శంకరాభరణం!

శంకరాభరణం!

సభకు నమస్కారం

శంకర శాస్త్రి సభకు పరిచయం చేసుకొనే మాట. జంధ్యాల రాసిన ఈ వాక్యం ఎంత కీర్తిని పొందిందో ప్రస్తుతం దీన్ని వాడే వక్తల సంఖ్యను లెక్కిస్తే తెలుస్తుంది.

.

బ్రోచేవారెవరు రా. ఈ రాగలను అవహేళనగా గానం చేస్తున్న

పండితుతో శాస్త్రి గారు కొపావెశం తో....

'ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. 

నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు.

ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. 

తాదాత్మ్యం పొందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి గంగాజలంలా పెల్లుబికిన భావమది, గీతమది. ఆధునికత పేరుతో, మిడి మిడి జ్ఞానంతో మన పూర్వీకులు మనకిచ్చిన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన సంగీతాన్ని నాశనం, అపభ్రంశం చేయకయ్యా!' 

అని చెప్పి వెళ్ళీపోయినతరువాత...

పండితుడు శిష్యురాలతో నీకేమైనా అర్థమైన్ద? అని అడుగుతాడు 

ఓ.. అర్ధమైంది నీకు ఏమిరాదని.....

శాస్త్రీయ రాగాలను అవహేళన చేస్తున్న ఒక పండితునికి శంకర శాస్త్రి బుద్ది చెప్పే తీరిది.

.

" ప్రతి తెలుగువాడి గుండె లోతుల్లోకి" ఈ సినిమా వెళ్ళింది అని చెప్పటనికి ఇందులోని ప్రతి పాట నిత్య యవ్వనమై సజీవంగా ఇప్పటికీ వినిపించటమే అందుకు కారణం.

సంగీతం గురించి ఇప్పుడు అప్పుడు చాలాతక్కువ మందికే తెలుసు,

కానీ ఈ సినిమా చూసిన తరువాత పామరుని దగ్గరనుండి సంగీత విధ్వాంశులు దాకా శభాష్ అనిపిచ్చుకున్న ఏకైక తెలుగు సంగీత చిత్రం.

ఇందులో నటించిన (జీవించిన ) నటీనటులు, సాంకేతిక నిపుణులు కు, దర్సక, నిర్మాత ల కు నమ:సుమాంజలీలు. 

.

పాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను'

సినిమా చివరలో శంకర శాస్త్రి సభికులతో చెప్పే మాట

.

శంకరాభరణం 1979 లో కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నిర్మంచబడిన సంగీత ప్రాధాన్యత గల చిత్రం. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి అంతగా పేరులేని నటీ నటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించటం విశేషం. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంశలను కూడా పొందింది. ఈ చిత్రానంతరం చిత్రదర్శకుడు కె.విశ్వనాధ్ కళా తపస్వి గా పేరొందాడు. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాతో మంచి ప్రఖ్యాతి పొంది తెలుగు చలనచిత్రరంగంలో స్థానం సుస్థిరం చేసుకున్నారు. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ప్రభావం తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!