నేనెవరు?

నేనెవరు?

.

ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయిన కథ అందరికీ తెలుసు. పేరు మర్చిపోవడంతో మొదలైన కథ ,ఒక అన్వేషణగా సాగి ,పేరు మళ్లీ గుర్తుకుతెచ్చుకోవడంతో ముగుస్తుంది .

మానవుని కథాఅంతే. ఈగ ఇల్లు అలుకుతూ పేరు మర్చిపోయినట్టు,లౌకికవ్యవహారాలలో పడి,మానవుడు తాను ఎవరైనదీ మరచిపోతున్నాడు. “నేనెవరు?” అని ప్రశ్నించుకొని,సమాధానం కోసం అన్వేషిస్తున్నాడు. ఆ అన్వేషణే ఆధ్యాత్మిక సాధన. మానవుని చరిత్ర. 

చిన్నతనంలో తరతమ బేధాలు తెలియవు. ఆ అమాయకత్వం అమూల్యమైనది. పెద్దయ్యాక ‘సామజిక స్పృహ’ ఏర్పడుతుంది. అంతరాలు,అభిప్రాయాలు ఏర్పడి నామరూపాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ సామాజిక స్పృహ కొన్నాళ్ళకు నిస్పృహ కలిగిస్తుంది.దానికి తోడు చేసే పనే కాదు,తీరిక సమయంలో చేసే కాలక్షేపం కూడా యాంత్రికం అయిపోవడం. దీనివల్ల అర్థాన్ని గడిస్తున్నా, బ్రతుకు అర్ధశూన్యంగానే వుందే అనిపిస్తోంది.

ఈ నిస్పృహ నుండి బయటపడి జీవితం పట్ల ఆసక్తీ,ఉత్సాహం ఏర్పడాలంటే సమాజాన్ని, పరిస్థితుల్ని దాటి చూడాలి. అత్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ఇందుకు సంస్కృతి సహకరిస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!