పేస్ బుక్ రైల్ బండి పోతున్నది... అడిగిన వాళ్ళకి అందులో చోటు వున్నది.!

పేస్ బుక్ రైల్ బండి పోతున్నది...

అడిగిన వాళ్ళకి అందులో చోటు వున్నది.!

(Vijay Lenka గారి స్కెచ్.)

ఒకానొక కాలం, రైలు బండిలో ప్రయాణం; చెక్క బల్లలు పోయి కుషన్‌ సీటులు వచ్చేసాయనుకోండి. ఆంధ్ర భూమీ ఆంధ్ర జ్యొతీ అనే అరుపుల మధ్య అనిపిస్తే ఒకటి కొనుక్కోవడము చదవడము అయిన తర్వాత పక్కోళ్ళు మొహమాటముగా ఆ పత్రిక అడగడము మీరు చిరు నవ్వుతో ఇవ్వడము. తెచ్చుకున్న ఉప్మానో పులిహారో పక్కోల్లతో పంచుకోవడము.

ఎదుటి వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలే కాకుండా వారి పూర్వీకుల సమగ్ర విషయ సేకరణ చిరునామాలు ఇచ్చి పుచ్చుకోవడం ఫోన్‌ నెంబర్లు వుంటే అవి కూడ ఇచ్చి పుచ్చుకోవడం రైలు దిగిన రెండు నిమిషాల్లో అన్నీ మరచి పోవడం; ఇదీ రైలు కధ

ఇప్పుడు ఫేస్బుక్కు అనే కొత్త రైలు వచ్చింది. ఊసు పోక కబుర్లు అన్నయ్యా అక్కయ్యా చెల్లీ బుల్లీ వరుసలు అవతలి వారి మొహాలు తెలియకపోయినా. మధ్యలో అలుకలు ఒకరి మీద ఒకరి మాటల విరుపులు, పగలు పంతాలు. రైలులో ఎదురుబొదురుగా కూసుంటాము కాబట్టి తిట్టుకోడానికి కష్టం ఇక్కడయితే ఫ్రీ ఫీల్డ్ మొహాల్లకి ముసుగులేసుకునీ మరీ యుధ్ధాలు.

పదిమందికీ పనికొచ్చేదుంటే చెప్పండి స్వోత్కర్షలు మొదలయినవి దయ చేసి వదిలేయండి.

ఫేస్బుక్కు ఫ్రెండ్స్ అంటే నవ్వు వస్తుంది, కొందరి మనసు బాధించొచ్చు కాని ఇవి కేవలము పరిచయాలే (టైమ్ పాస్ మూంఫలీ); కాని కొందరు అద్భుతమయిన వ్యక్తులు పరిచయమవుతారు ఆ విషయం వేరే.

ఎలానూ ఈ ఫేస్బుక్కు రైలు బండి దిగినంక విషయం మర్చిపోతాము కాబట్టి అందరూ మనసుల్లో ఏం పెట్టుకోకుండా హేపీసుగా వుండండి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!