శ్రీరామ భజనలు చేసే చోట ప్రత్యక్షమయ్యే చిరంజీవి!

శ్రీరామ భజనలు చేసే చోట ప్రత్యక్షమయ్యే చిరంజీవి!

యత్రాస్తి భోగో నహి మోక్షః యత్రాస్తి మోక్షోనమి తత్ర భోగః

శ్రీమారుతీస్సేవనం తత్పరాణం | భోగశ్చ మోక్షశ్చ కరస్థఏవ ||

అంటే, కేవలం భోగాలలోనే ఉంటే మోక్షంరాదు. ఇక ముముక్షువులకయితే భోగాల ప్రసక్తి లేదు. కొందరు దేవతలు కేవలం భోగాలను మాత్రమే ఇస్తారు. మరి కొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ "ఆంజనేయస్వామి" వారు అటు భోగాన్ని, ఇటు మోక్షాన్ని రెంటిని ఇవ్వగల కల్పవృక్షం, కామధేనువు, చింతామణిగా చెప్పుకోవచ్చని అర్థం.

ఏకోదేవ స్సర్వద శ్రీ హనుమా | నేకోమంత్ర శ్రీహనుమత్ర్పకాశః |

ఏకోమూర్తి శ్రీహనూమత్స్యరూపా | చైకం కర్మ శ్రీహనుమత్సపర్యా ||

సత్య పదార్థమైన బ్రహ్మము ఒకడే, ఆయనే హనుమా. ఒకటే మంత్రం ఉంది అది శ్రీ హనుమాను మంత్రమే. ఒకటే మూర్తి ఉంది ఆయనే హనుమ. ఇక మనం చేయవలసింది ఒకటే అది హనుమంతుని సేవా, వారి పూజ అని పరాశరుడు మైత్రేయునికి బోధించినట్లు తెలుస్తుంది.

ఆంజనేయం మహావీర | బ్రహ్మవిష్ణు శివాత్మకం

బాలార్క సదృశాభాసం | రామదూతం సమామ్యహమ్ ||

హనుమ అంటే బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని, సృష్టిస్థితి లయకారకుడని, వీరుడంటే బ్రహ్మవేత్త అని, రామదూత అంటే శ్రీరాముని స్వరూప కథనము చేయువాడని, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.

ఇంకా ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో! ఆ యింట్లో హనుమంతుని ప్రభావంవల్ల "మహాలక్ష్మి" స్థిరముగా ఉంటుంది.

ఏనాడో గడచిన రామాయణ గాధలోని శ్రీ ఆంజనేయ స్వామివారు ఇంకా బ్రతికి ఉంటారా..! అని ఎవ్వరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. వారి "చిరంజీవత్వాన్ని" నిరూపించుకొనుటకు తగు నిదర్శనాలు ఉన్నాయి. పాండవులలో బలశాలియైన భీమునకు హిమవత్పర్వతంలో దర్శనమిచ్చి తనతోకను ఒకసారి కదల్చిచూడమని చెప్పినట్లు వారి చిరంజీవత్వము నిరూపించుటకు సూచించు తగు ప్రమాణాలు కలిగిన ప్రత్యక్ష దైవం ఆయన...!

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.

అంటే శ్రీ ఆంజనేయస్వామి వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో! అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారని భక్తుల గాఢ నమ్మకం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!