ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ?

ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి ?

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రామాయణం నుండి


ధర్మం అనేది మీరు ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఒక్క వేదంలోంచే తెలుసుకోవాలి, ఎందుకంటే ధర్మం చెప్పడానికి ఇంకెవరికీ అధికారం లేదు, నేను ధర్మం చెప్తానండీ అంటే ఇంకెవరికీ అధికారం లేదు ధర్మం చెప్పడానికి నేను చెప్తానండీ ధర్మం అంటే లేదు వేదం చెప్పిందే ధర్మం అవుతుంది. వేదం చెప్పింది ధర్మం అయితే వేదం చదివి తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఇవ్వాళ ఎంతమందికి ఉంటుంది. వేదంలో ధర్మం ఇలా ఉంది అని మనం ఎలా చెప్పగలం చెప్పలేం కాబట్టి ఋషులేం చేశారంటే స్మృతులు కింద తీసుకొచ్చారు. గౌతముడు ఒక స్మృతి రచన చేశాడు. దానిని గౌతమ స్మృతి అంటారు. యజ్ఞవల్కడు ఒక స్మృతి చేశాడు ʻయాజ్ఞవల్క స్మృతిʼ, అత్రి ఒక స్మృతి చేశాడు ʻఅత్రి స్మృతిʼ స్మృతులొచ్చాయి, స్మృతులేం చేస్తాయంటే వేదంలో ఉన్నటువంటి ధర్మ సూత్రములను క్రోడీకరించి వాటిని అందంగా ఒక పొందికతో తీసుకొస్తారు దానికి ʻస్మృతిʼ అని పేరు ʻశృతిʼ ʻస్మృతిʼ రెండు విరుద్ధంగా ఉండవు, శృతిని స్మృతి అనుసరిస్తుంది. శృతిని స్మృతి ఎక్కడైనా తిరస్కరిస్తే దాన్ని మనం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది. అసలు ధర్మ విరుద్ధమైన విషయాన్ని ఋషి ప్రతిపాదించడు కాబట్టి స్మృతికీ శృతికీ మధ్యలో ఏదైనా భేదం ఉందా అంటే...? అది ఉన్నట్లు నీకు కనపడుతుందేమో కానీ పెద్దల దగ్గర నీవు ఆశ్రయించి తెలుసుకుంటే... ఆ భేదం ఉండే అవకాశం పెద్దగా ఏమీ ఉండదు. ఋషి ఎప్పుడూ మన ప్రయోజనం కొరకే మాట్లాడుతారు.

కాబట్టే రఘువంశ కావ్యంలో కాళిదాసు గారు ఒక మాట అంటారు, “వేదాన్ని స్మృతి ఎలా అనుసరించిందో అలా నందినీ ధేనువుని దీలీప మహారాజు అనుసరించాడు” అన్నాడు. శ్రుతేరి వార్థం స్మృతి రన్వగచ్చత్ అన్నాడు. సృతి యొక్క అర్థం వేదం ఏం చెప్పిందో దాన్ని స్మృతి అనుసరించినట్లు దిలీపుడు ఆ గోవుని నందినీ ధేనువుని అనుసరించాడు అన్నాడు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!