పోతన తెలుగు భాగవతము ప్రధమ స్కందం నుండి శ్రీ మహా విష్ణు మీద కొన్ని పద్యాలూ ....

పోతన తెలుగు భాగవతము ప్రధమ స్కందం నుండి శ్రీ మహా విష్ణు మీద   కొన్ని పద్యాలూ  ....


సరసిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ

కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్

సురలున్ బ్రాహ్మణసంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్

హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.


భగవంతుం డగు విష్ణుఁడు

జగముల కెవ్వేళ రాక్షస వ్యధ గలుగుం

దగ నవ్వేళలఁ దడయక 3

యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.


 చూపు అతిరహస్యమైన హరిజన్మ కథనంబు

మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ

జాల భక్తితోడఁ జదివిన సంసార

దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.


జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ

ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్ 

వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ

చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.