Face book జంద్యాల గారి స్టైల్లో....
- Get link
- X
- Other Apps
Face book జంద్యాల గారి స్టైల్లో....
------------------------------ -------.
ఒరేయ్ !
పేస్ బుక్ లో ఎవడో చచ్చాడని పోస్ట్ చేస్తే
లైక్ చేసే పింజారి వెధవ !
పేస్ బుక్ లో ట్విట్టెర్ వెతికే దరిద్రపు సన్నాసి !!
ప్రొఫైల్ పిక్చెర్ లు హాక్ చేసే నిక్రుష్ట
దుష్టాత్ముడా!!
పొద్దున్నె పాచి మొఖం తో స్మైల్ పోస్ట్ చెసే
సోంబేరిగా !!
మొబైల్లో ఆటోమాటిక్ వాయిస్ లకు రిప్లై ఇచ్చే
ఏప్రాసి గా!!
కంప్యూటర్ లో లో్టస్ అంటె పువ్వా? అని అడిగే
చెప్రాసి గా!!
ఒసమా బిన్ లాడెన్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించె
బల్లి మొహమా!!
ఏ కామెంటుకైన లైక్ కొట్టే బ్రష్టాతి బ్రష్టా!!
బ్యాంక్ మెసెజ్ లకు పేస్ బుక్ ఐడీ ఇచ్చే శుంఠాతి
శుంఠా!!
ఇంట్లో దువ్వెన పోతే గూగుల్ లో వెతికే వెధవన్నర
వెధవ...!!
కామెంటుల కోసం ఎదురు చూసే అక్కుపక్షి..!!
నీ గ్రూపులో ఒకడే మెంబెర్ ఉన్న ఏకాకి .. కాకీకవి!!
నీ కంప్యూటర్ లో వైరస్ రాను, నీ హార్డ్ డిస్క్
డ్రైనేజీ లో వెయ్య!!
24 గంటలూ పనీ పాట లేకుండా పేస్ బుక్ చూసే
త్రాష్టుడా..!!
పోతావురా రేయ్ !! పోతావు ... పేస్ బుక్ ఐడీ లేకుండా పోతావురా ....
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment