నదులతో కలిసి సరస సల్లాపాలతో మునుగి ఇష్టాగోష్టి మాట్లాడుతూ ఒక సందేహాన్ని అడిగాడు.

మీరు ఉదృతంగా ప్రవహించేటప్పుడు పెద్ద చెట్లని పెకలించి వేస్తారు. కానీ చిన్న రెల్లుగడ్డిని మాత్రం ఏమి చేయరు ఎందుకు?

స్వామి ఇది చాల చిన్న సందేహం. వినండి చెప్తాము. పెద్ద చెట్లు మేము సన్నగా ప్రహిస్తుండగా స్థలాన్ని ఆక్రమించి విర్రవీగుతాయి. ఉదృతంగా ప్రవహించే సమయంలో నన్నేమి చేయలేరు అని ఎదురొడ్డి నిలబడతాయి. అలా నిలబడినప్పుడు మేము వాటిని పెకిలించి వేస్తాము. ''బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి బ్రతుకగ మేలా''? నేను బలవంతుడనని విర్రవీగే వాడిని కచ్చితంగా కూలిపోతాడు ఏదో ఒకనాటికి. రెల్లు గడ్డి అలాకాకుండా! మేము ఎలా ఉన్న దగ్గరికి రాగానే తలవంచి నిలబడుతుంది. దీనితో మేము ఏమి చేయం. మా ఉదృతి తగ్గిపోగానే గర్వంగా లేచి నిలబడతాయి. ఇందువలన రెల్లుగడ్డి తన జీవనం కొనసాగిస్తుంది. అన్నారు.

ఇది మనకి కూడా వర్తిస్తుంది. ఎక్కువ చదువుకున్నాను అని కొందరు, బాగా సంపాదించానని కొందరు, అర్ధంతరంగా సంపదలు పొందితే నా అంతవాడు లేదని కొందరు, ఎందులోనైన విజయం సాదిస్తే నా అంత పోటుగాడు లేడని కొందరు, తెలివితేటల్లో న అంతవాడు లేడని కొందరు, మిడిమిడి జ్ఞానంతో విర్రవీగేవారు ఇంకొందరు. ఇలా వారి నాశనాన్ని వారె చేజేతులారా తెచ్చుకుంటున్నారు. 

ఎంత జ్ఞాని అనుకున్నవాడైనా కొన్ని ప్రశ్నలకి బదులు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఒక తరగతిలో వచ్చిన మార్కులు మరొక తరగతిలో ఎందుకు రావడంలేదు? ఎవరో కోట్లు సంపాదించుకు తిరుగుతుంటేకొందరు చిరిగిపోయిన కోట్లు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? ఆకలిని ఎందుకు అదుపుచేయలేక పోతున్నారు? నిద్రని ఎందుకు అదుపుచేయలేకపోతున్నారు? మనసుని, కోపాన్ని, రుచిని ఇలా దేన్నీ అదుపు ఎందుకు చేయలేకపోతున్నారు?

ఏది మన చేతుల్లో లేదు. ఈ విషయాన్ని గ్రహిస్తే అంతర, భాహ్య ఇంద్రియాలని నిగ్రహిస్తే అప్పుడు తెలుస్తుంది నిజం ఏమిటో! అంతేకాని పైపైన కనపడేవి చూసి ఇదే నిజమనినమ్మితే ఈ సంసార చట్రంలో ఇరుక్కొని భాదలు పడాల్సిందే! నువ్వు నేను అనుకుంటూ బ్రతకాల్సిందే! ఎన్నో దిక్కుమాలిన జన్మలు ఎత్తల్సిందే! తప్పదు. ఏదీ నీచేతుల్లో లేదు. అలాగని ప్రతీదీ దేవుడిమీద భారం వేయమని కాదు. నీపని నువ్వు చెయ్యి. ఫలితం ఆయనమీద వదిలేసేయండి. అప్పుడు లాభం కలిగిన నష్టం కలిగినా బాధ మాత్రం కలుగదు.."

Wednesday, April 2, 2014

జయ నామ ఉగాది...........By Sudha Rani

జయ నామ ఉగాది...........By Sudha Rani

భారతదేశంలో హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారమే

చేసుకుంటామని అందరికీ తెలిసినదే. చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రం దగ్గర

కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరు మీద ఆ మాసం వస్తుంది. చంద్రుడు చిత్ర నక్షత్రంతో

కలిసి ఉన్న పౌర్ణమి చైత్రమాసం. చైత్రమాసంతోనే మనకు వసంతఋతువు ప్రారంభమవుతుంది.

ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ప్రారంభమవుతాయి. మోడువారిన చెట్లు చిగురు

తొడుగుతాయి. అంతవరకు ఏ కొమ్మల మాటున దాగుంటుందో 

కోయిల వసంతం ఆగమించగానే  కుహూరవాలతో

పంచమస్వరంలో స్వాగతించి  జగతిని

మురిపిస్తుంది. మావిఁచిగురుతినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి

చిగురు తొడిగేనా అని కవిగారి సందేహానికి సమాధానం ప్రకృతికే తెలుసు.

ఇంత చక్కని వసంతఋతువు లో వచ్చే తెలుగువారి తొలి పండుగ ఉగాది.

ప్రతి సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది తెలుగుసంవత్సరం. అందుకే ఉగాదిని

సంవత్సరాది పండుగ అని అంటారు. ప్రతి సంవత్సరానికి ఒక్కో పేరు ఉంది. ఆ సంవత్సరం

అంతా ఆ పేరుతోనే వ్యవహరిస్తారు. మనిషి పుట్టిన మాసం ఏ సంవత్సరంలో

ఉంటే తిరిగి ఆ సంవత్సరం రావడానికి అరవై సంవత్సరాలు పడుతుంది. అలా అరవై సంవత్సరాలను

పూర్తిగా ఒక వ్యక్తి తన జీవితకాలంలో చూడడం అనేది విశేషంగా భావిస్తారు కనుకే తెలుగువారు షష్టిపూర్తి అనే

పేరుతో 60సంవత్సరాల పుట్టినరోజును ఘనంగా చేసుకోవడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది.

ఉగాది – యుగాది

యుగాది అనే సంస్కృత పదానికి

వికృత రూపమే ఉగాది అని అంటారు. మనిషిని ప్రకృతిని కాలాన్ని సృష్టించినవాడు బ్రహ్మ.

ప్రతి కల్పాంతంలోను ఒక ప్రళయం వచ్చి ఆయుగం ముగిసి కొత్త యుగం ప్రారంభం అవుతుంది.

దీనినే బ్రహ్మ కల్పం అంటారు. బ్రహ్మకల్పం లో సృష్టి ప్రారంభమయిన రోజు - యుగాది. చైత్రమాసపు శుక్లపక్షంలో మొదటి ఋతువు వసంతఋతువులో మొదటి తిథి పాడ్యమినాడు, మొదటివారం ఆదివారం నాడు ఈ సృష్టిని ప్రారంభించాడని ఆ యుగం ప్రారంభమే

యుగాది అని నారద పురాణంలో చెప్పబడింది. కాలాన్ని, నక్షత్రాలను, గ్రహాలను,

ఋతువులను, మాసాలను ఈదినమే బ్రహ్మ సృష్టించాడట. ఉగస్య ఆదిః ఉగాది. ఉగ అంటే

నక్షత్రగమనం, జన్మ, ఆయుష్షు అని అర్థం. అందువలన 

ఉగాది అనే పదం కూడా ప్రారంభం అనే అర్థంలో 

సరిపోతుంది.

యుగము అంటే జంట అనే అర్థం

కూడా ఉంది. భూ భ్రమణంలో ఏర్పడే ఉత్తరాయనం, దక్షణాయనం కలిపి యుగం అంటే సంవత్సరం

అయితే దానికి ప్రారంభమైన రోజు యుగాది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు.  చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగ జరుపుకోవడం

అనేది అనాదిగా భారతదేశంలో కనిపిస్తున్న ఆచారం.

ఉగాది పండుగ వసంతశోభలను తనతో తీసుకువస్తుంది. కొత్త ఆశయాలతో,

ఆశలతో కొత్త సంవత్సరం గతసంవత్సరం కన్నా మేలుగా, శుభదాయకంగా ఉండాలని ప్రజలంతా ఈ

పండుగని స్వాగతిస్తారు.

ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. భారతీయ

ధర్మాచరణకు ప్రామాణికమైన ధర్మ, నిర్ణయ సింధువులలో  ఉగాది పండుగ గురించి వివరించాయి.  ఉగాది పండుగనాడు చేయవలసిన పంచకృత్యాలు – తైలంభ్యంగనం,

నూతన సంవత్సరాదిస్తోత్రం, నింబకుసుమ భక్షణం, ధ్వజారోహణం(పూర్ణకుంభ దానం), పంచాంగ

శ్రవణం.

నింబకుసుమ భక్షణం

ఇళ్ళను శుభ్రం చేసుకోవడం, ముగ్గులతో అలంకరించడం, మామిడాకుల

తోరణాలు కట్టడం, చక్కగా నూనెరాసుకుని, నలుగుపెట్టుకుని అభ్యంగనస్నానం చేయడం, కొత్త

బట్టలు ధరించి దేవాలయంలో ఆరాధన చేయడం,పిండివంటలు తయారుచేసుకుని బంధుమిత్రులతో

ఆరగించడం - తెలుగువారి అన్ని  పండుగలలోను ఉన్న విశేషాలే. కానీ ఉగాది పండుగకి

మాత్రమే ప్రత్యేకమైనది నింబకుసుమ భక్షణం. నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి

తినడం. దీనినే అశోక కళికా ప్రాశనం అని కూడా అంటారు.

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం.

 నింబ అంటే వేప అని అర్ధం. వేపచిగుళ్లు తినడం వల్ల శతాయుష్షు, వజ్రసమానమైనదేహం, ఆరోగ్యం వల్ల

సర్వసంపదలు లభిస్తాయి. ఉగాది నాడు ముందుగా నింబ కుసుమాలు అంటే వేపపూతతో చేసిన

ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాతే ఏ పనయినా చేయాలి. ఉగాది పచ్చడి

షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు, ఉప్పు, కారం,వగరు,చేదుపదార్థాలు కలిసిన ఉగాది

పచ్చడి మానవజీవితంలో అనుభవానికి వచ్చే అంశాలకు ప్రతీకలు. కొత్త చింతపండు, లేత

మామిడిచిగుళ్లు, అశోకవృక్షం చిగుళ్ళు, చెరుకుముక్కలు, జీలకర్ర,కొత్త బెల్లం,

వేపపూత, మిరియాలు,లేదా మిరపకాయలు కలిపి చేసిన పచ్చడినే ఉగాది పచ్చడి అంటాము.

ఋతువులలో వచ్చే మార్పులను తట్టుకోవడానికి, వాత కఫ పిత్త దోషాలను పోగొట్టుకోవడానికి  ఈ పచ్చడి ఎంతో మంచిది అని ఆయుర్వేదశాస్త్రం

పేర్కొంటుంది. ఖాళీ కడుపుతో ఈ పచ్చడిని ఉగాదిరోజుతో ప్రారంభించి నవరాత్రులు

పూర్తయ్యేవరకు అంటే శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ, లేదా పక్షంరోజులు  తీసుకుంటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా గడపవచ్చునట.

త్వామష్ఠశోక నరాభీష్ట

మధుమాస సముద్భవ

నిబామి శోక సంతప్తాం

మమశోకం సదా కురు – అనే మంత్రం చదువుతూ ఈ ఉగాదిపచ్చడిని భుజించాలి. 

ఉగాదిపచ్చడిలో వేసే పదార్థాలను గమనిస్తే మనిషికి ప్రకృతిని

సంరక్షించుకోవలసిన అవసరం ఎంతగా ఉందో తెలుస్తుంది. ఆరోగ్యానికి ప్రకృతికి గల

సంబంధాన్ని వివరిస్తూ వృక్షో రక్షతి రక్షితః అనే సత్యాన్ని నిరూపిస్తుంది,

నింబకుసుమ భక్షణం అనే ఈ సంప్రదాయం. నూతనసంవత్సరాదిస్తోత్రం చేయడం అంటే ఉగాదినాడు

ప్రాతఃకాలాన లేచి శుచియైన తరువాత పూజామందిరంలో ఆసంవత్సరం పంచాంగం ఉంచి

సంవత్సరాధిదేవతను ధూపదీపారాధనలతో స్తుతించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి. ఉగాది

రోజు దేవుడికి వడపప్పు, పానకం నివేదించాలి. రాబోయే వేసవికాలపు తాపాన్ని  వడపప్పు లోని పెసరపప్పు, బెల్లపు పానకం

తగ్గిస్తాయి కనుక శ్రీరామనవమి వరకు వీటిని నిత్యం నివేదించి సేవించాలి. 

ధ్వజారోహణం-పూర్ణకుంభదానము

ఉగాది నాడు ధ్వజారోహణం, పూర్ణకుంభదానము జరపడం ఒక సంప్రదాయం.

ధ్వజారోహణం అంటే పట్టు వస్త్రాన్ని వెదురుగడకు కట్టి మామిడి, వేప ఆకులు, పూలదండలు

కట్టి దానికొసన కొబ్బరికాయను ఉంచిన కలశాన్ని ఉంచి ఇంటి ప్రాంగణంలో లేదా అందరూ చూసే

స్థలంలో నిలిపి ఉంచుతారు. మహారాష్ట్రీయులు పాటిస్తున్న ఈ ఆచారం ప్రస్తుతం

తెలుగువారిలో కనుమరుగైంది. ప్రస్తుతం కలశ స్థాపన, పూర్ణకుంభ దానం చేస్తున్నారు.

రాగి, వెండి, పంచలోహాలు లేదా మట్టితో చేసిన కుండని రంగులతో అలంకరించి దానిలో పంచ

పల్లవాలు వేసి, చందనం, పుష్పాక్షతలతో ఆవాహనచేసి పూజించి దానికి కొత్త వస్త్రాన్ని

కట్టి అలంకరించిన కొబ్బరికాయను ఉంచి పురోహితునికి దానం చేయడాన్ని పూర్ణకుంభదానం

అంటారు. ఇలా చేస్తే సంవత్సరం పొడుగునా లాభదాయకంగా ఉంటుందని విశ్వాసం.

పంచాంగ శ్రవణం

ఉగాదినాడు తెలుగువారి సంప్రదాయం పంచాంగ శ్రవణం. పల్లెల్లో

ప్రజలందరూ దేవాలయానికి చేరి పురోహితుడితో ఆ సంవత్సరం పొడుగునా జరగబోయే మార్పులను

గురించి చెప్పించుకుంటారు. దీనినే పంచాంగ శ్రవణం అంటారు. తిథి వార నక్షత్ర కరణ

యోగాలను కలిపి పంచాంగం అంటారు. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మనిషిజీవితంలో జరగబోయే

శుభాశుభాలకు అద్దం పడుతుంది పంచాంగం. వీటిని ముందుగా తెలుసుకోవడం కోసమే పంచాంగ

శ్రవణం చేస్తారు. శుభకార్యాలు, పితృకార్యాలు, పూజాపునస్కారాలకు అనుకూలమైన

రోజులగురించి తెలుసుకోవడానికి, ఆ సంవత్సరంలో గ్రహణాలు ఏ మాసాలలో  రాబోతున్నాయి, ఏయే కాలాలు దేనికి అనుకూలం, ఏ

రాశివారికి ఏ ఫలితాలు కలగబోతున్నాయి తెలుసుకోవడానికి  పంచాంగం ఉపయోగపడుతుంది.ఆయా రాశులవారి ఆదాయ

వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు, కందాయఫలాలను ఉగాదినాడు పంచాంగ శ్రవణంతో తెలుసుకుంటారు. ఈ పంచాంగశ్రవణంలో  తిథితో సంపదను, వారంతో

ఆయుష్షు, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి

కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలం కలుగజేస్తాయని

ఒక విశ్వాసం.

తెలుగు ఉగాది ప్రత్యేకతలలో పంచాంగశ్రవణంతో పాటు

కవిసమ్మేళనాలు జరుపుకోవడం కూడా ఒకటి. కొత్త సంవత్సరాన్నికవిత్వంతో ఆహ్వానిస్తారు

కవులు. ఉగాదిరోజున తమ కళలతో ప్రజలను రంజింపచేసిన కళాకారులకు సన్మానాలు జరిపి

గౌరవించడం కూడా తెలుగు జాతి సంప్రదాయం.

ఉగాది ప్రాశస్త్యం

భారతదేశ కాలమానంలో హిందూ కాలమానాన్ని శాలివాహన శకం అని

పిలుస్తారు. క్రీస్తుశకానికి, ఈ శాలివాహన శకానికి 79సంవత్సరాల తేడా ఉంటుంది.  కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళ ప్రాంతాలన్నీ పాలించిన గొప్ప తెలుగు చక్రవర్తి

శాలివాహనుడు. క్రీ.శ. 79లో

శకులమీద విజయం సాధించి పైఠాన్ కి తిరిగివచ్చి ఉగాది నాడే పట్టాభిషేకం

చేసుకున్నాడని, ఆ గుర్తుగా భారత కాలమానాన్ని శాలివాహన శకంగా వ్యవహరిస్తున్నామని

చరిత్రకారులు చెప్తారు. శ్రీరాముడు రావణాసురుడిని

సంహరించి అయోధ్యకిచేరి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఉగాదినాడే అని పురాణాలు

చెబుతున్నాయి. ఉగాది అంటే గొప్పసంకల్పాలకి ఆరంభం, విజయ పరంపరల సాధనకి సంరంభం.

 ఉత్తర దక్షిణ భారతావనిలో ఉగాది వేడుకలు

ఉగాది పండుగ సంవత్సరంలో వచ్చే తొలిపండుగగా తెలుగువారితో పాటు

 భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో

జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగ పేరు గుధీ పడ్వా. పడ్వా అనే పదం పాడ్యమి అనే తిథికి

మరో రూపం. గుధీ అంటే ధ్వజం లేదా జెండా. ఆకుపచ్చ, పసుపు వర్ణాలుగల జరీ అంచు

వస్త్రాన్ని ఒక వెదురు బొంగుచివర కట్టి, దానికి మామిడాకులు, ఎరుపురంగు పుష్పాలను

అలంకరించి ఒక రాగిపాత్రను దానిమీద బోర్లిస్తారు. ఈ జెండాని అందరూ చూసే మార్గంలో

వెలుపల ఉంచుతారు.  బ్రహ్మధ్వజం అని,

ఇంద్రధ్వజం అని పిలిచే ఈ గుథీని, రాముడు రావణుడిమీద సాధించిన విజయానికి, ఛత్రపతి శివాజీ

సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. సిక్కులు “వైశాఖీ” అని, బెంగాలీయులు “పొయ్ లా బైశాఖ్” అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. పంజాబు లో నూతన

సంవత్సరాన్ని “ వైశాఖి” అనే పేరుతో పిలుస్తారు. పంటలు

ఇంటికిచేరి రైతులు తమ సంతోషాన్ని పదిమందితో పంచుకునే పండుగ. భగవంతుడికి కృతజ్ఞతలు

తెలిపే పండుగ. అస్సాంలో కొత్త సంవత్సరాన్ని 

“బోహాగ్ బిహు ”పేరుతో పిలుస్తారు. ఎంతో ఉల్లాసంతో,

ఉత్సాహంతో ఈ పండుగ జరుపుకుంటారు. రాజస్థాన్ లో “తప్నా” అనే పేరుతో చైత్రమాసంలో కొత్తసంవత్సరం వేడుక జరుపుతారు.

సింధ్ ప్రాంతంలో “చేటీ చాంద్” అనే పేరుతో చైత్రమాసం పాడ్యమినాడు

కొత్త సంవత్సరం జరుపుకుంటారు. 

భారతదేశంలో దక్షిణాదిన మళయాళ ప్రజలు విషు అని, కొంకణ, కన్నడ ప్రాంతీయులు ఉగాది

అని, తమిళులు పుత్తాండి అని కేరళ ప్రాంతంలో

ఉగాదిని విషు అనే పేరుతో జరుపుకుంటారు. ఉగాది ముందురోజే ఇంట్లోని పూజగదిని బంగారురంగుపుష్పాలు,

పళ్లు, బంగారువస్తువులు, దేవతామూర్తులతో అలంకరించి ఉంచుతారు.ఆ ఇంటి ఇల్లాలు రాత్రి

ఆ పూజగదిలోనే నిద్రించి బ్రహ్మముహూర్తకాలంలో లేచి దీపం వెలిగించి ఇంటిలోవారందరినీ

ఒక్కొక్కరికీ కళ్లు మూసి పూజగదిలోకి తీసుకువస్తుంది. బంగారు రంగు వస్తువులతో అలంకరించబడిన

విషుక్కన్ చూడడం వలన కనులే కాక మనసులు కూడా పవిత్రమవుతాయని, కొత్త సంవత్సరం ఇలా

ప్రారంభిస్తారు మళయాళీలు. తమిళులు పుత్తాండి రోజున బంగారు, వెండి వస్తువులు,

తమలపాకులు, వక్కలు, పువ్వులు, కొత్తబియ్యం, కొబ్బరికాయలు వంటి వస్తువులను

చూడడంతో  పండుగవేడుక ప్రారంభిస్తారు. బాలి, ఇండొనేషియా, మారిషస్

వంటి ఇతర దేశాలలో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ఉగాది వేడుకలు జరుపుకుంటారు.

ఏ పేరుతో ఎలా పిలిచినా ఉగాది ఒక కొత్త సంవత్సరానికి

ప్రారంభం. అనాదిగా మనిషికి ప్రకృతికి గొప్ప అనుబంధం ఉంది. వసంతఋతువు ఆగమనంతో ప్రకృతిలో

మార్పులు వస్తాయి. పగళ్ళు దీర్ఘం అవుతాయి. 

శిశిరంలో రాలిపోయిన ఆకుల స్థానంలో చెట్లన్నీ కొత్త చిగుళ్ళువేసి

పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. ఋతువులో కలిగిన ఈ మార్పు మనిషిలో మందకొడితనాన్ని

దూరంచేసి ఉత్సాహపరుస్తుంది. ప్రకృతితో పాటే మనిషి కూడా గతకాలపు అనుభవాల గురుతుల పత్రాలను  విదిలించుకుని   కొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షల కొత్త  చిగురులు తొడిగి జీవితంలో గొప్ప మార్పుకు

స్వాగతం పలుకుతాడు.  ప్రకృతిలో ఆగమించే

వసంతకాలం తమ జీవితాల్లో కూడా సందడిచేయాలని,  ఆశించే వారందరికీ ఈ జయ నామసంవత్సర ఉగాది సర్వసంపదలు,

సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం.