విధి నిర్వాహకులు ......(స్కెచ్ --.శ్రీ వీరభద్ర శాస్త్రి..కాలనాధభట్ట.)

విధి నిర్వాహకులు ......(స్కెచ్ --.శ్రీ వీరభద్ర శాస్త్రి..కాలనాధభట్ట.)

.

1. మంత్రిగారి అబ్బాయి కారు ఇస్కూలు గేటుదగ్గరకు రాగానే గబగబా వాచ్ మ్యాన్ గేటు బార్లాతీసి అటెన్షన్ లో నిలబడి సాల్యూట్ కొట్టాడు. కారులోపలకి వచ్చి భవనం ముందు ఆగగానే ముందు డొర్ తెరిచి విధేయుడైన చప్రాసీ స్కూలు బ్యాగుతో కిందకు దిగాడు.

డ్రైవరు దిగి వచ్చి వెనక సీటు డోరు తెరిచి నిల్చున్నాడు. కొంచెంసేపు ఆగి తిరిగి తలుపు వేసి తనడ్రైవింగు సీటులో కూర్చున్నాడు. చప్రాసీ స్కూలు బ్యాగుతో ముందుసీట్లో ఎక్కి కూర్చున్నాడు. కారు వెనక్కి తిరిగి రయ్యిమని వెళ్ళిపోయింది.

చదువరులారా! మీకు వింతగా అనిపించవచ్చు ఏమిటీ ప్రహసనం అని.

అంతకు ముందు రోజే విమానంలో మంత్రిగారు కుటుంబసమేతంగా అమెరికా పర్యటనకు ఆదేశ ప్రభుత్వ ఆహ్వానంపై వెళ్ళడం జరిగింది.

మరి ఈ కారు రావడం ఇదంతా ఏమిటని అచ్చరువందుతున్నారా?

రోజూ మంత్రిగారి అబ్బాయిని స్కూలు కు తీసుకు వెళ్ళడం స్కూలుబ్యాగు మొయ్యడం ఆడ్రైవరుకు, చప్రాసీకి నిత్యవిధి. మంత్రి గారి అబ్బాయి వున్నా లేకపోయినా.

2. బోరున వర్షం పడుతొంది. మంత్రిగారి భవనం చుట్టూ వున్న పూల మొక్కలకు గొడుగు వేసుకొని రబ్బరు పైపుతో నీళ్ళు పోస్తున్నాడు తోట మాలి. అది అతని నిత్య విధి.వర్షం పడితే పడుగాక

3. రాత్రి తెల్లవార్లూ హోరున గాలి, దానికి సాయం బ్రహ్మాండమైన వర్షం 

ఉదయం విధ్యుఛ్చక్తి కార్యాలయం ముందు వాననీరుతో కల్సిపోయి ప్రవహిస్తున్న మురికి కాలవను అతిలాఘవంగా దాటుతూ...

కార్యాలయం లోపలకి వచ్చి ఒకసారి గోడ గడియారం కేసి చూసి, సరిగ్గా ఏడుగంటలవగానే కరెంటు ఆపేసి తనవిధిని సక్రమంగా సకాలంలో కరెంటు కోతను అమలు పరిచినందుకు సంతృప్తిగా వెనక్కి వెళ్ళిపోయాడు దారిలో ముందు వెళ్తున్న గొఱ్ఱెలమందను దాటుకుంటూ...

(వార్త: ఉదయం 7 నుంచి 9 వరకూ కరెంటుకోత అమలు)

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!