శ్మశానం ముందు ముగ్గు ఉండదు --రాజకీయ నాయకుడికి సిగ్గు ఉండదు ?


శ్మశానం ముందు ముగ్గు ఉండదు --రాజకీయ నాయకుడికి సిగ్గు ఉండదు ?
(నెట్ నుంచి కాపీ పేస్టు.)
.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ --అ
ప్రజాస్వామ్యం గా దేశాన్ని దోచుకుంటున్న --మేము
ఏలికలం --పాలకులం ---నాయకులం
రత్నగర్భని రాళ్ళగర్భ గా చేసాం --చేస్తున్నాము -
పగటి వేషగాళ్ళం --పూట కో వేషం వేస్తాం
చేటు చెయ్యని ప్రజలను --చీట్ చేస్తాం --చేస్తున్నాం
రాజకీయ శ్మశానం లో కాటికాపరులం
నిజాయితీ లేని బూతు దేవుళ్ళం
శవాలతో వ్యాపారం చేసే మగధీరులం
పాపాల భైరవులం -అధికార దాసులం
కర్మ సిద్దంతమంటూ ధర్మానికి నిలిచే ప్రజలను
నర్మభాషణ్లతో మోసం చేస్తాం
ఎలక్షన్ల కుంభమేళాలో -కులమతాలే పెట్టుబడిగా
ఆల్ ఫ్రీ --టోల్ ఫ్రీ అంటూ కలక్షన్లు చేస్తాం
అన్నార్తుల ఆకలికేకలు --ఆర్తనాదాలు --మాకు హిందోల రాగాలు
అబలల ఆక్రందనలు --నిరుద్యోగుల ఆవేదనలు మాకు భూపాల రాగాలు
రక్త పాతాలు --బందు ల భాగవతాలు -మా నాటకాలు --వ్యాపకాలు
రిక్త హస్తాలతో నిలుచున్న భారతి సహనానికి మా దోపిడీలే నిదర్సనాలు
వినాశనం మా వికాసం --వంచన మా ఆదర్సం
లంచం మా ఆశయం మోసం మా నినాదం
అన్యాయం మా కానందం --అవినీతి మా వేదాంతం
కులమతాలా మా కడ్డంకం --కుంభకోణం మా ప్రాణం
అధికారం కోసం --' ఆంధ్హ్రా ని ' విడగొడతాం --భారతాన్ని పడగొడతాం
రంగు రంగుల జెండాల --ఊసరవెల్లులం -మేమంతా
భారతిని పంచుకుంటాం గాని --అమ్మం ,
ప్రజాస్వామ్యపు --రెడ్ లైట్లో --లైటు లేని భారతికి --మేమే --మేమే
సెర్చ్ లైట్లం --టార్చి లైట్లం --ట్యుబ్ లైట్లం
స్వరాజ్య భారతి --సోదరులం --స్వతంత్ర భారతి వారసులం
మేమే --ఏలికలం --పాలకులం --నాయకులం
---------జై హింద్ --

Comments

  1. చాలా బాగా నిగ్గు తేల్చేరు కదా !సామాన్యులమంతా(పి )పీలికలం,--------------డా.సుమన్ లత

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!