కథా శిల్పి చాసో.- చాగంటి సోమయాజులు - కథ 'కుంకుడాకు'!

కథా శిల్పి చాసో.- చాగంటి సోమయాజులు - కథ 'కుంకుడాకు'!

.

నేను చదివిన 'కుంకుడాకు' కథ 1943లో అరసం రచయితల తొలి సభాసంచికలో ప్రచురితమైన కథ. 

1985లో చాసో సప్తతి సందర్భంగా (ఆయనకు 70ఏళ్ళ సందర్భంగా) కళింగ కథల సంకలనం ఆయన తన సొంత ఖర్చుతో ప్రచురించారు.గురజాడ వారి ప్రాంతానికి, అంటే కళింగ ప్రాంతానికి చెందిన కథకుల సంకలనం ''కళింగ కథానికలు''పేరిట చాసో ప్రచురించారు. 

ఆ సంకలనంలోని కథలు చాసో తన భావాలకు అనుగుణంగా ఏర్చి కూర్చి నవి. 

''ఈ కథ నేను రాస్తే ఎంత బావుణ్ణు'' అనే భావం కలిగించిన కథలను ఎంపిక చేసుకున్నానని ఆయన తన ముందుమాటలో చెప్పుకున్నారు. అంటే అది కేవలం ఆయన వ్యక్తిగత ఇష్టాలతో కూడుకున్న సంకలనం అన్నమాట. అందులో ఆయన తన కథ 'కుంకుడాకు'ను ఎంపిక చేసుకున్నారు. ఆ రకంగా అది ఆయనకు నచ్చిన కథ కాబోలు అనుకున్నాను. అంటే కాదు, ఆ ముందు మాటలో ఆయన ఇంకో మంచి మాట అన్నారు. ''నేను కథా రచనా నేర్చిన రీతిలో ఈ సంకలనాన్ని రూపు దిద్ది యువతరానికి అందిస్తు న్నాను. యువతరం కోసమే ఈ సంకలనం'' అని చెప్పారు.

.

ఇక 'కుంకుడాకు' కథ గురించి... ఇందులో వర్గ దోపిడీ లాంటి పడికట్టు పదాలు ఏవీ వుండవు. కానీ కథ మాత్రం అందుకు సంబంధించిందే. ఇద్దరు బాలికలు, అందులో ఒకమ్మాయి వయస్సు ఎనిమిదేళ్ళు, రెండో అమ్మాయి వయస్సు చెప్పరు. ఇద్దరూ పొలాల్లోకి వెళ్తారు.

ఒకమ్మాయి మోతుబరి రైతు కూతురు. కొంచెం హోదా వున్నది. 

రెండో అమ్మాయి కూలివాడి కూతురు. రైతు కూతురు పారమ్మ చింకి పరికిణి కట్టుకుంటే, కూలి కూతురు గవిరి గోచి కట్టుకుంది. 

పారమ్మ ఊరగాయ తింటే. గవిరి ఇంట్లో పొయ్యి లేవక పస్తు ఉంది. నెత్తిమీద కొండంత సంసారభారం పెట్టుకున్న గవిరి ఆకు, అలమా, కర్ర ఏరుకుంటుంటే పారమ్మ పట్టుబడతా నన్న భయం లేకుండా పక్క పొలంలో పెసరకాయలు తెంపుకొని తింటుంది. ఎందుకంటే ఆ పిల్ల అప్పలనాయుడు బొట్టి. అదే పని గవిరి చేస్తే అది పెద్ద నేరమవుతుంది. అందుకని రాత్రంతా తిండిలేక కడుపు కాలుతున్నా, పారమ్మ చేసిన పని గవిరి చేయలేకపోయింది. కుంకుడాకు చూడగానే గవిరి ఆకలి కూడా మర్చిపోగలి గింది.ఎందుకంటే కుంకుడాకులు దళసరివి. నాలుగాకులు ఏరితే తట్ట నిండు తుందని గవిరి ఆశ. కుంకుడా లు గంపకెత్తుకొని ఇద్దరూ కాంభుక్తా కళ్ళాం వారపోతుం డగా సింతకాయలు కనిపిం చాయి.

పాపం అవి తినాలని గవిరి రాళ్ళు విసురుతుంటే కాంభుక్తా వచ్చేశాడు. గవిరి తట్టని కిందపడేసి అక్కడ కనిపించిన పేడని కూడా అదే దొంగతనం చేస్తోందని అనుమానించి దాన్ని చెప్పుతోకొట్టి గవిరి కిందపడి ఏడుస్తుంటే తృప్తిగా వెళ్ళిపోయాడు. 

చెయ్యని తప్పుకి నెత్తినోరు కొట్టుకొని చెప్పినా వినకపోతే, వూరంతా భయపడే కాంభుక్తాని బూతులతో తిట్టడం ప్రారంభించింది గవిరి.

''లమిడీ కొడకా! నీ సింత కంప లెవిడికి అక్కరనేదు'' అనుకుంటూ కుంకుడాకుని కూడదీసి తట్టకెత్తి ఇంటికి బయలుదేరింది. 

గవిరి, పారమ్మ పొలాల్లోకి వెళ్తున్నప్పుడు పక్కనున్న స్కూల్లో పిల్లలు తల్లీ నిన్ను దలంచి, సరస్వతీ నమస్తుభ్యం పాడుతున్నారు. గవిరి ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు ఎక్కాలు వల్లె వేస్తున్నారు. అంతే కథ.

.

కథ చిన్నదే. విషయం మాత్రం పెద్దది. డబ్బున్నవాడు తప్పులు చేస్తే తప్పించుకోగలగటం. పేదవాడు చిన్న చిన్న తప్పులకు పెద్ద శిక్షలు అనుభవించటం అనే అంశాన్ని ఇద్దరు పిల్లల వైపు నుండి రచ యిత చూపించాడు.

ఇక స్కూల్‌ పిల్లల ప్రస్తావన మామూ లుగా చూస్తే కథకి అనవ సరంగా కనిప ిస్తుంది. కానీ, ముందే చెప్పినట్లు రచయిత అనవసరమైనవేవీ కథలో చూపించడు.గవిరి వయస్సు పిల్లలు బళ్లో చదువుకుంటూ పాఠాలు నేర్చుకుం టున్నారు. 

ఆ చదువు సమాజంలో బతకటానికి పనికివస్తుందని మనందరి నమ్మకం. కానీ పేదవాళ్ళు జీవితం నుండి బతుకు పాఠం నేర్చుకుంటారని చెప్పాడు రచయిత ఈ కథ ద్వారా. తప్పుచేయలేదని కాంభుక్తాకి నెమ్మదిగా చెప్పింది గవిరి. వినలేదు. 

అతడ్ని బూతులతో తిట్టడానికి కూడా వెనుకాడలేదు. అలాగే అతని చింత కంపల్ని ఇవెవడికి కావాలి అని తిరస్కరించి తన అభిమానాన్ని చాటుకుంది. 

ఎవరి సొత్తు కానీ కుంకుడాకుని ఏరుకుంది.రైతు కూతురు అయివుండి పారమ్మ పొలంలో పెసరకాయలు తిని పబ్బం గడుపుకుంది. 

డబ్బు తక్కువైనా పేదవాడు గుణానికి మిన్న అని కూడా అర్థమవుతుంది

. అభ్యుదయాన్ని కాంక్షిస్తూ, మార్క్సిజాన్ని నమ్మిన రచయిత చాసో సామాజిక 

అవగాహనకు అద్దం పట్టే కథ ఇది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!