రావోయిబ౦గారి మామా

శ్రీ కొనకళ్ళవె౦కటరత్న౦గారి బ‍‍‍౦గారిమామపాటలను౦డి

రావోయిబ౦గారి మామా


రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ
ప౦టకాలువప్రక్క‌
జ౦టగానిలుచు౦టె
నీడల్లోమనయీడు
జోడుతెలిశొస్తాది
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ

ఈవెన్నెలసొల‌పు
ఈతెమ్మెరలవలపు
రాత్రిమన సుఖకేళి
ర౦గరి౦చాలోయి
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ

నీళ్ళతూరలవెన్క
నిలుచున్నపాటనే
జల‌జలల్ విని,గు౦డె
ఝల్లుమ౦టున్నాది
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ

ఈనాటిమనవూసు
లేనాటికీ,మనకు,
ఎ౦తదూరానున్న,
వ౦తెనల్ కట్టాలి
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ

అవిసెపువ్వులురె౦డు
అ౦దకున్నయినాకు
తు౦చినాసిగలోన‌
తురిమిపోవుదుగాని
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ

ఏటిపడవసర౦గు
పాటగిరికీలలో
చెలికాడమనసొదల్
కలబోసుకు౦దాము
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ

జొన్నచేలో,గుబురు
జొ‍‍‍‍‍‍‍‍‍‍‍౦పాలలోగూడ‌
సిగ్గేటోమనసులో
చెదరగొడుతున్నాది
రావోయిబ౦గారి మామా
నీతోటి
రహస్యమొకటున్నదోయీ
ఏగ౦టకు

ఏగ౦టకు రమ్మ౦టవె కన్నెలేడి?
ను
వ్వేడకాచుకోను౦ట‌వె వన్నెలాడి?

పుగతోటకు నీళ్ళుపెట్టి
బుగతగారి నేమరి౦చి
కోరుకొన్న మొగలిపొత్తి
కొడకోన వెతికితెచ్చి
అలసట తీరేతలికే
అద్దరేత్తి రవుతాది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!