Friday, October 30, 2015

ఏదీ తనంతతానే ఎప్పటికీ రానేరాదు...

శుభోదయం.!

ఏదీ తనంతతానే ఎప్పటికీ రానేరాదు

కటువైన సత్యాన్నీ కఠోరమైన పరిశ్రమనూ సొంతం చేసుకున్నప్పుడే

అనూహ్య విజయాలు లభిస్తాయి! 

కృషితో లభించిన విజయానికి ఆనందం అర్ణవం ఔతుంది! 

ఆహ్లాదం అంతరిక్షంలా విచ్చుకొంటుంది!

భక్తి కవితా చతురానన బమ్మెర పోతన - డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

భక్తి కవితా చతురానన బమ్మెర పోతన

- డాక్టర్‌ సి. నారాయణరెడ్డి గారు.

.

"పలికెడిది భాగవతమఁట

పలికించు విభుండు రామభద్రుండఁట; నేఁ

పలికిన భవహర మగునట;

పలికెద వేఱొండుగాథఁ బలుకఁగ నేలా?"

నాలుగు పలుకులను ప్రాసస్థానంలో చిలికి తన పులకలు వెలార్చుకొన్నాడు. అయితే భాగవతరచన అంతంత మాత్రాన జరిగేదికాదు. ఈ "సహజ పాండిత్యు"నికి అది తెలియదా? అదీ విన్నవించుకొన్నాడు.


"భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు

శూలికైనఁ దమ్మి చూలికైన

విబుధజనుల వలన విన్నంత కన్నంత

తెలియ వచ్చినంత తేటపఱుతు."

భాగవతం తెలుసుకోవడం, తెలిసింది తెలుపుకోవడం చిత్రమట! నిజమే, రామాయణం అలలా సాగిపోయే మనిషి కథ. భారతం భిన్న లౌకిక ప్రవృత్తుల సంఘర్షణ వ్యథ. భాగవతం స్థూలదృష్టికి కృష్ణలీలాపేటిక, విష్ణుభక్తుల కథావాటిక. సూక్ష్మంగా పరిశీలిస్తే అది మధ్యమధ్య ఎన్నెన్నో విప్పలేని వేదాంతగ్రంథులున్న మహాగ్రంథం. ఆ ముడులు విప్పడం హరునికీ, విరించికీ దుష్కరమే! మరి ఆ భాగవత రహస్యం ఆ భగవంతునికే తెలియాలి. భారం అతనిపై వేసి వ్యాసభాగవతవ్యాఖ్యాత అయిన శ్రీధరుణ్ణి ఆలంబనం చేసుకుని తెలియవచ్చినంత తేటపరచినాడు ఈ వినయశీలుడు. ఈ తేటపరచటం ఏ తెలుగులో? నన్నయ ప్రారంభించిన తత్సమపద బహుళమైన తెలుగులోనా? లేక పాల్కురికి సోమన్న ప్రఘోషించిన జానుతెనుగులోనా? పోతన్న సాత్వికత అహంతలకూ వింతవింత పుంతలకూ అతీతమైనది.


"కొందఱికిఁ దెనుఁగు గుణమగుఁ;

గొందఱికిని సంస్కృతంబు గుణమగు; రెండున్‌

గొందఱికి గుణములగు; నే

నందఱి మెప్పింతుఁ గృతుల నయ్యైయెడలన్‌."

కొందరికి తెనుగు గుణమట. ఇందులో పరోక్షంగా పాలకురికి, ప్రత్యక్షంగా తిక్కన్న కనిపిస్తున్నారు. కొందరికి సంస్కృతం గుణమట. ఇందులో సుదూరంగా నన్నయ, సమీపంగా శ్రీనాథుడు వినిపిస్తున్నారు. ఆయాకవులే కాదు, వారి అనుయాయులు కూడా స్ఫురిస్తున్నారు. 'ప్రౌఢంగా పలికితే సంస్కృతభాష అంటారు. నుడికారం చిలికితే తెలుగుబాస అంటారు. ఎవరేమనుకున్నా నాకు తరిగిందేముంది? నా కవిత్వం నిజంగా కర్ణాటభాష' అని ఎదుటివాళ్లను ఈసడించి తోసుకుపోయే రాజసంగాని, తామసంగాని పోతన్నకు అలవడలేదు. అది శ్రీనాధుని సొత్తు. ఈ పద్యమే పోతన్న సత్త్వమూర్తికి అద్దం పట్టింది. 'ఆయా సందర్భాలనుబట్టి అందరినీ మెప్పిస్తాను' అన్న మాటలో వినయం ఎంత మెత్తగా ఉందో, విశ్వాసం అంత వొత్తుగా ఉంది. భాగవతం చదివితే తెలుస్తుంది అతని సంస్కృతగుణం; అచ్చతెనుగుతనం.

తులసి మొక్క ప్రాధాన్యత!

తులసి మొక్క ప్రాధాన్యత !భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం. అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుత్ఛక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది. తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు. తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట. అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు. అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఏ మధ్యే దృవీకరించారు. మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం. తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు .


కవికుల గురువు – కాళిదాస మహా కవి !

కవికుల గురువు – కాళిదాస మహా కవి !


కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక పోయారు .ఐదవ శతాబ్ది వాడని అనుకుంటారు .అభిజ్ఞాన శాకుంతలం నాటకం తో విశ్వ వ్యాప్త కీర్తి నార్జించిన వాడు .ఉపమా కాళిదాసస్య అనే టాగ్ ఉన్న కవి .

కుమార సంభవ కావ్యం లో హిమాలయ సౌందర్యాన్ని అత్యద్భుతం గా కీర్తిన్చాడుకనుక హిమాలయ సానువులలో ఉండే వాడేమో నని కొందరి ఊహ .మేఘదూతం కావ్యం లో ఉజ్జయిని ని కమనీయం గ చెప్పాడుకనుక ఉజ్జయిన వాసుడని మరి కొందరి అభిప్రాయం .రఘు వంశ కావ్యం లో కలింగ రాజు హేమాన్గదుడి గురించి రాశాడు కనుక కలింగ వాసి అని ఇంకొందరి అనుమానం .లక్ష్మీధర కల్లా అనే పరిశోధకుడు వీరికి భిన్నం గా కాశ్మీరుకు చెందిన వాడని చెప్ప్పాడు .అధిక సంఖ్యాకుల మనోభావం ప్రకారం కాళిదాస మహాకవి ఉజ్జయిని ప్రాంతం వాడే .ఒక రాజ కుమారిని వివాహం చేసుకొని ,చదువేమి లేక పోవటం తో సవాలు గా కాళికా దేవిని ప్రసన్నం చేసుకొని నాలుక పై బీజాక్షరాలు రాయించుకొన్న అదృష్ట వంతుడు .దానితో ఆయన మహా కవిగా రూపు దాల్చాడనే కద అందరికి తెలిసిందే .శ్రీ లంక రాజు కుమార దాసును కలిశాడని అక్కడ జరిగిన కుట్రలో హత్య చేయబడ్డాడనే కధనమూ ఉంది .

కాని కాళిదాసుకాలం నాలుగవ శతాబ్దికి విక్రమాదిత్య మహా రాజు కాలం తో సరిపోతోందని కొందరు వాదిస్తే, కాదు అయిదవ శతాబ్దపు చంద్ర గుప్తుని సమకాలీనుడని మరి కొందరి వాదన .ఇదంతా శుద్ధ తప్పు క్రీ పూ.ఒకటవ శతాబ్దం లోని అప్పటిఉజ్జయిని పాలకుడు విక్రమాదిత్యుని కాలం వాడని అన్నారు మరింత వెనక్కి నెట్టేసి .,ఆధునికులు మాత్రం అయిదు ఆరు శతాబ్దికి చెందాడు అంటారు .634శిలాశాసనం ప్రకారం బారవి కాళిదాసు పేర్లు ఒకే చోట కనిపించాయి .ఈ శాసనం కర్నాటక లోని ఐహోల్ లో లభించింది .,కాళిదాస కాలం పై చర్చను వదిలేసి ఆ మహాకవి రచనా వైవిధ్యాన్ని సామర్ధ్యాన్ని గురించి తెలుసు కొందాం .

మహాకవి రాసిన అభిజ్ఞాన శాకుంతలం ,మాళవికాగ్ని మిత్రం ,విక్రమోర్వశీయం అనే మూడు నాటకాలలో అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచ ప్రసిద్ధ నాటకం గా గుర్తింపు పొందింది .జర్మనీ ఫిలాసఫర్ కవి విమర్శకుడు నాటక కర్త శాకుంతలాన్ని చదివి యెగిరి గంతేసి నాట్యం చేశడని ‘’దివిని భువిని ఏకం చేశాడు కాకాళి దాసు ‘’అని సంభ్రమాశ్చర్యాలతో ఆనంద బాష్పాలు కార్చాడని చెబుతారు .అంతటి కీర్తి పొందింది .ఇందులో నాలుగో అంకం నాలుగో శ్లోకం అన్నిటికంటే గొప్పది అనే పేరుంది కాన్వ మహర్షి పెంచిన కూతురు శకుంతలను అత్తవారింటికి పంపేటప్పుడు కాలి దాసు ఆయనతో అనిపించినా శ్లోకే ఇది పెంచిన తండ్రి తానె దుఖాన్ని ఆపుకోలేక పోతుంటే కానీ పెంచి పెళ్లి చేసి అత్త వారింటికి కూతుర్నిపంపించే తల్లిదండ్రుల మనోక్షోభ ఎంతటిదో అనే భావం ఇందులో ఉంది .వీరేశలింగం గారు ఈ నాటాకాన్ని తెలుగులో గొప్పగా అనువదించారు .మాళవికాగ్ని మిత్రం అంటే ఆ ఇద్దరి కదా .మాళవిక అనే ఒక దాసీ పై ప్రేమలో పడిన రాజు అగ్ని మిత్రుడి కద .రాణి గారికి వీరి ప్రేమాయణం తెలిసి దాసిని నిర్బందిస్తుంది .మాళవిక రాజ పుత్రికయే నని తెలుస్తుంది .రెండవది అభిజ్ఞాన శాకుంతలం .దీని కద అందరికి తెలిసిందే .మూడవది విక్రామోర్వశీయం –పురూరవ రాజు దేవతా స్త్రీ ఊర్వశి ల ప్రణయం ఇతి వృత్తం .వీరి ప్రేమ అనేక ఆటంకాలకు లోననై చివరికి ఇద్దరూ ఏకమై ఊర్వశి విజయ విక్రమ అవుతుంది .

కాళిదాస మహా కవి మహా కావ్యాలు కుమార సంభవం ,రఘువంశం .పార్వతి దేవిజననం శివునితో కల్యాణం తాటక సంహారం కోసం కుమారస్వామి ఆవిర్భావం కద కుమారా సంభవం .రఘు వంశ రాజుల చరిత్రను తెలిపేది రఘువంశం .ఈ రెండు కావ్యాలలో కాళిదాస ప్రతిభ బహుముఖీనం గా విస్తరించింది . గీర్వాణం అంటే దైవ స్వభావాన్ని పొందింది .వీటితో బాటు ఋతు ఘోష ,మేఘ దూతం అనే రెండు ఖండ కావ్యాలు రాశాడు కాళిదాసు భారత దేశ ఋతు వర్ణనను ప్రతిభా వంతం గా గా ఋతు ఘోషలో వర్ణించాడు .మేఘ దూతం లో మేఘాన్ని రాయ బారిగా ఒక యక్షుడు తన ప్రియురాలికి పంపిన సందేశాన్ని కవితాత్మకం గా దారిలో కనిపించే ప్రదేశాల వివరాలతో సహా రాశాడు .

కాళిదాసు కవితా ప్రతిభ

శృంగార రసాన్ని పిండి వడ బోశాడు కాళిదాసు .ఆయన దృష్టిలో ప్రపంచం రాగమయం గా దర్శన మిస్తుంది .వైదర్భీశైలి తో నాటకాలు రాశాడు .సులభ శైలిలోనే రాశాడు .ఆయన సూక్తులు రసమాదుర్యం తో తోణికిస లాడతాయి .శకుంతల సొందర్యమే కాళిదాసు కవితా సౌందర్యం ‘’అనాఘ్రాతమ్ పుష్పం కి.సలయ మలూనం కరరుహై –రానావిధం రత్నం మధునవ మనాస్వాదిత రసం –అఖండం పుణ్యానాం ఫల మివచ తద్రూప మనఘం ‘’.కవుల్లో అగ్రేసరుడు కాళిదాసు .దీన్ని ఒక కవి తమాషాగా చెప్పాడు ‘’కవులు ఎవరెవరు అని లెక్కించటానికి చిటికెన వేలుతో ప్రారంభిస్తే మొదటి వాడు కాళిదాసు రెండవ వాడు తగలనే లేదట అదీ ఆయన గొప్పతనం అంటాడు ..శాస్త్ర సంబంధ ఉపమానంకాలారాలు విరివిగా వాడాడు .

‘’తతో మందానిలోద్ధత కమలాకర శోభినా –గురుం నేత్ర సహ్శ్రేనా నోదయామాస వాసవః ‘’ఇంద్రుడు తనకున్న వెయ్యి కళ్ళతో గురువు బృహస్పతిని చూశాడట .ఆ కదలిక మెల్లని చల్లని గాలి చేత కమల వనం కదిలి నట్లు గా ఉందట. .మరో ఉపమాలంకారం –ఇందుమతీ స్వయం వరం లో రాజులు వరుసలో కూర్చున్నారు .ఆమె ఒక్కొక్కరిని చూస్తూ తిరస్కరిస్తూ వెడుతుంటే ప్రతివారికి తననే వరిస్తుందనే ఆశ తో ముఖం వెలిగింది .దాటిపోగానే ముఖాలు చిన్న బోయాయి .దీన్ని దీప శిఖ తో పోల్చాడు దీపం ముందుకు వెడుతుంటే వెనకాల చీకటిని వదిలి పెట్టటం సహజం కదా అలా ఉంది ఈ సీను .దీప శిఖా వర్ణన కాళిదాసు చాలా చోట్ల చేశాడు .దేని ప్రత్యేకత దానికి ఉంది .

ఉత్ప్రేక్ష లను ,అర్ధాంతర న్యాసాలను అర్ధవ వంతం గా వాడాడు .వాల్మీకి తర్వాత ప్రక్రుతి వర్ణనలకు కకాళిదాసుకే పేరు .ప్రకృతిని కవిత్వం లో చిత్రం గీసి చూపిస్తాడు .స్త్రీలను కోమలం గా వర్ణించాడు .వారికి ప్రత్యెక వ్యక్తిత్వం ఉంటుంది .సంవాదాలు నాటకీయం గా నడిపిస్తాడు .ఋతు సంహారం లో ఒక్కో సర్గలో ఒక్కో రుతువును వర్ణించాడు .మల్లినాద సూరి కాళిదాస కావ్యాలకు గొప్పగా టీకా తాత్పర్యాలు సంస్కృతం లో రాస్తే వేదం వెంకటరాయ శాస్త్రిగారు చక్కని తెలుగులో చెప్పారు .కాళిదాస రచనలు ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదం పొందాయి .కొందరు ఆంగ్ల కవి నాటక రచయితా షేక్స్ పియర్ తో కాళిదాసును పోలుస్తారుకాని కాళిదాసు ప్రతిభ ముందు ఆయన సరిపోలడని ఎక్కువ మంది అభిప్రాయం .కొందరి భావనలు చూద్దాం –ముందుగా గోతే ఏమన్నాడో గమనించండి –


Thursday, October 29, 2015

అసామాన్యుడు విశ్వనాథ.!

అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం. 

కొత్తదారి కనుక్కోవటం చాలా కశ్టమ్. కానీ, పాత దారిలో ప్రయాణిస్తూ,

ఆ దారిని కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు. 

అలాంటి అసామాన్యుడు విశ్వనాథ.

.

ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో 

అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని,

తక్కువ కులాలవారి పైన చులకనను, 

స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు.

అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి,

ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు.

మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు. 

కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్నారు.

చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు. 

క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని ఖండికలు రాసి, 

వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు.

కాబట్టి, విశ్వనాథను తిట్టటం మాని ఆయన సాహిత్యం గురించి. తెలుసుకుని, 

చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. 

.

x

అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి!

అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి!

.

ధర్మరాజుగారికో రోజున రోఖం కావలసివచ్చి వేళకు జతపడక భీమసేనుడిని కుబేరుడి దగ్గరకు పంపాడుట అప్పు తెమ్మని.

తీరా అతను అందాకా వెళ్ళి అడిగే సరికి కుబేరుడేమో మీ అన్న వడ్డీ ఇస్తాడా మరి అన్నాడట. రణరంగంలోనే తప్ప ఋణరంగంలో ప్రభావశాలిగాని భీముడు

ఠంగున జవాబివ్వలేక మళ్ళీ భూలోకం వచ్చేసి, అన్నా వినమని కధ చెప్పాడు.

వడ్జీ పుచ్చుకోకపోతే మనం అప్పు పుచ్చుకోము అని చెప్పు అని కబురంపాడు 

ధర్మరాజు ఎందుకైనా మంచిదని. 

కుబేరుడు అప్పు ఇచ్చాడు. వడ్డీ వద్దనీ అన్నాడు.

ఇది అప్పు ఇచ్చే వారి మీద బాగా పనిచేసే ట్రిక్కు....

.

ఋ మణుడు రాసిన ఋణోపదేశం అనే మహాసందేశాత్మక కథనుండి 

ఊరికే ఇలాటి ఋణట్రిక్కులు నేర్చుకుంటే ఫలించవని ఋమణు గురవుల ఉవాఛ.... 

ఇది మీకు చేర్చిన వాడికి కనీసం ఓ ఫైవు అప్పిచ్చి ఋణ రమణుడి ఋణం తీర్చుకోండి....

మీ కోసం

మీ ఋణోదయం


Wednesday, October 28, 2015

ఊహా సుందరి.!


ఊహా సుందరి.!
(నాది కాదు నెట్ లో దొరికింది.)

కలల్లోనే తిరుగుతూ కవ్వించే నా రాణి
కనుల ముందుకు వచ్చి వలపుల వర్షించదేమి?

ఊయల నడకలననుసరించు తన వాలుజడ
ఊహలలో నను ఎక్కించెను అందాల మేడ

మచ్చలేని జాబిలివంటి ఆమె వదనం
చూడగనె వెలవెల బోయెను ఆ నందనవనం

కలువల కంటగింపైన ఆ గాజుకనులు
నా కనులలో పుట్టించెను మెరుపుల చెమక్కులు

చెలినెపుడూ అంటిపెట్టుకు ఉండే వెండి నవ్వులు
రాల్చును ధరపై మేలిముత్యాల రాశులు

తన పెదవులపైనే తలదాచుకున్నఆ ఎరుపు
చూడగ ఆ గులబీలకు అసూయ గొలుపు

ఎన్నెన్నో అందాలు కలిగినది ఈ లోకం
దీన్ని మించినది తన అందమున్న ఆ ఊహాలొకం

వన్నె చిన్నెల నా చెలి దిగిరాగా ఈ లోకం
వెలవెలబోదామరి తానులేని ఆ కలలలోకం

జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.)

జరీ అంచు తెల్లచీర !

(రావిశాస్త్రి గారి కధ.)

.

జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి

పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి

గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా

ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను,

ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.

.

ఇది మెరుపు లేని మబ్బు

ఇది తెరిపి లేను ముసురు 

ఇది ఎంతకీ తగ్గని ఎండ

ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి ఇది గ్రీష్మం 

ఇది శిశిరం ఇది దగ్ధం చేసే దావానలం

.

ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండీ

ఒక్క జ రీ అం చు తె ల్ల చీ ర విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ, 

పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన

ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.


Tuesday, October 27, 2015

మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం !


మ " గుణింతంతో ఓ అందమైన కంద పద్యం !

.

మామా మోమౌ మామా
మామా! మి మ్మోమ్మో మామ మామా మేమా
మే మోమ్మము మి మై మే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ఈ పద్యానికి అర్థం చూద్దామా.
మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖము గల
మామా = మా యొక్క
మా = మేథ
మిమ్ము, ఒమ్ము = అనుకూలించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏమి+ఒమ్మము = ఏమి ఒప్పుకోము
మిమై = మీ శరీరము
మేము ఏమే = మేము మేమే
మమ్ము,ఓముము+ఓముము =కాపాడుము,కాపాడుము
ఇమ్ము+ఔము = అనుకూలమగుమా
చంద్రుని వంటి ముఖముగల దేవా! మా బుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలముగా నుండి మమ్ము కాపాడుమని అర్థం. ఏకాక్షర నిఘంటువులు చూస్తే కాని ఇలాంటి పద్యాలు అర్థం కావు.
కాని చదువుతుంటే సరదాగా ఉంటాయి.

x

నిగమ శర్మ అక్క !

నిగమ శర్మ అక్క !(ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.)

తెలుగు సాహిత్యంలో కొన్ని పాత్రలు అక్షర రూపాన్ని సంతరించుకున్నాయి. 

అలాటి పాత్రలలో నిగన శప్మ అక్కగారి పాత్ర చిరస్మరణీయం! 

తెనాలి రామకృష్ణుడా పాత్రను తీర్చిదిద్దిన విధానమట్టిది. 

ప్రబంధయుగంలో వెలసిన గ్రంధాలలో అపురూపమైనది పాండురంగ మాహాత్మ్యం.. 

నిగమ శర్మోపాఖ్యానము అందొక కథ.

పరమ నిష్ఠారిష్టుడును, మహాపండితుడును, శ్రోత్రియ బ్రాహ్మ ణోత్తముని కొమరునిగాృనిగమశర్మ యుదయిచయించెను.వేదాది సర్వ విద్యలను నేర్చెను.ఉపవీతుడైన యనంతరము వివాహితుడయ్యెను. 

విధివశమున వానికి దుర్జన సాంగత్యమలవడెను. దానివలనృసర్వభ్రష్ఠుడయ్యెను. జూదమాడుట,వ్యభిచరించుట, పానము, యిత్యాది సర్వదుర్గుణముల కేలిక యయ్యెను.

ఈవ్యసనములకు వలసిన ధనమునకై యింటనే చౌర్యమారంభించెను. 

మాన్యములను తెగనమ్మసాగెను."భ్రష్టస్య కావాగతిః" యనురీతిగా సంచరించుచుండెను. తల్లి యిదియంతయు నెరింగియు పుత్ర వ్్యామోహమున భర్త కెరిగింపకుండెను. వారి భ్రష్టాచారములు మితిమీరిన దశలో పాపమాగృహస్థునకు పుత్ునివిషయము,యితరులవన నెరింగెను.

ఆబ్రాహ్మణగృహస్తునకు అంతకుమున్నె యొక కుమార్తెగలదు. 

ఆమెయే నిగమశర్మయక్క! ఆమెకంతకుముందేృ పెండ్లియయినది.

పిల్లలుకూడా. అదిగో ఆమెమాటపై నిగమ శర్మకు అమితగౌరవమట! 

అందువలన అతనిని సరిదిద్దుటకు ఆమెను బిలిపించినారు.

పుట్టినింటి మమకారము పెనవైచుకొన్న నాయతివ యరుదెంచి,

తమ్ముని రాకకై యెదురు చూడసాగినది. రేయంతయు జూదమాడి, తెల్లవారువేళకు దొడ్డిగుమ్మము నుండి నిగమశర్మ గృహప్రవేశమొనరించినాడు. యెందుకు వచ్చెను? చద్దియన్నమును భుజించిపోవుటకు. వానియదృష్టము రావడమేతడవు అక్క కన్నులలో బడినాడు. ఆమెప్రేమగా నతనిని చేరబిలిచి కడుపునిండుగా కుడువబెట్టి,పసిబాలుడగు తనయెడ బిడ్డను యెత్తుకొన నిచ్చి, పసికూనను యొడిలోనిడుకొని చనుగుడుపుచు, తమ్మునకిట్లు ధర్మోపదేశముచేయ నుపక్రమించినది.

ఇక్కడ కవి యామెనోటివెంట బలికించిన మూడుపద్యములూ ఆణిముత్యములే! వినుడు-

శా: ప్రారంభించిన వేదపాఠములకున్ ప్రత్యూహ మౌనంచునో, 

యేరా!తమ్ముడ! నన్ను జూడఁజనుదేవెన్నాళ్ళనో నుండి?, చ 

క్షూరాజీవ యుగంబు వాచె నిన్ కన్గోకున్కి, నీబావయున్ 

నీరాకల్ మది గోరు "చంద్రు పొడపున్ నీరాకరంబున్బలెన్".

యేరా! తమ్ముడూ!యేమిటి? వేదపాఠములకు అంతరాయమౌతుందనాయేమి,,,యింతకాలమైనా మాయింటికే రావడంలేదు?( నీపనికిమాలిన పనులేవోనాకుతెలియదనుకున్నావా? అనివ్యంగ్యం)కన్నులురెండూ నీకోసంయెదురు చూసి వచిపోయాయిరా! నేనేకాదు మీబావగారుకూడా 'చంద్రునికోసం యెదురుచూచే సరోవరంలా,యెదురు చూస్తున్నారనుకో! 

యిక్కడ కవి మనయింట మామూలుగా యెలామాట్లాడుకుంటామో అలాగే రచించటం గొప్పవిషయం! యెంతైనా కవగదా చివర ఒక మెరపు నెరిపించాడు. నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్ నీరాకరంబున్వలెన్_- అంటూ 'నీరాక-నీరాక; ఛేకానుప్రాసము. యింక రెండవ పద్యం చూద్దాం! ఇందులో చేస్తున్న పనులకు నిగమశ్మకు మందలింపు,

శా: వీరావేశముఁదాల్చి సర్వ ధనమున్ వెచ్చింతు గాకేమి,! ము 

క్కారుంబండు నఖండ సేతువృతముల్ కాశ్మీరఖండంపు కే 

దారంబుల్ఁ దెగనమ్మగాఁజనునె? నిర్దారుండవే? వెన్క నె 

వ్వారున్ లేరె సహోదరాదులు? కులధ్వంసంబు నీకర్హమే?

ఈపద్యంలో తమ్మునిపైకోపం,అయ్యోవీడు పాడౌతున్నాడే అనేబాధ, సంస్కరించకపోతే యెలాగ అనేతపన, యిలాపుట్టింటి ఆడబిడ్డకు కలిగే ఆవేశ కావేశాలు అన్నీ కవిరంగరించి ముద్దగాచేశాడు. యీఆడబడుచేగాదు,పుట్టింటి బాగుగోరే యే ఆడబడుచైనా అలాగే ఆలోచిస్తుందనుకుంటావు. 

యేరా! వీరావేశంతో ఒళ్ళెరుగక, డబ్బంతా విచ్చలవిడిగా ఖర్చుచేస్తునావంట? ముక్కారు పంటలు పండే మాన్యాలను తెగనమ్ముతున్నావట? నీ వెనక పెళ్ళాంఉందిరా! ఆమెకేదిదారి. నీవెనుక నున్న మాగతేమిటి?తమ్ములున్నారుకదా వారిమాటేమిటి? యీవిధంగా కుల ధ్వంసం చేయటం నీకుతగునా? అని నిగ్గదీసింది. చివరకు నాకొంపలో యిలాపుట్టావేమిరా! అంటోంది.

శా: ెశ్రీ లాలిత్యము, నిత్య శుధ్ధియు, గుణోత్సకంబునున్ గల్గి, యు 

ద్వేల స్ఫూర్తి దలిర్చు, తండ్రి యను నబ్ధిన్ చంద్రుడైఁ దోచినన్ 

బోలుంగాక ,భవాదృశుండితరుఁడై కన్పట్టినన్ జెల్లువే? 

" సాల గ్రామ ఖనిన్ జనించునె గదా జాత్యల్ప పాషాణముల్";

మాయింట చెడఁబుట్టావురా! యెంత పవిత్రమైన వంశమిది.నీవలన పాడైపోయింది. నీతండ్రి సర్వసంపదలకు నెసవైనవాడు,మహానిష్ఠాగరిష్ఠుడు, సద్గుణ శీలుడు. ెఅట్టివానికడుపున నికృష్టుడవైననీవుజన్మించుట,పరమ పవిత్రమైన సాలగ్రామ శిలలు లభించుగనిలో పనికిరాని రాయివలె పుట్టినావుగదరా! యనుచున్నది. ఈపద్యమున కవి నిగమశర్న తంట్రికి సముద్రునితో పోలికను జెప్పినాడు.

సముద్రుడు లక్ష్మిని కుమార్తెగా లాలించినవాడు,(శ్రీలాలిత్యము)జలములకు నత్యశుధ్ధిగలదుగదా(అదేనిత్యశుధ్ధత) రత్నాకరుడు సముద్రుడు అదిగుణోత్సకత.;

నిగమ శర్మతండ్రి- డబ్బున్నవాడగుట,నిష్ఠాగకిష్ఠుడగుట, సద్గుణవంతుడగుట; వీరిద్దరిలో ఉద్వేల స్ఫూర్తియుగలదు, సముద్రంపరంగా యెత్తైన కెరటాలు, ని:తండ్రిపరంగా మంచిపేరు ప్రతిష్ఠలుకలిగి ఉండుట.

ఈవిధంగా తండ్రి సముద్రుడైతే, మరి కొడుకేంగావాలి? ఆసముద్రున కుదయించిన చంద్రుడు కావాలిగదా! వీడు అలాకాలేదు.పనికిమాలినవాడయ్యాడు. అదే ఆమెబాధ!

చూశారా మానవ మనస్తత్వాలను మధనంచేసితీసిన కావ్య సుధారసం! ఇదిగో ఇదండీ "పాండురంగ విభుని పద గుభనం! సెలవు స్వస్తి!


Monday, October 26, 2015

ముస్లిము చరిత్రలు


ముస్లిము చరిత్రలు

హిందూదేశమునందు చరిత్ర రచన మహమ్మదీయుల ఆగమనముతో ప్రారంభమయినది. మహమ్మదీయులకు చరిత్రాభిమానము మెండు; కావున వారు మొదటినుండియు చరిత్ర రచనకు పూనుకొని పెక్కు చరిత్ర గ్రంథములను రచించిరి; కాని అవి దేశ చరిత్రలు కావు; అవి యన్నియు మహమ్మదీయ రాజ్యముల యొక్కయు, మహమ్మదీయ రాజవంశముల యొక్కయు చరిత్రములు. కావున వానియందు ఆ రాజ్యములకును రాజవంశములకును సంబంధించిన విషయములు మాత్రమే వర్ణింపబడినవి. వానిలో దేశ ప్రజలనుగూర్చి కాని, హిందూ రాజ్యములను గూర్చికాని ప్రస్తావము ఉండదు. మరియు మతాభిమానము పెంపున మహమ్మదీయ చరిత్రకారులు హిందువులనుగూర్చి కాని, హిందూ రాజ్యములనుగూర్చి కాని విధిలేక చెప్పవలసివచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు చెప్పక, సత్యమును కప్పిపుచ్చి, తమ యాధిక్యమును స్థాపించుకొనుటకు విషయమును తారుమారు చేసి చెప్పుదురు; కావున ఆధునిక దృష్టితో దేశ చరిత్రము రచియించునప్పుడు వానియందలి విషయములను చక్కగ పరిశీలించి కైకొనుట యుక్తము. క్రీ. శ. 14 శతాబ్ద ప్రారంభమునుండియు దక్షిణ భారతమున మహమ్మదీయుల ప్రాబల్యము అధికము కాజొచ్చినది. అప్పటినుండియే మహమ్మదీయ చరిత్రలలో దక్షిణ హిందూ రాజ్యముల ప్రస్తావము కానవచ్చును. ఈ చరిత్రలలో సమకాలిక రచనములును, అర్వాచీన రచనములును కలవు.

మహమ్మదీయ చరిత్రకారులలో ప్రప్రథమమున పేర్కొనదగినవాడు అమీరు ఖుస్రూ. ఇతడు బహు మేధావి; మహాకవి, సంగీత విద్వాంసుడు. ఇతడు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ కాలమునుండి ఘియ్యాజుద్దీన్‌ తుఘ్లకు కాలము పర్యంతము ఢిల్లీ సుల్తానుల యాశ్రయమున వర్ధిల్లి పారశీక భాషలో పెక్కు కావ్యములను రచించుటయే కాక 'తారీఖ్‌-ఇ-ఆలై' అను నామాంతరము గల 'ఖజైన్‌-ఉల్‌-ఫుతూహ్‌', 'తుఘ్లక్‌ నామా' యను చరిత్రలను వ్రాసెను. ఇందు మొదటిది వచన రచన. అందే అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ యొక్క యాంధ్రదేశ దండయాత్రలును, తక్కిన దక్షిణ దిగ్విజయములును వర్ణింపబడినవి. ఈ చరిత్ర గ్రంథమునందే కాక అతనిచే విరచితమైన 'ఖిజ్ర్‌ఖాన్‌ వ దవల్‌ రాణీ', 'నూ సిపిహ్ర్‌' అను కావ్యములలోను ఖిల్జీ సుల్తానుల దక్షిణ దిగ్విజయములు అందందు సందర్భానుసారముగ వర్ణింపబడినవి.

ఇతని తరువాత చెప్పదగినవాడు ఈసామీ. ఇతడు బాల్యమున ముహమ్మద్‌ బిన్‌ తుఘ్లకు ఢిల్లీ నుండి రాజధానిని దౌలతాబాదుకు మార్చినపుడు దక్కనుకు వచ్చి యచ్చటనే స్థిరముగ నిలిచిపోయెను. ముహమ్మదు బిన్‌ తుఘ్లకుపై దక్షిణదేశములవారు తిరుగుబాటు కావించి స్వతంత్ర రాజ్యములు స్థాపించుకొనినపుడు ఇతడు దక్కనునందే యుండి, అచట అపుడు నడచిన చరిత్రాంశములను ప్రత్యక్షముగ చూచెను. క్రీ. శ. 1347 లో స్వతంత్రుడై గుల్బరగ రాజధానిగ బహమనీరాజ్యమును స్థాపించిన అల్లా ఉద్దీన్‌ హసన్‌ గంగూ బహ్మన్‌షాను ఆశ్రయించి అతని యాదర గౌరవములకు పాత్రుడై క్రీ. శ. 1349 వ సంవత్సరమున, 'ఫుతూహ్‌-ఉస్‌-సలాతీ' నను ఉత్తమోత్తమ పద్యచరిత్ర గ్రంథమును రచించి అతనికి అంకితమొసగెను. ఇతని చరిత్రలో ఒక యాంధ్రదేశమునందే కాక దక్షిణ భారతమున నడచిన చరిత్రాంశములు విపులముగ వర్ణితము లైనవి. ఇతడు మహమ్మదీయ చరిత్రకారు లందరిలో గరిష్ఠుడు. ఇతడు గాఢ మతాభిమానము గలవాడైనను సత్యముమీదనే దృష్టి అధికముగ కలవాడు. కావున ఇతడు రచించిన చరిత్ర అత్యంతము విశ్వాసపాత్రమైనది.

ఈసామీకి సమకాలికుడు జియా ఉద్దీ\న్‌ బరనీ అను మహమ్మదీయ చరిత్రకారుడు మరియొక డుండెను. ఇతడు మహమ్మదు బి\న్‌ తుఘ్లకు ఆస్థానమున ఉండెను. మొట్ట మొదటినుండి ముహమ్మదు బి\న్‌ తుఘ్లకు పర్యంతము ఢిల్లీని పాలించిన మహమ్మదీయరాజుల చరిత్రను ఇతడు 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను గ్రంథమున వివరించెను. బరనీకి మతాభిమానముతోపాటు జాత్యభిమానముగూడ గాఢమైనందువలన ఇతడు రచించిన చరిత్ర ఈసామీ గ్రంథమువలె పక్షపాతరహితమైనది కాదు. హిందువుల యెడలను, మహమ్మదీయమతము నవలంబించిన భారతీయుల యెడలను ఇతడు ద్వేషముకలవాడై సందర్భము చిక్కినపుడెల్ల వారిని దూరుచుండును. కావున ఇతని యభిప్రాయములను పరిశీలించి చూచి కైకొనుట యుక్తము.

బరనీ వలెనే 'తారీఖ్‌-ఇ-ఫిరోజ్‌షాహి' అను పేరుగల చరిత్రను వ్రాసిన చరిత్రకారుడు మరియొకడు కలడు. ఇతని పేరు షమ్స్‌-ఇ-సిరాజ్‌ ఆఫీఫ్‌. ఇతని చరిత్ర బరనీ గ్రంథమంత ఉపయుక్తమైనది కాదు; కాని ఇందు మరియెచ్చటను కానరాని చరిత్రాంశములు కొన్ని కలవు.

ఇతనితరువాత పేర్కొన దగినవాడు నిజామ్‌ ఉద్దీన్‌ అహమద్‌ బఖ్షి. ఇతడు ఢిల్లీయందు అక్బరుపాదుషా యాస్థానమునం దుండెను. ఇతడు చరిత్ర రచనయం దొక క్రొత్త దారిని తొక్కెను. పూర్వులగు భారతీయ మహమ్మదీయ చరిత్రకారులవలె ఢిల్లీ సుల్తానుల చరిత్రతో తృప్తి నొందక బంగాళ, మాళవ, గుజరాతు, దక్కను ప్రాంతములలో స్వతంత్రరాజ్యములను స్థాపించి పరిపాలించిన మహమ్మదీయ రాజవృత్తాంతములను కూడ వర్ణించి యున్నాడు. నేటివరకు లభ్యమైన బహ్మనీ మొదలగు దక్కను మహమ్మదీయ రాజవంశ చరిత్రలలో నెల్ల నిజాముద్దీ\న్‌ అహమదుచే విరచితమైన 'తబకాత్‌-ఇ-అక్బరీ' లోని గ్రంథభాగమే ప్రాచీనతమ మైనది. అర్వాచీన మహమ్మదీయ చరిత్రకారులలో పెక్కండ్రు నిజామ్‌ ఉద్దీ\న్‌ అహమదు మార్గమును అవలంబించి విపులమైన చరిత్రలను రచించిరి. కాని మహమ్మదీయ చరిత్రలలో నిజామ్‌ ఉద్దీ\న్‌ రచనకు కొంత ప్రత్యేకత కలదు.

నిజామ్‌ ఉద్దీ\న్‌ యొక్క పద్ధతి ననుసరించి చరిత్రను వ్రాసిన రచయితలలోనెల్ల ముహమ్మదు కాసిం హిందూషా ఫెరిస్తా సుప్రసిద్ధుడు. ఇతడు హిందూదేశమునందు మహమ్మదీయుల అభ్యుదయమును వర్ణించుచు ఒకగొప్ప చరిత్ర గ్రంథమును వ్రాసెను. ఇది 'తారీఖ్‌-ఇ-ఫెరిస్తా' అనుపేర వాసికెక్కినది. ఫెరిస్తా దక్కను వాస్తవ్యుడు; మొదట నిజాంశాహి సంస్థానమును ఆశ్రయించి కొంత కాలము అతడు అహమదునగరమున నివసించి యుండెను. తరువాత అతడు విజాపురమునకు వచ్చి అచట ఆదిల్‌ శాహి ప్రభువులను ఆశ్రయించి వారి యనుగ్రహమునకు పాత్రుడై చరిత్ర రచన సాగించెను. భరతఖండమునందు ప్రభుత్వము సల్పిన మహమ్మదీయ రాజవంశము లన్నింటి వృత్తాంతమును ఫెరిస్తా తాను రచించిన చరిత్రమున వర్ణించి యున్నను దక్కను రాజవంశములను, అందును ముఖ్యముగ బహ్మనీ, ఆదిల్‌శాహీ, నిజామ్‌శాహీలను గూర్చి విస్తరించి చెప్పుట వలన అది దక్కను మహమ్మదీయ రాజ్యముల చరిత్రగనే ప్రసిద్ధిచెందినది; కాని ఫెరిస్తాకు స్వమతాభిమానముతో కూడ తనకు ఆశ్రయ మొసగిన ఆదిల్‌శాహీలపై ఆదర మధికమగుటవలన అతడు తరచుగా చరిత్రాంశములను విడిచిపెట్టియు, తారుమారు చేసియు సత్యమును కప్పిపుచ్చి యున్నాడు; కావున అతని చరిత్ర విశ్వాసపాత్రమైనది కాదు. అతని వ్రాతల లోని విషయములు ఇతర చరిత్రాధారములవల్ల రుజువైన కాని అంగీకార్యములు కావు.

ఫెరిస్తా అనంతరము వెలసిన మహమ్మదీయ చరిత్ర కారులలోనెల్ల ఖాఫీఖాను ముఖ్యుడు. ఖాఫీ యనునది అతని వాస్తవ నామము కాదు. అతడు మొగలాయి చక్రవర్తియగు ఔరంగజేబు కొలువులోని యుద్యోగి. ఆ చక్రవర్తి తన చరిత్ర ఎవ్వరును వ్రాయగూడదని శాసింపగా ఇతడు తాను రచించిన చరిత్రను గుప్తముగ దాచియుంచెను. తత్కారణముగ ఇతనికి (ఖాఫీ) దాచి పెట్టిన ఖానుడని పేరు కల్గెనని చెప్పుదురు. ఇతడు తనకు ముందు నడచిన చరిత్రను పూర్వచరిత్రలను ఆధారపరచుకొని వ్రాసెను. దక్కను విషయమున ఇతడు ఫెరిస్తా చరిత్రను అనుసరించినను అందందు ఫెరిస్తా వ్రాతకు విరుద్ధములైన అన్యగ్రంథములలోని చరిత్రాంశములను ఉదాహరించి యున్నాడు. తన కాలమున జరిగిన చరిత్రను మతాభిమాన దృష్టితో కాక యథాతథముగ వర్ణించి సత్యమును తెలిపి యున్నాడు. కావున ఇతని రచన అత్యంతము విశ్వాసపాత్రమని ఆధునిక చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.

పైన చెప్పిన వారివలె హిందూస్థాన చరిత్రలను వ్రాయక మరికొందరు మహమ్మదీయ చరిత్రకారులు ప్రాంతీయ మహమ్మదీయ రాజ్యములనుగూర్చి గ్రంథములను వ్రాసిరి. వారిలో ముఖ్యుడు సయ్యద్‌ ఆలీ తబాతబా అను నతడు. ఇతడు నిజామ్‌శాహి సంస్థానమును ఆశ్రయించుకొని రెండవ బుర్హా\న్‌ నిజామ్‌శాహి కాలములో అహమదు నగరమునందు నివసించుచు బహ్మనీ సుల్తానులను గూర్చియు, నిజాంశాహి వంశజులను గూర్చియు 'బుర్హా\న్‌-ఇ-మ అసీ'రను చరిత్ర గ్రంథమును వ్రాసి ప్రకటించెను. సయ్యద్‌ ఆలీ తబాతబా ఫెరిస్తాకు సమకాలీనుడు. హిందువులపై ద్వేషమునందు ఇతడు ఫెరిస్తాకు పైమెట్టు; కాని ఫెరిస్తా గ్రంథము కంటె ఇతనిదే విశ్వాసపాత్రమని చరిత్ర పరిశోధకుల యభిప్రాయము.

ఇట్లే ఆదిల్‌శాహి, కుతుబ్‌శాహి వంశ చరిత్రలను వర్ణించిన రచయితలును కలరు. ఇబ్రాహీం ౙబీరీ యను నతడు 'బుసాతీన్‌-ఉస్‌-సలాతీన్‌' అను గ్రంథమునను ౙహూర్‌ ౙహూరీ యను నతడు 'ముహమ్మద్‌ నామా' యందును విజాపుర సుల్తానుల చరిత్రమును వర్ణించి యున్నారు. అజ్ఞాతనామధేయుడగు చరిత్రకారు డొకడు 'తారీఖ్‌-ఇ-ముహమ్మద్‌ కుల్లీ కుతుబ్‌శాహి' అను గ్రంథమున కుతుబ్‌శాహీల చరిత్రమును వర్ణించి యున్నాడు. మరియొకడు 'హదీకత్‌-ఉల్‌-ఆలమ్‌' అను గ్రంథమున ఈ వంశజుల చరిత్రమును కడపటి కుతుబ్‌శాహి సుల్తానగు తానాశాహ పతనమువరకును వివరించి యున్నాడు. ఈ మహమ్మదీయ చరిత్రలయం దాయా రాజ్యములను ఏలిన సుల్తానుల చరిత్రలే కాక ఇరుగు పొరుగుల తెలుగు రాజ్యములకు సంబంధించిన విషయములును ప్రస్తావవశమున వర్ణింపబడి యుండుట వలన ఇవి తెలుగుదేశ ప్రాచీన చరిత్ర రచనకు మిక్కిలి ఉపయుక్తము లగు చున్నవి.

పాకుడురాళ్ళు!

పాకుడురాళ్ళు!
.
పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు.
భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు.
అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు.
ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి.[ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.
.
సినిమా ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి. ఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. అనాటి కాలంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశాడు రచయిత రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు నవల,
కేవలం మంజరిగా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా.
ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి
కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బెదిరించి పబ్బం గడుపుకునే సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.
.
క థా స్థలం గుంటూరు సమీపంలో ఓ పల్లెటూరు. కథా కాలం పద్య నాటకాలు అంతరించి, సాంఘిక నాటకాలు అంతగా ఊపందుకోని రోజులు. నాటకాలంటే ఆసక్తి ఉన్న మాధవరావు, రామచంద్రం కలిసి 'నవ్యాంధ్ర కళామండలి' ప్రారంభించి, సాంఘిక నాటకాలు ప్రదర్శించాలి అనుకుంటారు. వాళ్ళ నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడం కోసం వస్తుంది పదిహేనేళ్ళ మంగమ్మ. బళ్ళారి రాఘవ ట్రూపులో పనిచేశానని చెప్పుకునే నాగమణి పోషణలో ఉంటుంది మంగమ్మ. అప్పటికే మంగమ్మ మీద సంపాదన ప్రారంభించిన నాగమణి, నాటకాల్లో అయితే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చునని ఈ మార్గం ఎంచుకుంటుంది. మాధవరావు-రామచంద్రం తర్ఫీదులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది మంగమ్మ. కళామండలి కి మంచి పేరు రావడంతో, నాగమణి కి కొంత మొత్తం చెల్లించి మంగమ్మని చెర విడిపిస్తారు మిత్రులిద్దరూ.
కొంతకాలానికి కళామండలి మూతపడే పరిస్థితి వస్తుంది. మంగమ్మ, నాగమణి 'కంపెనీ' కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పాత మిత్రుడు చలపతి తనో సినిమా తీస్తున్నాననీ, మంగమ్మ అందులో నాయిక అనీ చెప్పి ఆమెని మద్రాసు తీసుకెడతాడు. చలపతి సినిమా తీయకపోయినా, మంగమ్మకి వేషాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. స్వతహాగా తెలివైనదీ, మగవాళ్ళని కాచి వడపోసినదీ అయిన మంగమ్మ సైతం -మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సినిమా హీరోయిన్ల వైభవం, ఐశ్వర్యం చూశాక తనుకూడా హీరోయిన్ కావాల్సిందే అని నిర్ణయించుకుని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో, ఓ సిద్ధాంతి సూచన మేరకు తన పేరు మంజరి గా మార్చుకుంటుంది. వేషాలు రానప్పుడూ, చివరివరకూ వచ్చి జారిపోయినప్పుడూ మంజరి నిర్ణయం మరింత పదునెక్కుతూ ఉంటుంది.
మెల్లగా అవకాశాలు సంపాదించుకుని, నాయికగా పేరు తెచ్చుకుని తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి నాయిక అవుతుంది మంజరి. అనుకున్నది సాధించాక ప్రపంచాన్ని లెక్కచెయ్యదు మంజరి. చలపతిని కేవలం ఓ సెక్రటరీగా మాత్రమే చూస్తుంది. నిర్మాతలని అక్షరాలా ఆడిస్తుంది. అయితే, తనని తీర్చిదిద్దిన మాధవరావు-రామచంద్రం మీద, కష్టకాలంలో తనని ఆదుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. అగ్రహీరోలతో కయ్యం పెట్టుకుని, దానివల్ల తనకి పోటీగా మరో నాయిక తయారవుతున్నప్పుడు కయ్యాన్ని నెయ్యంగా మార్చుకున్నా, తనని సినిమా నుంచి తీసేయాలని ప్రయత్నించిన నిర్మాతకి ఊహించని విధంగా షాక్ ఇచ్చినా మంజరికి మంజరే సాటి అనిపిస్తుంది. గుర్రాప్పందాల మీద లక్షలు నష్టపోయినా కొంచం కూడా బాధ పడదు కానీ, ఎవరన్నా డొనేషన్ అంటూ వస్తే రెండో ఆలోచన లేకుండా తిప్పి పంపేసి మళ్ళీ రావొద్దని కచ్చితంగా చెప్పేస్తుంది. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే, హిందీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది మంజరి. ఇందుకోసం తన కాంటాక్ట్స్ ని తెలివిగా వాడుకుంటుంది. భారదేశం తరపున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళిన తొలి తెలుగు నటి మంజరి. అక్కడ మార్లిన్ మన్రో ని కలుసుకున్న మంజరి, సిని నాయికలందరి జీవితాలూ ఒకేలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటుంది.x

Sunday, October 25, 2015

కల భాషిణి యంద చందాలు!

కల భాషిణి యంద చందాలు! 

ప్రబంధయుగంలో కవులు ఒకరినిమించినవారు మరొకరు.హేమాహేమీలు. వారిలో పింగళిసూరనయొకడు.

.

కలభాషిణి సూరన సృష్టించిన యొక యందారభరణి! 

విటజనహృదయమనోహారిణి. ద్వారకా నగరమునందలి యొకవేశ్య! 

ఆపాత్రను కళాపూర్ణోదయంలో పరిచయంచేస్తూ,కవియీపద్యంవ్రాశాడు.

దీన్ని చదువుకొని తరువాత తీరికగా ఆమెయందం యెంతమనోహరమైనదో ఊహించుకోండి అంటాడుకవిగారు. 

మరిమీరు వింటారా ఆపద్యం? యిదిగో-

ఉ: కూకటి వేణితో కురులు కూడకమున్నె, కుచ ప్రరోహముల్

పోకల తోటి సామ్యమును పొందకమున్నె, నితంబ సీమకున్ 

వ్రేకఁ దనంబొకింత ప్రభవింపక మున్నె, బ్రసూనబాణు డ 

ర్రాకల బెట్టె, దా నరవ నామెత బాలికకై విటావళిన్;

బాల్యం గడచి యవ్వనంలో అడుగు మోపక మున్నే విటజనాన్ని 

ఆకలభాషిణీ సౌందర్యం కలవర పరుస్తోన్నదట! వెలయాలుగదా యెవరికి వారు ముందుగా నామెపొందుకోసం తపన పడుతున్నారట. యింతకీ ఆమెపరిస్థితి యేమిటీ? అనేప్రశ్నకు కవి చెప్పే సమాధానమే యీపద్యం!

" ఆమెశిరోజములు సిగను చుట్టుకొనుటకు తగినరీతిగాలేవట. చూచుకములా(చనుమొనలు) పోకలయమతైనాలేవట! స్తనములేపుగా పెరుగ లేదని చెప్పుట. పిరుదులు విశాలముగా నెదుగలేదట! సామాన్యముగా వయస్సువస్తోన్న ఆడపిల్లకు కచ, కుచ,, జఘన, విజృంభణం సహజం. కానీ యీమెవిషయంలో అవేనీలేకపోయినా, మన్మధుడు విటజనహృదయాన్ని కొల్లగొడుతున్నాడంటే, మరి యామె యెంత అందంగా ఉన్నదో మీరేఊహించుకోండి!!! 

అంటాడు.

ప్రబంధాలు అపురూప కవితాకళాఖండాలు.చదవండి .అడుగడుగునా రసధునులే!


Saturday, October 24, 2015

దసరా పద్యాలు!


దసరా పద్యాలు!

.

దేవీ నవరాత్రులను దసరా పండగలుగా పిలుస్తారు. పూర్వపు రోజుల్లో దసరా సెలవలప్పుడు ఉపాధ్యాయులు తమ తమ పాఠశాలలో చదువుకునే బాల బాలికలను వెంటబెట్టుకుని గ్రామం లోని ఇంటింటికీ వెళ్ళే వారు, గృహస్తులను ఆశీర్వదంచేవాళ్ళు..

పిల్లలు కొత్త బట్టలు వేసుకుని చేతుల్లో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళే వారు. ఈ అంబులను గిలకలు అంటారు. వీటిని సంధించి వదిలితే, ఎదుటి వారి మీద పూలూ ఆకులు పడేవి. బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు, పద్యాలు పాడేవారు. వీటినే దసరా పద్యాలు అంటారు. దసరా పద్యాలు చాలా సులభంగా, వీనులకు విందుగా ఉంటాయి. మచ్చుకు కొన్ని పద్యాలు చూడండి

పద్యం 1

ఏ దయా మీ దయా మా మీద లేదు,

ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు,

దసరాకు వస్తిమనీ విసవిసలు పడక

చేతిలో లేదనక అప్పివ్వరనక

పావలా.. .అర్ధయితే ...పట్టేది లేదు,

ముప్పావలా అయితే ముట్టేది లేదు,

హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము,

అయ్య వారికి చాలు ఐదు వరహాలు

పిల్ల వారికి చాలు పప్పు బెల్లాలు

జయీభవా...దిగ్విజయీభవా

పద్యం 2

రాజాధిరాజ శ్రీ రాజ మహరాజ

రాజ తేజోనిధీ రాజ కందర్ప

రాజకంటీరవా రాజ మార్తాండ

రాజ రత్నాకరా రాజకుల తిలక

రాజ విద్య్త్సభా రంజన మనోజ

రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస

సుజన మనోధీశ సూర్య ప్రకాశ

నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ

ప్రకటిత రిపు భంగ పరమాత్మ రంగ

వర శిరో మాణిక్య వాణి సద్వాక్య

పరహిత మది చిత్ర పావన చరిత్ర

ఉభయ విద్యా ధుర్య ఉద్యోగ ధుర్య

వివిధ సద్గుణ ధామ విభవాభిరామ

జయీభవా...దిగ్విజయీభవా

ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై

పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాకారమై

సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై

వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా

మన్మధ పూజావిధానం! (ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.)

మన్మధ పూజావిధానం! 

(ఆచార్య చొప్పకట్ల సత్యనారయణ గారు.)

ఆంధ్ర ప్రబంధాలలో మన్మధోపాలంభనం విన్నాం.చూశాం.కానీ మన్మధ పూజావిధానం గురించి యెవ్వరూ ప్రస్తావించలేదు. ఆలోటు తీర్చనెంచారు కాబోలు ,మన రామరాజ భూషణుడు వారివసుచరిత్రలో మన్మధపూజను సాంగోపాంగంగా కావ్యనాయిక గిరికచే నిర్వహింపజేశారు. అపూర్వమైన ఆవిశేషాన్ని మీముందుంచాలని నాయీ ప్రయత్నం.సమాహితులై చిత్తగించండి!

గిరిక వసురాజును ప్రధమపరిచయంలోనే ప్రేమిస్తుంది. ఆయనేమో వచ్చినట్లేవచ్చి ఆమెచ్తిత్తంలో ముద్రవైచి రాజధానికి వెడలిపోయాడు. అక్కటితోఃఆమెకు విరహం ప్రారంభమయ్యింది. ఉపశమనంకోసం వన విహారానికి వెళుతుంది. ఆవసంతశోభలు, ఆమలయమారుతం, వగైరా వగైరా ఆమెబాధను మరింతగా పెంచుతాయి. దాంతో చెలికత్తెలు కర్తవ్యోపదేశంచేశారు. మన్మధపూజ చేయమని. అందుకామె యుపక్రమించింది.

ఉ: గొజ్జగి మంచునం దడిపిఁగూర్చిన పుప్పొడి తిన్నెమీద, లా 

మజ్జక కాయమాన లసమాన విమానముక్రింద నొక్క పూ 

సెజ్జ ఘటించి, యందొక కుశేశయ కర్ణిక నుంచి, యందు సం 

పజ్జలజేక్షణాసుతుని భావమువ్రాసి ,కురంగనాభికన్;

పూజకు కావలసిన యేర్పాట్లు చేశారు.యిలా! మంచుతోగూడిన గులాబీలనీటితో(పన్నీటితో)పుప్పొడితడిపి, పూజావేదిక తయారు చేసి, దానిపై వట్టివేళ్ళతో పందిరి వేసి, ఆవేదికపై నొక పూసెజ్జను అమర్చి, దానిపై నొకతామర బొడ్డు నుంచి, దానిపై మన్మధునిరేఖాచిత్రమును కస్తురితో లిఖించి దానిని పూజాస్థానమున నుంచినారు.

మన్మధుడు సాంగ సపరివార పత్నీ మిత్ర సమేతుడైయుండాలిగదా!

తే: అతని వామాంకమున రతినావహించి , 

మ్రోల నుడురాజు ఋతురాజుఁ గీలు కొలిపి, 

క్రేవల సగంధపవన కోకిల మరాళ 

కీర సారంగముల వ్రాసి, చేరిృచెలులు;

అతని యెడమవైపు రతీదేవిని,ప్రక్కలయందు వసంత చంద్రులను, అటుప్రక్కన మలయమారుతమును, కోకిలములను,హంసలను,చిలుకలను,తుమ్మెదలను, పొందుపరిచారట! అక్కడ నుండి ఆవాహనతో ప్రారంభమైనపూజ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. వారి మంత్రాలు వినితీర వలసినదే!

కం: కామ! కమలాస్త్ర! కమలా 

కాముకసుత! కామనియక నిధీ! యనుచున్ 

కోమలులు విన్నవించిరి 

కోమల కూకూయ మాన కోకిల ఫణితిన్!

యెలకోయిలలు గొతెత్తికూసినట్లున్నదట!వారిమంత్రోఛ్ఛారణ. కోియిల ఆయన పరివారంగదా!అందుకు.వయస్సులోఉన్న ఆడపిల్లల కంఠంఅలాఉంటే బాగుంటుందని వ్యగ్యం!

స్వామీ వసంతుడు నీపరివారంలోవాడు, కోకిలలా నీకాహళులు.యిక్కడున్న పత్రం ,పుష్పం ఫలం,మొదలగునవి యన్నీ నీవే! యికనీకేమియవ్వగలం? శీతాంశునకు అమృతార్పణ మనునట్టు, నీదేనీకీయక తప్పదు స్వీకరించి యనుగ్రహింపుమని ప్రార్ధనాపూర్వక నమస్కారముతో పూజముగించినారు.

ఇదీ మన్మధపూజా విధాన కథ!

నేను మనిషిని...

నేను మనిషిని... 


-నాని 

నేను మనిషిని... 


కొన్ని కోట్ల వీర్యకణాలను గెలిచి అమ్మ కడుపులో చోటు సంపాదించుకున్నవాడిని... 

వెచ్చని గదిలో నవమాసాలు విశ్రాంతి తీసుకొని పుడుతూనే ఏడ్చిన అమాయకుడిని... 

పలకా బలపం చేతబట్టుకుని వేళ్ళు అరిగేలా శ్రమించే విద్యార్ధిని... 


నేను మనిషిని... 


అమ్మ మీద ప్రేమ, నాన్నంటే భయం సమపాళం లో కలిగి ఉన్న మిశ్రమాన్ని... 

అంతులేని ఆశలకు, అవధుల్లేని ఆలోచనలకు ఎల్లప్పుడూ ఆశ్రయమిచ్చే ఆశ్రమాన్ని... 

ఆనందం,బాధ అనే రెండు కత్తులనూ హృదయమనే ఒకే ఓర లో సర్దిపెట్టుకోగల సమర్ధుదిని... 


నేను మనిషిని... 


నింగీ నేల కలవనివని తెలిసినా కలిసినట్టు చూపించే కళ్ళచేత మోసపోయే వెర్రివాడిని... 

సమస్థ ప్రపంచాన్నీ ఐదంగుళాల వస్తువులో పెట్టి జేబులో వేసుకొని తిరిగే బుధ్ధిశాలిని... 

కొన్ని విషయాలు తప్పని తెలిసినా తప్పక చేసే అశక్తుడిని... 


నేను మనిషిని... 


ఏరి కోరి వచ్చిన కన్నెపిల్లలో కన్నతల్లిని చూసుకుని మురిసిపోయే పసివాడిని... 

భగవంతుడిచ్చిన రోజులో సగం ఉద్యోగానికీ సగం కుటుంబానికీ ప్రతి రోజూ పంచే త్యాగజీవిని... 

జనన మరణాల మధ్య బ్రతుకు పడవలో పయనిస్తూ అనేక సుడిగుండాలకు సమాధానం చెప్పే నావికుడిని...

Friday, October 23, 2015

పండితారాధ్య చరిత్రము.!...... (పాల్కురికి సోమనాథుఁ డు)


పండితారాధ్య చరిత్రము.!
(పాల్కురికి సోమనాథుఁ డు)
.
పండితారాధ్య చరిత్రము లో యక్షగానము లన్నపేరుగల
దృశ్యరచనలు వర్ణిస్తోపాల్కురికి సోమనాథుఁ డిట్లు చెప్పినాడు:
....
"భ్రమరులు జాళెముల్‌ బయనముల్‌ మెఱసి
రమణఁ బంచాంగపేరణి యాడువారు
ప్రమథపురాతన పటుచరిత్రములు
క్రమమొంద బహునాటకము లాడువారు
లలితాంగ రసకళాలంకారరేఖ
లలవడ బహురూప మాడెడువారు
* * *
అమరాంగనలు దివి నాడెడు మాడ్కి
నమరంగ గడలపై నాడెడువారు
ఆ వియద్గతి యక్షులాడెడు నట్టి
భావన మ్రోకులపై నాడువారు
భారతాది కథలు చీరమఱుఁగుల
నారంగ బొమ్మల నాడించువారు
కడు నద్భుతంబుగఁ గంభసూత్రంబు
లడరంగ బొమ్మల నాడించువారు
నాదట గంధర్వ యక్షవిద్యాధ
రాదులై పాత్రల నాడించువారు"

 

తెనాలి వారి కవితా విన్యాసం! ________________________


తెనాలి వారి కవితా విన్యాసం!
________________________

విన్నవేయైనా కొన్ని మరల మరల వినాలనిపిస్తుంది. అందులో మనవికటకవి తెనాలి రామకృష్ణుని కవితా విన్యాస మొకటి. వెనక రాజులూ రాజ్యాలూ ఉండేవి.కళాపోషణ కారణంగానో, లేక సాహిత్యాభిమానమో గాని, యానాటి రాజులు కవి, పండడిత పోషణం చేస్తూఉండేవారు.కొందరుకవులు,పండితులు యెవరో యొకప్రభువునాశ్రించి వారికొల్వులో ఉండేవారు.మరికొందరు అలాకాక నానారాజ సందర్శనంచచేస్తూ వారిసత్కార మందుతూ తమ సాహిత్య జైత్రయాత్ర కొనసాగించేవారు. అలాంటివారితోనే అప్పుడప్పుడు చిక్కుల్రేర్పడుతూ ెఉండేవి.అహంకార పూరితులై విర్రవీగే కవిపండితులకు,అప్పుడప్పుడు శృంగభంగం జరుగుతూెఉండేది.

అలాంటి సంఘటనే యొకసారి రాయల సభలో జరిగింది. దానిని వారెలా యెదుర్కొన్నారో మన మిప్పుడు తెలిసికొందాం. "ప్రగడ రాజు నరసరాజనే" గొప్ప పండితుడు ఒకనాడు రాాయల సభకు వచ్చాడు.రాయలకు నమస్కరించి,"ప్రెభూ నేనెరుగని గ్రంధములేదు, యేపద్యమునకైనను సునాయాసముగా నర్ధమును జెప్పగలను. మీయాస్థానమున పెద్దనాది కవీంద్రులు కలరుగదా వారెవరైన నాతో వాదముచేయగలరా?లేనిచోృజయ పత్రమిప్పించుడు" అనిపలికెను. అంత రాయలు తెనాలిివారివంక జూచి కన్నుగీటెను. అంతే మన వికటకవిలేచి విజృభించెను. " నరసరాజా! పెద్దలు వారిదాకాయెందుకు? ముందు నన్నుగెల్వజాలిన నాపై వారి విషయమును జూచికొనవచ్చును. ఏమీ తామెరుంగవిగ్రంధములేదా?మాయొద్దనొకగ్రంధమున్నది.*దానినిప్పుడే దంప్పింతును ."అనిసేవకులకేదోఞచెప్పిపంపెను.వారొక పల్లకీలో నొకగ్రంధమును చీనాంబరమున గప్పి దెచ్చిరి. " అయ్యాగ్రంధమువచ్చివది. దీనిపేరు మీరెరుగుదురేమో చెప్పుడు.ఆపైగ్రంధవివరణ మొనర్పవచ్చుననెను." గ్రంధముపేరడుగ ' తిలకాష్ఠ మహిషబంధనము ' అనిచెప్ప నాపండితుడు దిక్కులుచూడసాగెను.

సరే అయినదిగదా యీ గ్రంధముపేరైనను తమరెరుంగరు. ఇక దానివివరములేమి చెప్పగలరు? ఇకమీరేదైనాృపద్యమునకు సునాయాసముగా నర్ధమును చెప్పగలననిగదాయనినారు. యేదీ తమరీపద్యమునకు అర్ధమును దెల్పుడు?

సీ: మేకతోకకుమేక తోకమేకాతోక
తోకమేకకుతోక మేకతోక;
మేకతోకకుమేక తోకనేకామేక
తోకమేకకుమేక తోకమేక;
మేకతోకకుమేక మేకతోకామేక
మేకతోకామేక మేకతోక;
మేకతోకకుమేక మేకతోకామేక
మేకతోకామేకృ మేకతోక;

గీ: మేకమెకనేకతొకతోక మేకమేక
మేక మెకనేక తొకతోక మేక మేక
మేక మెకమేక తొకతోక మేకమేక
మేకమెకమేక తొకతోక మేక మేక;

అయ్యా!యిదీ పద్యం. అర్ధంసెలవియ్యండీ! అన్నాడు.పాపం! లౌక్మం తెలియనియాపమడితుడు తెల్లబోయాడు.యేంచెయ్యాలో తెలియక చేతులు జోడించాడు." ెఓహో!యిదేనా తమపాండిత్యం?ఇంతమాత్రానికే యింతమిడిసిపాటా? నీవేమి పండితుడవయ్యా!

" తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్మునన్
పలుకగరాదు రోరి పలుమార్లు, పిశాచపు పాడిగట్ట! నీ
పలికిన నోట దుమ్ముపడ;! భావ్యమెరుంగగ నేర వైతి పె
ద్దలనిరసింతువా? ప్రగడ రాణ్ణరసా!విరసా!తుసా! బుసా!

అనియెక పద్యంతో రామకృష్ణుడాతవిదుమ్ముదులిపాడు". పండితుని దురవస్థగాంచి రాయలు దయతో కొంతద్రవ్యమొసంగిపంపెను.నాటి సభముగియనున్నది. రాయలవారడిగినారు" తెనాలివారూ యేదాగ్రంధము?యిటుదెప్పింపుడు? మేమును ఇంతవరకాగ్రంధమును వినలేదు కనలేదు" అనిపలుక దానిదేమున్నది,చూడుడని,పల్లకీలో దుకూలమును దొలగించి కొన్ని నువ్వుకట్టెలను, గేదెనుగట్టు పలుపుత్రాడును దెచ్చిరాయల ముందుంచెను. యిదియేమనియడుగ" యివితిలకాష్ఠములు- అదిమహిషబంధనము." అనినాడు.రాయలవారు ఔరాయనివిస్తుబోయినారు.

ఇక తెనాలి వారు చెప్పిన పద్యార్ధమును వివరింపుమన" అందేమున్నదిప్రభూ!మేకలమందయే! ఒకదానివెనుక నొకటిగా బేవుచున్నవనెను. తెనాలివారి సమయస్ఫూర్తికి,తెలివితేటలకు రాయలబ్బురపడి యఖండ సన్మానమొనరిమచెనట!
ఇదీ తెనాలి రామకృష్ణుని కవితా విన్యాసములలోృనొకటి!

సుగ్రీవవిజయము యక్షగానము ... ( పీఠిక- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి)


సుగ్రీవవిజయము యక్షగానము ...
( పీఠిక- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి)
.

శ్రీమద్రామాయణమునఁ గల కథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్ప కాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుఁడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అను కథాపాత్రముల శీలపు మేలిమినొఱసి మెఱుఁగు తఱుగులు చూపిన యొఱగల్లనఁ దగినది.

తెలుగున గుత్తెనదీవిరామాయణాదు లగు రామాయణ గేయకృతులలో నీసుగ్రీవవిజయపుఁ గథపట్టు చాలహృద్య రచనములతో నున్నది.

"ఎంతపనిచేసితివి రామా! నిన్ను
నేమనందును సార్వభౌమా!
చెంతకిటు రాలేక చెట్లనో దాగుండి
వింతమృగమునుగొట్టు విధమాయెనాబ్రదుకు!"

ఇత్యాది గేయములను పలువురు పాడుచుందురు.

ఈ రుద్రకవి సుగ్రీవవిజయమునుగూడ స్త్రీ వృద్ధ పామరాదులు పలువురు పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును తక్కిన సంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధార ప్రాయులు పఠించునట్లును, నీసుగ్రీవవిజయము వీథియాటగా నాడబడుచుండెడిది. ప్రాచీన సంస్కృతనాటకరచయితలు భాసభవభూత్యాదు లీ సుగ్రీవ విజయౌచిత్యమును దమ నాటకములలో విమర్శించిరి. శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకి రామాయణ పద్ధతిని సమర్ధించిరి.

భవభూతి "యద్వా కౌశల మింద్రసూనుదమనే తత్రాప్యభిజ్ఞో జనః" యని దీని యౌచిత్యము నించుక చెనకెను. మనరుద్రకవి సంస్కృతాంధ్ర రామాయణకవులు త్రొక్కిన త్రోవనే త్రొక్కెనుగాని, యపూర్వకల్పనాంశము నేమాత్రము నిందు జేర్పలేదు.

ఆయాపాత్రములు ప్రసిద్ధ రామాయణములలో నెట్టి యుక్తి ప్రత్యుక్తులు గలవిగా చిత్రములయ్యెనో ఇందు నదేతీరు గలదు. కాని యిది దేశిరచనముతో గేయరూపమున నుండుట విశేషము. ఇం దీక్రింది గేయరచనలు ప్రశస్తము లయినవి!

"హా సతీమణి! ధర్మచారిణి! హా గుణోన్నత! జనకసుత! నను
బాసిపోయితి వింతలోనె పద్మనయన!"

"లేఁటి మాయలు మదిని దెలియగ లేక పాపపు రక్కసునిచే
బోటి! నిను గోల్పడితిని నిఁక నాకేటిబ్రతుకు"

"లలన! నినుఁ గలనైనఁ బాయఁగఁగలన, నీవిటలేక యుండినఁ
జలనమొందెను నాదు హృదయము జలజనయనా!"

"తరణి కులమున బుట్టి శరచాపములు బట్టి
తరుణిఁ గోల్పడు కంటె మరణమే మేలు!
నను శౌర్యవంతుఁడని తనపుత్రి నిడినట్టి
జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె!"

"నాయమెఱుఁగక చంపితివి నరనాథ! పాపముఁ గట్టుకొంటివి
బోయ వింతియె గాక నీవొక భూమిపతివా?"

"శ్రీరామ! నీరామఁ జెఱఁగొన్న రావణుని
వారధుల ముంచితిని వాలమునఁజుట్టి
ఒకమాట నాకుఁ జెప్పకపోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె."

"ఆలి చెఱఁగొని పోయినట్టి దశాస్యుఁడుండగ నిర్నిమిత్తము
వాలినేటికిఁ జంపితివి రఘువంశ తిలకా!
ఇట్టి సాహస కర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమవెడలఁగఁ
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా!
నాయమేటికిఁ దప్పితివి రఘునాథ! జానకితోడనే చెఱఁ
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్‌?"

శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటుననుండి వాలిమేనఁ గాఁడనేసిన వాఁడిములుకుల కంటె, నిక్కడ తార ప్రత్యక్షమై నిలుచుండి శ్రీరాముని యంతరంగము నుచ్చిపోవునట్టు ప్రయోగించిన పలుకుములుకులు క్రొవ్వాఁడి గలవి.

ఈలఘుకృతి వీరకరుణరస భరితము. నీతిహృద్యము. స్త్రీ బాల పామరాదులు గూడ పఠింపఁ దగినది.

తెలుగు యతి - తిరుగు మతి! .

శ్రీ కామేశ్వర రావు భైరవభట్లగారు.
.

తెలుగు యతి - తిరుగు మతి!

.

"మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"

నాకింకా పళ్ళు ఊడలేదు కానీ ఉన్నవాటిని ఊడగొట్టుకొనేందుకు ....


Thursday, October 22, 2015

విశ్వనాథ గారి ..కిన్నెరసాని.!

కిన్నెరసాని.అంటే ఒక వాగు గోదావరి నదికి పాయ...
కాని కవులు ఒక అందం అయిన అమ్మాయి గా వర్ణిస్తారు!
నిజమేనంటారా....
విశ్వనాథ గారి ..కిన్నెరసాని.!
. కిన్నెర నడకలు
కరిగింది కరిగింది
కరిగింది కరిగింది
కరిగి కిన్నెరసాని వరదలై పారింది
తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది
పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది
కదిలింది కదిలింది
కదిలింది కదిదింది
కదిలి కిన్నెరసాని వొదుగుల్లుపోయింది
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది
ముదిత కిన్నెరసాని నురుసుల్లు గ్రక్కింది
నడచింది కడరాళ్ళు
గడచింది పచ్చికల్‌
తడసి కిన్నెరసాని సుడులలో మొరసింది
జడిసి కిన్నెరసాని కడలందు వొరిసింది
సుడిసి కిన్నెరసాని జడలుగా కట్టింది
కరగగా కరగగా
కాంత కిన్నెరసాని
తరగచాలుల మధ్య తళతళా మెరిసింది
నురుసుపిండులతోడ బిరబిరా నడిచింది
ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది
కదలగా కదలగా
కాంత కిన్నెరసాని
పదువుకట్టిన లేళ్ళకదుపులా తోచింది
కదలు తెల్లని పూలనదివోలె కదిలింది
వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది
నడవగా నడవగా
నాతి కిన్నెరసాని
తొడిమ యూడిన పూవు పడతిగా తోచింది
కడుసిగ్గుపడు రాచకన్నెలా తోచింది
బెడగుబోయిన రత్న పేటిలా తోచింది
పతి రాయివలె మారి
పడియున్న చోటునే
పడతి కిన్నెరసాని విడలేక తిరిగింది
ముగుద కిన్నెరసాని వగచెంది తిరిగింది
వెలది కిన్నెరసాని గలగలా తిరిగింది
తాను నదిగా నేల
నైనా ననుచు లోన
పూని కిన్నెరసాని పొగిలింది పొగిలింది
ముక్త గీతికవోలె మ్రోగింది మ్రోగింది
ఒకచోట నిలువలే కురికింది వురికింది
ఏ వుపాయము చేత
నైన మళ్ళీ తాను
మనిసి కిన్నెరసాని నగుదామ యనిపించి
ఆపలేనంత కోరికచేత విలపించి
ముగుద కిన్నెరసాని మొరసింది మొరసింది

హట్స్ ఆఫ్ కృష్ణశాస్త్రి గారూ ...

 ఎన్ని శతాబ్దాలైనా నిజం ఇదే ... ఈ పాటలో లాంటిదే .. ...
పనుల వత్తిడిలో బడలిన ...రేడు... కి .. ప్రియురాలి ఒడి కంటే విశ్రాంతి / ఉల్లాసం ఇచ్చే
మత్తు మందు / అదృష్టం ... ఉంటుందా ...

ప్రియుని విశ్రాంతి కోసం గాలిని శాసించాలనుకొనే ప్రియురాలి .. ఊహే...
వాహ్ ...మధురానుభూతి ...
హట్స్ ఆఫ్ కృష్ణశాస్త్రి గారూ ...
సడిసేయకో గాలి సడిసేయబోకే

సడిసేయకో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే

సడిసేయకే

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి

మణికిరీటము లేని మహరాజు గాకేమి

చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే

సడిసేయకే

ఏటి గలగలకే ఎగిరి లేచేనే

ఆకు కదలికలకే అదరి చూసేనే

నిదుర చెదరిందంటే నే నూరుకోనే

సడిసేయకే

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే

నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే

విరుల వీవన పూని విసిరిపోరాదే

సడిసేయకో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే

సడిసేయకో గాలి

సినిమా : రాజమకుటం (1960)

రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి

సంగీతం :మాస్టర్ వేణు

గానం : పి.లీల

https://www.youtube.com/watch?v=LlFJWGpIBLA

సైంధవుడు లేదా జయధ్రదుడు !


సైంధవుడు !
సైంధవుడు లేదా జయధ్రదుడు(సంస్కృతం:जयद्रथ) మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సల కి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు.
.
ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.

మఱియు ఇతఁడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడును అని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు విని ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని శిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకు గోచరము అగునట్లు పలికెను.
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది. సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి అర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం పన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతితుడయి సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

అపరాజితా శమీపూజ !


శుభోదయం!
.
అపరాజితా శమీపూజ: శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం
అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి:

మధ్యే అపరాజితాయై నమః ఇత్యవరాజితామావాహ్య
తద్దక్షిణే క్రియా శ్క్యైనమః ఇతి జయాం నామతః
ఉమాయైనమః ఇతి విజయామా వాహ్మ అపరాజితా
యైనమః జయాయైనమః విజయాయై నమహ్

అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము.

మొక్కజొన్న తోటలో.............కొనకళ్ల వెంకటరత్నం!


మొక్కజొన్న తోటలో.............కొనకళ్ల వెంకటరత్నం!
(పాటకు ప్రాణం పోసింది ....వింజమూరి సిస్టర్స్... సీతా అనసూయ లు .)
.
సుక్కలన్ని కొండమీద
సోకు జేసుకునే వేళ,
పంటబోది వరిమడితో
పకపక నవ్వేవేళ,
సల్లగాలి తోటకంత
సక్కలగిల్లి పెట్టువేళ,
మొక్కజొన్నతోటలో
ముసిరిన చీకట్లలో,
మంచెకాడ కలుసుకో;
మరువకు మామయ్య.
చీకటి మిణుగురు జోతుల
చిటిలి చిల్లులడక మునే,
సుద్దులరాగాలు చెవుల
నిద్దరతీయక మునుపే;
ఆకాశపుటొడిని తోట
ఆవలింతగొనక మునే,
పొద్దువాలుగంటనే
పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చి రా
ముద్దులమామయ్య!
గొడ్డుగోద మళ్ళేసే
కుర్రకుంకలకు గానీ,
కలుపుతీతలయి మళ్లే
కన్నెపడుచులకు గానీ,
బుగ్గమీస మొడివేసే
భూకామందుకు గానీ,
తోవకెదురు వస్తివా,
దొంగచూపు చూస్తివా,
తంటా మన యిద్దరికీ
తప్పదు మామయ్య!!
కంచెమీద గుమ్మడిపువు
పొంచి పొంచి చూస్తాది;
విరబారిన జొన్నపొట్ట
వెకిలినవ్వు నవుతాది;
తమలకుతీగెలు కాళ్ళకు
తగిలి మొరాయిస్తాయి;
చెదిరిపోకు మామయా,
బెదిరిపోకు మామయా!
సదురుకొ నీ పదునుగుండె
సక్కని మామయ్య!
పనలుకట్టి యొత్తి నన్ను
పలకరించబోయినపుడు,
చెరుకుతోట మలుపుకాడ
చిటికవేసి నవ్వినపుడు,
మోటబావి వెనక నాతొ
మోటసరస మాడినపుడు
కసిరితిట్టినాననీ,
విసిరికొట్టినాననీ,
చిన్నబోకు నలుగురిలో
సిగ్గది మామయ్య ..
https://www.youtube.com/watch?v=PQu7PywoG98

మరచిన మన దసరా పద్యం.


మరచిన మన దసరా పద్యం.
.

ఏదయా మీ దయా మామీద లేదు
ఇంతసేపుంచితే ఇది మీకు తగదు
దసరాకు వస్తిమని విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
ఇరుగుపొరుగులకెల్తె ఇస్తారు సొమ్ము
పావలా ఇస్తేను పట్టీది లేదు
అర్ధరూపాయిస్తె అంటీది లేదు
ముచ్చెవక ఇస్తేను ముట్టీది లేదు
ఇచ్చరూపాయిస్తె పుచ్చుకుంటాము
అటుపైని పావలాల్ పప్పుబెల్లాలు
జై జై విజయీభవ!

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అయిదు వ్రేళ్లు! .

బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అయిదు వ్రేళ్లు!

.

చుట్టాలసురభి - బొటనవ్రేలు

కొండేల కొరివి - చూపుడువ్రేలు

పుట్టుసన్యాసి - మధ్యవ్రేలు

ఉంగరాలభోగి - ఉంగరపువ్రేలు

పెళ్లికిపెద్ద -చిటికెనవ్రేలు

* * *

తిందాం తిందాం ఒకవేలు!

ఎట్లా తిందాం ఒకవేలు?

అప్పుచేసి తిందాం ఒకవేలు!

అప్పెట్టా తీరుతుంది ఒకవేలు?

ఉన్నాగదా నేను అన్నింటికీ

పొట్టివాణ్ణి, గట్టివాణ్ణీ బొటనవేలు!

(చిటికన వ్రేలు, ఉంగరము వ్రేలు, నడిమివ్రేలు,

చూపువ్రేలు, బొటనవ్రేలు, అని అయిదు వ్రేళ్ల పేళ్లు,

ఈ అయిదు వ్రేళ్ళూ అనుకొన్నట్టు ఒక్కొక్క వ్రేలినీ

చూపుకుంటూ బాలకు లీ పదములు పాడుదురు.)

పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.! .

పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.!

.
(నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి.... మిత్రభేదము.)
.
వారణాసియందు ధావకమల్లుఁడను చాకివాఁడు గలడు.
ఒకనాఁడు వాఁడు మిగుల బట్టలు గుంజిన బడలిక చేత మయిమఱచి గుఱువెట్టి నిద్రపోవుచుండెను. ఆ నడిరేయి వాని యిల్లొక దొంగ చొచ్చెను. అప్పుడు వాని యింటి వాకిటఁ గాలి బందముతో గాడిద నిలుచుండెను. ఆ యింటి కావలికుక్క దాపునఁ గూర్చుండి చూచుచుండెను. అవి యొండొంటితో 'లోనికి దొంగ చొచ్చినాఁడు. చూచితివా?', 'చూచితిఁ జూచితి', 'మఱి యేల మొఱుగవు?', 'నాపని విచారింప నీకేమి నిమిత్తము?', 'మన దొరయిల్లు దొద్దవోఁగా నొప్పరికింపవచ్చునా?', 'నీవే మెఱుఁగుదువు? రాత్రి దినము నిమిషమాత్రమయినఁ బ్రమాదపడక తలవాకిలి వదలక యిల్లు గాచుకొని యుండుదును. ఆవంతయయిన నావలని ప్రయోజన మెఱుఁగక యేలిక నాయందు సాతకము లేకయున్నాఁడు. కాఁబట్టి కూడు కమికెఁడయిన దొరకుట కఱవయ్యె. పాటెఱుఁగని దొరను సేవించుట కంటె మిన్నకుంట మేలు.'
ఇట్లు ఖరశ్వానములు ప్రశ్నోత్తరములు జరుపుచుండఁగా గాడిద మిక్కిలి కోపించుకొని 'యోరి దురాత్మ! వినుము. ఒక పోరామి వచ్చినపుడు స్వామి దోషములు దడవి యుపేక్షించి యుంట భృత్యునకు ధర్మము గాదు. అదియును గాక స్వామి రక్షణము విచారింపక సేవకుఁడు స్వార్థపరుఁడయి స్వకృత్యము నందుఁ బ్రవర్తింపఁడేనిఁ గృతఘ్నుఁ డగును. నీవు పాపిష్ఠుఁడవు. దొసఁగు పొసఁగినప్పుడు స్వామికార్య ముపేక్షించితివి. ఇంతటితో నేదియు మునిఁగిపోదు. నీపని నాచేతఁ గాదా? చూడు. మన యేలిక నిప్పుడు ప్రబోధించెదను' అని చెప్పి గట్టిగా నోండ్ర పెట్టెను. అంత నా మడివేలు మేలుకొని నిద్రాభంగమాయెనని మహాకోపముతో లేచి యొక బడియతో గాడిదను మోదెను. ఆయమందా మోఁదు తాఁకుట జేసి యా గాడిద ప్రాణములు విడిచెను. కాబఁట్టి పరాధికారము మనము పయిఁ బెట్టు కోరాదు.

x

Wednesday, October 21, 2015

తెలుగోడు మొట్ట మొదటిగా కట్టు కొనే స్వంత రాజధాని .


అమరావతి ...
తెలుగోడు మొట్ట మొదటిగా కట్టు కొనే స్వంత రాజధాని .
ఏ పాదుష... ఏ నవాబు లేదా ఏ తెల్ల దొర కట్టి ఇచ్చింది కాదు.
ఇది వారి చెమట.. వారి కృషి .. వారి నేర్పు.
మేచ్చుకుందాం.....గర్వించదగ్గ విషయం..
శుభాకాంక్షలు

సహజ శాంతస్వభావుడైన శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే ఏమవుతుంది?


మీకు మీ కుటుంబ సభ్యులకు నా విజయదశమి శుభాకాంక్షలు ...
.

..
సహజ శాంతస్వభావుడైన శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే ఏమవుతుంది? రావణుడు ఎదురుపడగానే రాముడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలేమిటో ఈ క్రింది పద్యంలో చెప్పారు ఎర్రాప్రగడ తన రామాయణంలో..
..
అతని రౌద్రరేఖ గని యబ్ది గలంగె, జలించె శైల మౌ
త్పాతిక వారిదంబు లతి దారుణ రావములై జనించె ధా
త్రీతల మెల్ల బిట్టదరె, దిక్కులు వ్రీలె, సమస్త భూతముల్
భీతి వహించె డెందమగలెన్, రజనీచరలోక భర్తకున్ …………(ఎర్రాప్రగడ)
..
ఎర్రాప్రగడ భారతం తెనిగించక ముందే రామాయణం వ్రాసారు. దురుదృష్టవశాత్తూ అది మనకు ప్రస్తుతం అందుబాటులో లేదు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాల శ్రమించి 46 పద్యాలు సేకరించి భారతి మాసపత్రికలో “ఎర్రాప్రగడ రామాయణం” శీర్షికన ప్రచురించారు. వాటిలో యుద్ధకాండంలోని ఈ పద్యం ఒకటి.
.
విజయదశమి నాడే శ్రీరాముడు రావణాసురిడిని వధించాడని కూడా చెబుతారు. ఉత్తర భారతదేశంలో విజయదశమి నాడు “రామ్లీలా” ఉత్సవం జరిపి రావణుడి బొమ్మను దహనం చేస్తారు.
..
(సేకరణః తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఆచార్య వి.రామచంద్ర గారి చిన్ని పుస్తకం “ఎర్రాప్రగడ”. బొమ్మ బాపుగారు వేరే సందర్భంలో వేసినది.)

ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల!


దసరా పాటలు..(జానపద గేయములు.)
.
ఓయిఓయిఓయి ఓకాపు పిల్ల!
తాటిమేకలచల్ల తాగడే గొల్ల
నిన్న మొన్నటిచల్ల నేటిక్కి పుల్ల
కవ్వాన్ని తిప్పింది కమ్మన్నిచల్ల.

చక్కని బొమ్మలు వేశారు బాపు. !

తను ఆమోదించని భావాలున్న పుస్తకాలకు కూడా 

చక్కని బొమ్మలు వేశారు బాపు. !

రామస్వామి ‘భగవద్గీత’ పుస్తకం ముఖచిత్రంలో 

శ్రీకృష్ణుడు అర్జునుడిలా విషాదయోగంలో కూర్చుని ఉండగా 

రచయిత రామస్వామి గీతాబోధ చేస్తున్నట్టు గీశారు.

.

పల్నాటి యుద్ధంలో బాలచంద్రుణ్ణి ఉద్దేశించి తండ్రి బ్రహ్మనాయుడు చేసిన

గీతోపదేశమే ఈ భగవద్గీత.

‘శకటములందెల్ల ధూమశకటము నేనే.. 

యెడారులలోన సహారా యెడారిని నేనే.. 

పద్యముల గంద పద్యము... విద్యల యందెల్ల జోర విద్యను నేనే ’-

ఈ పద్ధతిలో వ్యంగ్య ధోరణిలో భగవద్గీతను పరిహసిస్తూ రాసిన సెటైర్ ఈ రచన.

“అల్పజీవి”తో నేను......: అతిథి

“అల్పజీవి”తో నేను......: అతిథి

ఇప్పుడే రావి శాస్త్రి రాసిన ఈ నవల చదవటం అయ్యింది. 

ఇప్పుడే అంటే ఓ రెండు గంటలవుతోంది. “హమ్మయ్య.. అయ్యిపోయింది” అన్న రిలఫ్ ఉందెక్కడో! మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్నాను చాలా సార్లు. కానీ మొత్తానికి పూర్తి చేసేశాను. రావిశాస్త్రి గురించి చాలా విని ఉన్నాను. ఎలా అయినా ఆయన రచనలు చదివితీరాలన్నంత విన్నాను. అందుకే అల్పజీవి చేతికందగానే ఇక ఆగేది లేదనుకుంటూ చదవటం మొదలెట్టాను. చదువుతున్నప్పుడు “ఆహా” అనుకున్న సందర్భాలూ లేవు. సుమారు 200 పేజీలున్న ఈ నవల చదవడానికి నేననుకున్నదాని కన్నా చాలా తక్కువ సమయం పట్టింది.

కథా-కమామిషు: మొదట్లో చెప్పినట్టు, ఈ పుస్తకం మధ్యలో ఆపేస్తానేమో అనుకోడానికి కారణం, ఇది ఒక “అల్పజీవి” అయిన “సుబ్బయ్య” కథ. బొత్తిగా ధైర్యం లేని మనిషి. ఏది ఎప్పుడు ఎలా చేసినా అది పిరికి చర్యలానే అనిపిస్తుంది. రోజూ అరుగు మీద కూర్చుని బానే పరికిస్తాడు చుట్టూ ఉన్న మనుషులని, దారెమ్మెట పోయే వాళ్ళని. తన భార్యని ఎవడో వచ్చి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలో చెప్తూ ఉంటే కోపానికి బదులు హాశ్చర్యపోయే అల్పజీవి. భార్యతో మాట్లాడాలన్నా పిరికితనం. చుట్టూ ఉన్న మనుషుల్లో ఏదో ఒక్క గొప్పతనం ఆపాదించేసి తనని తాను “అల్పుడి”గా భావించేసుకుంటాడు. అతగాడి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసకున్నాయి, అతని పిరికితనం అతణ్ణి ఎందాకా నష్టపెట్టింది, అతను దాన్నుండి బయటపడ్డాడా? లేక ఇంకా కూరకుపోయాడా? ఇన్ని ఘటనలు అతనిలో అంతర్మధానానికి పురికొల్పాయా అన్నది ఈ నవల చదవి తెలుసుకోవాల్సిందే.

కథనం- నవీనం: ఈ పుస్తకాన్ని తెరచి- చదివి -ఆలోచించి కాసేపు- ఇప్పుడిది రాస్తున్నానంటే అది కేవలం ఈ నవలలో కథనం వల్ల. కొన్ని సినిమాల్లో ఒక పాత్ర తెర మీదకి రాగానే, ఫ్రీజ్ చేసి ఆ పాత్ర బాక్‍గ్రౌండ్‍ని వాయిస్ ఓవర్ ద్వారా తెలుపుతారే..అలా ఉంటుంది ఈ రచనలో ప్రతీ పాత్ర పరిచయం. కథ చెప్తూ చెప్తూ ఒక పాత్ర ప్రస్తావన వస్తుంది. ప్రస్తావన రాగానే ఆ పాత్ర పూర్వాపరాలు మన ముందు నిలుస్తాయి. ఆ పాత్ర ఒక్క రూపురేఖలూ, స్వభావాలు, ఆచారావ్యవహారాలు, గతాలు పూర్తవ్వగానే అంతకు ముందు ఏ సీనులో కథ ఆగిందో మళ్ళీ అక్కడే మొదలవుతుంది. ఇక చాలా నవల్లో సహజంగా కనిపించే పేరాలకు పేరాలు రాస్తూ సీన్ని వివరించడం కానీ, ఎడతెరగని డైలాగులు ఈ నవలలో చాలా అరుదు. ఇందులో ప్రతీ లైన్లో ఒకే ఒక్క లైన్ లో ఉంటుంది. అప్పుడే పాత్ర స్వగతంలో మాట్లాడుకుంటూటుంది. తర్వాతి లైన్లోనే నరేటర్ ఆ పాత్ర ఏం చేస్తుందీ చెప్తుంటాడు. కానీ ఎప్పుడూ మనమేం తికమకపడం, పఠనాప్రవాహం ఆటంకం లేకుండా పోతూనే ఉంటుంది. దాదాపుగా పుస్తకంలో ఒక్కో లైనులో ఒక్కో వాక్యమే ఉంటుంది.

భయం-భయం నిత్య బతుకు భయం: ఈ పుస్తకం నాతో పాటు చాన్నాళ్ళ పాటు ఉండిపోతుంది అన్న నమ్మకాన్ని కలిగించింది “ఆఖర్నో మాట” అంటూ రావి శాస్త్రి గారు ఉటకించిన ఈ కోట్:

“Courage is reckoned the greatest of all virtues; because, unless a man has that virtue, he has no security for preserving any other.” ఇది శామ్యూల్ జాన్సన్ అన్నారట. 

ఈ పుస్తకంలో అల్పజీవి అయిన సుబ్బయ్యకు కూడా కాస్తంత ఆత్మచింతన కలుగుతుంది చివర్లో. ఖచ్చితంగా ఇక పై ధైర్యంగా ఉంటాడా అంటే ఏం చెప్పలేం కానీ, అసలు ఆలోచనైతే ప్రారంభం అవుతుంది.

తెలుగు సాహిత్యంలో విరివిగా వినిపించే పేరు రావిశాస్త్రి రాసిన ఈ “అల్పజీవి”.

వర్షం రావిశాస్త్రి

వర్షం
రావిశాస్త్రి చిరునామా అక్కరలేని రచయిత. వృత్తి లాయరైనా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. తెలుగు నవలా సాహిత్యానికి అల్పజీవి లాంటి మనో విశ్లేషణాత్మక నవలను అందించారు. ఉత్తరాంధ్ర మాండలిక భాషను సొగసుగా రచనల్లో వాడారు. కథను ఎలా రాయాలో తెలుసుకోడానికి గొప్ప ఉదాహరణలు రావి శాస్త్రి కథలు. అసలు కథను ఎక్కడ ప్రారంభించాలో, ఎలా మలుపు తిప్పి మెరుపులాంటి ముగింపు ఎలా ఇవ్వాలో రావి శాస్త్రికి బాగా తెలుసు. అతను రాసిన కథల్లో ప్రతి ఒక్కటీ ఓ పాఠం లాంటిదే. అలాంటిదే వర్షం కథ. సంకల్పం అనేది మనిషికి ఎంత అవసరమో ఓ పిల్లాడి చేత చెప్పిస్తాడు ఈ కథలో.
క్లుప్తంగా కథా విషయానికి వస్తే- వర్షం దబాయించి కొడుతుంది. కలకత్తా వెళ్లాల్సిన సిటీబాబు అడివిపాలెం నుంచి వచ్చి వర్షం వల్ల కమ్మలపాక టీ దుకాణంలో చిక్కుకు పోతాడు. ఆ టీ దుకాణాన్ని ఒక తాత నడుపుతుంటాడు. అక్కడి నుంచి సిటీబాబు స్టేషన్ కు వెళ్లాలంటే రెండు కోసుల దూరం నడవాలి. లేదా బస్సు, లేదా బండి. వర్షం వల్ల అవేవి రావు. వర్షం మాత్రం మబ్బులు పట్టి, జోరుగా కురుస్తుంది. ఆ సిటీబాబు పేరు పురుషోత్తం. తాత వర్షంలో వెళ్లలేవని చెప్తాడు. పైగా- కత్తుల్లా మెరుపులు, కొండలు బద్దలు కొట్టినట్లు ఉరుములు, శివాలెత్తినట్లు గాలి, పగబట్టినట్లు వర్షం.. దాంతో పురుషోత్తంకు ఎటూ పాలుపోక అక్కడే నిలబడి ఆలోచనల్లో మునిగిపోతాడు.
కలకత్తా వెళ్లాల్సిన పురుషోత్తం మామ మాట విని అడవిపాలెంలో మున్సబు కూతురుని చూడడానికి వెళ్తాడు. కలకత్తా అర్జెంటుగా వెళ్లాల్సి ఉన్నా మేనమామ మాట కాదనలేక పెళ్లికూతుర్ని చూడడానికి అడివిపాలెం వెళ్తాడు. మున్సబుగారిది పాతకాలం నాటి పెంకుటిల్లు. కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, తులసి మొక్క. దండెం మీద ఆరేసిన తెల్లచీర, దీపపు వెలుగులో దేవతలా పెళ్లికూతురు కనిపిస్తుంది. తనను నిదానంగా బరువైన రెప్పల్లోంచి చూస్తుంది. పెళ్లి కూతురుని, తల్లి కావాలని మాట్లాడిస్తుంది. పెళ్లికూతురి తటాకాల్లాంటి కళ్లు వెలిగే చుక్కల్ని, మెరిసే చంద్రుడ్నే కాదు మండేసూర్యుడ్ని కూడా స్పష్టంగా చూడగలవు. అలా ఆలశ్యం అయిపోయి మర్నాడు ఉదయం బంధువులింట్లో భోజనం చేసి ఎండ్లబండిమీద బయల్దేరతాడు పురుషోత్తం. మున్సబు గారి ఇంటి దగ్గరకు వచ్చే సరికి పెళ్లి కూతురు గడపలో నిలబడి వారగా చూస్తుంది. ఆ చూపు పురుషోత్తంని వెంబడిస్తుంది. ఎడ్లబండి సాగుతూ ఉంటే, అతనికి నర్సు జ్ఞాపకం వస్తుంది. ఆసుపత్రికి వెళ్లినప్పుడు పురుషోత్తం బరువును మెషిన్ మీద చూస్తుంది నర్సు. తర్వాత భయం వద్దు, జబ్బు నయం అవుతుంది అని భరోసా ఇస్తుంది. అప్పుడు పురుషోత్తం కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక కంటతడి పెడతాడు. చుట్టూ అందమైన ప్రకృతిని చూస్తూ, ఎండ్లబండిపై వస్తుంటే వర్షం ప్రారంభమవుతుంది. ఎలా కమ్మపాక టీ దుకాణంలోకి వచ్చేసరికి వర్షం బాగా ఎక్కువ అవుతుంది.
టీ దుకాణం అంతా స్తబ్దతగా ఉంటుంది. తాత ముక్కాలిపీట మీద కూర్చొని చుట్ట తాగుతాడు. నీటిబొట్లు పాకపైనుంచి పాముల్లా జారుతూ ఉంటాయి. వర్షం మాత్రం ఆగదు. తాతా వర్షంలో బొగ్గులకోసం పంపిన తన మనవడికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ వర్షంలో ఎలా వస్తాడో... ఎదురుపోవాలంటే వర్షం పెద్దగా ఉంది అని కంగారు పడుతుంటాడు. నిప్పు ముట్టిద్దామని పురుషోత్తమును అగ్గి అడుగుతాడు. లేదని తెలుసుకొని ఇంకా నిరుత్సాహపడతాడు. ఇనుప ఊసల్లా వర్షం పడుతుంటే పురుషోత్తం ఆలోచనల్లోకి వెళ్తాడు. తన గురించి తను ఆలోచిస్తాడు. కలకత్తా వెళ్లి వచ్చాక పెళ్లి చూపులకు వెళ్లాల్సింది. కానీ... ఎప్పుడూ అంతే... చదువుకోకపోతే చెడిపోతావు అన్నారు. చదువుకున్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు అన్నారు. బుద్ధిగా ఉన్నాడు. ఈత రాకుండా నీళ్లల్లో దిగకూడదు అన్నారు. దాన్నీ పాటించాడు. రాజమార్గాలు ఉండగా, సందులెమ్మట తిరగకు అన్నారు. సందులెమ్మట తిరగలేదు. అన్యాయం, అధర్మం, నీకేల అటువైపు... నీ పని నువ్వు చేసుకో అన్నారు. అలానే ఉన్నాడు. ఇలా ఆలోచిస్తున్న పురుషోత్తంకు వర్షంలో తడుస్తూ, బొగ్గులమూట భుజాన వేసుకుని ధారల్ని చీల్చుకుని వస్తున్న తాత మనవడు కనిపిస్తాడు.
లోపలకు వచ్చి, బొగ్గుల మూటను పాకలో ఓ వైపు విసిరేసి, బట్టలు పిండుకొని గంతులేస్తాడు. ఎలా వచ్చావు అని తాత అడిగితే ఒరసాన్ని సంపిడిసి పెడతాడీపోతురాజు అని సమాధానం ఇస్తాడు పిల్లోడు. ఆ మాట పురుషోత్తంలో చైతన్యాన్ని కలిగిస్తుంది. అతనిలో నిస్తేజంగా ఉన్న శక్తిని బద్దలు కొట్టి పైకి తెస్తుంది. అంతే... తాతకు కూడా చెప్పకుండా ఒకటిన్నర గంటలో రెండుకోసుల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ చేరాలని ఆ పెద్ద వర్షంలో బయలుదేరుతాడు. మసక చీకట్లో తిన్నగా, సూటిగా ఈదురుగాలి కెదురుగా, వర్షాన్ని సరుకు చేయకుండా, తెర్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నాడు పురుషోత్తం... అతడ్ని తాత మెచ్చుకున్నాడు. అని కథ ముగిస్తాడు రావిశాస్త్రి.
పాత్రల సంభాషణల్లో, కథ చెప్పడంలో అక్కడక్కడా అద్భుతంగా ఉత్తరాంధ్ర పలుకుబడులు వాడారు రావిశాస్త్రి. అలానే కథంతా అద్బుతమైన వర్ణనలు రాశారు. కథ వర్షంతో మొదలై, వర్షంతో ముగుస్తుంది. ఆ వర్షంలో ఒక వ్యక్తి పొందిన జీవన మార్గదర్శకాన్ని చెప్పారు. సందర్భాను సారంగా ప్రతీకలు వాడారు. మనిషి సంకల్పం కంటే సమస్య చిన్నదని ఓ పన్నెండేళ్ల పిల్లాడితో చెప్పించారు రావిశాస్త్రి. వీరి అన్ని కథలు గొప్పవైనా ఈ కథ ప్రత్యేకమైంది అని చెప్పొచ్చు.
- డా.ఎ.రవీంద్రబాబుx

అమరావతి: ఆంధ్రుల రాజధాని........ నోట్ దీస్ పాయింట్స్ యువరానర్ !

నోట్ దీస్ పాయింట్స్ యువరానర్ !

కరెన్సీనోటు చిరగడానికి ముందు కనీసం 4000 మంది చేతులు మారుతుంది.

* హాలీవుడ్‌లో అడుగుపెట్టేనాటికి వాల్ట్‌డిస్నీ జేబులో 40డాలర్లు, చేతిలో సగం గీసిన ఓ కార్టూన్‌ ఉన్నాయంతే!

* విజయవాడ నగర విస్తీర్ణం(61.88 చ.కి.మీ) కన్నా తక్కువ విస్తీర్ణం గల దేశాలు పది ఉన్నాయి.(ఇది పాత లెక్క ఇప్పుడు మరో రెండు చదరపు కిలోమీటర్లు కలుపుకొండి.

* నెపోలియన్‌తో జరిపిన యుద్ధాలకు సంబంధించిన అప్పులను బ్రిటన్‌ ఇంకా తీరుస్తూనే ఉంది.

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ఈ-బేలో విక్రయించిన అత్యంత ఖరీదైన వస్తువు జెట్‌విమానం. వెల దాదాపు 5మిలియన్‌డాలర్లు.

అమరావతి: ఆంధ్రుల
రాజధాని

అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణము లో నివసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.

Tuesday, October 20, 2015

వెడలె ఈ రాజు కుమారుడు ...

బంగారు పాపా పాట .. నిన్న అడిగిన ప్రశ్నకు జవబు. 

(శ్రీ దేవులపల్లి వారి చక్కటి పాట .. రామశర్మ .. కృష్ణకుమారి . 

పాడింది రాజా సుశీల .. మాధవ పెద్ది .. సిత మరియు అనసూయ )

వెడలె ఈ రాజు కుమారుడు ... 

బంగారు తేరు మీద .. 

కోర మీసం చిన్నవాడ .. ఓర చూపులు పిల్లతోడ 

నువ్వు కులుకు బెళుకు తు జాతర కేల్లవు .. 

ఓరబ్బి చిన్నబ్బి. ...ఒలమ్మి చినమ్మి.. 

ఆరేవు కాడ ... ఆతోపు నీడ 

నన్ను చూసి చిన్నది .. నవ్వి ఉరు కున్నది .. 

మున్నేటి జాడ .. మేఘల ఓడ . 

నన్ను చూసి చిన్నది నవ్వి ఉరుకున్నది .

ఏల ప్రేమింతును? ---- దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

ఏల ప్రేమింతును? ---- దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

.. 

మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల?

పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ

గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?

Monday, October 19, 2015

వెయ్యి పడగలు ...ఒక సమీక్ష!


వెయ్యి పడగలు ...ఒక సమీక్ష శ్రీ Vadrevu Ch Veerabhadrudu గారు,!
.
'ఈ విద్య దేనికి పనికివచ్చును? ఒక్క తుపాకిముందు నిది యెందుకును పనికిరాదు. ఒకవేళ పనికివచ్చినను చేసెడిదేమి? దేశమున కింకనే విద్యయు అక్కరలేదు.'

'ప్రతి విద్యకును నాల్గు దశలు! అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణము లని. అవి నాల్గు కలిసినచోటే విద్యకు సంపూర్ణమైన స్థితికలదు. నేనొకటి చదువుకుని అది ఇతరులకు చెప్పి దాని నాచరించి యితరుల చేత దాని నాచరింపచేయుట అనునవి నాల్గుదశలు. తనకర్థము కాని దాని నాచరించుటయు, అర్థమైనదాని నాచరించకుండుటయు మన శాస్త్రాలలోనే లేదు.'

'విద్య యనగానేమి? అక్షరములు నేర్పుటయు, వంకర దస్తూరి వ్రాయించుటయునా? ప్రతివానికిని సంగీతజ్ఞానము, లయజ్ఞానము కూడ సునిశితమై యుండుట విద్యావిధానములో ప్రధానమైన విషయము. మన పూర్వులు చదువనగా హృదయపరిపాకము కలిగించునది యని యనుకొనిరిగాని కేవలం చదువుట, వ్రాయుట మాత్రమే చదువనుకొనలేదు. పూర్వము విద్యయే యుండినది,లేనిదిప్పుడు..'

వెన్ను మీద ఛళ్ళున చరిచినట్టున్న ఈ వాక్యాలు విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు 'నవలలోవి.

నిన్న విశ్వనాథ సాహిత్యపీఠం వారు ఆవిష్కరించిన పుస్తకాల్లో 'విశ్వనాథ వేయి పడగలలోని ముఖ్యాంశాలు 'అన్నది కూడా ఒకటి. డా.వెల్చాల కొండలరావుగారు సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని పరిచయం చేసే బాధ్యత నాకప్పగించారు.

వేయిపడగలు నవలలో వివిధ అంశాల మీద విశ్వనాథ సత్యనారాయణ ప్రకటించిన ఎన్నో అభిప్రాయాల్ని ఆ పుస్తకంలో సంకలనం చేసారు. తన గురించి, విద్య గురించి, భాష, సాహిత్యం, వాజ్మయం, కావ్యం, రసం,నృత్యం, సంగీతం, శిల్పం, నాటకం,మతం, సాంప్రదాయం, ప్రేమ,వివాహవ్యవస్థ లాంటి విషయాలమీద ఆ నవల్లో ప్రాసంగికంగా వెలిబుచ్చిన అభిప్రాయాలతో పాటు, కొన్ని ఋతువర్ణనలు, కథలు కూడా సంకలనం చేసారు.

విజ్ఞానసర్వస్వాల్లాంటి నవలలు ప్రపంచంలో చాలానే ఉన్నప్పటికీ, ఒక నవలనుంచి ఇటువంటి ఎంపికతో వచ్చిన పుస్తకాన్ని నేనింతదాకా చూడలేదు. డేవిడ్ కాపర్ ఫీల్డ్, వార్ అండ్ పీస్, బ్రదర్స్ కరమజోవ్, డాక్టర్ ఫాస్టస్ వంటి నవలలకి లభించని ఈ అపురూప గౌరవం వేయిపడగలకి దొరికింది. ఆ మాటే చెప్పాను సభలో.

ఆ సభలో వేయిపడగలకి ఇంగ్లీషు అనువాదం కూడా ఆవిష్కరణ జరిగింది. అయిదుగురు అనువాదకులు కలిసి చేపట్టిన బృహత్ప్రయత్నం.అందుకుగాను ఆచార్య సి.సుబ్బారావు, వైదేహీ శశిధర్, ఆత్రేయ శర్మ, అరుణా వ్యాస్, నారాయణస్వామి లకు తెలుగు జాతి ఎంతో ఋణపడి ఉంటుంది.

అయితే నేనింతకుముందు 'సంస్కార 'నవల విషయంలో చెప్పినట్టుగా, ఇంగ్లీషులో అనువాదం రావడం ఒక ఎత్తు, దాని చుట్టూ ఒక డిస్కోర్సు లేవనెత్తడం మరొక ఎత్తు. విశ్వనాథను సంప్రదాయవాదిగా, అభివృద్ధి వ్యతిరేకిగా, ఫ్యూడలిస్టుగా తెలుగు ప్రపంచం భావించడానికి చాలావరకు వేయిపడగలు నవలనే కారణం. కాని ఆ భావాల్లో చాలావరకు ఈనాడు కొత్తగానూ, కొత్త ప్రాసంగికతతోనూ కనబడటం విశేషం. ముఖ్యంగా విద్య గురించి వేయిపడగలు వ్యక్తం చేసిన భావాలతో ఈ సంకలనం మొదలుపెట్టడం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది.

ఆధునిక తెలుగు సాహిత్యంలో వైతాళిక పాత్ర పోషించిన రచనలు- కన్యాశుల్కం, గణపతి, కోనంగి, వేయిపడగలు వంటివి తెలుగు జాతి ప్రాచీన ఆధునిక విద్యలపట్ల గొప్ప సంఘర్షణకు లోనైన కాలంలో వచ్చిన రచనలు.

భారతదేశం ఆధునీకరణ చెందుతున్న యుగసంధిలో తలెత్తిన ఆ ప్రశ్నలకీ, ఒక శతాబ్ద కాలం తర్వాత మనమంతా ఎదుర్కొంటున్న ప్రశ్నలకీ మధ్య ఎంతో సారూప్యం ఉంది.

ఈ విద్య ఒక్క తుపాకి ముందు పనిచెయ్యదని విశ్వనాథ ఏ విద్య గురించి మాట్లాడేడో, ఆ విద్య ఇప్పటికీ అలానే ఉంది. విద్య అంటే బలవంతుడి భాష బలవంతంగా నేర్చుకోవడమని ( Education is learning the language of the dominant) ఇప్పటి విద్యావేత్తలు వాపోతున్నారు. ఆధునిక విద్య తలెత్తుతున్న తొలినాళ్ళల్లో ఆ విద్యను విమర్శించడాన్ని అభివృద్ధి వ్యతిరేకంగా విమర్శకులు భావించారు. కాని ఇప్పటికి ఆ విద్య స్వరూప స్వభావాలు మనకి బోధపడ్డాయి కాబట్టి, విశ్వనాథ ఆవేదన సహేతుకమేననని మనకి ఒప్పుకోక తప్పట్లేదు.

మరో మాట కూడా చెప్పాను నా ప్రసంగంలో. విశ్వనాథను సంప్రదాయవాదిగా చూడటం ఆయన భావాలకు సమగ్ర రూపాన్నివ్వడం కాదని. ఆయన్ని వివరించడానికి సరైన పదం ఆయన్నొక anti-colonial రచయితగా గుర్తించడం. 'జీవుడి ఇష్టము ' (1942) లాంటి కథ రాసేటప్పటికి ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో చెప్పుకోదగ్గ యాంటీ కలోనియల్ రచన ఏదీ తలెత్తనే లేదు. ( ఫ్రాంజ్ ఫానాన్ The Wretched of The Earth రావడానికి ప్రపంచం 1961 దాకా ఆగవలసి వచ్చింది.)

సహృదయంతోనూ కొంత నిశితంగానూ విశ్వనాథను చదివినప్పుడు మనకి తెలిసేదేమంటే ఆయన తన చైతన్యం colonize కాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాడని. ఆధునిక రచయితలు మానవీయ సమాజాన్ని కలగన్న మాట నిజమే గాని అందుకు వాళ్ళు ఎంచుకున్న నమూనాలు కలోనియల్ నమూనాలే. Pre-modern సమాజం మాడర్నైజ్ అయితే మరింత మానవీయంగా మారుతుందనే వాళ్ళు నమ్మారుగాని, ఆ నమ్మకంలో ఎంత అమాయికత్వం ఉందో postmodern thought బయట పెట్టినదాకా మనకు బోధపడలేదు.

గురజాడ, గాంధీ,విశ్వనాథ వంటివారి భావాల్లో సారూప్యత లేకపోయినప్పటికీ, వాళ్ళందరిలోనూ ఉమ్మడిగా కనవచ్చే అంశం, మాడర్నిటీని ధిక్కరించడమే. మాడర్నైజేషన్ ని ఒక కలోనియల్ ప్రక్రియగా నిదానించడంలో వారి జాగరూకత సరైనదేనని ఇప్పుడు మనకి తెలిసి వస్తున్నది.

అలాగని విశ్వనాథ భావాలన్నీ ఆరోగ్యకరమైనవీ,ఆమోదయోగ్యమైనవీ అని కాదు. ఆయన వేయిపడగలు నవలలో తాత్త్వికంగా ఎంత అస్పష్టతకు గురయ్యాడో ఆర్.ఎస్.సుదర్శనంగారు యాభై ఏళ్ళ కిందటనే ఎంతో యుక్తియుక్తంగా విమర్శించారు. కాని ఇప్పుడు మనం చూడవలసింది, చర్చించవలసింది ఆ భావాల కన్నా కూడా ఆ భావాల వెనక ఉన్న స్వతంత్రతా ప్రవృత్తి గురించీ, తాను మానసికంగా colonize కావడానికి ఇష్టపడని ఒక జీవుడి ఇష్టం గురించీను.

శ్రీ కృష్ణుని రసికత, వాచాలత....


శ్రీ కృష్ణుని రసికత, వాచాలత....
.
శ్రీ కృష్ణుడు చాల రోజుల తరువాత ద్వారకకు తిరిగి వస్తాడు...

..

అప్పుడు కృష్ణుడు ఒక భామ ఇంటికి ముందు వెళితేవేరొకతె లోఁ గుందునో, సుకరాలాపములాడదో, సొలయునో,సుప్రీతి వీక్షింపదో అని శంకించి
.

ఒకే సారి అందరి ఇళ్ళలో ప్రవేశించి,
వారిని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు।ఎలాగంటే,...

సీసము:
తిలకమేటికి లేదు తిలకినీ తిలకమా? పువ్వులు దురుమవా పువ్వుఁ బోడి?
కస్తూరి యలదవా కస్తూరికా గంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ?
కలహంస బెంపుదే కలహంస గామిని? కీరముఁ జదివింతె కీరవాణి?
లతలఁ బోషింతువా లతికా లలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి?
.

ఆటవెలది:
మృగికి మేతలిడుదె మృగశాబలోచన? గురులనాదరింతె గురువివేక?
బంధుజనుల బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు.
.
మనసెరిగి మాట్లాడడమంటే ఇదే!

ఏ భామకి దేనియందు మక్కువో గ్రహించి ఆమె taste ని ప్రశంసిస్తూనే
ప్రోత్సహిస్తున్నాడు, ధర్మం హెచ్చరిస్తున్నాడు।
ఇవన్నీ, మనసు నొచ్చుకోకుండా।
బంధుజనుల బ్రోతె బంధు చింతామణీ?
.
అనడంలో ఎక్కడా నిదరణ గాని,హిత బోధ గాని, లేదు।
ఇదే పద్ధతి శ్రీ రాముడు కూడా అవలంబిస్తాడు
రామాయణంలో, శబరిని పలుకరించేటప్పుడు

"తపస్సు బాగా వృద్ధి అవుతోంది కదా!" అంటాడే గాని,
తపస్సు బాగా చేస్తున్నావా?
అని కాదు।

I

ఇంత శృంగారం ఒలికిస్తున్నా
తానుమాత్రం దానిలో జారిపోలేదు అనే ధ్వని
అచ్యుతుడు అనే శబ్దంలో ఉంది।
"అనుచు సతులనడిగె నచ్యుతుండు"
(అచ్యుతుడు = జారని వాడు)