ఉత్తర.!

అభిమన్యునికి వీడ్కోలు పలుకుతున్న ఉత్తర.!

.

ఉత్తర విరాటరాజు కుమార్తె.

ఉత్తరుడు ఈమె సహోదరుడు.

ఉత్తర విరాటరాజు కూఁతురు. ఉత్తరుని చెల్లెలు. అభిమన్యుని భార్య.

పరీక్షిత్తుని తల్లి. 

ఈమెకు అర్జునుఁడు అజ్ఞాతవాసమపుడు బృహన్నల అను నామములో నాట్యము కఱపెను. 

అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రము ఈమెగర్భమున ఉండిన పిండమును హింసింపఁగా ఆ వేదనను ఈమె సహింపనోపక సంకటపడుటనుచూచి కృష్ణుఁడు ఈమెగర్భము ప్రవేశించి యాపిండమును రక్షించెను.

కాన ఆబిడ్డకు పరీక్షిత్తు అను పేరు కలిగెను.

పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. 

అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము

ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. 

అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది.

ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. 

యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!