శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే --


-

శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే --(ఎర్రాప్రగడ -రామాయణం .)

-

సహజ శాంతస్వభావుడైన శ్రీ రామచంద్రుడు ఆగ్రహిస్తే ఏమవుతుంది? రావణుడు ఎదురుపడగానే రాముడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలేమిటో ఈ క్రింది పద్యంలో చెప్పారు ఎర్రాప్రగడ తన రామాయణంలో..

..

అతని రౌద్రరేఖ గని యబ్ది గలంగె, జలించె శైల మౌ

త్పాతిక వారిదంబు లతి దారుణ రావములై జనించె ధా

త్రీతల మెల్ల బిట్టదరె, దిక్కులు వ్రీలె, సమస్త భూతముల్

భీతి వహించె డెందమగలెన్, రజనీచరలోక భర్తకున్ !

..

ఎర్రాప్రగడ భారతం తెనిగించక ముందే రామాయణం వ్రాసారు. దురుదృష్టవశాత్తూ అది మనకు ప్రస్తుతం అందుబాటులో లేదు. 

శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాల శ్రమించి 46 పద్యాలు సేకరించి భారతి మాసపత్రికలో “ఎర్రాప్రగడ రామాయణం” శీర్షికన ప్రచురించారు. వాటిలో యుద్ధకాండంలోని ఈ పద్యం ఒకటి.

..

(సేకరణః తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఆచార్య వి.రామచంద్ర గారి చిన్ని పుస్తకం “ఎర్రాప్రగడ”. బొమ్మ బాపుగారు 

వేరే సందర్భంలో వేసినది.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!