పలుకే బంగారమాయెనా!

శుభరాత్రి!
.
పలుకే బంగారమాయెనా!
(రామదాసు కీర్తన....రచించినవారు రామదాసు)
.
రాగం - ఆనందభైరవి......తాళం - ఆది
.
ప: పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||
చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||
చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||
చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర
ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||
చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు
పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||
చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా
కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!