పైనున్న వాడు బహు కొంటెవాడు.

పైనున్న వాడు బహు కొంటెవాడు. 

.

పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా అందరినీ ఆడించి, ఆడుకుంటాడు. 

.

అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడగా, ‘వీడి’కి వజ్రాలూ, ‘వాడి’కి మరమరాలూ యిస్తాడు. 

.

ఉప్పుకి, కప్పురంలా గుబాళించాలన్న ఉబలాటం కలిగిస్తే, 

.

కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా చూస్తాడు,

.

జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని కోరికలతో

.

కాలక్షేపం చేయించేస్తాడు.

రామదాసు గారు (భద్రాచలం తాలూకా కాదు) అన్నట్టు, – అంతా ‘వాడి’లీల.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!