పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు''

గీత రచయిత 'కొసరాజు ! 

(''
పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు'' ).

జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా

తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి

..”ఏరువాక సాగాలోరన్నో…” అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా 

“రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ” 

అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు

ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది.

''పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు'' అని స్వయంగా ప్రకటించుకున్న

జానపద గీతాల రారాజు గురించి ఎంతరాసినా తక్కువే. తెలుగు పదం, తెలుగు పద్యం, తెలుగు తనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. 

జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, 

.

వినరావినరానరుడా..., సరిగంచు చీరగట్టి... శివగోవింద గోవింద, డబ్బులోనె ఉందిరా, 

.

.నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, , 

చెంగుచెంగునా గంతులు వే... .... యండి, ... సరదా సరదా సిగిరెట్టు, .... ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు... 

ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మూడువేలకు పైగా గీతాలు రాసి 'కవిరత్న'గా, 'జానపద కవి సార్వభౌముడు'గా పండిత పామరుల మన్ననలు పొందినవారు కొసరాజు రాఘవయ్య చౌదరి.

కేవలం హాస్యప్రధానమైన పాటలే గాకుండా, విభిన్నమైన అంశాలపై మంచి పాటలు రాశారు కొసరాజు. ''గాఢాంధకా రమలముకున్నా భీతి చెందక ! నిరాశలోనే జీవితాన్ని కుంగదీయక'' అనే ఉత్తేజభరితమైన పాటలను రాశారు. ఉన్నవారు, 

''లేనివారని బేధాలు తొలగిపో వాలనే భావంతో'' కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా; అని ప్రశ్నించారు. '

'తోడికోడళ్ళు'' చిత్రం కోసం ''ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది'' అంటూ శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటారు.

అభ్యుదయ భావాలతో, సామ్యవాద దృక్పధంతో సమాజంలోని అవినీతిని ఎండగడుతూ అధిక్షేప గీతాలు రచించిన కొసరాజు పౌరాణిక చిత్రాలకు సైతం రసోచిత గీతాన్ని రాశారు.

''మంచి మనసులు'' సినిమాకోసం ''మావా మావా మావా!ఏమే భామా భామా''అంటూ రాసిన పాట, సంగీతం సమకూర్చిన మహాదేవన్‌ గారిని స్వ రాల మామను చేసింది. ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు పరస్పరం కవ్వించుకునే గీతం ''వాలు వాలు చూపుల్తో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దించుతారు మీరుగాదా'' అనేవి, ఆ తర్వాత తెలుగునాట ప్రేమోక్తలయ్యాయి. ఘంటసాల, జమునారాణి పాడిన ఈ పాట వారికి కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. 

''దులపర బుల్లోడా! దుమ్ము దులపర బుల్లోడా'' పాట భానుమతిగారి నోట రసవంతంగా వినిపించేలా రాశారు. 

మూగజీవుల పట్ల కారుణ్యభావాల్ని ప్రకటిస్తూ ''వినరా వినరా నరుడా; తెలుసుకోర పామరుడా;'' అనే పాటను గోమాత స్వగతంగా రాశారు. ''చెంగుచెంగున గంతులు వేయండి'' పాటకూడా ఈ భావంతో సాగేదే.

ఆయన పొందిన సత్కారాలు అనేకం. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీలో ''నవభారతం'' బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిలభారత కాంగ్రెస్‌, ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఆయన్ని ఘనంగా సత్కరించాయి. తెనాలి క్లాసికల్‌ ఫిలిమ్‌ సొసైటీ నుంచి సముద్రాల రాఘవాచారి అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ అందుకున్నారు.

''వ్రాసిన మాటలే వ్రాయుట కంటె, పాడిన పాటలే పాడుట కంటె, సరికొత్త రచనల సాగించినపుడె, కవి చమత్కారాన కథ రక్తికట్టు''- అంటూ నవ్యతకోసం పరితపించిన కొసరాజు తెలుగుభాష ఎంత కమ్మగా, కమనీయంగా ఉంటుందో తన రచనల్లో చూపారు. ''జాను దేశి కవిత నా నుడికారమ్ము, ఏ నిఘంటువులకు నెక్కకుండు, చిన్ననాటి నుండి జీర్ణించుకొన్నాను, పల్లెపదములన్న పరమ

ఆయన తెలుగువాడిగా పుట్టినందుకు అనేక సందర్భాల్లో ఎంతో గర్వించారు. ఎన్నో పద్యాలు రాశారు. ''రైతు జన విధేయ రాఘవయ్య'' మకుటంతో రాసిన శతకంలో ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తిచాటారు. ''సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగుకొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె...' అంటూ వాపోయారాయన.

కాదేదీ కవితకు అనర్హమన్న రీతిలో చెట్టు, గట్టు, పుట్ట, అట్టు, సిగరెట్టు, పండుగలు, పేకాటలు, తాగుళ్ళు, ఇల్లరికపుటల్లుళ్ళ గురించి ఎన్నో పాటలు రాశారు. వినోదాన్ని విషాదాన్ని, భక్తిని, రక్తిని సమయోచితంగా తనకలం ద్వారా ఆవిష్కరించాడు. సామెతలు, పలుకుబళ్ళు, తెలుగునుడికారంతో గేయ సాహిత్యానికి వన్నె తెచ్చిన కొసరాజు 1984లో రఘుపతి వెంకయ్య అవార్డును, 1985లో కళాప్రపూర్ణ బిరుదును పొందారు.

అభ్యుదయకవిగా, ప్రజాకవిగా, రైతుపక్షపాతిగా ఆంధ్రసాహితీ మాగాణంలో తెలుగునుడికారపు పంటలు కొల్లలుగా పండించిన కొసరాజు బుద్దిమానుకోని పేకాటరాయుళ్ళ మనస్తత్వానికి ప్రతీకగా నిలిచిందీపాట. ఇంకా ''భలే ఛాన్సులే... ఇల్లరికంలో ఉన్న మజా'' 'సరదా సరదా సిగరెట్టు'' 'ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా'', 'మంగమ్మా: నువ్వుఉతుకు తుంటే అందం'' అనే హాస్య గీతాలెన్నిం టినో తన కలం ద్వారా ఒలికించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ''కొండవీటి వైభవం' (ఖండకావ్యం), గండికోటయుద్ధం (ద్విపద కావ్యం), కొసరాజు విసుర్లు, సిన్మాడైరెక్టర్‌ అనే పుస్తకాలను రాసి సాహిత్య లోకానికి అందించారు. చివరిసారిగా సురేష్‌ ప్రొడక్షన్‌ వారి ''గురుబ్రహ్మ''చిత్రానికి 1986 అక్టోబర్‌ 27వ తేదీన ''వినరా, ఆంధ్రకు మారా'' అనే బుర్రకథను రాసి, అదేరోజు రాత్రి పది గంటలకు పరమపదించారు. ఆయన హేతువాది. ఏరువాక... ఏటినీరు ఉండేంతవరకు కొసరాజే రసరాజు.

ఈ యన చెప్పులు కూడా వేసుకొనేవారు కాదు. బెంగుళూరు లో మా ఇంటికి వచ్చేవారు .. మంచి మిత్రుడు .. మంచి భోజన ప్రియుడు .. అయన జ్ఞాపకాలు మధురాతి మధురాలు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!