Skip to main content
కార్తీక దీపం!
కార్తీక దీపం!
-
కార్తీక దీపం వెలిగించేటప్పుడు
"సమస్త చరా చార జీవ రాశులకు" ఈ దీపం వెలుగును,
శుభములను చేకూర్చేలా చెప్పుకోవలసిన శ్లోకం .
ఆశ్లోకాన్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాను .
.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవన్తి త్వం శ్వపచాహి విప్రాః
.
కార్తీక మాసంలో ఉపవాస దీక్షతో పాటు ఉభయ సంధ్యలలో దీపారాధన చేస్తే శివపార్వతుల అనుగ్రహామూ పొందొచ్చు. దీపాన్ని పరబ్రహ్మగా భావిస్తూ, పరమశివుడిని ఆవాహన చేసుకుని మానవాళి మేలుకోసం సాధనలు చేసే బిడ్డలను చూసి పార్వతీ పరమేశ్వరులు ఆనంద తాండవం చేస్తుంటారు. ఈ రోజు నువ్వు వెలిగించిన దీపం మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడింది కాబట్టి ఇదే అగ్నిహోత్రం సాక్షిగా నిలిచి ఈ జన్మలోనే పాప ప్రక్షాళన చేసి ఉత్తమ గతులు పొందేలా పరమశివుడి సన్నిధికి చేరేలా సహకరిస్తుంది. కార్తీక మాసంలో పెట్టే ఒక్క దీపం ముక్తికి మార్గాలన్ని చూపుతుంది.
Comments
Post a Comment