ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! ! .

ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! !
.
ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా ,
అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి "
అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో .......
కలనాటి ధనము లక్కర
గలనాటికి దాచ కమల గర్భుని వశమా
నెల నడిమి నాటి వెన్నెల
యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.
.
అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం
నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా
గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక
అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు .
ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా
పద్యం చెప్పాడు .
.
ఎమి తిని సెపితివి కపితము?
బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
ఉమెతకయను తిని సెపితో
అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!
భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని
అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి?
భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?
.
ఎంత వెటకారం ! అలసని పెదనా !అని సంబోధిస్తూ ...
.
దీనికీ సభికులు నిశ్శబ్దం గానే ఉన్నారు .
అల్లసాని వారు ఆ పదాన్ని మార్చలేదు . ఆ పద్యాన్నీ వెనక్కి తీసుకోలేదు .
రెండు పద్యాలూ చరిత్రలో అలాగే నిలిచి పోయాయి .
ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! !

.x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!