లలాట లిఖితం

లలాట లిఖితం

.

ఇది నా స్వంత రచన కాదు. చిన్నప్పుడు విన్నది ఇప్పుడు నలుగురికీ చెప్పాలని రాస్తునాను. మీలో కొందరికి ఇది ఇదివరకే తెలిసి ఉండవచ్చు.

నారద మునికి ఎలాగైనా తండ్రిగారైన బ్రహ్మను గద్దె దింపి తాను పరమపిత అనే బిరుదు కొట్టేద్దామని మహా కోరికగా ఉండేది. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. త్రిలోక సంచారికదా ఒక సారి భూలోక సంచారం చేస్తూ ఒక స్మశానం మీదుగా వెళుతుండగా అతని కాలికి ఒక పుర్రె తగిలింది. పరిశీలనగా దానివైపు చూస్తే ఆ పుర్రెయొక్క నొసటి భాగాన ఊర్ధ్వలోక ప్రాప్తి అని రాసి ఉంది. హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం శవాన్ని దహనం చెయ్యాలి. అలా చేస్తే పుర్రె ఉండదు, మరి పుర్రె ఉన్నాదీ అంటే ఆ ప్రేతానికి దహన సంస్కారాలు జరుగనట్లే, దహనమే జరుగని ప్రేతానికి ఊర్ధ్వలోక ప్రాప్తి ఏమిటీ,? దొరికేడు మా నాన్న, ఈ దెబ్బతో అతగాడిని గద్దె దించి నేను కూర్చుందును అనుకుంటూ తన బలం ద్విగుణీక్రుతం చేసుకుందుకు ముందస్తుగా కైలాసానికి వెళ్ళి శంభో శంకర, చూసేవా మా నాయనగారి తెలివిలేని రాతలు అంటూ ఆపుర్రెను శివునకు చూపించేడు. అవును నారదా మీ నాన్న ముసిలివాడవుతునాడు సుమా అంటూ శివుడు చెప్పగానే నారదుడు రెట్టించిన ఉత్సాహంతో వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకు కూడా ఆ పుర్రె చూపించి అతని చేత కూడా బ్రహ్మ ముదుసలి అన్న మాట అనిపించుకుని సత్యలోకం చేరుకుని తండ్రిని నిలదీసేడట దహన సంస్కారమే లేని వీనికి ఊర్ధ్వ లోక ప్రాప్తి ఎలా?? అని. బ్రహ్మ చిరునవ్వుతో "కుమారా నీవే స్వయంగా ఊ పుర్రెను కైలాసానికీ వైకుంఠానికీ తీసుకెళ్ళి ఇక్కడికి తెచ్చేవు కదా మరి ఊర్ధ్వలోక ప్రాప్తి లేదని ఎలా అనుకుంటునావు అని అడుగగా నారదుడు తెల్ల మొహం వేసేడట. అదీ భోగట్ట. అంచేత నొసటిరాతను తప్పించ ఎవరి తరం??

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!