జాజి శర్మ గారి వర్షం కురిసిన రాత్రి!

జాజి శర్మ గారి వర్షం కురిసిన రాత్రి!

.

విక్కీరావు ఆఫీసు పనిమీద ఓ పల్లెటూరు వెళ్ళవలసి వచ్చింది.

రాత్రికి అక్కడే బస ఏర్పాటుచేసుకున్నాడు.

ఆఫీసు పని చేసుకుంటూ సిగరోబీస్ అయిపోయినాయి అని గమనించి విసుక్కుని వాటికోసంబయలుదేరాడు. 

బస నుండి కిలోమీటర్ నడిస్తేనే కానీ సిగరోబీస్ దొరకలేదు. 

అవి తీసుకునివస్తుంటే వర్షం మొదలయ్యింది. 

కాస్తంత దూరంలో గొడుగుతో ఓ వ్యక్తి వెడుతుంటే విజిల్ వేశాడు.

.

ఆ వ్యక్తి విజిల్ వినబడి ఆగి వెనక్కి చూశాడు. 

విక్కీరావుని రమ్మని సైగ చేశాడు. 

విక్కీరావు గొడుగులోకివచ్చి "థాంక్స్" అని 

" సారీ! విజిల్ వేశినందుకు" అన్నాడు.

.

" పర్వాలేదు! అలా విజిల్ వేశే నన్ను అంజలి నన్ను ఆకట్టుకున్నది " అన్నాడా వ్యక్తి

.

" అలాగా ! అంజలి అదృష్టవంతురాలు . మీలాంటి పరోపకారులను చేసుకున్నది"

.

" ఆ! ఏం అదృష్టం లెండి. అంజలిని నేను చంపేశాగా ?" అన్నాడా వ్యక్తి

.

" చంపేశారా " అన్నాడు విక్కీరావు కంగారుగా

.

" భయపడకండీ ! నేను మిమ్మల్ని చంపనులెండి. అంజలిని చంపినందుకు నన్ను ఉరి తీశారుగా "

.

అని గొడుగుతో మాయమయ్యడు ఆ వ్యక్తి.

(సిగరోబీస్ అంటే ఫిల్టర్ సిగరెట్లు అని మా వింజమూరి వారు చెప్పారు )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!