Friday, June 30, 2017

ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ?

ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ?

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం నుండి


ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి, ఎందుకంటే ధర్మం చెప్పడానికి ఇంకెవరికీ అధికారం లేదు, నేను ధర్మం చెప్తానండీ అంటే ఇంకెవరికీ అధికారం లేదు ధర్మం చెప్పడానికి నేను చెప్తానండీ ధర్మం అంటే లేదు వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవ్వాళ ఎంతమందికి ఉంటుంది. వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం చెప్పలేం కాబట్టి ఋషులేం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు. దానిని గౌతమ స్మృతి అంటారు. యజ్ఞవల్కడు ఒక స్మృతి చేశాడు ʻయాజ్ఞవల్క స్మృతిʼ, అత్రి ఒక స్మృతి చేశాడు ʻఅత్రి స్మృతిʼ స్మృతులొచ్చాయి, స్మృతులేం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు దానికి ʻస్మృతిʼ అని పేరు ʻశృతిʼ ʻస్మృతిʼ రెండు విరుద్ధంగా ఉండవు, శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అసలు ధర్మ విరుద్ధమైన విషయాన్ని ఋషి ప్రతిపాదించడు కాబట్టి స్మృతికీ శృతికీ మధ్యలో ఏదైనా భేదం ఉందా అంటే...? అది ఉన్నట్లు నీకు కనపడుతుందేమో కానీ పెద్దల దగ్గర నీవు ఆశ్రయించి తెలుసుకుంటే... ఆ భేదం ఉండే అవకాశం పెద్దగా ఏమీ ఉండదు. ఋషి ఎప్పుడూ మన ప్రయోజనం కొరకే మాట్లాడుతారు.

కాబట్టే రఘువంశ కావ్యంలో కాళిదాసు గారు ఒక మాట అంటారు, “వేదాన్ని స్మృతి ఎలా అనుసరించిందో అలా నందినీ ధేనువుని దీలీప మహారాజు అనుసరించాడు” అన్నాడు. శ్రుతేరి వార్థం స్మృతి రన్వగచ్చత్ అన్నాడు. సృతి యొక్క అర్థం వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీ ధేనువుని అనుసరించాడు అన్నాడు.


Thursday, June 29, 2017

పోతనగారి మహా భాగవతం ! (కృతిపతి నిర్ణయము.)

పోతనగారి మహా భాగవతం !

(కృతిపతి నిర్ణయము.)

"ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్

సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే

సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ

బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.!

భావము:

విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా రాసిన భాగవతాన్ని మానవమాత్రులు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.

.

తే 

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,

నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,

దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ, 

గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.

..

భావము:

ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి

.

క.

పలికెడిది భాగవత మఁట, 

పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ

బలికిన భవహర మగునఁట, 

పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

భావము:

వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.

.

-ఆ.

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, 

శూలికైనఁ దమ్మిచూలికైన, 

విబుధజనుల వలన విన్నంత కన్నంత

దెలియ వచ్చినంత దేటపఱతు.!

భావము:

అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్ననో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్ననో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.

-క.

కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ 

గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం

గొందఱికి గుణములగు నే 

నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.!

భావము:

తెలుగు పదాలతో కూర్చి రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి రాసిన రచనలను మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.

మ.

"ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్

తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో

తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా

జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.!

భావము:

సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.

-మ.

"లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం

జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.!

భావము:

బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.

Wednesday, June 28, 2017

రుక్మిణీకల్యాణం ! (భాగవతం ....పోతన .)

రుక్మిణీకల్యాణం !

(భాగవతం ....పోతన .)

.

"ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్

జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ

ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా

భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.!

.

"కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై

కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా

కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ

కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.!

.

"భూషణములు చెవులకు బుధ

తోషణము లనేక జన్మదురితౌఘ విని

శ్శోషణములు మంగళతర

ఘోషణములు గరుడగమను గుణభాషణముల్."!

.

విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి."

కుమార శతకము! (ఫక్కి వేంకటనరసింహ కవి)

కుమార శతకము!

(ఫక్కి వేంకటనరసింహ కవి)

.

.క. శ్రీభామినీ మనోహర

సౌభాగ్యు దయాస్వభావు సారసనాభున్‌

లో భావించెద నీకున్‌

వైభవము లొసంగుచుండ వసుధ కుమారా! 1

.

క. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల

లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్‌

బ్రాజ్ఞతను గలిగి యున్నన్‌

బ్రాజ్ఞులలోఁ బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా! 2

.

క. అతి బాల్యములోనైనను

బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స

ద్గతిమీఱ మెలఁగ నేర్చిన

నతనికి లోకమున సౌఖ్యమగును ముమారా! 3

.

క. వృద్ధజన సేవ చేసిన

బుద్ధి విశేషజ్ఞుఁడనుచుఁ బూతచరితుఁడున్‌

సద్ధర్మశాలి యని బుధు

లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగఁ గుమారా! 4

.

క. పెద్దలు వద్దని చెప్పిన

పద్దులఁ బోవంగరాదు పరకాంతల నే

ప్రొద్దే నెదఁ బరికించుట

కుద్దేశింపంగఁ గూడ దుర్విఁ గుమారా! 5

.
క.తనపై దయ నుల్కొనఁగను
గొన నేతెంచిన సుశీల గురుమతులను వం
దనముగఁ బూజింపఁ దగు
మనమలరఁగ నిదియ విబుధ మతము కుమారా!6

.

క.ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁ గుమారా!7

.

క.పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్‌
హద్దెఱిఁగి లేవకున్నన్‌
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!8

.

క.సతతముఁ బ్రాతఃకాలో
చిత విధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
పతి పూర్వపర్వతాగ్రా
గతుఁడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా! 9

.

క.పోషకుల మతముఁ గనుఁగొని
భూషింపక కాని ముదముఁ బొందఁడు మఱియున్‌
దోషముల నెంచుచుండును
దోషివయిన మిగులఁ గీడు దోఁచుఁ గుమారా!10

Tuesday, June 27, 2017

పోతన సరస్వతి స్తూతి ..తెలుగు భాగవతం !

పోతన సరస్వతి స్తూతి ..తెలుగు భాగవతం !

.

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్

నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ

దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్

పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

భావము:--

అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! 

{*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}

ఉ.

"శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా

హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం

దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడు గల్గు, భారతీ!

.

భావము:--

భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

ఉ.

"అంబ, నవాంబుజోజ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా

డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా

చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా

వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!

భావము:--

తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్త్రుతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!

-ఉ.

"అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.!

.

భావము:--

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; 

ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయ్యి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

మ.

"హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.!

భావము:__

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రొహించు గాక.

.

ఇలా ఇష్టదేవత లందరినీ స్తుతించి. సూర్యభగవానుడిని, కుమారస్వామిని స్మరించుకున్నాను. ముందుగా కవితాసరస్వతి విలాస విన్యాసాలను వెలయింప జేసిన వాల్మీకి మహర్షుల వారికి వందనం చేస్తున్నాను. హయగ్రీవాసురుని చేతిలో పడి చిక్కుపడిన వేదసమూహాన్ని మొక్కపోని ఓర్పుతో, నేర్పుతో చక్కదిద్దిన వ్యాస భగవానుల వారికి వంగి నమస్కరిస్తున్నాని. శ్రీ మహాభాగవతకథ అనే సుధారసాన్ని పంచి పెట్టిన శుకయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తియ్యనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసికొన్న మయూరకవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కవి చంద్రుడు కాళిదాసుని కైవారం చేస్తున్నాను. కవుల హృదయాలను దోచుకున్న నన్నయ భట్టారకుని స్తుతిస్తున్నాను. హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనాచార్యుని కొనియాడుతున్నాను. తక్కిన పూర్వకవు లందరిని మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవు లందరిని అభినందిస్తున్నాను. ముందు తరాలలో రాబోయే కవు లందరికీ శుభం పలుకుతున్నాను. ఆంధ్ర సంస్కృత ఉభయ భాషలలో గద్యపద్యాల (చంపూ) కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను.

పోతన గారి శివ భక్తి !

పోతన గారి శివ భక్తి !

.

"వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా

శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,

బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో

న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్!!

భావము:--

అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, 

మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి, 

పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా

ప్రణామం చేస్తున్నాను.

పోతన తెలుగు భాగవతం !

పోతన తెలుగు భాగవతం !

.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో

ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.!

భావము:

సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదాస్మరిస్తు ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంధారంభ ప్రార్థనా పద్యం.

.

(అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల... కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి,

Monday, June 12, 2017

కర్పూరవసంతరాయలు ! రచన --డా; సి, నారాయణ రెడ్డి-

కర్పూరవసంతరాయలు !

రచన --డా; సి, నారాయణ రెడ్డి-

.

ఇది ఒక కథాత్మక గేయకావ్యం-- క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ' రసికప్రభువు' -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి 'లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరయలు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి HISTORY OF REDDY'S KINGDOMS లో కుమారగిరి రెడ్డి కి కర్పురవసంతరయలు అన్న బిరుదు ఉన్నదని ఉదహరించటం జరిగింది. ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు 'కుమారగిరి'. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. అందుకే అతనిని 'కర్పురవసంతరయలు గా పిలిచేవారట. కుమారగిరి రెడ్డి స్వయం గా పండితుడు, కవి. ఇతడు వసంతరాజీయ్యము అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని వ్రాసినట్లు చరిత్ర. రాజ్య భారాన్ని తన మంత్రి, బావ అయిన కాటయ వేమారెడ్డి పై మొపి, సంగీత, నాట్య, వినోదాలతో కాలాన్ని కర్పూరం వలె వెలిగించాడు. క్లుప్తంగా కథాశరీరం. 'కుమారగిరి', 'లకుమ' నాట్యానికి, ఆమె తనూ లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమ ను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. రెడ్డీ రాజులచరిత్రకు ప్రాణం పోసిన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిచ్చారు నారాయణ రెడ్డి గారు. ఇక ఈ కావ్యం లొని కొన్ని ఘట్టాలు చైత్రపూర్ణీమనాడు జానువెన్నెలరెడు ఉదయింఛచినాడదొ మదనునికి సైదొడు కొండవీడానాడు వెండివెన్నెలలొన కనిపించె నచ్చముగ కైలాసగిరివొలె ఆసుప్రసన్నసమయాననగరొధ్యానమందున కళాల క్ష్మి అందెసవరించిండది ఆనాదలహరి రాజాంతరంగముననిండినదపుడు నర్తకియె తప్ప అన్యముకానబడదు రాజునకపుడు రెనిముగ్దమనస్సులొన మన్మధునీఅరవబాణమవతరించినది రెనిస్నిగ్ధహ్రుదంతాన ఆంమ్రుతాంశు పదునెడవకళయెస్పురించినది సార్వబౌముని రాజస మ్మడుగువట్టినది అతిమస్రణ రసలొలత పైకిలెసినది రత్నహారము దీసి రాజు వెదికడాసె తలవంచి లకుమ అడుగులు ముందునకువెసె దండ తొపాటుకరదండయుగళము గూడ లకుమ గళమందున అలంకరణమైపొయె చంద్రుడొక్కడు అతనిచుట్టుగచంక్రమించును వెలచుక్కలు లకుమ యెక్కతె ఆమెచుట్టుగలాస్స్యమాడెను లక్షఊహలు తొలుత లకుమాకింకిణులకు రాయండుముగ్దుండయ్యె ఆవెనుక ఆమె తనూ లావణ్యమునకె దాసుండయ్యె ఆయమ వసంతరాయని మానస సరొవరాంతరాళ విహారయైన రాజమరాళి ఇలా లకుమతొనె కాలాన్ని వెల్లబుచ్చుతూ రాజ్యాన్ని;రాణి ని విస్మరిస్తాడు 'కుమారగిరి'

రేడు నాఅంతహపురమునకు రాడనెడుదుఖము కన్నను రాచగద్దెను విడిన వార్తయె రంపమున గొసినది ఆతకత్తె లనాదరించుట అధిపులకు ధర్మమ్మె కాని వారి అడుగులమ్రొలబ్రతుకును ధారవొయుట యేటిన్యాయం కేళీకామందిరము కన్ననుఓలగమ్ము పవిత్రమైనది వ్యక్తికన్నను దేశపరిరక్షణ ఆదరపాత్రమైనది రాజ్జ్యరక్షణకొసం 'లకుమ' నుఅర్ధిస్తుంది రాణి] నీ పయిన్ ఒక ఘోరభారము మొపగా వచ్చితి చెల్లి పాలముంతువొ నీటముంతువొ భాధ్యతను గమనించి తల్లి నిన్ను రాయలు కన్నులందుననిల్పినందుకు పరితపించను కాని దేశమ్మును తృణమ్మట్టు కాలద్రొయుట నెట్ల్లు సైతును గుండె రాయిగ జేసికొని కడకొక్కమాటయెయందునమ్మా భుపతిని ఎటులైనవీడిపొవుటయె నీకు అవశ్యమమ్మా ఆలొచన పడుతుంది లకుమ, రాణీని, రాజ్జ్యాన్ని నాకొసంవిడనాడిన రాజునొదలి ఎలావెల్లను రాణీకిచ్చినమాట ఎలానిలుపుకొను ఎందుకి హ్రుదయమ్మునిచ్చితివీశ్వారా; ఈసానిదానికి అనుకుంటు తూర్పువాకిట భాలభానునితొల్లికిరణము తొంగిచూచెను లకుమలొనొకవజ్రసంకల్పమ్ము వేళ్ళనుదన్నిలెచె అనాటి అసురసంధ్యాలకుమరక్తాంబరముగట్టి రాయనికిఎదురుగానిల్చె ఇదిఎమివేషమే మదవతీ యననామె శివతాండవమున కిఇ చీరయేతగుననియె మృడునియాకృతి దొప ఒడలెల్ల పొంగించె డండండముక్కుమని డమరుకము పల్కించె నృత్యమందిరము శొణితవర్ణితమ్మయె ఆమెలొ అసురసంధ్యామూర్తికననయె ఒక్కమాటుగ నామెఒడిలొనచెయివెసె నృపునికనులందొకమెరుపు తళుక్కునదూసె మరునిముసమున లకుమ ధరణీ పైగూలె ప్రభుడప్పుడుగగ్గొలుపడి ఏమియునుతొచక ఎదలొదిగినబాకునూడంబెరికె దాని పిడిచుట్టు పత్రమ్ముకనిపించె రక్తసిక్తాక్షరములను రేడుపటియించె ఓలకుమా యెటనుంటివొ నివు;ఇంకెచట పరమసాధ్విజగత్ స్వర్ణాసనముపైన కొమరగిరి చరితమ్ము కొండవీటను శీశీరమును సైతమువసంతముగ రూపుగట్టించు కొండవీటను పాదుకొన్నట్టి మట్టిలొసైతము కర్పూరసొరభములు వీచు

ఈ కావ్యాన్ని స్వ్యయంగా నారాయణరెడ్డి గారు ఆలపించారు ఈ కావ్యాన్ని చదివినా విన్నా శతకొటిమల్లికల సువాసనని మనం కూడా ఆస్వ్యాదించవచ్చు