కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

శ్రీ కృష్ణ స్తోత్రము .
















శ్లో !!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ !

సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి !

గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !!

తా.

లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును ,

వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును ,

ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును ,

చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును ,

దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును ,

కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , 

గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు

గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు 

విజయమునుపొందు గాక !!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.