Skip to main content
లక్ష్మణుడు నవ్విన నవ్వు !
లక్ష్మణుడు నవ్విన నవ్వు !
.
రాముని పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు నవ్విన నవ్వు కలకలానికి కారకమైంది. అదే కీలకమైంది కూడా.
.
అన్నకు ద్రోహం చేసిన విభీషణుడు, అన్నను చంపిన సుగ్రీవుడు,
జాలరిపిల్లను నెత్తి నెక్కించుకున్న శివుడు, ఆడరాని మాటలాడిన సీత…
ఇలా అంతా లోలోపల ఉలిక్కిపడతారు.
.
‘నీ నువ్వుకు కారణమేమిటి?’ అని రాముడు అడుగుతాడు.
.
అప్పుడు తాము అడవిలో ఉన్నప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వచ్చి ఆవహించబోతే,
అన్న సేవలో ఉన్నానని, అన్న పట్టాభిషేకం అయ్యాక రమ్మన్నానని –
ఇప్పుడు చిన్న కునుకు పట్టగా నవ్వొచ్చిందని చెబుతాడు లక్ష్మణుడు
Comments
Post a Comment