హాస్య ప్రధానమైన చాటు సంభాషణలు.!

హాస్య ప్రధానమైన చాటు సంభాషణలు.!

.

“ ఆవంఛావారి పావంఛా మీద గావంఛా ఆరవేశాను.

.

అది ఎండిందంఛావా? లేదంఛావా?” 

.

అవంచా అనేది ఇంటి పేరు, పావంచా అంటే అరుగు. గావంచా అంటే చిన్ని టవలు.

.

.ఇంకో చమత్కారయుతమైన చాటు వాక్యంచూద్దాం.

.

.

ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్ళికి కొంతమంది కవులు,పండితులు వెళతారు. వివాహానంతరం వారికి సంభావనలు (డబ్బులు) ఇచ్చేటప్పుడు ఆ యజమాని కవులకి కొంచెం ఎక్కువ, పండితులకి తక్కువగా సంభావనలు ఇస్తాడు. వారిలో ఒక కవికి తక్కువ సంభావన వస్తుంది.

.

ఆ కవికి కోపంవచ్చి యజమానితో ఇలా అంటాడు. (ఇవి పద్యపాదాలు)

.

“ కవిగనుము కనులు లేవా!”

నేను కవిని నీకు కనిపించటం లేదా? అని. 

యజమానికూడా పద్యపాదంలోనే కోపంగా సమాధానం చెపుతాడు.

“ కవివైతే ‘చంకనాకు’ గంటంబేది?” అని.

(పూర్వం వ్రాసుకోడానికి తాటాకులు ఉపయోగించేవారుకవులు. అట్టి తాటాకుల కట్ట చంకలో పెట్టుకొనేవారు. మొలకి వ్రాసుకొనే గంటం వ్రేలాడేది.)

నువ్వు కవివైతే నీ చంకన్+ఆకు= చంకలో ఆకు, మొలలో గంటం ఏది? అవి లేవు కనుక పండితుడనుకొని సంభావన తక్కువగా ఇచ్చేను. అని సమాధానం.

.

ఇందులో ఇంకో చమత్కారం “ చంకనాకు” అనేది ఓ తిట్టు కూడా! 

(కోపంతో నా చంకనాకు అని అంటారు) 

ఇట్టి హాస్య ప్రధానమైన చాటు సంభాషణలు సాహిత్యంలో కోకొల్లలు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!