Posts

Showing posts from January, 2016

కలువ కన్నుల కన్నయ్య!

Image
కలువ కన్నుల కన్నయ్య! . "లలనా! యేటికి తెల్లవాఱె? రవి యేలాదోఁచెఁ బూర్వాద్రిపైఁ? గలకాలంబు నహంబుగాక నిశిగాఁ గల్పింపఁ డా బ్రహ్మ దా వలఱేఁడుం గృపలేఁడు; కీరములు దుర్వారంబు; లెట్లోకదే; కలదే మాపటికాల మందు మనకుం గంజాక్షు సంభోగముల్." . ఏమే చెలీ! అప్పుడే ఎందుకు తెల్లవారిపోయిందే!  తూర్పుకొండమీద ఆ సూర్యుడు ఎందుకు పొద్దుపొడిచేసేడే బాబు! అవును పగళ్ళన్నవి లేకుండా ఎప్పటికి తెల్లవారని రాత్రిళ్ళుగా ఎందుకు చెయ్యడే  ఈ బ్రహ్మదేవుడు! . ఈ మన్మథుడేమో మరీ కరుణమాలిన వాడైపోయాడు; చిలకలను చూస్తే వారించేవాళ్ళే లేరు; ఇంకా ఎలాగమ్మా బతకటం!  అసలు రాత్రి ఎప్పటికేనా అవుతుందా!  ఆ కలువ కన్నుల కన్నయ్యతో కలిసే అదృష్టం లభిస్తుందంటావా! . (పోతనామాత్యుడు.)...

మరొక ఆదిశంకరులవారు అవతారమెత్తాలి--- .

Image
మరొక ఆదిశంకరులవారు అవతారమెత్తాలి--- .  శ్రీ ఆదిశంకరాచార్యులవారు సాక్షాత్తూ పరమశివుని అవతారమని భావిస్తాము. భారతావనిలో బౌద్ధం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం లో, ఆది శంకరులవారు తమ జన్మస్థానమైన కలాడి లో కూర్చోని తమ అద్వైత సిద్ధాంత ప్రవచనాలు చేయలేదు. పాదచారియై బౌద్ధాన్ని "ప్రచ్చన్న పాషండం" గా ఖండిస్తూ, దేశం నలుమూలలా శంకర మఠాలు స్థాపించి ధర్మ ప్రచారం చేశారు. హిందూమత పరిరక్షణ చేశారు. ఎక్కడి కేరళలో కలైడి, ఎక్కడి హిమాలయాలు!!! అదీ 1200 యేండ్ల క్రిందట!! .  హిందూమత పునరుద్ధరణకు బద్ధకంకణులై శ్రమించగల పరివ్రాజక స్వాములు--మరొక ఆదిశంకరులు---అవతరించాల్సిన సమయం వచ్చింది. హైందవం జనసామాన్యానికి దూరమై ఎవరో కొంతమంది ఛాందస ఆచారవ్యవహారాలకు బందీయై, పరిమితమై అంతరించిపోయే ప్రమాదం ప్రస్ఫుటంగా కనపడుతున్నది. పవిత్రహైందవ శంఖనినాదం వూరువూరులా, వాడవాడలా ప్రతి ప్రాంగణంలోనూ మారుమ్రోగింపవలసిన తరుణం వచ్చింది. రాజకీయ దుర్గంధానికీ, ఛాందసానికీ దూరంగా హైందవుడైన ప్రతి పురుషుడూ, ప్రతి స్త్రీ కులాలకు అతీతంగా హైందవం నాది, మనది అని గర్వించగల తరుణం సాకారం చేయగల ధర్మప్రచారకులు మరొక ఆది శంకరులు ఈ పవిత్రావనిలో ఉద్భవిం

ఫేస్ బుక్ గీత.!

Image
ఫేస్ బుక్ గీత.! . నీ పోస్ట్ కు లైక్ లు రావటం లేదు..షేర్ కావటం లేదు అని బాధపడేముందు...ఒక్క క్షణం....  . నువ్వు ఇప్పుడైనా...గతంలో అయినా ఎవరి పోస్ట్ లకి ఎప్పుడైనా లైక్ కొట్టావా...షేర్ చేసావా  . అన్నది ఆలోచించు... ఇచ్చి పుచ్చుకోవటం అనేది మన సంస్కృతి అనే విషయం మర్చిపోతే నీ  . పోస్ట్లులు అనేవి ఒకటి ఉన్నాయి అనే విషయం అందరూ మర్చిపోతారు :):):)

మనసులో పన్నీరు!

Image
మనసులో పన్నీరు! . నేనులో ఏముంది నీవులో ఏముంది నీవులో ఏముంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది నేనులో నీవుంది నీవులో నేనుంది నీవులో నేనుంది మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది  మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు ఔనా..ఆ..మ్మ్ మ్మ్ (డాక్టర్ సి. . నారయణరెడ్డిగారు.)

అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా?

Image
అంతా భ్రాంతియేనా! ....పార్వతికి నిరాశేనా? . దేవదాసు పార్వతికి అన్యాయం చేశాడు. అందుకు దేవదాసుని నిందించి ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవదాసుకి అసలు న్యాయం చెయ్యటం రాదు. తనకేం కావాలో దేవదాసుకే పెద్దగా ఐడియా ఉన్నట్లు తోచదు. పక్కింట్లో ఉంది, చూడ్డానికి బాగుంది, తను చెప్పినట్టల్లా వింటుందని పార్వతిని ఇష్టపడిపొయ్యాడు. ఇక్కడదాకా బానే ఉంది. . దేవదాసుకి వాస్తవిక దృక్పధం ఉన్నట్లు అనిపించదు. తనకన్నా తక్కువ స్టేటస్ పిల్లని పెళ్లి చేసుకోడానికి తండ్రి ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నాడు! పోనీ తండ్రిని ఎదిరించగల ధైర్యమన్నా ఉందా అంటే.. అదీ లేదాయె! డబ్బున్న కొంపలో పుట్టాడు. అల్లరిచిల్లరగా తిరిగాడు. సుఖవంతమైన జీవితం. ఈ బాపతు కుర్రాళ్ళకి బుర్ర తక్కువేమో! . ఇంత పిరికివాడూ.. పార్వతి దగ్గర అధార్టీ చెలాయిస్తుంటాడు. కోపం వచ్చి పార్వతి నుదుటిపై గాయం చేసిన అహంభావి. తండ్రి జమీందారు కావున భయం. పార్వతి పల్లెటూరి పేదరాలు కావున తేలిక భావం. కళ్ళముందు కనిపిస్తున్న కోహినూర్ వజ్రాన్ని కాలదన్నుకున్న అజ్ఞాని. . తప్పుల మీద తప్పులు చేసి.. బాధ మరచిపోవడానికి హాయిగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడు తప్ప గత

తెలుగుతనానికే అందం ముళ్ళపూడి వెంకటరమణ గారి తెలుగు బాష. !

Image
తెలుగుతనానికే అందం ముళ్ళపూడి వెంకటరమణ గారి తెలుగు బాష.  .  బుడుగు, రాధ, గోపాలం,బామ్మ, పంచవటి కాలనీ,.........మధ్య తరగతి సౌందర్యాన్ని తన కళ్ళతో.... బాపు కుంచెతో ఆవిష్కరించిన వాడు, ఏడుపదులు దాటిన వయసులో హైస్కూలు కుర్రాడిలా కోతికొమ్మచ్చి ఆడుతున్నవాడు,ఎంత ఎదిగినా మధ్యతరగతిలో ఒదిగిన వాడు....  .  “రాధతో రోజులు గోపాలానికి కవిత్వం నేర్పాయి.  .  పెరుగుమీద తొరక కోసం రాధ పెట్టే రభస అతనికి హృదయమంతటితోనూ నవ్వడం నేర్పింది.  కోన తేలిన రాధమ్మ నాసిక అతనికి దేముడి శిల్పచాతురిని బోధపరిచింది. రాధమ్మ నిద్రించినపుడు ఆమె నయనాలు అందానికి అర్ధాలు చెప్పాయి. రాధమ్మ చూపులు అతనికి ఏంచెప్పేవో చెప్పడం అతని తరం కాదు.  రాధమ్మ తరం కాదు.” .  ---- * శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు, రాధాగోపాలం కథలు*

"నీ తోడు " నాకు కావాలి! "ప్రమాణం చెయ్యి"!

Image
"నీ తోడు " నాకు కావాలి! "ప్రమాణం చెయ్యి"!  . ఆ అమ్మాయి పేరు రచన!అప్పుడే పెళ్ళై అత్త వారింటికి వచ్చింది భర్తతో.  ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే సంస్కృతాంధ్ర భాషల్లో ఉభయ భాషా ప్రవీణురాలు. అబ్బాయికుడా ఉభయ భాషా ప్రవీణుడే!ఆ నూతన దంపతులకు ఏకాంతం దొరికింది.  ఇద్దరూ పిచ్చా పాటీగా మాట్లాడుకుంటున్నారు.భర్త అడిగాడుకదా!  నా జీవితాంతం నీ తోడు నాకు కావాలి."ప్రమాణం చెయ్యి"!అన్నాడు.  అందుకే గదా నేను వచ్చింది.అని సమాధానమిచ్చింది భార్య.  అంతేకాదు నాతోడు నీకు కావాలి కాబట్టి నేనొక పొడుపు కధ పొడుస్తాను.  నీకు తెలిస్తే సమాధానం చెప్పు.అప్పుడు నా తోడు నీదే!అంది.నవ్వుతూ!  . " ప్రభాతేకీ దృశం వ్యోమ ప్రమాణేకీ దృశం వచ: ఆంధ్ర గీర్వాణ భాషాభ్యాం ఏకమేవోత్తరం వద!" . అనగానే ఆ ఉభయ భాషా ప్రవీణుడు ఏదో కొంచెం మిడి మిడి జ్ఞానంతో ఏమిటీ?నీ ప్రశ్నలు?  . ఉదయం ఆకాశం ఎలా ఉంటుంది? ప్రమాణం చేసేటప్పుడు తెలుగులో ఏమంటారు? ఇవా! నీ రెండు ప్రశ్నలు! పైగా ఆ జవాబు ఆంధ్ర గీర్వాణ రెండు భాషల్లోనూ ఒక పదమేనా? ప్రశ్నలు సులభమే!ఐనా జవాబు చెప్పడం కొంచెం!కష్టమేనే! అంటూ జుట్టు ప

దామెర్ల వారి ఊరుబావి. ...

Image
దామెర్ల వారి ఊరుబావి. ...  ఇంకిపోయి, పూడుకుపోయిన ఊరుబావి.  పేరుకేమిగిలింది.  అనవసరపు మాటలలో, అయోమయపు కవితలలో,  అర్థంకాని కథల్లో...... ! .  కాలం గడుస్తున్న కొద్దీ బావి చుట్టూ ఎన్నో జరిగాయి.  బావి వైపువాళ్ళు బావికి గట్టు కట్టి, గోడ కట్టి బాగుచేయించిన కాలమూ ఉంది.  తమ గుత్తగా బావిదగ్గరకు రావడానికి నియమాలు పెట్టి కట్టడి చేసిన రోజులూ ఉన్నాయి. తరాల అంతరాలకు ఆ బావి ప్రత్యక్ష సాక్షి. కాలంతో ఆ గొడవలూ కొట్లాటలూ వస్తూనే ఉన్నాయి సర్దుకుంటూనే ఉన్నాయి.  మనుషుల మనస్థత్వాల వల్ల ఈ హెచ్చుతగ్గులస్థాయి మారుతున్నా ఒక విషయం అందరిలో బలంగా ఉండేది.  ఆ బావి ఆ ఊరి అవసరం. దానిని కాపాడుకోవాలి. అందరికీ అందాలి. ఆపై చేసే ఆలోచనలదగ్గరే అనేకమైన తేడాలు వచ్చాయి. హక్కులు, బాధ్యతలు, కట్టుబాట్లు ఏనాటికీ అందరికీ నచ్చేవిగా ఉండలేవు . ఊళ్ళోవాళ్ళో, పొరుగూరివారో, బాటసారులో… బావి దగ్గర నీళ్ళు త్రాగినవారూ ఉన్నారు. బావిలో చెత్తా చెదారం పడేసిన ప్రబుద్ధులూ ఉన్నారు.  ఎప్పటి కప్పుడు క్రొత్త నీరు ఊరే బావి అది.  అప్పుడప్పుడు బాగుచేసుకుంటుండాలి అంతే.

సుందరకాండ విశిష్టత:! .

Image
సుందరకాండ విశిష్టత:! . ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ. తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది ఏది లేదని చెప్పవచ్చు.  శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.  . . భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు.  అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. .  సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు. . ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాడ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది. ఆధ్యాత్మక చింతనతో చూస్తే భగవత్సౌందర్యమును, జీవ సౌందర్యమును, ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది. . సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః  సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం  సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?  . .అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ.  సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్త

సీమంతం.! (Babay Shower .)

Image
సీమంతం.! (Babay Shower .) తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది.సీమంతం .  కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం  (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం).  సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం. . ఇది గర్భాకాలమున ఆరవనెలన గాని, ఎనిమిదవ నెలనగాని జరుపవలెను (దేశకాలమానములు బట్టి ఇవి వేర్వేరుగా ఉండవచ్చును). ఇందులో మేడిపండ్లు, వనస్పతి మొదలగు శుభకరమైన పదార్థములను ఉపయోగించి భర్త భార్యను మేడిచెట్టువలె బలముగా నుండుమని, వనస్పతివలె సంతాన సంపదను పొందుమని అర్థం వచ్చే మంత్రములను వినిపించును.  అలాగే, ప్రజాపతి అదితికి సీమంతోన్నయనము చేసినట్లు నీకు కూడా సీమంతోన్నయనము చేసి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వృద్ధాప్యము వరకు దీర్ఘజీవిని చేసెదను అని ఇంకొక మంత్రము పలుకును.  అటు తర్వాత భర్త దేవతలను ప్రార్థించి గర్భదోషములు తొలగింజేయు, భవిష్యత్త్ సంతాన కళ్యాణమునకై గర్

పెద్దనామాత్యుని నాయిక వరూధిని.!

Image
పెద్దనామాత్యుని నాయిక వరూధిని.! . "మృగమదసౌరభవిభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్".! . “కస్తూరి, పచ్చ కర్పూరపు పరిమళాల తాలూకు చిక్కటి సౌరభము  ఇతర సువాసనలను కప్పివేస్తూ, ఒకానొక అమ్మాయి జాడను తెలిపే  గాలితెమ్మెర … అలా …వీచిందిట!” . పెద్దనామాత్యుని స్వారోచిషమనుసంభవం కావ్యంలో నాయిక వరూధిని అనే అప్సరసను పరిచయం చేసే సందర్భంలో ఆమె గురించిన మొట్టమొదటి పద్యం అది.

నీవల్ల కాదు....!!

Image
నీవల్ల కాదు....!! ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు. ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు. అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ లేదు. అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు. చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.  "అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.  నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.  చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు. "అన్నా ... భయపడకు... జాగ్రత్తగా పట్టుకో... పడిపోకుండా చూసుకో" అని అరిచాడు. తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.  ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా

అన్నమయ్య కీర్తన...కులుకక నడవరో!

Image
అన్నమయ్య కీర్తన...కులుకక నడవరో! . కులుకక నడవరో కొమ్ములాలా జలజల రాలీని జాజులు మాయమ్మకు ఒయ్యనే మేను కదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీ పాదతాకు కాంతలాలా . పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బలమీద అయ్యో చెమరించె మాయమ్మకు నెన్నుదురు|| . చల్లెడి గందవొడి మైజారీ నిలువరో పల్లకి వట్టిన ముద్దు పణతులాలా మొలమైన కుందనపు ముత్యాల కుచ్చులదర గల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు జమళి ముత్యాలతోడి చమ్మాళిగ లిడరో రమణికి మణుల ఆరతు లెత్తరో . అమరించి కౌగిట అలమేలుమంగ నిదె సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు|| . అలమేల్మంగమ్మ పల్లకిలో కూర్చున్నది. పల్లకిని మోసే ముద్దుగుమ్మలను అన్నమయ్య హెచ్చరిస్తున్నాడు. ఓ భామలారా! ఒయ్యారంగా కులుకుతూ నడవకండే! అమ్మ నెరులు చెదరి విరులు జలజలా రాలిపోతున్నాయి, నుదురు చెమరిస్తుంది. పాపటలో జల్లిన గంధపొడి శరీరమంతా జారుతున్నది. జడకు గల ముత్యాల కుచ్చులు అదురుతున్నవి. కర కంకణాలు కదిలిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నడవండే! అమ్మ పల్లకి దిగినది. దిగిన వెంటనే ముత్యాల పాదరక్షలు అందించండే! మణుల హారతి పట్టండే! అంటూ చెలికత్తెలను అమ్మవారి సేవకు పురమాయిస్తున్నాడన్నమయ్య! x

అన్నమయ్య వెంకటేశ్వర శతకం .!

Image
అన్నమయ్య వెంకటేశ్వర శతకం .! . దివ్య దంపతుల శృంగారాన్ని భక్తితో వర్ణించిన వారిలో అన్నమయ్య చాలా ప్రముఖంగా కనిపిస్తాడు. . అలమేలుమంగా వేంకటేశ్వరుల శృంగారాన్ని తన సంకీర్తనలలో అతను పుష్కలంగా వర్ణించడం అందరికీ తెలిసిన విషయమే. సంకీర్తనలే కాకుండా, "వేంకటేశ్వరా!" అనే మకుటంతో ఒక శతకం కూడా రచించాడు అన్నమయ్య. ఈ శతకంలో కూడా వారిద్దరి శృంగార విలాసాలు రకరకాలుగా చిత్రించబడ్డాయి. అందులో ఒక సరసమనోజ్ఞమైన సన్నివేశాన్ని వర్ణించే పద్యం  ఒకటి రుచి చూద్దాం: . "అందవు, కోసి యిమ్ము విరు" లంచును జే రలమేలుమంగ ని  న్నుందగ గోర జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న  య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచు పువ్వులు కోయజేయ ని  ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా ! . స్వామివారు తన సతితో కూడి ఉద్యానవనంలో విహరిస్తున్నారు కాబోలు.  అక్కడ కొన్ని పూల చెట్లున్నాయి. ఆ పూలు కోసుకోవాలని అమ్మవారికి కోరిక పుట్టింది. కాని అవి ఎత్తుగా ఉన్నాయి. "ఆ పూలు నాకందవు, మీరు కోసిపెట్టం"డని గోముగా అడిగిందావిడ. . అయ్యవారేమయినా తక్కువ తిన్నారా! నాక్కూడా అందవని చెప్పి, నువ్వే కోసుకోమని

“కవికుల గురు: కాళిదాసః”.!

Image
“కవికుల గురు: కాళిదాసః”.! . కాళిదాస మహాకవి గొప్పతనం జగద్విదితం.  అందుకే “కవికుల గురు: కాళిదాసః” అని  అందరిచే కీర్తించబడినాడు. ఇంకా కాళిదాసు గొప్పతనాన్ని తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని  తెలుసు కొందాం.  . “పురా కవీనాం గణన ప్రసంగే /  కనిష్టికా దిష్టిత కాళిదాసః// అద్యాపి తత్తుల్య కవేరభావాత్  అనామికా సార్థవతీ బభూవ //  . “ పూర్వం కవులని గణన అనగా ఎవరు ముందు ఎవరు తరువాత అని లెక్కించడం  ప్రారంభించగా, చిటికిన వేలుని (ప్రధమ స్థానాన్ని) కాళిదాసు అధిరోహించెనట. తదుపరి  రెండవ స్ధానం కోసం (ఉంగరం వేలుకి “అనామిక” అని పేరు.) రెండవ వేలుని అధి రోహించడానికి ఇప్పటికీ కాళిదాసుతో సమానమైన కవి లేనందున ఆ రెండవవేలుకి  అనామిక అనేపేరు సార్థకమైంది.” . సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా ఉన్న కాళిదాసుకి “వీణాపుస్తక పాణి” ఎప్పుడు  పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమై పలకరిస్తుందిట. ఒకరోజు చదువుల తల్లి తన వద్దకి వచ్చినపుడు కాళిదాసు ఇలాప్రశ్నిస్తాడు? “అమ్మా! ఇప్పుడున్న కవి,పండితులలో కవి ఎవరు? పండితుడు ఎవరు?అని.” అపుడు సరస్వతి ఇలా అంటుంది. “కవిర్దండీ కవిర్డండీ భావభూతిస్తు పండితః” అని శ్లోకపాదం చె

హాస్యానికి ఆలంబనాలు చాటువులు.!

Image
హాస్యానికి ఆలంబనాలు చాటువులు.! . “ శృంగారాది నవరసాలలో హాస్యానిది రెండవ స్థానం. సంభాషణా చాతుర్యం ద్వారా, హావభావ విన్యాసం ద్వారా మనసుకు హాయిని కలిగించేది హాస్యం” . హాస్యానికి ఆలంబనాలు చాటువులు. చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని శృంగార భరితంగా కూడ ఉంటాయి. కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి ఆనందించండి. . “ఆణోరణీయాన్ మహతో మహీయాన్ మధ్యో నితంబశ్చ మదంగనాయాః తదంగ హారిద్ర నిమజ్జనేన  యజ్ఞోపవీతం పరమం పవిత్రం” . దానిభావం పరిశీలిద్దాం -  మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనీకనిపించనిది అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం. అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము అనగా (సన్నని) నడుము,  మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు, అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!”

సుమతి శతకం.!

Image
సుమతి శతకం.! . సుమతి శతకంలో చాలా పద్యాలు నిర్మాణంలో కూడా ఒక రకమైన పునరుక్త వాక్యాలను అనుసరిస్తాయి. అందుచేత వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం తేలికవుతుంది. ఉదాహరణకి: నవ్వకుమీ సభలోపల నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ! ఈ పద్యంలో చివరి ముక్క నయమిది అనే పూరక పదంతో ప్రారంభం కావడం గమనించండి. అంటే కవికి ‘నా’తో మొదలయ్యే సార్థకమైన మాట వెతకవలసిన అవసరం తప్పిందన్న మాట.

సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.!

Image
సంగీత సామ్రాట్టు స్వాతి తిరునాళ్.! . - రచన : తనికెళ్ళ భరణి. ఆధ్యాత్మిక రంగంలో ఆదిశంకరాచార్యులు... హైందవ జాతి పునరుద్ధరణంలో వివేకానందుడు... ఎలాగ కృషి చేసి ప్రాత:స్మరణీయులై అతి చిన్నవయస్సులోనే పరమేశ్వరుడిలో లీనమైపోయారో!... .  అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన ట్రావన్కూర్ మహారాజు "స్వాతి తిరుణాళ్" కూడా సంగీతంలో విశేషమైన కృషి చేసి ముప్పై మూడవ ఏటనే పరమపదం చేరాడు. .  అల్లకల్లోకంగా ఉన్న రాజకీయ, సాంఘిక పరిస్థితులు... వారసులెవరూ లేకపోతే రాజ్యాన్ని కాజేద్దామని కోట బురుజుల మీద గిరికీలు కొడ్తున్న "తెల్లదొరతనపు గద్దలు"... ఐకమత్యం లేక పరస్పరం కలహించుకుని ముక్కలు చెక్కలైపోతున్న సిగ్గులేని భరతజాతీ!... ఇలాంటి పరిస్థితుల్లో 1813 వ సంవత్సరంలో లక్ష్మీబాయి, రాజరాజ వర్మలకు ’స్వాతి’ నక్షత్రంలో పుట్టాడు..."స్వాతి తిరుణాళ్"!! పదహారో ఏటనే రాజ్యానికి వచ్చాడు గానీ.... కుట్రలూ కుతంత్రాల రాజకీయ చదరంగం ఏమీ నచ్చలేదు. ఎందుకో అతని మనసు సంగీతం వైపు మొగ్గింది. అలాంటి రాజకీయ కల్మషంలో గూడ... స్వచ్చమైన పద్మంలాగ సంగీత పరిమాళాలు గుబాళించాడు!! ఆయనో బాలమేధావి....అక్షరాల

మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...

Image
శుభరాత్రి.! మా వై.(Why).జయంతి గుర్తుకువచ్చింది. . ఈ పాట జీవితంసినిమాలో.. ఆమెమొదటి సినిమా.. . మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా...  మన ప్రేమా వీణా గానమై ఆనందమై నవ లోకము చూద్దామా. ..  చెలి వెన్నెలలో పూ వన్నెలలో మన ప్రణయ కథా రచన మన మనసు మనసు ఏకమై ఆనందమై నవ లోకము చూద్దామా.. .

దేశమునక యరిష్టము.!

Image
దేశమునక యరిష్టము.! . మధు సేవ నాటకమున దేశారిష్ట కారణములను వివరించించిన సీసపద్యమును చూచినట్లయితే మనకాశ్చర్యం కలిగిస్తుంది.  కవి నిర్మొహమాటంగా ఎంత స్పష్టంగా వ్రాశాడో చూడండి.  . సీసము:- కొంపలు తెగనమ్మి కోర్టుల, రైళ్ళ, కా ఫీ హొటేళ్ళ, వకీళ్ళ, పెంచువారు. పండిన సరు కెల్ల పర దేశముల కంపి కరవున కిర వేర్పరచు వారు మూడు ప్రొద్దులు ముష్టి మున్సిపల్ పదవి లో పలనుండి కనులు కన్ పడనివారు. ఆస్తి భార్య పేర అప్పులు తమ పేర  పెంచి ఐ.పీ.లను పెట్టువారు. తేటగీతి:- బట్ట కొఱకు, జుట్టు కొఱకు, బ్రాంది కొఱకు, సిరులు పర దేశముల పాలు చేయువారు. పూర్తిగా నెల్లెడల వట్టిపోవు దనుక  దేశమునకీ యరిష్టము తీరిపోదు. నిరంకుశాః కవయః అన్నరుకదా పెద్దలు.  అందుకే అంత నిర్మొహమాటంగా వ్రాయగలిగాడు. పద్య రచన కాని, గద్య రచన కాని, యదార్థానికి దర్పణం పట్టాలంటారు పెద్దలు. అతిశయోక్తులు, కవిచమత్కారాలు లాంటి వన్నీ కూడా యదార్థాన్ని ప్రతిపాదించిన పిదపనే చూపించాలి. మనం కూడా యదార్థానికి ప్రతి బింబంలా పద్య రచన చేయగలిగితే ఆదరణీయం కాకపొతుందా! జైహింద్.

భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.!

Image
భారత దేశ గణతంత్ర దినోత్సవ శుభా కాంక్షలు.! . శ్రీ దేవుల పల్ల్లి వారి జాతీయ గీతం.! . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి.! . జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి జయ జయ సశ్యామల సు శ్యామ చలచ్చేలాంచల జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి...!!

సౌందర్యం.!

Image
సౌందర్యం.! . " లోకంలో ఉన్న సౌందర్యం ఒక్కోసారి ఒక్కోలా హఠాత్తుగా దర్శనం ఇచ్చేస్తే ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ అనుభూతి చెందడం అనేది ఒక్కోసారి చాలా ఇబ్బందైన పని అనే అనిపిస్తుంది, ఆ సౌందర్యాన్ని చూసిన ఆనందం వల్ల కలిగిన తన్మయత్వపు స్థితిలో ఉన్నప్పుడు ఒక అందాన్ని మించి మరో అందం కంటిముందు కనిపించి కళ్ళెదుటే తిరుగాడుతూ ఉంటే పొందే బాధ స్వర్గమో,నరకమో ఖచ్చితంగా తెల్పలేని భావస్థితిలా తోస్తుంది " . ఇంత స్థితి గురించి నేనెందుకు వర్ణించి చెప్తున్నాను అంటే , ఈరోజు జరిగిన ఒక సంఘటన గురించి ముందుగా వివరించాలి.... . మా కాలేజులో అమ్మాయిలు ఎప్పుడు కూడబలుక్కుని ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, ఈరోజు ప్రతీ అమ్మాయి " లంగా ఓణీలు " కట్టుకుని చక్కగా మన తెలుగు వస్త్రధారణలో తయారయ్యి కాలేజుకి విచ్చేసి మాకు కనువిందు చేసేసారు ఒక్కసారిగా...!!! ఉదయం లేచి ఏ ఏ సౌందర్యాలును ఈరోజు ఆస్వాదిస్తానా అని అనుకునే నాకు ఇంత ఊహించని సౌందర్యాలు ఎదురయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుబోక అచేతనావస్థకు గురి అయిన వ్యక్తిలా అలా వాళ్ళని చూస్తూ ఉండిపోయానంతే .......!!! . " ఈలోకంలో ఎన్ని గొప్ప సౌందర్యా

ఎన్ని ఏళ్లు బతికామన్నది కాదు

Image
ఎన్ని ఏళ్లు బతికామన్నది కాదు ఎట్లా బతికామన్నది ముఖ్యం.  వందేళ్లు జీవించినా..  జీవితంలో పోరాటం లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు.............. జీవితాన్ని లెక్కించేది సంవత్సరాలతో కాదు..  వాళ్ల జీవితంలోని సంఘర్షణను, పోరాటాన్ని చూసి''  -- శరణ్‌కుమార్‌ లింబాలే, మరాఠీ దళిత రచయిత

నాయనమ్మ కు సినిమా నచ్చలేదు ...

Image
నాయనమ్మ కు సినిమా నచ్చలేదు ...  తన ని హెరాయిన్ గా తిసి వుంటే  మరో బకావళి అని పేరు పెట్టి వుంటే ..  బహు బలి నచ్చేది ..  మనం బాలి అయిపోయే వాళ్ళం . .  సీనియర్ నటి జమున మాత్రం ఈ సినిమాపై కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. బాహుబలి ఓ చెత్త సినిమా అని అందులో హీరో తప్ప, కథ ఎక్కడుందని ఘాటైన కామెంట్స్ చేసారు.  రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన జమున మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన మనవడి ప్రోద్భలంతోనే బాహుబలిని చూశానని ఈ సీనియర్ నటి తెలిపారు. బాహుబలి సినిమాను ఓ స్టుపిడ్ సినిమా అన్న జమున అసలు ఇందులో కథ ఎక్కడుందని ప్రశ్నించింది.  తమన్నా పాత్రను అనుష్క చేసి ఉంటే కాస్త బాగుండేదని తన మనసులో మాటలను బయటపెట్టింది జమున.  ఇంతగా ప్రేక్షకాదరణ పొందిన బాహుబలి చిత్రం జమునకు నచ్చకపోవడానికి కారణమేంటి, ఇదొక స్టుపిడ్ సినిమా అనడానికి కారణమేంటి అని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి దీనిపై జక్కన్న స్పందిస్తారో లేదో చూడాలి.

ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! ! .

Image
ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! ! . ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా , అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి " అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో ....... కలనాటి ధనము లక్కర గలనాటికి దాచ కమల గర్భుని వశమా నెల నడిమి నాటి వెన్నెల యలవడునే గాదె బోయె నమవస నిశికిన్. . అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు . ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా పద్యం చెప్పాడు . . ఎమి తిని సెపితివి కపితము? బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో ఉమెతకయను తిని సెపితో అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా! భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి? భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా? . ఎంత వెటకారం ! అలస

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు?

Image
రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? .  ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు. "కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు. "అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్

అందం .

Image
అందం . (ఆడవాళ్ళు తాము అందంగా లేమని బాధపడనక్కరలేదు) .  ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అందం అనేది సహజంగా వచ్చేస్తుంది....  ఈ రంగులను, ఈ రంగు రంగులతో కూడిన అందమైన పూలను, పళ్లను, పక్షులను, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారో తెలీదు.. కొందరు భగవంతుడంతారు.. కొందరు ప్రకృతే సృష్టించింది అంటారు.. ..  కానీ ఈ ప్రకృతిలో జీవ రాసులన్నిటిలోనో ఉన్న" ఒకే ఒక్క తేడా ఆడ మగ." . .. మనము ఎన్ని తేడాలు ఏర్పరుచుకున్నప్పటికీ..  దేవుడు సృష్టించిన తేడా ఇదేనేమో... ( నాకు ఇంతకన్న తేడాలు ఏమున్నాయో తెలీదు మరి) .  ఈ అందం అనే ఆలోచన మనిషికి వచ్చిందేనేమో.. లేకపోతే ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.. ఎందరో తాము అందంగా లేమని పక్క వారితో పోల్చుకుని భాదలు పడుతున్నారు.. మరి కొందరు అందాన్ని ఇనుమడించుకోవాలని తాము సంపాదించిన దానిని అంతా బ్యూటీ పార్లర్లకు సమర్పించు కుంటున్నారు.... .  మగ వారి సంగతి ఏమో గానీ ఆడవాళ్ళు మాత్రం అందం అనే విషయానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు... అందుకేనేమో ఆడవాళ్ళ మీద వారి అందం మీద, వారు తయ

సంవత్సరమంటే

Image
చిన్నప్పుడు సంవత్సరమంటే… సంంంంంంంంంంంంవత్సరంలా ఉండేది. . ఇప్పుడంటే కొంచెం ఏమారితే చాలు, సంవత్సరాలు, నెలలూ తిరగబడిపోతున్నాయ్. . మొన్ననే మన ముందే ఏడుస్తూ పుట్టిన పిల్లల్ని నేడు పలకరిస్తే “ఇంజనీరింగ్  . చదువుతున్నాను అంకుల్” అని అంటున్నారు…తేడా ఎక్కడుంది? . భూమేమైనా సూర్యుడి చుట్టూ తిరిగే వేగం హెచ్చించిందా? . మనమే మంచు భల్లూకాల్లా ఆరునెలలు మనకు తెలియకుండానే హైబర్నెషన్‌లోకి  . వెళ్ళిపోతున్నామా? లేదా తేడా మన వయస్సు ..భాధ్యతలలో ఉందా .. ఏం . జరుగుతోంది…..నాకు తెలియాలి. Y2K సమస్య పోయిన సంవత్సరంలో వచ్చినట్లు ఉంది…  . చూస్తే దశాబ్దం గడిచిపోయింది. మొత్తానికి జీవితం 8x వేగంతో ఫాస్ట్ పార్వర్డ్‌లో చూస్తూన్న . సినిమాలా జరిగిపోతోంది.

గుంపులో గోవింద !

Image
అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద ! . ఏదో అందరూ ఇండియాలో ఉండి , ఒకరు అమెరికా వెళ్తే గొప్పకానీ , . అందరూ అమెరికా వెళ్ళినవారే అయితే గొప్పేం ఉంది? గుంపులో గోవింద !  . అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా? అందుకే మనసూరుకోక యధాశక్తిగా గొప్పలు చెప్పుకోవడం.. . " మా అబ్బాయి ఉండే ఊళ్ళో చలికాలం అంతా మంచు మయం , తెల్లారేసరికి దూదికుప్పల్లా మొకాటివరకు మంచు , ఎంతబాగుంటుందో చూడ్డానికి " అని ఒకరంటే " నిజమే పాపం అదో పీడాకారం , తెల్లారి లేస్తూనే పారలు , పలుగులు పట్టుకొని ఆ మంచంతా తవ్విపోసుకోవాలిట పాపం , వెధవ చాకిరీ , మా అబ్బాయి ఉండేది సీ కోస్ట్ , లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతవరణం " అని మరొకరి సానుభూతి . . "కిందటిసారి మేము వెళ్ళినప్పుడు నయాగరా చూశాం ఎంత బాగుందో " అని ఒక ఇల్లాలు కళ్ళు విప్పార్చుకొని చెప్తే.. . " భలెవారేలెండి ! అసలు నయాగరా అందం చూడాలంటే కెనడా వైపునుండి చూడాలి , మొన్న మేము వెళ్ళొచ్చాము , ఈ సారి మీరూ వెళ్ళిరండి " అంటూ మరొక ఇల్లాలి సలహా.

మురిపించే అందాలే అవి నన్నే చెందలే.!

Image
మురిపించే అందాలే అవి నన్నే చెందలే.! (కవిత రాసింది ...Sri.Acharya Gowtham Manohya..గారు) కొన్ని (అంది, అందని)అందాలను, అందమైన అనుభవాలను ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేం. చిన్ననాటి జ్ఞాపకాలు అమ్మచేతి గోరుముద్దలు కన్నెపిల్లల వాలు చూపులు తొలిరాత్రి తమకాలు. ఇలా, మధురమైన కొన్ని సంఘటనలు వాటి తాలుఖు జ్ఞాపకాలు, అజన్మాంతం మన స్మృతి పథంలో మెదులుతూ అనునిత్యం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇటువంటి మధురమైన జ్ఞాపకాల్లో తోలిరేయిది ఓ మధుర ప్రస్థానం. ఏదో జరుగుతుందని మరేదో జరగబోతుందని ఇంకేదో జరగాలని ఓ కన్నెపిల్ల పడే ఆరాటం. తన కన్నుల్లలోని తమకం. విచ్చుకునే పెదవులు, బిగుసుకునే నడుము, నాట్యమాడే ఊహలు wowww ఆ అందం... ఆ ఆరాటం... ఆ అతిశయం,  అంతా ఇంతా కాదు. నిజానికి ప్రతీ స్త్రీ జీవితంలోను ఇదో మధురమైన సన్నివేశం. తనువు మనసు ఏకమై, తమకంలో తరించిపోయే భావావేశం అప్పటివరకు ఆమో వికసిస్తున్న  గులాబీ మాత్రమే. విచ్చుకుంటున్న ఆమె (పూ)రేఖులకు పరిపూర్ణమైన యవ్వన, సుఖాన్ని... రుచి చూపించే తియ్యని రేయది. పొద్దుతిరుగుడు పువ్వులాగా మగడి, కౌగిలింతలో ముడుచుకు పొయ్యే మతైన క్షణమది. తాకిళ్ళతో మొదలై, 

తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే...

Image
తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే... ,  దానికంట ఒక్క రోజు ముందే నేను చచ్చిపోతాను....  ప్రక్క రాష్టాల వాళ్ళు భాష భాష అని చచ్చిపోతుంటే  మీరు తెలుగు చచ్చి పోవాలని అనుకుంటున్నారు . . తెలుగంటే 35 మార్కులు ముక్కి ములుగి తెచ్చికోవటం కాదురా అది మనం మన అమ్మతో మన భాధలను ఆనందాన్ని పంచుకొనే వారధి ..  ఐన దెబ్బ తగిలితే sit అని అసుధాన్ని నోటిలో వేసుకొనే మీకు తెలుగు గొప్పతనం ఏం అర్ధం అవుతుంది. / నేను మీకు ఉపన్యాసం చెప్పటానికి రాలేదు తెలుగు తల్లి కోసం పాఠం చెప్పటానికి వచ్చాను సర్ తెలుగు భాష చనిపోదు మీకు కూడా ఏమి కాదు మీరు అతి త్వరలో మల్లి మా ముందుకు వచ్చి మల్లి మంచి మంచి ఉపదేశాలు చెప్తారు అని ఆశిస్తూ...  మీ కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను .. మీకు ఏమి కాదు మీలాంటి మహనీయుల వాళ్ళ ప్రతిరోజు ఎందరో పడుతున్న భాదల్ల్ని మరచి మొఖం మిధ మల్లి చిరునవ్వు చిగురిస్తుంది మీకు దేవుడు నిన్ను నూరేళ్ళు దేవుడు మా మధ్య ఉంచుతారు అని ప్రార్ధిస్తున్నాము .! x

క్షణంలో సగం

Image
క్షణంలో సగం --శ్రీరంగం శ్రీనివాసరావు...(శ్రీ శ్రీ) (ఇది--ఆంధ్ర జ్యోతి మాసపత్రిక, 1949 ఏప్రియల్--ఉగాది సంచికలో ప్రచురించబడింది. తరువాత ఇంకెక్కడైనా ప్రచురించారో లేదో నేను చూడలేదు.) ఒక సాయంత్రం (వాడి పేరు చెప్పను) కనబడ్డాడు. "బయల్దేరు" అన్నాడు. ఎక్కడకని అడిగి లాభంలేదు వాడితో. హఠాత్తుగా అలాగే ఎన్నోసార్లు కనబడి ఏవో ప్రతిపాదనలు చేస్తూ వుంటాడు. నేను మారుమాట లేకుండా వాటిని శిరసావహిస్తూ ఉంటాను. "అనుభవం జ్ఞానానికి జనకుడు" అంటే నేను నమ్మను. అలాగే "అవసరం సృష్టికి జనని" అనే సుభాషితంలోకూడా నాకు నమ్మకంలేదు. అంటే పూర్తిగా నమ్మకం లేదనాలి. అవన్నీ సగం సత్యాలు కాబట్టి సగం సగం మాత్రమే నమ్ముతాను. ఇద్దరం బయలుదేరిన తర్వాత వీడు (ఎవరి పేరైతే చెప్పదలచుకోలేదో వాడు) "ఇప్పుడు మనం లక్షాధికారులం కావడం ప్రారంభిస్తున్నాం. తక్షణమే! జోరుగా నడు" అన్నాడు. ఇద్దరం తక్షణం ప్రారంభించాం. కాని ఆ ప్రారంభం ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉండి పోయింది. అప్పుడు బయల్దేరిన మేము ఇంకా బయల్దేరుతూనే ఉన్నాం. * * * ఈ సాయంత్రం ఇక్కడ ఈ నగరంలో.....సముద్రంలాంటి ఆకాశంలాంటి ఎడారిలాంటి ఆకాశంలాంట

వింజమూరి శివరామ రావు !

Image
వింజమూరి శివరామ రావు ! .  వింజమూరి శివరామ రావు , అంటే మా రాం బాబయ్య గారు బుద్ధ పౌర్ణమి నాడు  పిఠాపురం తాలూకా చంద్రపాళెంలో 15-5-1908లో జన్మించారు.  వీరి తండ్రి గారు రామూర్తి పంతులు .. జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉండేవారు .. పిఠాపురం మహారాజ్ వారి దివానం లో కూడా సలహా దారు వుండేవారు . విరి మరణం తో శివరామారావు గారి BA చదివి ఆగి పోయింది .. తరువాత గుంటూరు లో ఒక ప్రెస్ లో పని చేస్తో చదువు పూర్తి చేసారు  ప్రముఖ అభ్యుదయ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వీరి మేనమామ.  శివ రామారావు కలం పేరు 'గౌతమి'.  శివరామారావు ఆకాశవాణిలో రెండు దశాబ్దాలు (1949-68) స్క్రిప్ట్ రైటరుగా విజయవాడ కేంద్రంలో పనిచేశారు.  ఆకాశవాణిలో చేరడానికి ముందు పత్రికలలో పనిచేశారు. ' జ్వాల ' పత్రికలోను, నవోదయ పత్రికలోను సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. పద్యాలను, గేయాలను సమప్రతిభతో వ్యాయగల నేర్పరి. ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు.  ఈయన అనువాద రచనలో కూడా సమర్ధులు. అమరుకం, మొపాసా కథలు, గోర్కీ కథలు వీరి అనువాద సామర్థ్యాన్ని చాటిచెబుతాయి. కల్పవల్లి ఈయ

ఎర్రచీమలు!

Image
ఎర్రచీమలు! (కృష్ణమూర్తి గారు తన బాల్యంలో చీమలను దీక్షగా గమనించేవారట. చీమలపై ఆయన వ్రాసిన ఓ పేరా స్ఫూర్తిగా)  .  నిలువున్న నిన్నటి చపాతీలు తిందామని చూద్దును కదా, అందులో ఎర్రచీమలు. చీమ! జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కటి ఆకారం! రెండు అండాకారాలు - ఒకటి ఎర్రనిదీ, మరొకటి నల్లనిదీనూ. వాటిని దారంలా కలుపుతూ సన్నటి నడుము. అటూ ఇటూ హడావుడిగా పరుగెడుతూ ఉన్నాయి. ఇటు వైపు వెళ్ళే చీమకు అట్నుంచి వచ్చే చీమ అడ్డుపడితే, ఓ లిప్తపాటు తలను తాకించి, ఏదో సందేశాన్నందిస్తూంది. కొన్ని చీమలు కలిసికట్టుగా చేరి, ఓ పెద్ద ముక్కను లాగుతున్నాయి. ఆ చీమలబారు ఎక్కడి నుంచీ మొదలవుతుందో చూద్దామని పరికిస్తూ వెళితే, గోడవారగా పక్కగదిలోకి, అలా గది చివర్న ఓ చిన్న పుట్టలోనికి దారి తీసింది. అందులో సగం బారును లెక్కపెడితే, ఉజ్జాయింపుగా 450 చీమలున్నాయి. ఇటు వెళుతున్నవి, తిరిగి వస్తున్నవీ కలిపి. అంటే, దాదాపు వేయి చీమలు ఆహార సేకరణ అనే ఆ మహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి! భగవంతుని సృష్టిలో అన్నీ అద్భుతాలే. ఉహూ.. ఆ వాక్యం బావోలేదు. సృష్టిలోని అణువణువులోనూ భగవంతుడు తానై రూపాంతరం చెందాడేమో. ఠాగూర్ అనుకుంటాను గుర్తు లేదు. చూడగలిగితే భ

శంకరాభరణం!

Image
శంకరాభరణం! సభకు నమస్కారం శంకర శాస్త్రి సభకు పరిచయం చేసుకొనే మాట. జంధ్యాల రాసిన ఈ వాక్యం ఎంత కీర్తిని పొందిందో ప్రస్తుతం దీన్ని వాడే వక్తల సంఖ్యను లెక్కిస్తే తెలుస్తుంది. . బ్రోచేవారెవరు రా. ఈ రాగలను అవహేళనగా గానం చేస్తున్న పండితుతో శాస్త్రి గారు కొపావెశం తో.... 'ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు.  నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది.  తాదాత్మ్యం పొందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి గంగాజలంలా పెల్లుబికిన భావమది, గీతమది. ఆధునికత పేరుతో, మిడి మిడి జ్ఞానంతో మన పూర్వీకులు మనకిచ్చిన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని నాశనం, అపభ్రంశం చేయకయ్యా!'  అని చెప్పి వెళ్ళీపోయినతరువాత... పండితుడు శిష్యురాలతో నీకేమైనా అర్థమైన్ద? అని అడుగుతాడు  ఓ.. అర్ధమైంది నీకు ఏమిరాదని..... శాస్త్రీయ రాగాలను అవహేళన చేస్తున్న ఒక పండితునికి శంకర శాస్త్రి బుద్ది చెప్పే తీరిది. . " ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి" ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై స

మాయదారి కృష్ణుడు !

Image
మాయదారి కృష్ణుడు ! . "ఎలా వచ్చెనమ్మ కృష్ణు డేలా వచ్చెనే! ఈ మాయదారి కృష్ణు డోచ్చి మహిమ చేసెనే! ఉట్టిమీద పాలు,పెరుగు ఎట్లా దించెనే! నే కొట్టబోతే దొరక డమ్మా చిన్ని కృష్ణుడు" .

స్మశాన వేదాంతం.!

Image
స్మశాన వేదాంతం.! (బలజేపల్లి లక్ష్మి కాంత కవి .) . ....... శా. మాయామేయజగంబె నిత్యమని సంభావించి మోహంబునన్‌ నా యిల్లాలని నా కుమారుఁడని ప్రాణంబుండునందాఁక నెం తో యల్లాడిన యీ శరీర మిపుడిందుం గట్టెలం గాలుచో నా యిల్లాలును రాదు పుత్రుఁడును దోఁడైరాఁడు తప్పింపగన్‌. .......... కన్యాశుల్కం...(గురజాడఅప్పారావు.) . ఇల్లు ఇల్లుఅనేవు ఇల్లు నదనేవు.. నీఇల్లుఎక్కడేచిలుక. ఊరికి ఉత్తరాన సమధి పూరిలో కట్టే ఇల్లు ఉన్నదే చిలుక మోసేరునలుగురు వెంబడిపదిమంది వెంటనెవరు రారుచిలుక కాలి పోయేదాక కావలిఉందురు కాని వెంటనెవరు రారుచిలుక!

వెర్రి తలల తె(లు)గులు!

Image
వెర్రి తలల తె(లు)గులు! . 'బెంకట్రావ్! బెంకట్రావ్! భై ఆర్యూ బాండరింగ్ ఇన్‌ ద బరండా"? . "ఢిల్లీ" ని దిల్లీ అంటున్నారు, "కాశ్మీర్" ని కశ్మీర్ అంటున్నారు. వాళ్లు అలాగే అంటారు అంటున్నారు! సరే. మరి "పశ్చిమ్‌ బంగ" యేమిటి? అనేక భారతీయ భాషల్లో, అంగ, వంగ, కళింగ......రాజ్యాలున్నాయి. అందులో ఈ "వంగ" ఒకటి. అక్కడ వాళ్లు మాట్లాడే భాషని వాళ్లు "బంగ్లా" అంటారు. అందుకే, తూర్పు బెంగాలు వాళ్లు వాళ్ల దేశం పేరు "బంగ్లాదేశ్" అని పెట్టుకున్నారు. మరి మనదేశం లో వున్నది "పశ్చిమ బంగ్లా" యే అవుతుంది కదా? ఇంగ్లీషువాళ్లు, "బెంగాల్" అన్నారు. "బెంగాలు విభజన" ఓ చారిత్రక సత్యం. బెంగాలు ని తెలుగులోకి అనువదించుకుంటే, "బంగాళ" అయ్యింది. ఇంగ్లీషువాడు "బే ఆఫ్ బెంగాల్" అంటే అది "బంగాళాఖాతం" అయ్యింది! ఇప్పుడది "బంగాఖాతం" కాదు (అయిపోదు) కదా? వాళ్లు "వ" అనే అక్షరాన్ని "బ" అని పలుకుతారు. "రవీంద్ర" ని "రబీంద్ర" అంటారు. అవనీ ని అబనీ అంట

-జై హింద్ !

Image
-జై హింద్ ! . ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ క్రింది విషయం. చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డల విషయం. వారిని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.  🔫🔫🔫🔫🔫🔫🔫🔫🔫 నా సీట్ లో కూర్చున్నాను ఢిల్లీ లో . ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .  సరిగ్గా టెక్ ఆఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న అన్ని సీట్ల లోనూ సైనికులు కొందరు వచ్చి ఆక్రమించుకున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుంది అని పక్కన కూర్చున్న అతడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని  " ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .  ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి  . " మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు  &q

నల్లని కన్నయ్యా..

Image
నల్లని కన్నయ్యా.. . కలువపూలు తెలుపు, కమలములు తెలుపు, కల్పవృక్షం తెలుపు ! .  కసేరుక తెలుపు, కళానిధి తెలుపు, కామ ధెనువు తెలుపు ! .  కనికరము తెలుపు, కర్తవ్యం తెలుపు, కర్పూరం తెలుపు, ! .  కళ దేతుం తెలుపు, కళ త్రం తెలుపు, కల్యాణం తెలుపు, ! .  కాదమ్బరీ తెలుపు, కామేశ్వరీ తెలుపు, కారుణ్యం తెలుపు, ! .  కళ్ళు తెలుపు, కుతూహలమ్ తెలుపు, కిరణం తెలుపు, ! .  అన్నం తెలుపు , అన్నపూర్ణ తెలుపు, ఆనందం తెలుపు, ! .  ఉప్పు తెలుపు , ఉమ్మి తెలుపు , ఉషోదయం తెలుపు, !

తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.!

Image
తెలుగు సాహిత్యంలో హాస్యం.....శ్రీశ్రీ.! . అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ తన శతకాల్లో అక్కడక్కడ హాస్యాన్ని మెరిపించారు. . “దయ్యాలను చూపిస్తా నయ్యారమ్మనుచు నొక్క ఆసామి నా కయ్యో తన కూతుళ్లను చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా ” . ఇక పేరడీ అనేది ఫక్కున నవ్వించే ప్రక్రియ ‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే పద్యానికి శ్రీశ్రీ పేరడి ప్రసిద్ధమైనది. . “ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్ చొప్పడిన యూరకుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా ” . శ్రీశ్రీ రాసిన ‘ఏ దేశ చరిత్ర చూసినా’ కవితకు మచిరాజు దేవీప్రసాద్ గారి పేరడీ. . “ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణము రహదార్ల చరిత్ర సమస్తం ధూళి ధూస పరివ్యస్తం. ” ఆమోదయోగ్యమైన హాస్యాన్ని ఆనందంగా, అనుభవిస్తేనే ఆహ్లాదం, ఆరోగ్యం.

ఎదురు చూపులు!

Image
ఎదురు చూపులు! .  కమ్మగా పాడే కోయిలనడిగాను,  నీ తీయని మాటలతో నను మురిపించేది ఎప్పుడని ...  చల్లగా వీచే చిరుగాలిని అడిగాను , నీ చల్లని చూపుతో నను తాకేది ఎప్పుడని..  వర్షించే మేఘాన్ని అడిగాను ,  నీ నవ్వుల జల్లుల్లో నను తడిపేది ఎప్పుడని ...  హాయిని పంచే వెన్నెలని అడిగాను ,  ఆ వెన్నల్లో హాయిగా ఊసులడేది ఎప్పుడని ...  పరుగులు తీస్తున్న సెలయేటిని అడిగాను ,  నీ పరుగు నా కోసమేనా ? అని ... నాలో ఉన్న నా ప్రాణమైన నీకు తెలిపాను , నీలో ఉన్న నీ ప్రాణం నేనేనని ,  నా దరి చేరమని ..... నను బ్రతికించమని 

గోదావరి.....ఆవకాయ.!

Image
గోదావరి.....ఆవకాయ.! . "దారెరుగని వాడును గో దారిన తానొక్కమారు తడవని వాడును కూరిమిన ఆవకాయను ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి" . భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు,  . ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము. . ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది.

కొత్త .....కపిత్వం.! .

Image
కొత్త .....కపిత్వం.! . మధువు మైకమునిచ్చు మగువ సుఖమునిచ్చు ఈ రెండింటి వల్ల ఖర్చు హెచ్చు ఆ పై సకల రోగములు వచ్చు . భావము: మధువు (మద్యపానం) మత్తునిస్తుంది. స్త్రీ లైంగిక సుఖాన్ని అందిస్తుంది. కాని ఈ రెండింటి వల్ల ఖర్చు అధికమవుతుంది. ఆ తర్వాత అన్ని రకాల రోగాలు వస్తాయి.