జాజి శర్మ గారి వట్టి భోళామనిషి !


.

విక్కీరావు ఆఫీసుకి లేటుగా వెళ్ళేసరికి ఆఫీసర్ తన సీట్లో గంభీరంగా కూర్చుని ఉన్నాడు.

" గుడ్మానింఘ్ సార్ " అని గట్టిగా సకిలించాడు.

...

" ఏమి గుడ్మానింఘ్ ఏమిటోనోయ్ ! ఈ ఆడాళ్ళ తో మహా చిక్కొచ్చి పడింది. మనం తెచ్చిన ఏ చీర బాగుంది అని చెప్పరు. ఎలాగోయ్ వీళ్ళ తో " అన్నాడు ఆఫీసర్ ..

.

" నిజమే సార్ " అన్నాడు ఆయనకి సమర్ధింపుగా .

.

" అది కాదోయ్ ! నల్లపిల్ల , పళ్ళు ఎత్తు, మెల్లకన్ను, ఒక కాలు కుంటి, ఇలాంటి దాన్ని చేసుకున్నాని కృతజ్ఞత కూడా లేకుండా చీర మోహాన కొడుతుందా ! ఇదిగో ఈ చీర మన లక్ష్మీ జనరల్ స్టోర్స్ వాడికి ఇచ్చేసి సాయంకాలం ఇంటికి డబ్బు పట్రా! వెళ్ళి పని చూసుకో " అని చీర సంచి ఇచ్చాడు ఆఫీసర్ .

.

లేటుగా వచ్చినదానికి అక్షింతలు వెయ్యకుండా " పని చూసుకో " అన్నందుకు బతుకు జీవుడా అని చీర సంచి తీసుకుని తన సీటుకి వచ్చేశాడు విక్కీరావు. .

.

సాయంకాలం లక్ష్మీ జనరల్ స్టోర్స్ కి వెళ్లి చీర తాలూకు డబ్బు తీసుకుని ఆఫీసర్ గారింటికి వెళ్ళాడు. 

ఆఫీసర్ గారు మహా ఉషారుగా ఉన్నారు. .

.

.

" రావోయ్ ! రా ! రా ! కూర్చో " అని " డబ్బిచ్చాడా " అనడిగాడు ..

.

"ఇచ్చాడు సార్ ! " అని డబ్బు అందించాడు. .

.

" కాఫీ తాగి వెడుదువుగానీ కుర్చోవోయ్ " అని "మహా లక్ష్మీ ! రావు కి నాకు కాఫీ పట్రావో" అని కేక పెట్టాడు. .

.

విక్కీరావు ఇబ్బందిగానే కూర్చున్నాడు. ఈయన ఆఫీసులో చెప్పిన అవతారం పేరు మహాలక్ష్మీ అన్నమాట. .

.

మరో ఐదు నిమిషాలలో నిజంగానే నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు, కంచి పట్టుచీరలో పసిమి ఛాయతో 

మహాలక్ష్మీగారు కాఫీ ట్రే లో కాఫీ తెచ్చింది. " నమస్కారం ! కాఫీ తీసుకోండి రావు గారు ! " అని తను లోపలి వెళ్ళిపోయింది. .

.

" సార్ ! తమరేమిటీ ! మహాలక్ష్మీ గారిని నల్లపిల్ల , పళ్ళు ఎత్తు, మెల్లకన్ను, ఒక కాలు కుంటి అన్నారు. అమ్మగారు నిజంగా మహాలక్ష్మీలా ఉన్నారు" అన్నాడు విక్కీరావు ఏమీ అర్దం కాక. .

.

.

" నేను ఆఫీసులో చెప్పింది చిన్నిల్లు లేరా బాబు ! ఆ అనంతపురంలో ఎదో కక్కుర్తి పడితే అంటగట్టారు." .

.

.

అసలు సంగతి చెప్పారు ఆఫీసర్ గారు. వట్టి భోళామనిషి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!