మా దివాకర్ల వెంకట అవధాని సార్ !!

మా దివాకర్ల వెంకట అవధాని సార్ !!

.

తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలోఎంత గాఢానురక్తిని 

క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. 

ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.

పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా 

చదివి వినిపించేవారు.

ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని 

రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన 

ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి.

..

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా

షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా

ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై!!

.

అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ

పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన

స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర

కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్!!

.

అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని

ప్రవరుడి ఘట్టాలను పాడి వినిపిస్తుంటే, మాకు ఒక్క పదం అర్థం కాకపోయినా ఒళ్లు పులకరించిపోయేది. 

రేడియోలో ఘంటసాల, సుశీల, లీల, జిక్కి పాటల, పద్యాల పారవశ్యం ఒక వైపు, ఇల్లు వదిలాక స్కూల్లో తెలుగు పద్య శ్రవణానందం మరోవైపు… 

మా బాల్యం ఎంత హాయిగా గడిచిపోయిందో!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!