Saturday, August 31, 2013

కాళింది లో గోవిందం -

కాళింది లో గోవిందం -( రచన... ఓలేటి శ్రీనివాసభాను...)

ఆడింది ఆడింది పాదం

కాళింది లో గోవిందం

మున్నీట సర్పం - మూడింది దర్పం ...

మిన్నూ-  మన్నూ ఏకం...

ఊగింది లోకం!   ఆడింది .... ఆడింది పాదం ...


గాలీ-నీరూ కాలకూటంగా

వ్రేపల్లె కే సంకటంగా

ఘోరంగా- ప్రాణం పోవంగా

"రంగా.. రంగా" యన్న ఆలకించంగా!  ఆడింది... ఆడింది పాదం...


పడగెత్తి నాగన్న లేవంగా

బుసకొట్టి కోరలు తెరువంగా

వాటంగా- వాలం సాయంగా

నిలువెల్ల మదమంత - నీటను కలువంగ!  ఆడింది ... ఆడింది పాదం


నేత్రం- జలజాతపత్రం

గాత్రం-ఎంతో పవిత్రం

శిఖిపింఛ మౌళి - శ్రీ  బాల శౌరి

చిందులేసిన తీరు చిత్రాతి చిత్రం!  ఆడింది .. ఆడింది పాదం..


పోతనా మాత్యుని శ్రీ కృష్ణుని వర్ణన....

పోతనా మాత్యుని శ్రీ కృష్ణుని  వర్ణన....


కటి చేలంబు బిగించి, పింఛమున జక్కం గొప్పు బంధించి, దో

స్తట సంస్ఫాలన మాచరించి, చరణద్వంద్వంబు గీలించి, త

త్కుటశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది

క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్..


కృష్ణుడు కాళీయమర్దనానికి సంరంభంతో ఉరుకుతున్న సందర్భం. పైన చెప్పిన పద్యం ఒక స్థిరచిత్రం (still photograph) అయితే, ఇది చలనచిత్రం! అందులో కృష్ణుని పసితనం కనిపిస్తే ఇందులో గోపకిశోరుని పొంగు మన కళ్ళముందు కదలాడుతుంది.


ఉత్తరీయాన్ని నడుముకి బిగించాడు. జాఱకుండా పింఛాన్ని చక్కగా కొప్పున బంధించాడు. జబ్బలు రెండూ చఱిచాడు. రెండు కాళ్ళనీ దగ్గరగా తెచ్చాడు. తెచ్చి, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి దూకాడు. ఎవరు? సింహకిశోరం లాంటి గోపాలుడు. "లాంటి" ఏవిటి, అప్పుడతడు సింహకిశోరమే! అంతెత్తునుండి దూకేసరికి, గుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయిందట!


పద్య నిర్మాణంలోని సొగసు బిగువు వల్ల కృష్ణుడిలో ఉఱకలు వేస్తున్న అదే ఉత్సాహం మనలోనూ కలగడం లేదూ! అదీ కవిత్వమంటే!


మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు

కడుపున దిండుగా గట్టిన వలువలో

లాలిత వంశనాళంబు జొనిపి

విమల శృంగంబును వేత్ర దండంబును

జాఱి రానీక డా చంక నిఱికి

మీగడపెరుగుతో మేళవించిన చల్ది

ముద్ద డాపలి చేత మొనయ నునిచి

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు

వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి


సంగడీల నడుమ జక్కగ గూర్చుండి

నర్మభాషణముల నగవు నెఱపి

యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద

శైశవంబు మెఱసి చల్ది గుడిచె...

(పోతనామాత్యుడు)


ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావాలి, ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయ అన్నమాట! అది వ్రేళ్ళ సందుల్లో ఇఱికించాడు. హాయిగా స్నేహితుల మధ్య (సంగిడీలు - స్నేహితులకి చక్కని తెలుగుపదం) కూర్చుని, ఊసులాడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు చిన్ని కన్నయ్య. చేతిలో ఉన్న వేణువునీ బెత్తాన్నీ కొమ్ముబూరనీ పక్కన పెట్టవచ్చు కదా! అలా తన దగ్గరే అట్టేపెట్టుకోడంలో బాలకృష్ణుని పసితనం మన కళ్ళకిగడుతుంది. అదీ పోతన వర్ణనలోని అందం! మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు. వాటిని మీగడతరకల్లాంటి తెలుగుపదాలతో మేళవించి తెలుగు చిన్నారి కిట్టమూర్తిని మన కళ్ళముందుంచాడు పోతన.

Friday, August 30, 2013

దృత రాష్ట్రుడు అనగా,

దృత రాష్ట్రుడు అనగా, 

తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించే వాడే దృతరాష్ట్రుడు.

మాయ స్వరూపం తోటే, భగవద్గీత మొదలయినట్లుగా అనిపించుచున్నది.. భగవద్గీత మొదటి 

అధ్యాయం, దృతరాష్ట్ర ఉవాచ... అని మొదలవుతుంది.. 

రాష్ట్రుడు అనగా, రాష్ట్రమును ధరించినవాడు..దృత రాష్ట్రుడు అనగా, 

తనది కాని రాష్ట్రాన్ని తనదిగా భావించే వాడే దృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, 

దేహము,ఇంద్రియములు, మనస్సు బుద్ధి మున్నగున్నవి దృశ్యములు. అవి తానూ కాదు. 

దృక్కగు ఆత్మ ఒకటియే తానూ గాని, దేహాది దృశ్య పదార్దములు కాదు. కానీ అజ్ఞాని, 

తనది కానట్టి, అనగా ఆత్మేతమైనట్టి దేహాది దృశ్యరూప రాష్ట్రమును తనదిగా దలంచి 

దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే అతడు దృతరాష్ట్రుడు. 

అజ్ఞాన భావంతో గూడి యుండు వారందరున్నూ దృత రాష్ట్రులే అని 

గీతా మకరందం వివరిస్తుంది. 

తనది కాని దానిని తనదిగా భావించి, భ్రమించే అజ్ఞాన అంధకారంలో ఉన్న 

జీవుడు ఇలా పలికెను..అని మాయా స్వరూపాన్ని గురించి గీత 

మొదట్లోనే వివరించుచున్నది..

Thursday, August 29, 2013

అదే నీ ధ్యానము. శివధ్యానము. ..

శివధ్యానము

పరమేశ్వరుని ధ్యానము గురించి మహాకవి కాళిదాసు చక్కగా వివరించేడు. శివుడు జ్ఞాన స్వరూపుడు గనుక, ఆయన జ్ఞానాత్మకమైన స్వరూపాన్నే ధ్యానిస్తూ ఉంటాడు. అంటే తననే ధ్యానిస్తూంటాడు. 


ఈ విశ్వంలో ప్రతిదీ సృష్టిగతమైన తన ధర్మాన్ని అనుసరించి చరిస్తుంది. నువ్వు వాటి గురించి ధ్యానించినా, లేకపోయినా వాటి పని అవి నియమానుసారం చేసుకుపోతుంటాయి. వాటికి నీ ధ్యానంతో పనిలేదు. 


మరి ఈ సృష్టిలో నీకూ అస్తిత్వం వుంది. మిగతావాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ అస్తిత్వానికి అర్థం ఏమిటి? అసలు నువ్వెందుకు ఉన్నట్లు?


కాబట్టి నీవేమిటో తెలుసుకో. నీదైన జ్ఞానాన్ని పొందు. సృష్టిగతమైన నీ ధర్మం పట్ల, నీ జీవనచర్య పట్ల పరిపూర్ణమైన ఎరుకను కలిగివుండు. ఆనందంగా వుండు. శాంత మనస్కుడవై వుండు. అదే నీ ధ్యానము. శివధ్యానము. 


“పాలుపంచుకొనుట”

ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. “మీరందఱూ వేషధారులు నేను సూత్రధారిని” అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు.


కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపం ఆ ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి “ఓ పడతీ! నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా?” అని వాబోయింది. ఆ లీలామానుషవిగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరి తఱం ?


పడఁతీ! నీ బిడ్డఁడు మా

కడవలలో నున్న మంచి కాఁగిన పా లా

పడుచులకుఁ బోసి చిక్కిన

కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో?


జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?

“పాలు” అనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో “పాలుపంచుకొనుట” అనే ప్రయోగం ఉన్నది. నలుగురికీ ఉపయోగపడే పదార్థమును పంచుకోకుండా తమకోసమే నిలువ చేసుకోరాదని శ్రీ కృష్ణ జగద్గురువు మనకీ కథ ద్వారా బోధించాడు. అందుకనే మిగిలిన కడవలను కూడా పగులగొట్టి పంచుకో తగినవి నిలవచేసుకోనీయకుండా చేశాడు. మీ-మా అనుభేదాలు మఱచి తోటి జనులతో సహజీవనము చేయమన్నదే ఆ సర్వేశ్వరుని సందేశం.

Keshav.Keshav. Painting.

Keshav.Keshav. Painting.


Bhagavatha - Markandeya's Vision of Maya

Bhagavatha - Markandeya's Vision of MayaSage Sukha describes the qualities of Kaliyuga, which began immediately after Krishna's departure. Wealth alone will be the criterion of the pedigree, morality and merit. Righteousness, purity of body and mind, forgiveness, keenness of memory will decline. Men will be greedy, immoral and merciless. Kings will be impatient to conquer the whole globe. Mother earth laughs: "Kings wage wars and want to own the entire earth. Glorious kings, mighty demons have ruled this earth, but their names are mere stories now -- and their object remains unaccomplished."

Shuka says, "O King! The stories of these legends have been narrated to instill in men the ephemeral nature of worldly enjoyments and also to help develop a distaste for them. On the other hand, inculcating a taste for Krishna's stories, and devoting oneself to him, gives joy and permanently ends all misery."

Parikshit asks Shuka, "Tell me O Sage! How will men will be able to shake off the accumulated evils in the age of Kali?"  Shuka answers, "Dear Parikshit! Kali is a storehouse of evils. But it has one great virtue -- by merely chanting the names and singing the glories of the Supreme, one can be free from all attachments and reach the Supreme." 

Shuka completes the narration of the Bhagavatha and gives his final message to Parikshit. "O King! give up the notion that you will die. The body is born at a particular moment, as it was non-existent before. You are the unborn soul, hence, cannot die. You are distinct from the body, just as the fire is distint from the firewood. It is the mind, which creates bodies, objects of senses and actions for the soul. It is Maya that creates the aforesaid mind. From Maya proceeds the transmigration of the soul (Jeeva). With constant thought of Lord Vasudeva, inquire by your own effort the truth of the Self.

"Impelled by the curse, Takshaka may burn your body, but not your soul. Identify yourself with the Absolute, and realise your true nature - you will neither see Takshaka, nor your own body. Thus, I have narrated to you, O protector of men, whatever you wished to listen  concerning the pastimes of Lord Srihari. What more do you desire to hear?"

Parikshit approaches the feet of Shuka and bent low with joined palms: "Bhagawan Shuka! I am blessed. I am fulfilled. With your infinite grace, I have heard the glorious stories of Srihari, and also the ways of attaining him. I am neither afraid of Takshaka nor any other means of death. Now, O Sage! With your permission I shall control my speech and having established my mind in Vishnu, give up the ghost. My ignorance has been eradicated by firmness in Jnana (the knowledge of truth) and Vignana (its realisation)." Worshipped by the King, the divine sage Shukha takes leave and departs with the other ascetics. Parikshit sits on the blades of Kusa grass, facing north and meditates on the Lord.

Takshaka, in the guise of a brahmin, was on his way to accomplish his task -- to end Parikshit's life. He meets Kashyapa, a physician, (skillful in counteracting the effects of any poison), who was also going to see Parikshit. Takshaka gratifies him with gifts of gold and silver and sends him back. Takshaka gains access in the vicinity of Parikshit, assumes his original form of a venomous snake and bites him. The fire of the poison engulfs Parikshit, who was already one with the Supreme. His body was instantly reduced to ashes, while all men looked on.

Janamejaya, the son of Parikshit, seeks vengeance for his father's death. He performs a sacrifice intending to eliminate the entire species of snakes. In the midst of the cruel sacrifice, where many snakes fall into the fire, the elders and sages reason with him to stop the sacrifice. Janamejaya obeys and stops the sacrifice.

-------------------------------------

Markandeya:


These divine stories, in turn, were narrated as an interlude by Suta Pauranika in the Naimisharanya forest, while the sages were engaged in the performance of a great sacrifice.

Shaunaka asks Suta: "O Suta, people speak of the seer Markandeya, as the one who remained alive even during the deluge. We hear that he beheld the Supreme person as a babe floating on a banyan leaf, while drifting in the waters of the great flood. O great Yogi! You are also a repository of the ancient Puranas. Please resolve our doubt."

Suta answers: "Markandeya, a jewel of the Bhrigu race, was the son of Mrukandu. He was a lifelong celibate, thoroughly trained in the knowledge of the scriptures and its practice. He constantly contemplated on Srihari with devotion adhering to a severely austere life. With his amazing penance extending to countless number of years, he conquers death. Indra, afraid that he might lose his position, tries to interrupt Markandeya's austerities with various enticements like music of gandharvas, dance of the apsaras, the tempting vernal season, inducing greed, etc., But every attempt at distraction proved futile against the firm resolve of the sage. They withdrew like children that would run away after rousing a snake.

To shower their grace on Markandeya, Srihari appears before him in the form of Nara and Naryana, the divine sages. Markandeya greets them with reverence and devotion and extolls them. "O Seer! You have attained perfection, through concentration of the mind, self-control and unceasing devotion to me. May all be well with you! You may receive a boon from me." Markandeya replied: "The vision of your glorious presence is boon enough for me. What more can I ask for. Nevertheless, I would want to have a vision of your Maya, under which the world perceives diversity." The divine sages grant the wish and smilingly return their abode in Badarikashrama.

Thinking about the boon to witness the Lord's maya, Markandeya, who always thought of the Lord like an unbroken trickle of oil, sometimes forgot to worship him. One day, while worshipping the Lord on the banks of the river Pushpabhadra, a furious wind sprang up. That was followed by frightful clouds with flashes of lightning. Rain poured like columns as thick as the axle of a chariot. With whirlpools swirling, water flooded the earth with waves reaching the sky. Fearful crocodiles and other creatures emerged from the waters. The sage felt perturbed at heart, while the whole earth was covered by a sheet of water. Markandeya was the only one alive, floating in the waters, tossed about with violent winds. Beaten by the storm, oppressed with hunger and thirst, and assailed by alligators and whales, he was exhausted. He fell a prey to fear, grief and infatuation. His judgment was clouded by the Lord's maya.

Rolling about in the deluge, Markandeya, saw a young banyan tree. In one of its branches he saw a babe lying in the hollow of a leaf. The babe, possessed of a dark-green hue of an emerald, was glowing with its splendour. It was smiling with a captivating charm. The babe, lifting its foot with its hands, places it in its mouth and was sucking it. At that very sight, the fatigue of Markandeya disappeared.

He headed towards the babe to find out more about it. But like a mosquito, he was sucked into the babe, along with its breath. Inside the babe's belly, Markandeya could see the entire universe as it was before the deluge. He saw the Himalayas, the river Pushpabhadra and his own hermitage on its bank, and the sages dwelling there. Even as he was seeing this, he was thrown out of the belly, along with the babe's breath, into the deluge. He could see the babe again, lying on the banyan leaf as before. He gazed at the child and proceeds to embrace it. That very moment, the child, no other than Lord Srihari, disappears. The deluge, the waters along with the banyan tree also disappeared in an instant. He stood in his hermitage as before. Markandeya realises the glory of the Lord's yogamaya displayed vividly to him. He seeks refuge in the Lord and extolls him saying that even the learned fall a prey to delusion, thinking themselves to be wise.

Lord Rudra was passing by in the skies on his mount Nandi along with his spouse Parvathi. Parvathi observes Markandeya looking very composed like the waters of the sea, his mind totally fixed on the Lord. She expresses her willlingness to meet the saint. Lord Rudra tells about Markandeya's extraordinary penance and approaches him. "...For it is the greatest gain to meet a pious soul."

Markandeya was lost in his trance, and could not perceive the glorious Lord Shiva approach him. Knowing his mental condition well, the Lord enters the cavity of the saint's heart using his divine maya. The sage was amazed, seeing the glorious form of Shiva which flashed in his heart. He woke up from his trance and beheld Shiva, the preceptor of the world, along with spouse Parvathi. Bending low, he pays obeisance to the Lord and after offering him due hospitality, worships him with words of praise. Bhagawan Shiva laughs cheerfully: "Seek a boon of your choice,. We three - Myself, the glorious Brahma, and the almighty Srihari, always resort to devotees like you, who are pious and tranquil and look upon all with an equal eye. By merely seeing you, or hearing about you, even great sinners get purified of their thoughts."

Having been made to revolve long by the Maya of Lord Vishnu, and subjected to a severe trial, the soothing words of Lord Shiva relieved Markandeya of all his afflictions. He glorifies Lord Shiva "I ask one boon of you -- the unfailing devotion to Lord Vishnu and those devoted to him, as well as to yourself." Shiva, along with Parvathi, bless Markandeya: "O great sage! Let all your desires be fulfilled; your fame will endure till the end of this age. I grant you immunity from old age and death." Shiva withdrew, telling the glory of the sage and his experiences of the Lord's maya to Parvathi."

ముందుగ వచ్చితీవు...

ముందుగ వచ్చితీవు...

ఈ రోజు మళ్ళీ తిరుపతివెంకటకవులదే ఇంకొక పద్యాన్ని తలుచుకుందాం:


ముందుగ వచ్చితీవు, మునుముందుగ నర్జును నేను జూచితిన్

బందుగులన్న యంశమది పాయకనిల్చె సహాయ మిర్వురున్

జెందుట పాడి, మీకునయి చేసెద సైన్య విభాగ మందు మీ

కుం దగు దాని గైకొనుడు, కోరుట బాలుని కొప్పు ముందుగన్


ఈ పద్యంలోని గొప్పదనం తెలియాలంటే అది వచ్చే సందర్భాన్ని ఒక్కసారి సింహావలోకనం చెయ్యాలి.

కౌరవ పాండవులకి యుద్ధం నిశ్చయమైపోతుంది. సైన్య సమీకరణంలో భాగంగా, కృష్ణుణ్ణి తనవైపుకు తిప్పుకోవాలన్న ప్రయత్నంతో దుర్యోధనుడు స్వయంగా కృష్ణుని వద్దకు బయలుదేరుతాడు. అది తెలుసుకుని ధర్మరాజు అర్జునుణ్ణి కృష్ణుడి వద్దకు పంపిస్తాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి చేరుకుంటారు. దుర్యోధనుడు కాస్త ముందువస్తాడు. కానీ కృష్ణుడి తలదగ్గరున్న ఆసనంలో కూర్చోడంతో, కాళ్ళదగ్గరున్న అర్జునుణ్ణి ముందుచూస్తాడు కృష్ణుడు. తను ముందొచ్చాను కాబట్టి, తనకే సాయంచెయ్యాలంటాడు దుర్యోధనుడు. ఇదీ సందర్భం. కృష్ణుడు తన మాటల చాకచక్యాన్నంతా చూపించే పద్యమిది. పద్యం చూడ్డానికి సాధారణంగా ఉన్నా, ఇలాటి పద్యం రాయడం కష్టం. తనకి మాత్రమే సాయం చెయ్యాలన్న దుర్యోధనుడితో, అర్జునుడికి భాగం ఇవ్వడమే కాక, ముందుగా అతనికే కోరుకొనే అవకాశం కలిగిస్తానని చెప్పాలి, చెప్పి ఒప్పించాలి. అదంతా ఒక్క పద్యంలో! అందుకే ఈ పద్యం ఈ మొత్తం ఘట్టానికంతా కీలకమైన పద్యం. తిక్కన ఈ సందర్భంలో మూడు నాలుగు పద్యాలు రాసాడు. తన సైన్య భాగాల గురించి చెప్పి, తర్వాత అర్జునుడు బాలుడు కాబట్టి ముందతన్ని కోరుకోమని అంటాడు కృష్ణుడు భారతంలో. ఇక్కడ, సైన్య భాగాలగురించి వివరించకముందే, ఈ పద్యంలో అర్జునుడు బాలుడు కాబట్టి ముందతను కోరడమే సమంజసమని నిర్ణయిస్తాడు. ఇదొక విధంగా దుర్యోధనుడికి ఉత్కంఠను రేపుతుంది.

"అసలు అర్జునుడికి ముందు కోరుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? దుర్యోధనుడికి ముందవకాశం వచ్చినా సైన్యాన్నే కోరుకుంటాడు కాని యుద్ధం చెయ్యని కృష్ణుణ్ణి కోరుకోడుకదా?", అన్న అనుమానం రావచ్చు.

దీని వెనక రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి, దుర్యోధనుడు కాస్త తెలివి ఉపయోగించి కృష్ణుణ్ణి కోరుకుంటే, పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. అలా కోరుకోడానికి అవకాశం లేకపోలేదు. దాన్ని నివారించడం ఒకటి. అంతా కన్నా ముఖ్యమైనది అర్జునుడి భక్తికి పరీక్ష. మొత్తానికీ పరీక్షలో అర్జునుడు నెగ్గుతాడు. దుర్యోధనుడు కూడా చివరికి తనకే మేలు జరిగిందని సంతృప్తుడౌతాడు! విపత్కర పరిస్థితిలో, win-win పరిష్కారాన్ని చూపించిన కృష్ణుని నేర్పు, ఈ కాలంలో negotiation skillsకి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు!


పాడి, ఒప్పు లాంటి అచ్చ తెలుగు మాటలతో హాయిగా సాగిపోయే ఈ పద్యం, "ముందుగ" అన్న పదంతో మొదలై, అదే పదంతో పూర్తికావడం ఒక శిల్ప విశేషం.

భయరవ భట్ల  కామేశ్వరరావు  గారి సేకరణ...

Wednesday, August 28, 2013

శ్రీ వడ్డాది సుబ్బారాయుడు.


ఒక తండ్రి, తన బిడ్డకి ఊహ తెలియని రోజుల్లో, పనిమీద పరదేశానికి వెళ్ళి, కొన్నాళ్ళ తర్వాత ఆ బిడ్డకి ఊహ తెలిసే వయసుకి తిరిగి వచ్చాడనుకోండి. "అతనే నాన్న" అని తల్లి చెప్పి, ఆ తండ్రి ఆప్యాయంగా ఆ బిడ్డని చేరబోతే, ఆ బిడ్డ మనస్థితి ఎలా ఉంటుంది? ఇలాటి అనుభవం ఈ కాలంలో మరీ అరుదేమీ కాదు. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలని వదలి పరదేశాలకి వెళ్ళే వాళ్ళు చాలామందే కనిపిస్తారు కదా.

అలాటి పరిస్థితిని పద్యంలో వర్ణించడమే కాదు, మరో మహత్తరమైన విషయాన్ని చెప్పడానికి, దీన్నొక పోలికగా ఉపయోగించిన ఒక మంచి పద్యం ఇది.


జననీ గర్భములోన నుండగ విదేశంబేగి, బెక్కేండ్లకున్

జనుదే దండ్రిని గాంచు బిడ్డవలె నీ సంబంధమున్ ముందు నే

గన కీ వేళ నెఱింగి స్నేహభయశంకాముత్త్రపాశ్చర్య భా

జనమై నిల్చితి జేరదీసికొనవే సద్భక్తచింతామణీ!


ఈ పద్యాన్ని రాసిన కవి శ్రీ వడ్డాది సుబ్బారాయుడు. ఇతను 1854-1938 మధ్య కాలంలో జీవించారు.

ఆంధ్రప్రశస్తి.....

ఖండకావ్యము: తెలుగు వెలుగు

కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఖండిక: ఆంధ్రప్రశస్తి


రాజమహేంద్రుని రంగస్థలంబున నాట్యమాడించె నన్నయ్య కవిత,

కావేరినీటిలో గలిపి సంగీతంబు ద్రావణంబొనరించె త్యాగరాజు,

జీవకళలుదేఱ జిత్రవిహారముల్ చిత్రించిరీయాంధ్ర శిల్పివరులు,

అసహాయశూరులై యలరి యీయాంధ్రులు గంగలో కత్తులుగడిగినారు,


ధణధణంధణ సాగరాంతముల మ్రోగె

జయరవంబులనీభేరి జగతిలోన,

అలరెనీ శాసనములు శిలాక్షరముల

రమ్యతరమైనదౌర! యాంధ్రప్రశస్తి!!!

భరతభూమి ధన్యభూమి.

పిల్లలకు పాలు లేకపోతే మనం ఎంత బాధపడతామో లేగదూడలకు పాలుపట్టినీయకుండా పాలుపిండుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకొని వాటిని బాధించకుండా వాటితో సహజీవనము చేయాలని మనకు బోధించినాడు. ఆవులు దూడలకు పాలు ఇచ్చిన తరువాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలన్నదే జగద్గురువైన కృష్ణుని ఆంతర్యం . పశుపక్షాదులను సైతం ప్రేమించి అహింసాయుత జీవనాన్ని లోకానికి బోధించిన భరతభూమి ధన్యభూమి.

Tuesday, August 27, 2013

కష్టజీవి శ్రీకృష్ణుడు ........సత్యనారయణ పిస్కా...


కష్టజీవి శ్రీకృష్ణుడు ........సత్యనారయణ పిస్కా...

  మీలో చాలామందికి ఈ వ్యాసం యొక్క శీర్షిక (Title) చిత్రంగా తోచవచ్చు - "శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!" అని. వ్యాసమును చదివిన పిమ్మట, ఈ శీర్షిక పెట్టడంలోని సామంజస్యాన్ని మీరే నిర్ణయించాలి. 

        శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు...

        కృతయుగంలో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించిన శ్రీమహావిష్ణువే, మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలనూ, కష్టాలనూ అనుభవిస్తూ, మనకెన్నో ధర్మసందేశాలను అందించాడు. 

        శ్రీకృష్ణునిది విలాసజీవితం అనుకుంటారు ఎంతోమంది. నిజానికి, శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు. 

        శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. శ్రీరాముని జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం. 

        శ్రీరాముని శైశవం, బాల్యం బహుసుఖంగానే గడిచాయి. సీతను వివాహమాడిన అనంతరం కొన్నేళ్ళు సుఖంగా జీవించాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం, ఉత్తరకాండలో సీతావియోగం.......ఇవీ శ్రీరామునికి వచ్చిన ముఖ్యమైన కష్టాలు. కొంతకాలం కష్టాలు అనుభవించినా, ఆయన సుఖపడిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. 

        ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు.

        శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు. చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో! 

కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన. అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. 

      

        కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి. 

        ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. 

        అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకరయుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది. 

జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి. చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే, చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. 

    

        తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. 

        కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 

అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి. 

        మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా? 

    

        నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు. 

    

        ఈ "శ్రీకృష్ణాష్టమి" పర్వదిన సందర్భంగా ఆ పరమాత్ముని కరుణాకటాక్ష వీక్షణాలు మన అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తూ, మరి ప్రస్తుతానికి సెలవు! 


చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ...

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ

బంగారు మొలతాడు పట్టు దట్టి

సందిట తాయెత్తులు సరి మువ్వ గజ్జెలు

చిన్ని కౄష్ణా నిన్ను నే చేరి కొలుతు


ఓయమ్మ నీ కుమారుడు

మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా

పోయెద మెక్కడి కైనను

మాయన్నల సురభులాన మంజులవాణీ..

(పోతనామాత్యుడు..)

Monday, August 26, 2013

యోరుగల్లు,..

ఖండకావ్యము: తెలుగు వెలుగు

కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఖండిక: ఆంధ్రరాజధానులు 


శ్రీయుగంధరమంత్రి శేఖరశేముషీశ్రీరమ్యమైనది యోరుగల్లు,

కాకతీరుద్రుని కైలాససదనమై యొప్పారు శైలాగ్రమోరుగల్లు,

ఉభయకవిసుహృత్తునుజ్జ్వలకవితాసి నొఱపుజేసినఱాయి యోరుగల్లు, 

మందారమకరందమాధుర్యమును జీర్ణమొనరించుకొనుభూమి యోరుగల్లు,


పాదుసాహులకును పైకత్తిగానాగి

గుండెతల్లడంబు గూర్చె పెల్లు,

చెప్పగిప్పరాని శ్రీలకు పుట్టిల్లు,

వీరరసముగల్లదోరుగల్లు!!!

తెలుగు తల్లి!!!


ఖండకావ్యము: తెలుగు వెలుగు

కృతికర్త: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఖండిక: తెలుగుతల్లి


భద్రాద్రి రఘురాము పాదసేవదరించు రామదాసుండు గారాపుబిడ్డ,

కృతిరామునకునిచ్చి కృతకృత్యుడైనట్టి పోతన్న నీముద్దు పుత్రకుండు, 

రామసంకీర్తనారక్తి ముక్తుండైన త్యాగయ్య నీప్రియతనయుడమ్మ,

కాళహస్తీశ్వరు కరుణావిశేషంబు గన్న కన్నప్ప నీకన్నకొడుకు,


కాంచికాక్షేత్రమందు శంకరుని కరుణ

నవ్యయపదంబు గైకొన్న యసదృశుండు,

వాడు చిరుతొండనంబి నీపాపడమ్మ,

తెలియ నీకెవ్వరీడమ్మ తెలుగు తల్లి!!!


ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము.....

మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది.

ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది.

దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము.

అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు.

ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము.....

Sunday, August 25, 2013

Laila Majnu 1949 Telugu - Payanmaye Priyatama, Ghantasala, SamudralaSr C...

మనసును హత్తుకునేలా ఘంటసాల గారి మొదటి హిట్ సాంగ్.

సామజ వర గమన......


సామజ వర గమన

సాధు హృత్ - సారసాబ్జు పాల

కాలాతీత విఖ్యాత


సామని గమజ - సుధా

మయ గాన విచక్షణ

గుణశీల దయాలవాల

మామ్ పాలయ


వేదశిరో మాతృజ - సప్త

స్వర నాదా చల దీప

స్వీకృత యాదవకుల

మురళీవాదన వినోద

మోహన కర, త్యాగరాజ వందనీయ....

దేవులపల్లి కృష్ణశాస్త్రి ....

సార్వజనీనమైన మనిషి ఆలోచనల్లో పుట్టిన సాహిత్యం... వెయ్యికాలాలు వర్థిల్లుతుందట. సరిగ్గా అలాంటివే దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం. విరహవేదనను ఎంత హృద్యంగా వర్ణించారో చూడండి ఆయన. క్షణాలు రాళ్ళుగా మారి కదలడం లేదట. మనసులో రూపం మాత్రం అలానే ఉందట. పోనీ వెళ్దామా అంటే... కుదరడం లేదట. అసలు వేదన ఎంత మధురంగా ఉంటుందా అని... చదివిన వారికి తొలి సారి అనిపిస్తుంది....
ఏ సీమల ఏమైతివో ఏకాకిని నా ప్రియా.. ఏకాకిని నా ప్రియా..
ఏలాగీ వియోగాన వేగేనో నా ప్రియా..
ఏలాగీ మేఘమాసమేగేనో ప్రియా.. ప్రియా.. ప్రియా..
ఘడియ ఘడియ ఒక శిలయై కదలదు సుమ్మీ..
ఎద లోపల నీ రూపము చెదరదు సుమ్మీ..
పడి రావాలంటే వీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ..

దారులన్నియు మూసె దశ దిశలు ముంచెత్తె..
నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ..
ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీ గర్భకుహరాల..
తమస్వినీ గర్భకుహరాల..

లోకమంతా పాకినవి పగటి వెలుగులు..
నాకు మాత్రం రాకాసి చీకట్ల మూలుగులు.. రాకాసి చీకట్ల మూలుగులు..

ఎపుడు నీ పిలుపు వినబడదో అపుడు నా అడుగు పడదు.. 
ఎచటికో పైనమెరుగక ఎందుకో వైనమందక నా అడుగు పడదు..