అధికమాసం..(జాజి శర్మ గారు.)

అధికమాసం..(జాజి శర్మ గారు.)

లూనార్‌ సోలార్‌ హిందూ కేలండర్‌ ప్రకారం సంవత్సరానికి 12 నెలలే కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం, లేదా పురుషోత్తమ మాసం వస్తుంది. కొన్ని సందర్భాలలోనే మాసగడువు క్షీణిస్తుంది. వేదకాలం నుండే పూర్తి గణన కేలండర్‌ మనకి వుంది. జ్యోతిష్‌ వేదాంగం 14వ శతాబ్దం నాటింది. సూర్య సిద్ధాంతంగా దానినే ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట, ఆరవ శతాబ్దంలో వరాహమిహిర 12వ శతాబ్దంలో భాస్కర పరిగణించారు.

ఓసారి భగవాన్‌ నారాయణుడు ధ్యానంలో ఉండగా, నారదుడు వారి వద్దకు వేతెంచి అధికమాసానికి గల కారణాలను వివరించమన్నాడు. ప్రజల పాపాలతో బరువెక్కామని 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమంటే నారయణుడు అధిక మాసాన్ని సృష్టిం చాడట. అయితే ఈ అధిక మాసంలో పూజలూ, పునస్కారాలు నిర్వహించటంలేదని అధిక మాసం కృష్ణునికి మొరపెట్టుకుంటే, పురుషోత్తం మాసాన్ని సృష్టించి, ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయన్నారట. 

పంచాంగంలో తిధి, వాసర, నక్షత్ర, యోగ, కరణాలకు ప్రాధాన్యతవుంది. తిధి అంటే భూమి నుండి సూర్యుడు, చంద్రుడు మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకొని 12 డిగ్రీల చొప్పున 30 తిధులను చేశారు. మాసానికి రెండు పక్షాలు శుద్ధలేక శుక్లపక్షం. తిధిపేర్లు ప్రతిపద, ద్వితీయ నుండి పూర్ణిమ/ అమావస్యవరకు. అశ్వనినుండి మేష రాశివరకూ నక్షత్రాలు. ఒక్కోరాశి 2.25 నక్షత్రాలకు సమం.

ఒక్కోసారి రెండు రోజులకు ఒకేతిధి, మరోసారి ఆరోజుతర్వాత తిధికి జారుకుంటుంది. అంటే ఆ తిది సూర్యోదయాన్ని వదలుకుంది. ఒక్కోసారి సూర్యుడు ఏరాశిలోకి ప్రవేశించకపోతే దానిని అధిక మాసంగా పరిణిస్తారు. ఇలా ప్రతిమూడు సంవత్సరాలకూ జరుగుతుంది. అధికమాసం చైత్రం నుండి కార్తీకం, ఫల్గుణ మాసాల పరిధిలోకిరాదు.

సూర్యుడు ఏదైనా నెలలో రెండు రాశులమధ్య ప్రయాణిస్తే, దీనినే క్షయం అంటారు. క్షయ మాసానికి ముందు, తర్వాత కూడా రెండు అధిక మాసాలు వస్తాయి. అధిక మాసంలో పూజలు పునస్కారాలు లేకపోయినా దానాలు చేస్తే సత్ఫలితాలుంటాయి. రాగి పాత్రలో 33 తీపిపదార్థాలు వుంచి, ఆ పాత్రకు ఏడు దారపు తొడుగులను వేసి అల్లుడికి గానీ, గౌరవనీయవ్యక్తికి దానం చేయాలి. నారాయణుడిని స్మరించాలి. ఇలా చేస్తే అధికమాసం దుప్ఫలితాలుండవు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!