సుభాషితాలు మానవ జీవన వికాస సూత్రాలు!

సుభాషితాలు మానవ జీవన వికాస సూత్రాలు!

.

"విడమర్చి చెప్పాలంటే, ఒక కథ మరొక కథ నుంచి ఎదుగుతుంది. 

ఒక పద్యం మరొక పద్యం నుంచి ఎదుగుతుంది.

ఒక్కొక్కసారి ఒక కథ నుంచి మరొక పద్యం, 

ఒక పద్యం నుంచి మరొక్క కథ ఎదుగుతాయి."

.

వాడిన పూలే వికసించెనె,

చెర వీడిన హృదయాలు పులకించెనె-- శ్రీ శ్రీ

-

తే: కుసుమ గుఛ్ఛంబునకుఁ బోలెఁ బొసగు 

మాన సౌర్య వంతున కివి రెండుమహితగతులు, 

సకల జన మస్తక ప్రదేశములనైన, 

వనము నందైన జీర్ణభావంబు గనుట!

అభిమాన వంతునకు రెండే జీవనమార్గాలట! 

,

పూలచెండులా,పూలచెండు యెవరైనా 

సిగలోనలంకరించు కొనినట్లయిన

నలుగురిప్రశంసలకు నోచుకుంటుంది.

లేకపోతే ఆయడవిలోనే చెట్టుదగ్గరే వాడిపోయి 

పడిపోతుంది. 

అభిమానవంతుడుగూడా బ్రతికితే అలానలుగురి చేతాప్రశంసింపబడుతూనలుగురితో 

కలసి బ్రతకాలి లేదంటే, యేయడవికోపోయి మునివృత్తితో

జీవించాలితప్ప వేరుమార్గమే లేదట!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!