దేశమునక యరిష్టము.!

దేశమునక యరిష్టము.!

.

మధు సేవ నాటకమున దేశారిష్ట కారణములను వివరించించిన

సీసపద్యమును చూచినట్లయితే మనకాశ్చర్యం కలిగిస్తుంది. 

కవి నిర్మొహమాటంగా ఎంత స్పష్టంగా వ్రాశాడో చూడండి. 

.

సీసము:-

కొంపలు తెగనమ్మి కోర్టుల, రైళ్ళ, కా

ఫీ హొటేళ్ళ, వకీళ్ళ, పెంచువారు.

పండిన సరు కెల్ల పర దేశముల కంపి

కరవున కిర వేర్పరచు వారు

మూడు ప్రొద్దులు ముష్టి మున్సిపల్ పదవి లో

పలనుండి కనులు కన్ పడనివారు.

ఆస్తి భార్య పేర అప్పులు తమ పేర 

పెంచి ఐ.పీ.లను పెట్టువారు.

తేటగీతి:-

బట్ట కొఱకు, జుట్టు కొఱకు, బ్రాంది కొఱకు,

సిరులు పర దేశముల పాలు చేయువారు.

పూర్తిగా నెల్లెడల వట్టిపోవు దనుక 

దేశమునకీ యరిష్టము తీరిపోదు.

నిరంకుశాః కవయః అన్నరుకదా పెద్దలు. 

అందుకే అంత నిర్మొహమాటంగా వ్రాయగలిగాడు.

పద్య రచన కాని, గద్య రచన కాని, యదార్థానికి దర్పణం పట్టాలంటారు పెద్దలు. అతిశయోక్తులు, కవిచమత్కారాలు లాంటి వన్నీ కూడా యదార్థాన్ని ప్రతిపాదించిన పిదపనే చూపించాలి.

మనం కూడా యదార్థానికి ప్రతి బింబంలా పద్య రచన చేయగలిగితే ఆదరణీయం కాకపొతుందా!

జైహింద్.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!