Posts

Showing posts from June, 2020

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲-తెలుగు లో వివరణ- (6)🤲

Image
  శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏 🤲-తెలుగు లో వివరణ- (6)🤲 👉🏿"వేయి నామములు ప్రధాన వ్యాసం: విష్ణువు వేయి నామములు- 401-500. 🙏🏾 401) వీర: - పరాక్రమశాలియైనవాడు. 402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు. 403) ధర్మ: - ధర్మ స్వరూపుడు. 404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు. 405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు. 406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు. 407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు. 408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు. 409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు. 410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు. 411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు. 412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు. 413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు. 414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు. 415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు. 416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు. 417) సుదర్శన: -

🚩🚩గీతాంజలి కావ్యం.🚩🚩 (రవీంద్రనాథ్ ఠాగూర్.)

Image
🚩🚩గీతాంజలి కావ్యం.🚩🚩 (రవీంద్రనాథ్ ఠాగూర్.) ✍️✍️ గీతాంజలి" రవీంద్రనాథ్ ఠాగూర్" రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది.. ✍️బెంగాలీ భాషలో వ్రాయబడిన మూల గ్రంథం గీతాంజలి 103/157 పద్యాల సంకలనం. ఇది 1910, ఆగష్టు 14న ప్రచురింపబడింది. ఇంగ్లీషు గీతాంజలి లేదా సాంగ్ ఆఫరింగ్స్ 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లం లోనికి తర్జుమా చేశాడు. . ✍️ఆ రోజుల్లో (1900-1913) భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రచయిత. భక్తితో కూడిన దేశప్రేమ మనకు ఈ పద్యాలలో కనిపిస్తుంది. ✍️1913లో గీతాంజలి ఇంగ్లీషు అనువాదం కారణంగా రవీంద్రనాథ్ టాగూరు సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఐరోపా ఖండేతర వ్యక్తిగా నిలిచాడు.. ✍️గీతాంజలి కావ్యంలోని మచ్చుకు కొన్ని కవితలు 🚩ప్రార్థన ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు

Narayana The Namo Namo (Annamacharya song)

🙏🏿నారాయణ తే నమో నమో🙏🏿 .................................. (అన్నమాచార్య....ఆధ్యాత్మ సంకీర్తన -) .✍️ నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో చరణములు: మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమపురుష భవబంధ విమోచన నరమృగశరీర నమో నమో జలధిశయన రవిచంద్రవిలోచన జలరుహభవనుత చరణయుగ బలిబంధన గోపవధూవల్లభ నలినోదర తే నమో నమో ఆదిదేవ సకలాగమపూజిత యాదవకుల మోహనరూప వేదోద్ధర శ్రీవేంకటనాయక నాదప్రియ తే నమో నమో✍️

🔻-బాబోయ్ చలం " - " స్త్రీ ✍️🔻

Image
🔻-బాబోయ్ చలం " - " స్త్రీ ✍️🔻 🚩ఈమధ్య మళ్ళి చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,, చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది. చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరక శక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి. ఒకళ్ళు ఆరాధించతగిన వ్యక్తే కానీ, కామించదగ్గది కాదు. ఆయన స్త్రీలందరూ, జీవితంలో ఏ ఆదర్శం కోసం తను వేదన చెంది, తపించి విసిగి వేసారి, ఒంటరితనం, బాధ అనుభవించాడో, ఆ ఆదర్శం కోసం అంతే బాధపడి ఆఖరవుతాడు. 🚩ఆంధ్రలో బ్రహ్మ సమాజం 1864లో ప్రారంభమయింది. 1916 ప్రాంతంలో చలం బ్రహ్మ సమాజంలో చేరాడు (ఆంధ్రలో చలం పే.604). దాదాపు 1920ల వరకు అందులో పనిచేశాడు. బ్రహ్మ సమాజంలో చేరకముందే తన ఇంట్లో ఆడవాళ్ళనీ, పిల్లల్నీ పొట్టి నిక్కర్లేయించి బాడ్మింటన్‌ ఆడటానికి తీసుకెళ్ళడం లాంటి పనులు చేశాడు. ఈనాడవి అంత గొప్ప విషయాలనిపించక పోవచ్చు. కానీ అప్పటి వాళ్ళకవన్నీ విపరీతంగా కనిపించాయనటంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళు బజార్ల గుండా వెళ్తుంటే ఎంతో మంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు,ఉమ్ములూసేవారు. అట్లా చలం తన వ్యక్తిగత జీవితంలోనే సమాజాన్నెదిరించి త

shivani bhavani swathi kiranam video song by sp Balu.avi

Image
ఎంత మంచి  పాటో..... విని చాల కాలం అయ్యింది... విని తరిద్దాం....