Tuesday, October 31, 2017

ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’

- లలిత ,రాగిణి ,పద్మిని--                                                             - లలిత ,రాగిణి ,పద్మిని-

ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’ 

.

కొచ్చిన్ సిస్టర్స్ తో ప్రోగ్రాం. 

ఆర్గనైజర్స్ హడావుడి పడిపోతున్నారు.

.

‘ఎక్కడ ఎక్కడ వారు?’ అని వెతుకుతున్నారు. 

.

ఇది గమనించి శ్రీశ్రీ ‘ఎందు కొచ్చిన్ సిస్టర్స్?’ అన్నారు

.

( ఎందుకొచ్చిన అని ఒక అర్ధం, ఎందు? అని ప్రశ్న రూపంలో ఒక అర్ధం).

{కొచ్చిన్ సిస్టర్స్ చిత్రం - లలిత ,రాగిణి ,పద్మిని-}

-

ముళ్ళపూడి ..వారు పేల్చిన జోకులు !


.

టీచర్ పిల్లవాడిని ‘గుఱ్ఱము’ అని రాయమంటాడు.

పిల్లవాడు ‘గఱ్ఱమ’ అని రాసుకొస్తాడు. ‘ఇదేమిట్రా?’ అని టీచర్ కేకలేస్తాడు.

పిల్లవాడు అంటాడు : ‘మీరే కదా అన్నారు టీచర్ - ‘గుఱ్ఱము’ నకు కొమ్ములుండవు అని’

( అసాధ్యమిది వేరే భాషలో)

.

కృష్ణుడు తలుపు తీసి చూస్తే ఎదురుగా స్త్రీ మూర్తి ఉంటుంది. ‘అరె మీరా?’ అంటాడు కృష్ణుడు.

.

‘మీరా కాదు సక్కుబాయి’ –ఆ స్త్రీ సమాధానం (ఎలాగండి- వేరే భాష వారికి ఈ జోక్ చెప్పేది?

గోమాత సర్వ శుభ రూపిణి !


గోమాత సర్వ శుభ రూపిణి !

-

“సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం 

సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం”

.

సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని, 

వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని, 

గోమాత యజ్ఞమునకు తల్లి వంటిదని ఈ శ్లోకం అర్థం.

గోమాత సర్వ శుభ రూపిణి. 

ముక్కోటి దేవతలకు నిలయం గోమాత.

శుభరాత్రి -సౌందర్య లహరి ! **** 6*** .

శుభరాత్రి -సౌందర్య లహరి !

**** 6***

.

శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా

పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |

ధనుర్బాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||

.

గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన

మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ,

సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి 

వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, 

పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడి శౌర్యస్వరూప ఐన భగవతీదేవి

మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

మళ్ళీ జరగదు…ఒక సరి కొత్త ..పాత జోకు!!

మళ్ళీ జరగదు…ఒక సరి కొత్త ..పాత జోకు!!

(ఈ జోకు నాది కాదు ఎవ్వరిదో తెలియదు.)

-

ఒకాయనకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. జైల్లో కొద్ది రోజులు 

ఉండే సరికి ఆయనికి విసుగొచ్చింది.దగ్గర్లో ఉన్న ఒక చీమను 

పట్టుకుని దానికి కొన్ని ట్రిక్స్ నేర్పించాలనుకున్నాడు. ఎగరడం, దొర్లడం,పిల్లిమొగ్గలేయడం లాంటివి. అన్ని సంవత్సరాలపాటు శిక్షణ ఇచ్చి దాన్ని ఎలా చెబితే అలా చేసేలా తయారు చేశాడు.

జైలు శిక్ష పూర్తయిన తర్వాత దాన్ని ఒక అగ్గిపెట్టెలో పెట్టుకొని బయటకు వచ్చాడు. బార్ లోకి వెళ్ళాడు.

ఒక దగ్గర కూర్చుని అగ్గిపెట్టె లోనుంచి చీమను బయటకు వదిలాడు. పక్కనున్న అతనితో “ఇప్పుడు ఈ చీమ నేను ఎలా చెబితే అలా చేస్తుంది. చూడు” అన్నాడు.

అతను ఆశ్చర్యపోతూ “ఏదీ చూపించండి?” అన్నాడు.

జైల్లో తను ఆ చీమకు నేర్పించిన ట్రిక్కులన్నీ చూపించాడు. అవతలి వ్యక్తి సంభ్రమంగా “దీంతో నువ్వు చాలా డబ్బు సంపాదించవచ్చు. నీ పంట పండినట్లే ” అన్నాడు.

దాంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయి మన హీరో పక్కనే ఉన్న బేరర్ ని పిలిచి ” ఏమోయ్ ఈ చీమను చూశావా?” అన్నాడు.

వాడు వెంటనే దగ్గరికి వచ్చి ఆ చీమను చేత్తో నలిపేసి.

” సారీ సర్ ఇంకెప్పుడూ అలా జరగదు.” అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

...

గమనిక: జోకుల్లో తర్కం(లాజిక్) కోసం వెతకద్దు. 

నచ్చితే మనసారా నవ్వుకోండి. 

ఇదేమీ నిజంగా జరిగింది కాదు.

....

Monday, October 30, 2017

యాత్రలు-కాశీ ప్రయాగ!

.

యాత్రలు-కాశీ ప్రయాగ!

.

సీ.కాలాడినప్పుడే కావాల్సిన పనులు 

చేసినంత సమకూరు సుభ మిలను. 

కాలాడి నప్పుడే కాశీ ప్రయాగల 

యాత్రలు చేయనూహించవలయు 

చేతనున్నప్పుడే చేయు దానములన్ని 

చేతులాడినప్పుడే చేయు పనులు 

కన్నులున్నప్పుడే కరువార తిలకించు 

కమలనాధుచరణ కమలములను. 

.

ఆ. చెవులు వినగలిగిన చక్కని భజనలు

చెవులకు వినిపించు జలవు మీర

పలుకు గలిగినపుడే పరమేశు నామము

పరిపరివిధములను పలుకుచుండు.

.

(ఇది మా అక్క Suryalakshmi Taranikanti గారి పద్యం.)

కార్తీక పురాణం 12వ రోజు!!


-

కార్తీక పురాణం 12వ రోజు!!

-

ద్వాదశీ ప్రశంస: మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.

కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ దాన మహిమ
పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను

సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు"!


.

సిద్దేంద్రయోగి...వారి గురువు నారాయణతీర్థులు"!

.

నారాయణ తీర్థుల వారికీ దృష్టిదోషం ఉండేది... రోజూ రాత్రిళ్ళు భోజనాలయ్యాక....వసారాలో పడుకునీ కళ్ళుమూసుకుని 

తరంగాలు పాడుకునేవారు.

బాలకృఘ్ణడొచ్చి.....తీర్థులవారి బొజ్జమీదెక్కి....తాండవం చేసేవాడు.

తాండవ క్రిఘ్ణడి నృత్యం రోజూ చూస్తున్న సిద్దయ్య...ఓ రోజు అడిగాడు. "గురూ గారు రోజూ బాలకృఘ్ణడు మీ బొజ్జమీద తాండవం చేస్తోంటే మీకు పొట్టనొప్పిగా ఉండట్లేదూ?"

"బాలకృఘ్ణడి తాండవమా...ఎప్పుడ్రా..."

"అయ్యో! రాత్రిళ్ళు....మీరు నిద్రపోయే ముందు తరంగాలు అంటారు గదా....అప్పుడు బాలకృఘ్ణడు తాండవం చేస్తాడు...నేను రోజూ చూస్తున్నాగా"!

"ఎంత అదృష్టవంతుడివిరా...గుడ్డిపీనుగుని నాకు కనపడ్డేం!" అని కళ్ళు తుడుచుకునీ

"ఒరే...ఈసారి కృఘ్ణడు కనబడ్తే మనిద్దరికీ జన్మరాహిత్యం ఎప్పుడో కనుక్కో..."

"ఓ......అలాగే"అన్నాడు సిద్దప్ప...

మర్నాడు రాత్రి బాలకృఘ్ణడు కనపడగానే దణ్ణం పెట్టీ "జగద్గురూ....మా గురూగారికీ, నాకూ మోక్షం ఎప్పుడు?" అన్నాడు.

"నీకు ఈ జన్మలోనే...(నా దర్శనం అయ్యిందిగా.....!)

మీ గురూగారికి మాత్రం మరో జన్ముంది!!" అన్నాడు. మురళి మనోహరంగా మోగింది...

అంచేతే సిద్దేంద్రయోగి...యక్షగానంని ఆంధ్ర దేశం అంతటా ప్రదర్శించీ...పుణ్యలోకాల కెళ్ళారు.

ఆ తర్వాత...వారి గురువు నారాయణతీర్థులు...

.

కృష్ణలీలా తరంగాలు’

.

.కృష్ణంకలయ సఖీ సుందరం

బాలకృష్ణం కలయ సఖీ సుందరం

కృష్ణం గత విషయ తృష్ణం....

.

అవి రాసినాయన `నారాయణ తీర్థులు’ .!


శుభం...శ్రీకాళహస్తీశ్వరా !

శుభం...శ్రీకాళహస్తీశ్వరా !

.

పవిపుష్పంబగు, నగ్నిమంచగు,నకూపారంబు భూమీస్థలం

బవు,శత్రుండతిమిత్రుడౌ,విధముది వ్యాహారమౌనెన్నగా

నవనీమండలి లోపలున్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్

శివ!నీ నామము సర్వవశ్యకరమౌశ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీకాళహస్తీశ్వరా!

ఈ భూమియందు నీమహిమగల నామమైన "శివ శివ"యని నామోచ్చారణము

చేయువానికి కఠినమైన వజ్రము సుకుమారమైన పువ్వుగాను,అగ్నిమంచుగాను,

సముద్రము భూమిగాను,శత్రువు మిత్రుడుగాను, విషము గొప్పరుచికరమైన ఆహారముగాను కన్పట్టు చుండును.పరికించగా

నీ పేరు అన్నింటిని వశము చేసుకోనునట్టిది అని తెలియును.

Sunday, October 29, 2017

బోల్ రాధా బోల్ అమ్మడు..!!

                                బోల్ రాధా బోల్ అమ్మడు!!

మన బోల్ రాధా బోల్ అమ్మడు... ఇప్పుడు ఎలాగుందో...

మనం అనుకోవడమే గాని... వారి లోకం వారిది !!

మా దివాకర్ల వెంకట అవధాని సార్ !!

మా దివాకర్ల వెంకట అవధాని సార్ !!

.

తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలోఎంత గాఢానురక్తిని 

క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. 

ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.

పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా 

చదివి వినిపించేవారు.

ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని 

రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన 

ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి.

..

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా

షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా

ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై!!

.

అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ

పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన

స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర

కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్!!

.

అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని

ప్రవరుడి ఘట్టాలను పాడి వినిపిస్తుంటే, మాకు ఒక్క పదం అర్థం కాకపోయినా ఒళ్లు పులకరించిపోయేది. 

రేడియోలో ఘంటసాల, సుశీల, లీల, జిక్కి పాటల, పద్యాల పారవశ్యం ఒక వైపు, ఇల్లు వదిలాక స్కూల్లో తెలుగు పద్య శ్రవణానందం మరోవైపు… 

మా బాల్యం ఎంత హాయిగా గడిచిపోయిందో!!

ఋణ గీత అను అప్పుల వేట !

-


ఋణ గీత అను అప్పుల వేట !

.

సుమతి శతక కర్త అప్పిచ్చువాడు లేని వూళ్ళో వుండ వద్దన్నాడు. 

ఏమి చిత్రమో గానీ మరీ యిదే కవి 'అప్పుగొని చేయు విభవము /తెప్పరమై కీడు తెచ్చుర సుమతీ అన్నాడు.

మరి అప్పిచ్చే వాడిని వూర్లో పెట్టుకోవడం ఎందుకు?

మళ్ళీ ఈ కవిగారే బంగారు కుదువ బెట్టకు అంగడిలో సరుకులు అరువు తేకు అన్నారు.

ఈకాలం లో బంగారు కుదువ బెట్టకపోతే పిల్లాడిని చదివించడ మెలా?మధ్య తరగతి వారి బాధలు అర్థం చేసుకోవాలి మరి! "అర్థం చేసుకోరూ!"

.

'అప్పులేనివాడే అధిక సంపన్నుండు' అంటాడు వేమన, 

"తీర్చినట్టి బకాయి తెచ్చిపెట్టును హాయి /అప్పు మెడ లో రాయి ఓ!కూనలమ్మా!అన్నారు ఆరుద్ర.

మరి పింగళి నాగేంద్రరావు గారు "అప్పుచేసి పప్పుకూడు 

తినరా ఓ!నరుడా/గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా' అని సూక్తి ముక్తావళి బోధించారు.

ఎవరి మాట వినాలి?

వున్నవారు లేనివారు రెండే రెండు జాతులురా / వున్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా"

అన్నారు పింగళి వారు.

అప్పుల అప్పారావు ఓ విరుగుడు చెప్పారు.

ఐ.పి పెట్టిన వాడే వి.ఐ.పి జగాన" అప్పిచ్చిన వాడు మన బాగే కోరతాడన్నది పెద్దల వాక్యం 

'అప్పిచ్చిచూడు ఆడపిల్లనిచ్చి చూడు' అన్నట్టు 

ఎవరి కష్టాలు వాళ్ళవి.అప్పులుచేయడం లో మనకు ఆదర్శం మన వెంకన్న బాబు, మరియు మన ప్రభుత్వ.మే కదా!

.

'ఋణానంద లహరి'.వ్రాసిన ముళ్ళపూడి వారికి నమస్కరిస్తే 

"నీకు అడగ్గానే అప్పుదొరకా" అని ఆశీర్వ దిస్తారట.

ఇంతకీ అప్పు నిప్పా?పప్పా?ఏమో ఒకటి మాత్రం నిజం

'అప్పు ఆరు తెన్నులు ముప్పు మూడు తెన్నులు' ఆ తరువాత తీసుకున్న వాళ్ళ తలరాత.

"అప్పుతీసుకున్నవాడే అధిక సంపన్నుండు' అంటాడు ఆధునిక కవి.ఎందుకు కాడు.

అప్పు చేసి తెచ్చిన డబ్బు వడ్డీలకు తిప్పితే అధిక సంపన్నుడు కాడా?అప్పుచేసి కారు కొనరా ఓ! నరుడా! యిదే కలికాలపు తీరురా నరుడా! 

ఏదో తమాషాకు కాసేపు నవ్వుకుందామని వ్రాశాను.అప్పుచేయకండి.

అయినా నేను చెప్తే మానేస్తారా ఏమిటి?

సర్వసిద్ధికారకం!!

                                  సర్వసిద్ధికారకం ప్రభో !.!


-

సర్వసిద్ధికారకం ప్రభో !.!ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,

భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, 

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. 

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,

సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్..

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, 

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. 

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,

న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,

పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,

సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,

తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ....

..

(చిత్రం...వడ్డాది పాపయ్య గారు.)

బుద్దుండే ఆడదెవతీ సంతానం కోరుకోదు ''!!

బుద్దుండే  ఆడదెవతీ సంతానం కోరుకోదు ''!!

.

''మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది 

ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు;

పిల్లలను కనడం తప్ప ,మరే పనైనా చేయగలదు.

.

ఇక పిల్లల విషయానికొస్తే -బుద్దుండే  ఆడదెవతీ సంతానం కోరుకోదు ''

-

మార్గరెట్ మిచ్చెల్...గాన్ విత్ ది విండ్ నుండి .

శుభరాత్రి - అమ్మడు ! .


శుభరాత్రి - అమ్మడు !శుభరాత్రి !

.

ఆమ్మాయే సన్నగ - అర నవ్వే నవ్వగా .

మాతరం నటి చెప్పుకోండి చూద్దాం .

.


శుభరాత్రి - అమ్మడు !

.


శుభరాత్రి - అమ్మడు !

.

శుభరాత్రి - అమ్మడు !

.


శుభరాత్రి - అమ్మడు !

.

శుభరాత్రి - అమ్మడు !

.


 శుభరాత్రి - అమ్మడు !

.

శుభరాత్రి - అమ్మడు !

.

శుభరాత్రి - అమ్మడు !


.

శుభరాత్రి - అమ్మడు !

.శుభరాత్రి - అమ్మడు !

.

శుభరాత్రి - అమ్మడు !

.


 శుభరాత్రి - అమ్మడు !

.

శుభరాత్రి - అమ్మడు !

.

ఆమ్మాయే సన్నగ - అర నవ్వే నవ్వగా .

మాతరం నటి చెప్పుకోండి చూద్దాం .

సినిమాల వాడ బెజవాడ ! -

సినిమాల వాడ బెజవాడ !

-

1950s లో తమిళ్ మలయాళం డబ్బింగ్ సినిమాలు బాగా వచ్చేవి.

తమిళ డబ్బింగు సినిమాలలో మంత్రికుమారి, సౌదామిని, మనోహర్ చాలబాగాఆడాయి.

-

మలయాళం డబ్బింగు సినిమాలలో ..తండ్రి, ఆకలి, కా ల చక్రం నాకు బాగానచ్చినవి.

-

హీరో లలో నజిరు.. తిక్కుర సి ...కాని సుకుమారి నాకు నచ్చిన హెరాయిన్ ..

ఆమె ఇప్పుడు తల్లి పాత్రలలో కనిపిస్తుంది.

-

ఆకలి కరపత్రాలునాదేగ్గెరవంద కుఫైగాఉండేవి....

మాకు అప్పుడుఅవేగొప్ప...

బెజవాడ ఈశ్వరమహల్ ,రామా టాకీసు ,దుర్గకళామందిరం.. లక్ష్మిటాకీసుచుట్టుతిరిగి ఫిమ్స్ముక్కలు ఎరుకోనేవాళ్ళం..

అదొకసరదా...హాల్దేగ్గెరవెళ్లిబయటనుంచి మాటలుపాటలువినేవాళ్ళం.

ఆరోజులుమాకే కాదు ఎవ్వరికీరావు.

.

ఒకచిన్నవిషయం.ఒకరోజు దేవదాసు సినిమాచూసి 9 గంటలకు సత్యనారయణపురంలోమాఇంటికివస్తున్నాం. నేనుమాతమ్ముడు.. దారిలోఒకఊరకుక్కమమ్మల్ని ఆపేసిందిఒకఅరగంట... 

మల్లి ఎవరోపెద్దవాళ్ళువస్తే వారితో కలసి దాటం..

అప్పుడునావయసు10 అనుకుంటాను.

కార్తిక పురాణం 11వ రోజు !

                                   కార్తిక పురాణం 11వ రోజు

-

                       (మంధరుడు - పురాణ మహిమ.)

ఓ జనక మాహారాజా! ఈ కార్తీక మాస వ్రత మహాత్మ్యం గురించి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తనివితీరదు. ఈ మాసములో విష్ణువును అవిసెపూలతో పూజిస్తే చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు పూజ తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికొక ఇతిహాసము చెప్తాను. శ్రద్ధగా ఆలకించమమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.

పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనము చేస్తూ, మద్యపానీయాలకు అలవాటు పడ్డాడు. అంతే కాక తక్కువ జాతి వారితో స్నేహము వలన స్నాన, జప, దీపారాధన వంటి ఆచారాలను కూడా పాటించక దురాశాపరుడై ఉండెను. అతని భార్య మహా గుణవంతురాలు. శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుక్కోక సకల ఉపచారాలను చేస్తూ, పతివ్రతా ధర్మమును పాటించసాగెను.
మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవానిగా పనిచేయుచున్ననూ, ఇల్లు గడవక చిన్న వ్యాపారాన్ని కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్టగడవక పోవడం వల్ల దొంగతనములు చేస్తూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న డబ్బును, వస్తువులను అపహరించి జీవించసాగెను. ఒక రోజు ఓ బ్రాహ్మణుడు అడవిదారిన పోతున్నప్పుడు అతన్ని భయపెట్టి, కొట్టి అతని దగ్గరున్న డబ్బును లాక్కుంటున్నప్పుడు అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి డబ్బును చూడగానే వారిద్దరినీ చంపి ఆ డబ్బును మూటగట్టుకునెను. అంతలో దగ్గరలో ఉన్న గుహనుండి పులి వొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకున్ని చంపుటకు ప్రయత్నించగా కిరాతకుడు దానిని చంపెను. కానీ ఆ పులి కూడా అతనిపై పంజా విసరడం వల్ల ఆ దెబ్బలకు చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురూ నాలుగు విధాలుగా మరణించినారు. ఆ నలుగురూ యమలోకములో అనేక శిక్షలు అనుభవిస్తూ, రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి.
మంధరుడు చనిపోయిన దగ్గర నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేస్తూ భర్తను తలచుకొని దు:ఖించుచూ కాలము గడుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి 'స్వామీ! నేను దీనురాలను. నాకు భర్తగానీ, సంతతి గానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్న దాన్ని. కాబట్టి నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించెను.'
ఆమె వినయానికి, ఆచారానికి ఆ ఋషి సంతోషించి 'అమ్మా ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు వృధాగా పాడుచేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రమ్మని చెప్పెను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు పొందవచ్చని చెప్పగానే ఆమె సంతోషముతో వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి, గోమమయముచే అలికి ముగ్గులు పెట్టి, తానే స్వయంగా రెండు వత్తులను చేసి, ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయం దగ్గర జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను.
ఆమె కూడా ఆ రాత్రంతయూ పురాణము వినెను. ఆ రోజు నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలానికి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుటవల్ల విష్ణు దూతలు వచ్చి ఆమెను విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో కలిసి ఉండడం వల్ల కొంత దోషం వల్ల మార్గ మధ్యమమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి 'ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి నా యందు దయతలచి వారిని కాపడమని' వేడుకొనెను.
అంత విష్ణుదూతలు 'అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైనప్పటికీ స్నాన, సంధ్యావందనాలు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే స్నేహితుడ్ని చంపి డబ్బు కాజేసెను. ఇక మూడవవాడు పులి. నాల్గవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై పుట్టినా అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశి రోజున కూడా తైల లేపనము, మద్యమాంస భక్షణ చేసినాడు కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురూ నరక బాధలు అనుభవిస్తున్నారని వారి చరిత్రలు చెప్పెను.'
అందుకామె చాలా విచారించి 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుని కూడా రక్షించమని ప్రార్థించగా, అందుకు విష్ణు దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును పులికి, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము విప్రునకు, ధారపోసినచో నీ భర్తతో పాటు వారికీ మోక్షము కలుగుతుందని చెప్పగా ఆమె అలానే ధారపోసెను. ఆ నలుగురూ ఆమె దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి'. కాబట్టి 'ఓ రాజా! కార్తీక మాసము

                                                        ---------------------

చాణక్య నీతి!

-

చాణక్య నీతి!

.

ఏకవృక్షసమారూఢా నానా వర్ణా విహఞ్గమాః |

ప్రభాతే దశసు దిక్షు తత్ర కా పరివెదనా ||

-

జీవితం లో నైనా ఇదే జరుగుతుంది! ఎవరెవరో ఎక్కడెక్కడ నుండియో వస్తారు . తమ పని తీరిపోతూనే ఎవరిదారి వారిదే! ఈ విషమై వాల్మీకి రామాయణములో ఈ విధముగా అంటాడు.

యదా కాష్టంచ కాష్టంచ సమేయేతాం మహార్ణవే

సమేత్యపి వ్యపేయేతాం కాలమసాధ్య కంచన

ఒక పెద్ద వరదలో అటువైపునుండి ఒక దుంగ ఇటువైపునుండి ఒక దుంగ కలిసి కొంత దూరము పయనించుతాయి. కానీ ఆవి కాలమనే ఒరవడికి విడిపోతాయి. ఇది ప్రకృతి సహజము. పైగా ఇక కలవవు అని కూడా చెప్పలేము. లేక తప్పక కలుస్తాయి అనలేము. ఒకే చెట్టు పక్షులు ఎటు తిరిగినా రాత్రికి రావలసినదే కదా! చెట్టుకు కూడా ఆ సహనము కావాలి.

మనకైనా పై విషయము అదే విధముగానే వర్తిస్తుంది. ఏవేవో కారణాలతో ఒకేచోట పోగైనవారు తమ అవసరము తీరగానే తమదారి తాముచూసుకొంటారు. వారు కృతజ్ఞత చూపలేదే అని మనము బాధపడితే కోరి రోగాలు కొనితెచ్చుకోవడమే! దానికంటే వారి రాకపోకలవల్ల మనకు వచ్చిందీ లేదు పోయిందీ లేదు అని ఊరకుంటే ఆరోగ్యము వుంటుంది ఆనందమూ వుంటుంది.

ఆశ్రయించినవారికి అయినంతవరకు సమకూర్చు. కృతజ్ఞత చూపలేదని కృంగిపోవద్దు.

ఈశ్వరుని గుడి గోపురం.అరుణాచలం! -

ఈశ్వరుని గుడి గోపురం.అరుణాచలం!

-

తేజో లింగము : అరుణాచలేశ్వర స్వామి - ఉమాదేవి , అరుణాచలం ( తిరువణ్ణామలై) ,తమిళనాడు .

తమిళనాడులో (అరుణాచలం) తేజోలింగము ఉంది . ఈ స్వామి "అరుణాచలేశ్వర స్వామి"అని పిలుస్తారు. పార్వతీ దేవి ఇక్కడేతపస్సు చేసి, శివునికి అర్థ భాగమైనదని ప్రతీతి. ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి. మీదూరంలో ఉంది. విల్లు పురం నుంచి కాట్పాడికివెళ్లే మార్గంలో ఉంది . విల్లు పురం నుంచి 68కి. మీ .

అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక.

అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది.

ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.

ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

-

దేవదాసు-వేదాంతం!

_

దేవదాసు-వేదాంతం!

.

అక్కినేని "దేవదాసు" విడుదలయిన రోజుల్లో అప్పటికి అంతగా విఖ్యాతి గాంచని శ్రీ ఆరుద్ర, శ్రీ శ్రీశ్రీ విజయవాడలో రిక్షాలో వెడుతూ

ఆ పాటల లోని వేదాంతాన్ని గురించి చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు.

"కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! బహుదొడ్డ ప్రయోగం" ఆరుద్ర

" దాంట్లో పెద్ద వేదాంతం దాగుందోయ్" అన్నారు శ్రీశ్రీ ఓ దమ్ములాగుతూ

" జగమే మాయ అంటూ చాలా అర్ధం లాగారు"

"అల పైడిబొమ్మ! చాలా బాగుంది" ఇంకో దమ్ముతో శ్రీశ్రీ

"కొన్ని ప్రయోగాలు అర్ధం లేకుండా వాడారు"

" తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి బాబు!" అన్నాడు రిక్షావాడు చర్చకు పుల్ స్టాప్ పెట్టాడు.

.

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! అని రాయలేదుట .. కూడి (కలసి)ఎడమైతే(విడిపోతే ) పొరపాటు లేదు అని రాసేరు .. కాని ఘంటసాల వారు అలా పాడేరు... వేదాతం వారు తాగుబోతోడి మాటలకు అర్దాలేముంటాయి సర్దుకు పోయేరుట.

.

అరుణ రేఖ కూచిభొట్ల గారి జోకు !

-

అరుణ రేఖ కూచిభొట్ల గారి జోకు.

-

."పెళ్ళి చూపులలో నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నన్ను చూసి ఏం అనుకున్నావు?" అడిగాడు శ్రీను.

.

"మీ మీసాలు, గంభీరమైన మొహం చూసి మీ రెక్కడ నా మాట వినరోనని భయపడ్డాను!" అంది వాణి

కనక మహా లక్ష్మీ అదరహో!!


-

కనక మహా లక్ష్మీ అదరహో!!

.

అందాలె తొంగి చూసె.హాయి హాయి..

ఆనందం ఈలవేసే హాయిహాయి...

సొగసు మెరిసే. వయసు విరిసే ..మనసుమురిసే.!

నరకాసురుడు !


-

నరకాసురుడు !

-

నరకాసురుని తరచి చూస్తే… వ్యక్తిత్వానికి సంబంధించిన 

చాలా సూచనలు కనిపిస్తాయి.

నరకాసురుడు ఎవరో కాదు… విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామికీ, భూదేవికీ కలిగిన సంతానమే! 

నరకాసురునికి బీజం సంధ్య వేళలో ఏర్పడిందట. పగలు- వెలుతురు, వేడి, జ్ఞానం, శక్తి… వంటి గొప్ప లక్షణాలకు ప్రతీక. 

ఇక రాత్రేమో- చీకటి, నిద్ర, అజ్ఞానం, కామం… వంటి దుర్లక్షణాలకు ప్రతినిధి. 

మంచి లక్షణాలు ఎన్ని ఉన్నా కూడా, ఒక్క దుర్లక్షణం ఉంటే చాలు… ఆ మనిషి నాశనం అయిపోతాడు. 

రావణాసురుడు జ్ఞాని అయినప్పటికీ అహంకారంతో ఓడిపోయాడు. మహిషాసురుడు బలవంతుడు అయినప్పటికీ మదం వల్ల నశించిపోయాడు. నరకాసురునిలో కూడా మంచిని తుంచే చెడు లక్షణాలు ఉన్నాయని సూచించడానికి అతను సంధ్యవేళలో రూపాన్ని ధరించాడు అని చెబుతారు.

దేవుని కుమారుడు అయినప్పటికీ…

తమ కుమారుడైనప్పటికీ నరకాసురునిలో అసుర లక్షణాలు ఉన్నాయని గ్రహించారు ఆ దంపతులు. లోక కళ్యాణం కోసం అలాంటివాడిని సాక్షాత్తూ విష్ణుమూర్తే చంపేస్తాడని భయపడింది భూదేవి. ఆ భయానికి ఆమెలోని తల్లిమనసు తల్లడిల్లింది. దాంతో `ఏ ఒక్కరివల్లా తన కొడుకు చనిపోకూడ`దన్న వరాన్ని వరాహమూర్తి దగ్గరనుంచి కోరుకుంది భూదేవి. విష్ణుమూర్తి ఒక్క క్షణం ఆలోచించాడు. `నీ చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ అతను మరణించడం సాధ్యం కాదు` అన్న వరాన్ని అందించాడు. ఆ మాటలకు మురిసిపోయింది భూదేవి. చూస్తూ చూస్తూ తన కన్నబిడ్డను తానే చంపుకోదు కదా అన్నది ఆమె నమ్మకం! కానీ నరకుని అకృత్యాలు మీరిపోవడంతో సత్యభామ అవతారాన్ని ధరించి తానే అతని గుండెలను చీల్చాల్సి వచ్చింది. నడవడి సరిగా ఉంటే ప్రపంచమే తన నెత్తిన పెట్టుకుంటుంది. కానీ అదే నడవడి దారి తప్పితే, సాక్షాత్తూ భగవంతుడే తన తండ్రి అయినా నాశనం తప్పదు అని సూచిస్తున్నాడు నరకాసురుడు.

చెడు స్నేహం:

నరకాసురునిలో అసురలక్షణాలు ఉన్నప్పటికీ అవి చాలారోజుల వరకూ నిద్రాణంగానే ఉండేవి. కానీ బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం మొదలైన తరువాతే అతనిలో రాక్షసప్రవృత్తి ప్రబలిందని కొన్ని గాథలు చెబుతున్నాయి. స్నేహితుడు చెడ్డవాడైతే మనలో నిద్రాణంగా ఉన్న బలహీనతలకు బలం చేకూరుతుందని ఇది సూచిస్తోంది. నరకాసురుడు ఇక లోకం మీదకి విజృంభించసాగాడు. క్రోధంతో మునులను పీడిచసాగాడు, మదంతో దేవతల తల్లి అయిన అదితి కుండలాలను లాక్కొని అవమానించాడు, కామంతో 16,000 మంది రాకుమార్తెలను చెరపట్టాడు. ప్రాగ్జ్యోతిషాపురం అనే గొప్ప రాజ్యానికి రాజైనప్పటికీ ప్రపంచాన్నే జయించాలని అత్యాశ పడ్డాడు. దాంతో నరకాసురుని వధ తప్పలేదు.

కోరి తెచ్చుకున్న అంతం:

తన మానాన తను చక్కగా రాజ్యాన్ని పాలిస్తే నరకాసురుడికీ ఎప్పటికీ ముప్పు ఉండేది కాదు. కానీ అరిషడ్వార్గాలన్నింటినీ అరువు తెచ్చుకున్న నరకాసురుడు, చావుని కొనితెచ్చుకున్నాడు. ఓరిమికి మారుపేరైన భూదేవే… సత్యభామ రూపంలో అతడిని సంహరింపక తప్పలేదు. ప్రహ్లాదుడు రాక్షసుని కడుపున పుట్టినా దేవునిగా మారాడు. నరకాసురుడు భగవంతుని కడుపున పుట్టినా రాక్షసునిగా అంతమొందాడు. నరకాసురుని చావు పండుగగా మారిందంటే అతని జీవితం ఎంత గొప్ప గుణపాఠమో కదా!

Saturday, October 28, 2017

అసామాన్యుడు విశ్వనాథ!!

అసామాన్యుడు విశ్వనాథ!!

-

అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం. 

కొత్తదారి కనుక్కోవటం చాలా కష్టం . కానీ, 

పాత దారిలో ప్రయాణిస్తూ,ఆ దారిని 

కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు. 

అలాంటి అసామాన్యుడు విశ్వనాథ.

.

ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో 

అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని,

తక్కువ కులాలవారి పైన చులకనను, 

స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు.

అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి,

ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు.

.

మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు. 

కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకో

గలుగుతున్నారు.

చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు. 

క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని 

ఖండికలు రాసి, వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు.

నాగేంద్రుడు !

నాగేంద్రుడు !

-

శివకేశవుల అనుగ్రహాన్ని పొందిన నాగేంద్రుడు ... మానవాళిచే

దైవంగా భావించబడుతున్నాడు.

కొన్ని శైవ క్షేత్రాల్లోను ... మరి కొన్ని వైష్ణవ క్షేత్రాల్లోను ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

కొన్ని ప్రాంతాల్లో నాగేంద్రుడు ఉపాలయంగా కాకుండా

ప్రధాన దైవంగా కూడా కనిపిస్తుంటాడు.

ప్రాణస్నేహితులు. !
-

ప్రాణస్నేహితులు. !

.

హలో ! హలో !!

ఎవరూ !

నేనంరా ! తమ్ముడు !

ఆ ! అన్నయ్యా చెప్పు !

ఏం ! లేదురా ! నాకు ఫేస్బుక్ కావలిరా ?

ఫేస్భుక్కా ? అకౌంటు ఓపెన్ చెస్తే సరిపోతుందిగా ?

అకౌంటు ఓపెన్ చెయ్యటం నాకు చేతకాదుగా ! నేను చదువుకోలేదుగా !

అయినా నీకు ఫేస్భుక్ ఎందుకూ ?

ఏం లేదురా ! మొన్న బస్లో వస్తుంటే, ఓ అమ్మాయి తన ఫేస్బుక్ ఐడీ ఇచ్చి, చాట్ చేద్దాం రా అన్నది. !

అలానా ! అయితే ఓ వెయ్యి రూపాయలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో పంపు !

అంతేనా ! ఒరేయ్! ఇప్పుడే పంపుతా ! అర్జెంటుగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చెయ్యరా !

వెయ్యి రూపాయలేంట్రా ! పన్నెండొందలు పంపుతా ! నాకు ఫేస్భుక్ కావల్రా అర్జంటుగా !

అరేయ్ ! దానికి చాలా ప్రాసెస్ ఉందిరా ? నువ్వనుకున్నంత వీజీ కాదు !

అలాగా ! ఇప్పుడే ఒకడు ఫేస్భుక్ అమ్మేత్తానన్నాడు. ఆడేంట్రా ఐదొందలకే ఫేస్భుక్ అమ్మేత్తానంటాడు "

ఒరెయ్ నువ్విలా అందరినీ నమ్మేయ్యబాక ! మోసపోతావ్ ! నేను నీకు అంత అర్జంటయితే నా ఫేస్భుక్ ట్రాన్సఫర్ చేసేస్తా ?

అలాగే ! అయితే నా తమ్ముడి చేత పంపిత్తా వెయ్యిరూపాయలు, ఆధార్ కార్డు, ఫొటో

అలా వద్దు. అర్జంటు అంటున్నావుగా ! నా ఫేస్భుక్ అకౌంట్ నువ్వు వెయ్యి రూపాయలు పంపగానే ట్రాన్సఫర్ చేత్తా. డబ్బు నా అకౌంట్లో వేసెయ్యి.

అలాగే, అయితే ఆధార్ కార్డు, ఫొటొ అఖర్లేదా ?

ఇది ట్రాన్సఫర్ కదరా ! అవేమీ అక్కర్లేదు.

విసుక్కోకరా బాబు ! నేను చదువుకోలేదుగా ! అందుకే అడుగుతున్నా ! సర్లే పదినిమిషాల్లో బాంకెళ్ళి నీకు అకౌంట్లో డబ్బు ఏత్తా ! ఓకేనా ? నువ్వు మటుకు నీ ఫేస్భుక్ అకౌంట్ నాకు ట్రాన్సఫర్ చేసెయ్య్.

ఉంటానే

ఓకే ! డబ్బు వేసేయ్యిరోయ్ !! ఉంటాను.

నీకున్,మాంసమువాంఛయేని కరవా!

శ్రీ కాళహస్తీశ్వరశతకము...

....

నీకున్,మాంసమువాంఛయేని కరవా! / నీచేత లేడుండగా

జొకైనట్టి కుఠారముండ ననల / జ్యోతుండ నీరుండగా

పాకంబొప్పఘటించి చేతిపునుకన్ / భక్షింప కాబోయచే

చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా / శ్రీకాళహస్తీశ్వరా!

.....

శ్రీకాళహస్తీశ్వరా! 

నీకు మాంసమును తినవలెనని కోరిక ఉన్నచో జింక ఉన్నది.

పదునైన కత్తి ఉన్నది.నీ కంటిలో అగ్ని యున్నది.

శిరస్సుపై గంగ చేతియందు నీళ్ళు ఉన్నవి.

వాని అన్నింటితో వండుకొని,నీ పుఱ్ఱెయగు భిక్షా పాత్ర యందు 

పెట్టుకొని తినవచ్చును గదా!

ఆ బోయవాడైన తిన్నడు పెట్టిన ఎంగిలి మాంసము 

తినుట న్యాయము గాదు! 

అనగా నీ భక్తులు ఇచ్చినది దేనినైనను స్వీకరించెదవు కదా.


శివ స్తుతి!!-

శివ స్తుతి!!

-

చిదానంద రూపం త్రినేత్రాభిరామం

సదా లోకరక్షం పరం వేదసారం!

సదాకారమేకం సదానందరూపం

సదా భక్తపాలం హృదా భావయామి!!

-

కార్తీక పురాణం 10వ రోజు !

-

కార్తీక పురాణం 10వ రోజు

-

ద్వాదశీ ప్రశంస  

మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.

కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.


సాలగ్రామ దాన మహిమ

పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.

ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.

నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. 

.

అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.

ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.

ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.

చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.

శుభరాత్రి -సౌందర్య లహరి! **** 3****

-

శుభరాత్రి -సౌందర్య లహరి!

*

సౌందర్యలహరి శ్రీ శంకర భగవత్పాద విరచితము. ఇది 100 శ్లోకములతో కూడిన దేవీ స్తుతి గ్రంథము. పరబ్రహ్మ తత్త్వాన్ని 'శాంతం, శివం, సుందరం' అని పేర్కొంటాము. ఆ పరతత్త్వం, తత్స్వరూప సౌందర్య స్వభావ ప్రవర్తనాలు మానవాకృతిని దాల్చి, స్త్రీమూర్తిగా అభివ్యక్తమైతే ఎలావుంటుందో ఈ గ్రంథంలో అత్యంత మనోజ్ఞంగా వర్ణింపబడి ఉన్నవి. అంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మంను సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమయ్యే అక్షరమాలారత్నం ఈ గ్రంథం. శ్లోకాలన్నీ మృదుమధుర గంభీరాలై, ప్రసాదసౌకుమార్యాలై వెలయుచు, భక్తిశ్రద్ధలతో చదివే దేవీభక్తులకు అనిర్వాచ్యమైన మనశ్శాంతిని కలుగజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

ఈ గ్రంథంలో దేవీ సౌందర్యం, స్వరూప - సంస్థితి - గుణ - చేష్టా - ప్రభావ - తత్త్వసౌందర్యాల - స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ భేదాలతో అత్యంత మనోహరంగా వర్ణించటం వలన శ్రీ శంకర భగవత్పాద విరచిత ఈ దేవీస్తుతికి సౌందర్యలహరి అనే నామకరణం ఎంతో సముచితంగా ఉంది. ఈ దేవియే యోగమాయ. ఆదిశక్తి ఐన ఈ తల్లి దుర్గాది శక్తిరూపాలను పొంది ఈ కలియుగంలో సర్వత్రా పూజలందుకుంటున్నది. ఆదిపరాశక్తియే ప్రతిగ్రామంలోనూ గ్రామశక్తిగావివిధ నామాలతో వెలయుచున్నది. పోలేరమ్మ, అంకమ్మ, గంగమ్మ,అని ప్రతి గ్రామానికీ గ్రామశక్తి ప్రధాన దేవతగా ఉంటుంది.

పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నప్పుడు అది జ్ఞాతం కాకుండా ఉండడానికి దుర్గాస్తవం చేసి ఉన్నారు. అర్జునుడు కౌరవులతో సంగ్రామానికి మూందు శ్రీకృష్ణ ప్రేరితుడై దుర్గాదేవిని పూజించాడు. ఉపనయం సమయంలో మొదట ఉపదేశింప బడేది గాయత్రీ మంత్రమే కదా! అందువల్ల ప్రతి వ్యక్తీ మొదట శక్తి ఉపాసకుడే అవుతున్నాడు.

జగజ్జనని ఐన శ్రీదేవి తనను ఉపాసించే భక్తులను తన కన్నబిడ్డల్లా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ప్రసాదిస్తుంది. అందువల్ల ఎల్లరూ తమ శక్త్యానుసారం పరాశక్తి, ఆదిశక్తి, శ్రీ రాజరాజేశ్వరీ, లలిత, శ్రీ మహాత్రిపురసుందరి అనే నామాలతో విరాజిల్లే శ్రీదేవిని ఉపాసించి శ్రీమాత అనుగ్రహంతో ఐహిక సుఖాలను మాత్రమే కాకుండ పునరావృత్తిరహితమూ, నిరతిశయ సుఖమూ అమృతధామము ఐన మోక్షాన్ని పొందుదురు గాక!

ఈ గ్రంథరాజానికి విస్తృత వాఖ్యానాలు ఎన్నో వున్నా, దేవి భక్తుల నిత్య పారాయణం నిమిత్తం ఈ గ్రంథాన్ని సంగ్రహ తాత్పర్యముతో, చిన్నపొత్తముగా వెలువరిస్తున్నాము. దేవీభక్తులకు ఈ చిన్నపొత్తము ఎంతో ప్రయోజనకారి కాగలదని మా ఆకాంక్ష.

******************************************************************************************************************

శ్లో|| శివః శక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం

న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి |

అతస్త్వా మారాధ్యాం హరిహర విరఞ్చాదిభిరపి

ప్రణంతుం స్తో్తుంవా కథ మకృత పుణ్యః ప్రభవతి ||

అమ్మా, ఓ భగవతీ! సర్వమంగల సహితుడయిన శివుడు జగన్నిర్మాణశక్తివయిన నీతో కూడితేనేకాని జగాలను సృజించడానికి సమర్థుడు కాడు; నీతో కూడకపోతే ఆ దేవుడు తాను కదలటానికి సైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.

******************************************************************************************* 1

శ్లో|| తనీయాంసం పాంసుం తవచరణ పజ్కేరుహ భవం

విరిఞ్చిస్సఞ్చిన్వన్‌ విరచయతి లోకా నవికలమ్‌ |

వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం

హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్‌ ||

ఓ మాతా! బ్రహ్మదేవుడు నీ చరణకమలాలలో పుట్టిన కించిత్తు పరాగాన్ని గ్రహించి లోకాలను ఎలాటి వైకల్యం లేకుండ సృజిస్తూన్నాడు. ఈ ఇంచుకపదరజస్సునే మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు. దానినే శివుడు చక్కగామొదిపి తన శరీరానికి విభూతిగా అలదు కొంటున్నాడు.

******************************************************************************************* 2

శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||

అమ్మా! నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీప నగరం. ఆ నీ పాదలేశం మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు, సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి. అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది. అంటే ఉద్ధరించేది; సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం.

******************************************************************************************* 3

శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః

త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |

భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం

శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ ||

భగవతీ! లోకశరణ్యా! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించవు కదా! కారణం, ఓ అంబా! భక్తులను భయం నుంచి రక్షించడానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్నిఒసగడానికి, ఆడంబరమైన బాహ్యప్రదర్శ లేని నీ పాదసరోజములే చాలును.

******************************************************************************************* 4

శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం

పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్‌ |

స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా

మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌ ||

ఓ జగన్మాతా! ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను, పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగియై, త్రిపురాలను తెగటార్చి క్రోధావిష్టుడైన శివుడి మనసులో సైతం కామవికారాన్ని కలిగించి క్షోభపెట్టగలిగాడు. అలాగే మన్మథుడు నిన్ను కొలిచి, తన సతి రతీదేవి కన్నులను రంజింపచేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపుతో అరణ్యాలలోతపస్సు చేసుకునే మునుల మనస్సులలో కామాభిలాష కలిగించటానికి సమర్థుడైనాడు. ఔరా! నీ ప్రసాద మహత్తు అద్భుతం కదా!

******************************************************************************************* 5

శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః

వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |

తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌

అపాజ్గాత్తే లబ్ధ్వా జగదిద మనజ్గో విజయతే ||

ఓ హిమగిరి కుమారీ! మన్మథుడి విల్లు పువ్వులతోరూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి; పుష్ప నిర్మితమైన బాణాలూ ఐదు అతడి అమ్ముల పొది; కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు; అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని పరికరాలు కలిగిన మన్మథుడు అంగ రహితుడు; బలిష్టమైన మేనులేని వాడు. అయిననూ, నిన్నారాధించి, నీ కడగంటి కటాక్షంతో ఈ జగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.

******************************************************************************************* 6

శ్లో|| క్వణత్కాఞ్చీదామా కరికలభ కుంభస్తననతా

పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా |

ధనుర్బాణాన్‌ పాశం సృణి మపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా ||

గణగణమని మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొలనూలు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాలతో సాటివచ్చే కుచముల భారంచే కాస్త ముందుకు వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుడి వంటి నెమ్మోము కలదీ, చెరకు వింటిని, పుష్పబాణాలను, పాశాన్ని, అంకుశాన్నిచేతుల్లో ధరించినదీ, త్రిపురాలను మట్టుపెట్టిన శివుడి శౌర్యస్వరూప ఐన భగవతీదేవి మా ఎదుట సుఖాసీనయై ప్రత్యక్షమగుగాక!.

******************************************************************************************* 7

శ్లో|| సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే|

శివాకారే మఞ్చే పరమశివపర్యజ్కనిలయామ్‌

భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్‌ ||

తల్లీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, కల్పవృక్షాల వరుసతో చుట్టబడినదైన కదంబచెట్ల పూలతోటలలో చెలువొందే చింతామణులతో నిర్మితమైన గృహంలో, పరబ్రహ్మ అయినటువంటి పరమశివ పర్యంకనిలయవై, మంగళరూపమైన ( త్రికోణపు) పానుపుపై, నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివైన నిన్ను కొందరు ధన్యులుమాత్రం సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యంగా నీ సేవ లభించదని భావం).

******************************************************************************************* 8

శ్లో|| మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం

స్థితం స్వాధిష్ఠానే హృది మరుత మాకాశ ముపరి |

మనో పి భ్రూమధ్యే సకలమపి భిత్త్వా కులపథం

సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే ||

ఓ భగవతీ! నువ్వు మూలాధారంలోవున్న పృథివీతత్త్వాన్ని, మణిపుర చక్రంలోవున్న ఉదకతత్త్వాన్ని, స్వాధిష్ఠాన చక్రంలోని అగ్నితత్త్వాన్ని, అనాహత చక్రంలోని వాయుతత్త్వాన్ని, అంతకు పైనవుండే విశుద్ధచక్రంలోని ఆకాశ తత్త్వాన్ని, కనుబొమల నడుమనుండే ఆజ్ఞాచక్రంలోని మనస్తత్త్వాన్ని వీడి, సుషుమ్నా మార్గాన్ని ఛేదించుకొని సహస్రార కమలంలోని నీ భర్త ఐన సదాశివుడితో కూడి రహస్యంగా విహరిస్తున్నావు.

*************************************************************************

జరీ అంచు తెల్లచీర ! (రావిశాస్త్రి గారి కధ.)

జరీ అంచు తెల్లచీర !

(రావిశాస్త్రి గారి కధ.)

.

జరీ అంచు తెల్లచీర ని కట్టుకోవాలనే కోరిక విశాలాక్షి అనే అమ్మాయికి

పదేళ్ళ వయసులో కలిగి ఆమెతో పాటు ఎదిగి తండ్రి పేదరికం వల్ల తీరని కోరికయి

గగన కుసుమంగా మారింది. తండ్రి నెత్తురే ఖరీదుగా చెల్లించడానికి సిద్ధపడినా

ఆ చీర ఖరీదుకు సరిపోకపోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఆమె వేదనను,

ఆ వేదనలోని తీవ్రతను రావిశాస్త్రి ఇలా వర్ణిస్తారు.

.

ఇది మెరుపు లేని మబ్బు

ఇది తెరిపి లేను ముసురు 

ఇది ఎంతకీ తగ్గని ఎండ

ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి ఇది గ్రీష్మం 

ఇది శిశిరం ఇది దగ్ధం చేసే దావానలం

.

ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం ఒక్కటి ఒక్కటే సుమండీ

ఒక్క జ రీ అం చు తె ల్ల చీ ర విశాలాక్షి మనసులోని విచారాన్ని, నిరాశని వెల్లడిస్తూ, 

పరస్పర విరుద్ధమయిన అర్థాలను ఇచ్చే పదచిత్రాలతో, చిన్న వాక్యాలతో సాగిన

ఈ రచన విశాలాక్షి పాత్రలోని వేదనను పాఠకుడికి కూడా పంచుతాయి.

అలాగే మరి కొన్ని వ్యాక్యాలు..

ఆశ కొరిక పెద వాడి ను౦చి దనిక... రాజు.. ఆడ.. మెగ .. అ౦దరు

ఆ చితిలొ పడి కాలిపొయారు ఎ౦దరిజీవితాలను తగుల పెట్టారు పెడుతున్నారు..

.ఏ నాటిను౦చొ ఇ నాటివరకు...అ,,,,, నాకు చాలు అనుకొ౦టే అదే సుఖ౦ ...

పెద్దలు అన్నగారు తమరికి తెలియదా.....అయినా సావిత్రి బాగు౦ది....

ఇప్పటికి 50 స౦ ను౦చి పక్కనె వు౦ది.... బాలెరా ఎ౦తొ బాగున్నారు.... 

అ౦తె ,, కనులు,, మనసు ,,ఇవి వెతుకుతూనెవు౦టాయి...

ఇప్పుడు మీరు తమ్ముడు నటిగా ఆమె అ౦తె అ౦టారు.... 

అ౦తెనా అ౦టే ...కాదు ,,,ఇది సత్వ౦... లేదానన్ను తీసివెస్తారు... .

తీయరులె మీ ప్రక్కన నాకు పెద్దదిక్కు వున్నారుగా

శకుంతల మదన లేఖ !

-

శకుంతల మదన లేఖ !

(మహా కవి కాళిదాసు--- చిత్రం -రాజ రవి వర్మ.) 

.

శకుంతల విరహం లో వుండగా ,.శకుంతల మనో గోప్యాన్ని ”మదన లేఖ ”లో వ్రాసి, దేవతా ప్రసాదం గా దుష్యంతునికి అంద జేస్తే బాగుంటుంది అని చక్కని సలహా నిచ్చింది ఆమె ఇష్ట సఖి ప్రియంవద.

”నీ సలహాను కాదన గలనా ?”అంది శకుంతల .అయితే లేఖ ,ఏ విధం గా ఉండాలో కూడా ప్రియంవదే చెప్పేసింది .”నీ వేదన ,అనురాగ తాపాలు ,చదవ గానే మనసుకు హత్తు కోనేట్లు ,లలిత పద బంధం తో లేఖను రాయి  .”అని సూచించింది .

.

మళ్ళీ ప్రియంవదే ”ఆత్మ గుణావ మానినీ !శరీరానికి చల్లదనం సౌఖ్యం చేకూర్చే శరజ్యోత్స్న ను చేలాన్చలం తో నివారించే వారుంటారా” ?అన్నది .సంబోధన లోనే శకుంతల గుణాదిక్యం ,దానిపై ఆమె కున నమ్మకం వ్యక్తమవుతుంది ”.దుష్యంతుడు తప్పక వలచి తీరతాడు .నీ గుణాదిక్యత కు    ముగ్ధులు కాని వారెవ్వరు ?ఆభి జాత్యం గల, సుకు మారివి .నిన్ను తప్పక స్వీకరిస్తాడు .సందేహం వద్దు .”అని ఖచ్చితం గా చెప్పింది 

..

మన్మధ లేఖ కు కావలసిన సామగ్రిని ప్రియంవదే సిద్ధం చేసింది .”సుకోదర సుకుమారమైన నళిన  పత్రం పై నఖాలతో వర్ణాలు రాయి ‘అని హితవు పల్కింది .అందులో ప్రసాదాన్ని వుంచి ,పొట్లం లాగా మడిచి రాజుకు ఇవ్వ వచ్చు అని చెప్పింది 

.రాజు అక్కడికే వస్తాడు .ప్రియంవద నెమ్మది గా అంటుంది ”మీ ఇరువురి అన్యోన్య అను రాగం ప్రత్యక్షం అయాయి .అయినా మాచేలి యందలి ఆత్మీయత చేత నేను మళ్ళీ చెబుతున్నాను ”అని రాజ ధర్మాన్ని ,ఆయనకు గుర్తు చేసింది .

ఆర్తి లో వున్న వారి ఆర్తి పోగొట్టటం రాజ ధర్మమే కదా అని భావం ”మా ప్రియ సఖి మన్మధ బారి పడింది .ఆమె ప్రాణం నిలప టానికి మీరే అర్హులు ”చాలా చిన్న చిన్న మాటలే .అందులో దుష్యంతుని పై శాకున్తలకున్న అవ్యాజ మైన ప్రేమను వ్యక్త పరుస్తూ మనమ్ధుని పీడా నుంచి ఆమెను కాపాడమనీ ,ఆమె చాలా కృశించి పోయి ఉందనీ ,ప్రాణాలు మాత్రమే నిలిచి ఉన్నాయనీ జ్ఞాపకం చేసిందన్న మాట .ఆమె ప్రాణం కాపాడటానికి అతడే సమర్ధుడు అని నిర్ద్వంద్వం గా చెప్పేసింది .ఇక్కడే ప్రియంవద నేర్పరి తనం మరో సారి కాళిదాసు మనకు వ్యక్తం చేశాడు .

.

మన వాడికి . ఆడ వాసన అసలు పడదు!

               మన వాడికి . ఆడ వాసన అసలు పడదు!

Friday, October 27, 2017

ఆ కిక్కే వేరు.

-

-

ఇలా పుల్లల పొయ్యిమీద చిలకడదుంపలు పెట్టి కాల్చుకుతింటే ఆ కిక్కే వేరు.

-

చిన్నప్పుడు వేణ్ణీళ్ళ పొయ్యిలో చిలగడ దుంపలు కాల్చుకు తినేవాళ్ళం. వేరుసెనక్కాయలు కూడా. 

-

ఈ బొమ్మ క్రెడిట్ అంతా... ఇది ఫోటో కాదంటే నమ్మలేనంత బాగా వేసిన ఆ పెయింటర్ దే.

శ్రీకాళహస్తీశ్వరశతకం ........ధూర్జటి .


-

                    శ్రీకాళహస్తీశ్వరశతకం ........ధూర్జటి .

.

నిను సేవింపగ నాపద ల్బొడమనీ నిత్యోత్సవంబబ్బనీ

జనమాత్రుండననీ మహాత్ముడననీ సంసారమోహంబు పై

కొననీ జ్ఞానము గల్గనీగ్రహగాతుల్ కుందింపనీ మేలువ

చ్చిన రానీ యని నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా 

-

అర్ధం-సుఖాలు ఇచ్చేది భగవంతుడైనప్పుడు,కష్టాలనిచ్చేది కూడా భగవంతుడే!

సుఖాలు అనుభవించేటప్పుడు మనిషి అదంతా తన ప్రతిభ వల్లనే అనుభవిస్తున్నాని భావిస్తాడు.

కష్టాలు వచ్చినప్పుడు,తనకు కాలం కలసి రాలేదని అంటాడు.గ్రహరీతులు బాగాలేవని అంటుంటాడు.

.

కష్టసుఖాలు విడదీయలేనివి.రెండూ కలసే ఉంటాయి.

సుఖాలు అనుభవించటం వల్ల చాలా కష్టాలు రావచ్చు.

కష్టాలు అనుభవించిన తరువాత సుఖాలు పొందవచ్చు

కనుపాప! (యెంకి పాటలు --నండూరి సుబ్బారావు) -


కనుపాప!

(యెంకి పాటలు --నండూరి సుబ్బారావు)

-

అద్దమే లంటాది అందాలు తెలప

ముద్దుమాటల కెంకిదే ముందు నడక

.

అద్దమే లంటాది అందాలు తెలప ...

కంటెదర నా కాడ కనిపాపలో నీడ

సూసుకొంటా నొసట సుక్కెట్టు కుంటాది

.

అద్దమే లంటాది అందాలు తెలప

ముద్దుమాటల కెంకిదే ముందు నడక

కనిపాపలో నీడగని నవ్వుకుంటాది

మొకము సిటిలిస్తాది రకరకము లవుతాది

.

అద్దమే లంటాది అందాలు తెలప

ముద్దుమాటల కెంకిదే ముందు నడక

కంటిదరి నాకాడ కంట నీరెడతాది

కనిపాపలో నీడ మన సదరగొడతాది

.

అద్దమే లంటాది అందాలు తెలప

ముద్దుమాటల కెంకిదే ముందు నడక

కార్తీక పురాణం 9వ రోజు!

-

కార్తీక పురాణం 9వ రోజు!

-

అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతము:
జనకుడు వశిష్ఠులవారితో మునిశ్రేష్ఠా! ఈ అజామిళుడు ఎవడు? పూర్వజన్మలో ఎట్టిపాపములు చేసియుండెను? ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగెనో వివరించమని ప్రార్థించెను. అంత ఆ మునిశ్రేష్ఠుడు జనకమహారాజుతో ఇట్లు పలికెను.
జనకా! అజామిళునిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుడుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుడిని విమానమెక్కించుకొని వైకుంఠమునకు తీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాలా విచారిస్తూ వచ్చాము అని భయపడుతూ చెప్పిరి.
'ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇలా జరగలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును' అని యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతమును తెలుసుకొని 'ఓహో! అదియా సంగతి! తన అవసాన కాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసిగానీ, తెలియకగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా!' అని అనుకొనెను.
అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగానుండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్టియై, వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరించుచూ, శివాలయమలో ధూపదీప నైవేద్యాలను పెట్టక, దుష్టసహవాసములను చేస్తూ తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధము పెట్టుకొనెను. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ, చూడనటుల ప్రవర్తించుచూ భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.
ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి ఈ రోజు నేను ఎంతో అలసిపోయాను, నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉన్నది. త్వరగా వంటచేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు కూడా ఇవ్వక, అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు కలదై భర్తను తూలనాడడం వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త నుండి చేతికర్రను లాక్కొని భర్తను రెండింతలుగా కొట్టి బైటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయెను.
భర్త ఇంటినుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి 'ఓయీ నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు' రమ్మని కోరెను. అంత ఆ చాకలి 'తల్లీ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను. చాకలి వాడునూ. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపుపని చేయజాలను' అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కలసి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి 'అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్ని సాక్షికా పెండ్లాడిన భర్తను ఇంటినుండి వెడలగొట్టి, క్షణికమైన కామవాంఛలకు లోనై మహాపరాధము చేసితిని' అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను.
కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా అతనిపాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి
నుండి ఆమె మంచి నడవడికవల్ల భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు ఏదియో వ్యాది సంక్రమించి దినదినమూ క్షీణించుట చేత మరణించెను. అతడు రౌరవాది నరక కూపమన పడి నానాబాధలు అనుభవించి మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసినందువలన ఏడు జన్మముల పాపములు నశించుటచేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. దాంతో మాలవాడా శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. అదీ వారి పూర్వజన్మ వృతాంతము అని తెలిపెను.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటివారైననూ మోక్షమును పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణశ్రవణములు చేసివారు ఇహ, పర సుఖములను పొందగలరు.

శుభరాత్రి -సౌందర్య లహరి! **** 2***

శుభరాత్రి -సౌందర్య లహరి!

**** 2***

శ్లో|| అవిద్యానా మంతస్తిమిర మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ |

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ||

.

అమ్మా! నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యద్వీప నగరం. ఆ నీ పాదలేశం మందబద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం; లేమిచేత కుంగిపోయే దరిద్రులకు, సకలసంపదలనిచ్చే చింతామణుల శ్రేణి. అంతేగాక జనన మరణ సంసారరూపమైన సాగరంలో మునిగి దరిగానక తపించే వారికి - విష్ణువు అవతారమైన ఆదివరాహస్వామియొక్క కోర అవుతోంది. అంటే ఉద్ధరించేది; సంసార సాగరాన్ని తరింపజేసేది అని భావం.