అందం .

అందం .

(ఆడవాళ్ళు తాము అందంగా లేమని బాధపడనక్కరలేదు)

ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అందం అనేది సహజంగా వచ్చేస్తుంది.... 

ఈ రంగులను, ఈ రంగు రంగులతో కూడిన అందమైన పూలను, పళ్లను, పక్షులను, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారో తెలీదు..

కొందరు భగవంతుడంతారు.. కొందరు ప్రకృతే సృష్టించింది అంటారు..

.. 

కానీ ఈ ప్రకృతిలో జీవ రాసులన్నిటిలోనో ఉన్న" ఒకే ఒక్క తేడా ఆడ మగ."

. ..

మనము ఎన్ని తేడాలు ఏర్పరుచుకున్నప్పటికీ.. 

దేవుడు సృష్టించిన తేడా ఇదేనేమో...

( నాకు ఇంతకన్న తేడాలు ఏమున్నాయో తెలీదు మరి)

ఈ అందం అనే ఆలోచన మనిషికి వచ్చిందేనేమో.. లేకపోతే ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.. ఎందరో తాము అందంగా లేమని పక్క వారితో పోల్చుకుని భాదలు పడుతున్నారు.. మరి కొందరు అందాన్ని ఇనుమడించుకోవాలని తాము సంపాదించిన దానిని అంతా బ్యూటీ పార్లర్లకు సమర్పించు కుంటున్నారు....

మగ వారి సంగతి ఏమో గానీ ఆడవాళ్ళు మాత్రం అందం అనే విషయానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు...

అందుకేనేమో ఆడవాళ్ళ మీద వారి అందం మీద, వారు తయారు అవడానికి పట్టే సమయం మీద అనేక రకాల జోకులు పుట్టుకొచ్చాయి.

నిజానికి ఆడవాళ్ళు అందంగా ఉండరని ఎండలో కాసేపు పనిచేస్తే వారి అందం తరిగిపోతుందని అనేక మంది చెబుతుంటారు.

అది నిజమే ననడానికి కొన్ని ఆధారాలు కూడా లేకపోలేదు. 

సృష్టిలో అందం అని చెప్పుకునే లక్షణాలన్నీ మగజాతికే ఉన్నాయి.

ఉదాహరణకి మగ కోయిలే పాడుతుంది, మగ నెమలే పురి విప్పి నాట్యం చేస్తుంది, మగ సింహానికే జూలు ఉంటుంది, ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.

కానీ మగ జాతికి అంత అందం ఎక్కడ నుంచి వచ్చిందంటారా??!!

అవన్నీ ఆడవారి రక్తమాంసాలతో తయారైన దేహాలు కదండీ.. అందుకే అంత అందం..

ఆడవారి అందం అంతా దేవుడు మగవారికి ఇచ్చేసి ఆడవారికి ’ మాతృత్వం’ అనే అందాన్ని ప్రసాదించాడు. దీనికి సంబంధించి ఒక కధ కూడా ఉందండీ.. 

ఒక సారి దేవుడు ఆడవాళ్లని అడిగాడట.. మీకు అందం కావాలా మాతృత్వం

( తల్లి ప్రేమ ) కావాలా అని?!

ఆడవాళ్ళు మాతృత్వం కావాలని కోరుకున్నారట. 

అంచేత ఆడవాళ్ళు తాము అందంగా లేమని బాధపడనక్కరలేదు, 

కృత్రిమ అందం కోసం తాపత్రయపడనక్కరలేదు.. ఎందుకంటే ఆడవారికి మాతృత్వమే ఎన్నటికీ తరగని అద్భుతమైన అందం.

Vinjamuri Venkata Apparao's photo.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!