హరిఅను రెండక్షరములు!

హరిఅను రెండక్షరములు!

.

"హరిఅను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజ నాభా

హరి నీ నామ మహాత్మ్యము

హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా!

(.శ్రీకృష్ణ శతకం..)

ప్రతిపదార్థం: 

అంబుజ నాభా అంటే నాభియందు పద్మం ఉన్న ఓ విష్ణుమూర్తీ! (శ్రీ కృష్ణా);

హరి + అను అంటే ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలు; పాతకములను అంటే చేసిన

పాపాలను; హరియించును అంటే పోగొడతాయి; 

హరి అంటే హరి అనెడి; నీ నామ మహాత్మ్యము అంటే నీ పేరులో ఉన్న గొప్పదనం;

హరిహరి అంటే ఆహా; పొగడంగ అంటే స్తుతించడం; వశమె అంటే సాధ్యమగునా!

భావం: ఓ శ్రీకృష్ణా! ‘హ’ ‘రి’ అనే రెండు అక్షరాలను కలిపి పలికినంత మాత్రానే అంతవరకు చేసిన పాపాలనన్నిటినీ హరిస్తావు. ఓ శ్రీకృష్ణా! 

నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని వర్ణించి చెప్పటం ఎవ్వరితరమూ కాదు కదా!

హరి అనే రెండు అక్షరాలను స్మరించిన ప్రహ్లాదుడు కష్టాలను అధిగమించాడు.

శ్రీహరిని ధ్యానించిన గజేంద్రుడు మోక్షం పొందాడు.

శ్రీహరికై తపస్సు చేసిన ధ్రువుడు ఆకాశంలో నక్షత్రరూపంలో శాశ్వత స్థానాన్ని పొందాడు.

ఇంకా ఎందరో భక్తులు ఆ హరిని ప్రార్థించి మహనీయులు అయ్యారు. 

హరి అనే రెండు అక్షరాల పదానికి ఇంత మహాత్మ్యం ఉందని కవి ఈ పద్యంలో వివరించాడు

x

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!