దేవ దేవ ధవళాచల.. -- నాకు నచ్చిన పాట! .

దేవ దేవ ధవళాచల.. -- నాకు నచ్చిన పాట!
.
(కృతజ్ఞతలు ....-కె సుబ్రహ్మణ్యం, కావలి)
.
ఇప్పటికే ప్రేక్షకులను అలరించే పౌరాణిక చిత్ర రాజం భూకైలాస్.
అందరికీ తెలిసిన కథతోనే ఆద్యంతం కమనీయంగా రూపొందించారు.
మహాసాధ్వి సీతను అపహరించిన రావణుడే ఈ చిత్రంలో అద్వితీయ శివ భక్తుడిగా మనకు దర్శనమిస్తాడు.
ఎన్టీ రామారావు నటన ఈ చిత్రంలో నభూతో నభవిష్యతి. రావణుడు వస్తూ
‘దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో’ అంటూ ఘంటసాల గానం చేసిన పాట మహాదేవుని వివిధ నామాలతో అద్భుతంగా మలచబడింది. ఆయన రూపం ధవళాచలము. అంటే వెండికొండ. ఆయన గంగాధరుడు. దేవలోకాన్ని సుధాసాగరంగా, మహాదేవుణ్ణి హిమకరుడిగా (చంద్రుడు) అభివర్ణిస్తూ పాట సాగుతుంది. పాలిత కింకర -కింకరులు అంటే సేవకులు.. అంటే భక్తులకు ఆయన కొంగుబంగారం అన్న మాట. భవనాశంకర -్భవ అంటే సంసారం. నా శంకరం అంటే దాటడం అనే అర్థం. నా వేరుచేస్తే శంకరం.. అంటే సుఖాలను ప్రసాదించే స్వామి. శంకర పురహర నమో నమో -త్రిపురాసురులను సంహరించిన ఓ దేవ దేవా వందనం అంటూ ప్రార్థనాగీతం మధుర మనోహరంగా సాగుతుంది.
.
అదే సమయంలో మరోవైపునుండి దేవర్షి నారదుడు వస్తుంటాడు.
‘నారాయణ హరి నమోనమో.. నారద హృదయ విహారీ నమో’ అని గానం చేస్తూ రావణుని వద్దకు రాగానే పాట ఆపుతాడు. నారాయణుడంటే రావణునకు గిట్టదుకదా!
ఈ రెండు మధురమైన గీతములను సృష్టించిన సముద్రాల నిజంగా ధన్యుడు. తెలుగులో పౌరాణిక చిత్రాలు ఉన్నంత వరకు ఆయన పేరు మారుమోగుతూనే ఉంటుంది.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!