"నీ తోడు " నాకు కావాలి! "ప్రమాణం చెయ్యి"!

"నీ తోడు " నాకు కావాలి! "ప్రమాణం చెయ్యి"! 

.

ఆ అమ్మాయి పేరు రచన!అప్పుడే పెళ్ళై అత్త వారింటికి వచ్చింది భర్తతో. 

ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే సంస్కృతాంధ్ర భాషల్లో ఉభయ భాషా ప్రవీణురాలు. అబ్బాయికుడా ఉభయ భాషా ప్రవీణుడే!ఆ నూతన దంపతులకు ఏకాంతం దొరికింది. 

ఇద్దరూ పిచ్చా పాటీగా మాట్లాడుకుంటున్నారు.భర్త అడిగాడుకదా! 

నా జీవితాంతం నీ తోడు నాకు కావాలి."ప్రమాణం చెయ్యి"!అన్నాడు. 

అందుకే గదా నేను వచ్చింది.అని సమాధానమిచ్చింది భార్య. 

అంతేకాదు నాతోడు నీకు కావాలి కాబట్టి నేనొక పొడుపు కధ పొడుస్తాను. 

నీకు తెలిస్తే సమాధానం చెప్పు.అప్పుడు నా తోడు నీదే!అంది.నవ్వుతూ! 

.

" ప్రభాతేకీ దృశం వ్యోమ ప్రమాణేకీ దృశం వచ: ఆంధ్ర గీర్వాణ భాషాభ్యాం ఏకమేవోత్తరం వద!"

.

అనగానే ఆ ఉభయ భాషా ప్రవీణుడు ఏదో కొంచెం మిడి మిడి జ్ఞానంతో ఏమిటీ?నీ ప్రశ్నలు? 

.

ఉదయం ఆకాశం ఎలా ఉంటుంది? ప్రమాణం చేసేటప్పుడు తెలుగులో ఏమంటారు?

ఇవా! నీ రెండు ప్రశ్నలు! పైగా ఆ జవాబు ఆంధ్ర గీర్వాణ రెండు భాషల్లోనూ ఒక పదమేనా? ప్రశ్నలు సులభమే!ఐనా జవాబు చెప్పడం కొంచెం!కష్టమేనే!

అంటూ జుట్టు పీక్కుంటున్నాడు మన వాడు. ఇదేదో చిత్రమైన పొడుపు కధలా ఉందే!అని మరిమరి ఆలోచించాడు.

నిన్నపెళ్ళితంతులో,బిందెలో ఉంగరం తియ్యమంటే!ఆమెకు అందకుండా తెలివిగా,మూడుసార్లూ....నేనే గెలిచాను. ఇప్పుడు ఏమిటి?ఇలా ఓడిపోయేలా ఉంది నా పరిస్థితి!అనుకుంటూ,

సరే! నా ఓటమిని,నీకోసం!ముద్దు ముద్దుగా!తొలిసారి అంగీకరిస్తున్నాను. 

ఈ జవాబు తెలిసినట్టే తెలిసి,ఎతకీ అందకుండా పోతోంది.అని తెలివిగా ఆమె దారికొచ్చాడు.

.

అప్పుడు మన రచన! సంస్కృత భాషలో "నీ తోడు" అనే పదాన్ని విడదీసి రెండు చేస్తే,(అంటే సంధి విడదిస్తే ) నీత+ఉడు="నీ తోడు" అవుతుంది.నీత = తొలగిన,ఉడు =నక్షత్రాలు 

వెరసి "నీ తోడు" అనే పదానికి తొలగిన చుక్కలుగలది.అని భావం. 

తెలుగులో మనం ఎవరితోనైనా ప్రమాణం చేసేటప్పుడు "నీ తోడు"అని జవాబిస్తాం కదా! అ

ది ఉండనే ఉంది. అలా రెండు భాషల్లోనూ ఒకే పదం మొత్తం మీద "నీ తోడు".సరేనా! 

కాబట్టి నీతోడు నాకు!నా తోడు నీకు! ఎల్లవేళలా ఉండాలని ప్రమాణం చేసి మనం నేటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం! సరేనా? అనగానే ఆనందంతో నవ్వుకున్నారు ఇద్దరూ!

.

మొత్తం మీద ఇలాంటి చమత్కార పొడుపు కధలు ఆంధ్ర గీర్వాణ భాషల్లో కోకొల్లలు.

చూశారూ!మన ఆంధ్ర గీర్వాణ భాషలు ఎంత తియ్యనివో!మరెంత చక్కనివో!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!