Monday, September 29, 2014

గౌతమ మహర్షి .......గోదావరి నది పుట్టక

గౌతమ మహర్షి .......గోదావరి నది పుట్టక 


(వివిధ పురాణాల లోని కథ)


గౌతముడు వ్యవసాయ భూ జల శాస్త్రాలలో నిపుణుడు. భారతీయుల వేదవిజ్ఞానం భౌతికమైన విజ్ఞానమే కాక దానికి ఆధారమైన ఆధ్యాత్మిక దైవిక విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. గౌతముడు భౌతిక విజ్ఞానముతో సాధించలేని పనులను దైవికశక్తి ద్వారా సాధించి ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేశాడు. ప్రకృతిని క్షోభించకుండా వివిధ రకాలుకా కాలువలు జలాశయాలు నిర్మించి ఎందఱినో ఆదుకున్నాడు. 


అహల్యా గౌతమ దంపతులు నిరంతర అతిథిసేవా పరాయణులు. గౌతముడు తన వ్యవయాస శాస్త్రవిజ్ఞానముతో శిష్యుల సహాయముతో వరి కాయగూరలు మొదలైన పంటలు పండించేవాడు. పరమసాధ్వి పతివ్రత అయిన అహల్య ఆ పంటలనుండి వచ్చిన వాటిని వండి అతిథులకు ఆర్తులకు పెట్టేది. అపర అన్నపూర్ణ వలె విరాజిల్లేది ఆ అహల్య.


ఇలా ఉండగా గౌతమ అహల్యల అద్వితీయ అతిథిసేవ వారి ధర్మనిరతి చూసి ఈర్ష చెందారు కొందరు మునులు! ఆహా! ఈర్ష అతి దారుణామైనది. అది మహామేధావులైన మునులను సైంతం విడువదు. “ఈ జలం తాము తెచ్చిందేననే అహంకారంతో విర్రవీగుతున్నారీ అహల్యాగౌతములు” అంటూ కువ్యాఖ్యానాలు చేసేవారు. ఈర్ష మత్సరముగా మారి చివరికి వాళ్ళు గౌతముని అక్కడనుండి వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. 


పవిత్రమైన మంత్రములను లౌకిక స్వార్థ ప్రయోజనాలకై వాడకూడదని తెలిసికూడా ఆ మునులు గౌతమునికి కీడు చేయాలనే ఉద్దేశ్యముతో మహాగణపతిని మంత్రబద్ధముగా ఉపాసనచేశారు. ప్రత్యక్షమైన విఘ్నేశ్వరునితో తమ కోరిక చెప్పారు. ఆ వినాయకుడు ఆశ్చర్యపడి “ఔరా! ఏమి చిత్రము! ప్రాణదాతకి ప్రత్యుపకారం చేయకపోగా అతనికి అపకారం చేస్తున్నారే! ఇట్టి కృతఘ్నుల పాపానికి నిష్కృతి ఉండదు” అని తలచి “నాయనలారా! అపకారికి ఉపకారము చేయమని మన శాస్త్రాలు ఘోషిస్తుంటే మీరు కనీసము కృతజ్ఞతా ధర్మాన్ని కూడా పాటించుట లేదెందులకు? ఈ ప్రయత్నం మానండి. కృఘ్నతకు మించిన పాపం లేదు” అని హితవు చెప్పాడు. 

.

“స్వామి! నీవు నిజంగా మంత్రబద్ధుడవే అయితే మా కోరిక తీర్చు” అని సమాధానం చెప్పారు ఆ మునులు. “ఎవరి కర్మకు వారే బాధ్యులు. అటులనే అగుగాక” అని అంతర్ధానమయ్యాడు మహాగణపతి.


గణేశుడు ఒక మాయాధేనువును సృష్టించినాడు. అది గౌతముడి పొలాన్ని పాడుచేయసాగినది. పవిత్రమైన గోమాతను ఎన్నడు అదిలించరాదని తెలిసిన గౌతముడు ఆ మాయాధేనువును పక్కకి పంపాలని గడ్డి పరకలు తీసుని గోవుపై వేశాడు. దానికే అది మృతిచెందినది. గౌతముడు దుఃఖిస్తూ “పరమేశ్వరా! నేనేమి అపరాధము చేసినాను? గడ్డిపరకలు తగిలి గోవు మృతిచెందుటేమి? నన్ను ఈ ఘోరమైన గోహత్యాపాతకము నుండి రక్షించు స్వామి!” అని ఆక్రోశించాడు. ఇలా బాధపడుతున్న గౌతముని చూసి ఆ మునులు “గోహత్య వంటి మహాపాతకము చేసిన మీరు పవిత్రమైన ఈ ఆశ్రమములో ఉండకూడదు. తక్షణం వెళ్ళిపోండి” అని తూలనాడి రాళ్ళు విసిరి వెళ్ళగొట్టారు.


మహాపాపము చేశానే అనే దుఃఖంతో గౌతముడు అహల్య ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయారు. సకల ధర్మసూక్ష్మాలు తెలిసిన ఆ గౌతమ మహర్షి ప్రాయశ్చిత్త విధానము తెలిసికూడా పండితమండలిచే ఆమోదముద్ర వేయించుకోవాలనే ఉద్దేశ్యముతో క్రోశదూరం వెళ్ళినా తిరిగివచ్చి తనకు అపకారం చేసిన మునులకు నమస్కరించి “అయ్యా! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉపదేశించండి” అని ప్రార్థించాడు! “గౌతమా! చేసిన తప్పు చెప్పుకుంటూ పృథ్వికి ముమ్మార్లు ప్రదక్షిణము చేసి ఇక్కడ మాసవ్రతము చేయాలి. లేదా ఈ బ్రహ్మగిరికి నూటొక్కమార్లు ప్రదక్షిణములు చేసి కోటి పార్థివలింగారాధన చేసి గంగాస్నానము చేయాలి” అని ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించారు. గౌతమ మహర్షి అటులనే చేశాడు. అప్పుడు పరమశివుడు సంతోషించి


“నాయనా! గౌతమా! నీవు ధన్యుడవు. ఆజన్మ శుద్ధుడవైన నీకు పాపము లేదు. ఇదంతా ఆ మునుల కుతంత్రము. ఈ కృతఘ్నులకు ప్రాయశ్చిత్తము లేదు. వీరు భ్రష్టులై వేదమార్గాన్ని వదిలి నాకు దూరమవుతారు. వీరి వంశములోని వారంతా పతితులవుతారు. వత్సా! ఏదైనా వరం కోరుకో. ప్రసాదిస్తాను.” అని అన్నాడు. కరుణామయుడైన గౌతముడు “స్వామి! ఈ మునివరులు నాకు ఉపకారమే చేసినారు. వీరివల్లనే కదా నేడు నాకు నీ దర్శన మహద్భాగ్యము కలిగినది!” అని అన్నాడు. పరమశివుడు గౌతముని క్షమాగుణము చూసి సంతోషించాడు. “స్వామి! లోకకళ్యాణార్థము గంగను ప్రసాదించు” అని కోరాడు గౌతముడు. పరమశివుని సంకల్ప మాత్రాన ప్రత్యక్షమైన గంగాభవానిని స్తుతించి గౌతముడు “భాగీరథివై ఉత్తర భారతమును అనుగ్రహించినట్టే గోదావరివై దక్షిణ భారతాన్ని ఆంధ్రభూమిని పునీతము చేయి తల్లీ!” అని ప్రార్థించాడు. గంగాదేవి కోరికపై స్వామి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపుడై గోదావరీనది జన్మస్థానములో అవతరించాడు. గౌతమ మహర్షి పేఱున ఆ నది గౌతమీనదిగా ప్రసిద్ధికెక్కినది...


Sunday, September 28, 2014

బాల్యం....ఒక తీపి గుర్తు...

బాల్యం....ఒక తీపి  గుర్తు...


నేను ...నా సిగాన పెసునా.


బాబాయి గాడి దొంగ చూపులు..
జడకుండు మహిమ తెలియదు జడులకు ...

బడినన్ నేర్వగ రాదే

జడకుండు మహిమ తెలియదు జడులకు జగమే

జడలుండు పడతి ఇలతిరి

గెడు తేనెలలది యది పొసగెడు కత్తేరా

పాఠాంతరం 

బడినన్ నేర్వగ రాదే

జడకుండు మహిమ తెలియదు జడులకు జగమే

జడలుండు పడతి ఇలతిరి

గెడు పూల్తురిమిన యది పొసగెడు కత్తేరా!

Saturday, September 27, 2014

బాలరసాల సాల

శ్రీనాథ మహాకవి భాగవతాన్ని రాజుకి అంకితమిమ్మని చెప్పటానికి పోతన ఇంటికి పల్లకి లో వెడుతున్నారు. పోతనకొడుకు పొలం దున్నుతున్నారు. 

శ్రీనాథుడు తన మహాత్మ్యము చూపుదాం అని, ఒక పక్క పల్లకి బొంగు మోస్తున్న బోయీలను తొలగిపొమ్మన్నారు. ఆ బోయీలు లేకున్నా పల్లకి వెళ్తోంది.

అది చూసి కొడుకు వింతపడగా, పోతన నాగలి కాడికి గట్టిన వెలపలి ఎద్దును తొలగించమన్నారు. ఆ ఎద్దు లేకుండానే నాగలి పొలమును దున్నుతోంది.

శ్రీనాథుడు రెండో పక్క బోయీలను కూడ తొలగిపొమ్మన్నారు. ఏ బోయీలు లేకున్నా పల్లకి గాలిలో తేలుతూ వెళ్తోంది. 

పోతన లోపలి ఎద్దును సైతం తొలగించమన్నారు. 

ఏ ఎద్దు లేకుండానే గాలిలో తేలుతూ నాగలి పొలం దున్నుతోంది. ఆ దృశ్యము చూసి శ్రీనాథుడు పల్లకి దిగివచ్చి పోతనతో "హాలికులకు సేమమా?" అని పరిహాస మాడారు.

వెంటనే పోతన ఆశువుగా ఇలా కవిత్వ పటుత్వపు పద్యం రూపంలో సమాధాన మిచ్చారు.

ఉ.

బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్

గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

గున్నమామిడి చెట్టుకు పూసిన లేత చివుళ్ళలా కోమలమైనట్టి, కావ్యం అనే కన్యను అమ్ముకుని; అట్టి నీచపు తిండి తినడం కంటే; నిజమైన కవి నాగలి పట్టిన వ్యవసాయదారు డైనప్పటికి తప్పులేదు; అడవీ ప్రాంతాలలో కంద దుంపలు, పుట్టతేనెలుతో దీవించువా రైనప్పటికి తప్పులేదు.

Friday, September 26, 2014

పద్య సాహిత్యం » మనుచరిత్ర.లో కొన్ని పద్యాలు........

పద్య సాహిత్యం » మనుచరిత్ర.లో కొన్ని పద్యాలు........రచన: అల్లసాని పెద్దన.

.

తొలితెలుగు ప్రబంధం మనుచరిత్ర. నీతినీ ధర్మాన్నీ భక్తినీ బోధించటం అంతకుముందు వచ్చిన తెలుగు రచనల గమ్యం.

ఐతే పెద్దన తన మనుచరిత్రతో తెలుగు సాహిత్యాన్నంతటినీ ఓ మలుపు తిప్పాడు. 

.

వాల్మీకి శోకం శ్లోకం ఐతే పెద్దన ఆనందం ప్రబంధమైంది.

సామాజికస్థితిగతులు అసంతృప్తికరంగా ఉన్నప్పుడు, జీవితం దుఃఖభాజనంగా కనిపించినప్పుడు “సాహిత్యప్రయోజనం సమాజశ్రేయస్సే” అన్న దృష్టి సాహితీకారులకు కలగటం చూశాం, ఇప్పుడూ చూస్తున్నాం. 

సుఖసంతోషాల్తో సౌభాగ్యంతో ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ఉన్న సమాజపు జీవనదృష్టిని ప్రతిబింబించేవి తొలితరం ప్రబంధాలు. వాటిలో తొలిదీ ఉన్నతమైనదీ ఈ మనుచరిత్ర.

.

వరణాద్వీపవతీ తటాంచలమునన్‌ వప్రస్థలీ చుంబితాం

బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ

హరిణంబై అరుణాస్పదంబనగ ఆర్యావర్తదేశంబునన్‌

పురమొప్పున్‌ మహికంఠహార తరళ స్ఫూర్తిన్‌ విడంబింపుచున్‌

.

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా

షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా

ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై

.

.శీలంబుం కులమున్‌ శమంబు దమముం చెల్వంబు లేబ్రాయముం

పోలంజూచి ఇతండె పాత్రుడని ఏ భూపాలు డీవచ్చినన్‌

సాలగ్రామము మున్నుగా కొనడు మాన్యక్షేత్రమున్‌ పెక్కుచం

దాలం పండు నొకప్పుడుం తరుగ దింటం పాడియుం పంటయున్‌

.

ముడిచిన యొంటికెంజెడ మూయ మువ్వన్నె

మెగముతోలు కిరీటముగ ధరించి

కకపాల కేదార కటక ముద్రిత పాణి

కురుచ లాతాముతో కూర్చిపట్టి

ఐణేయమైన ఒడ్డాణంబు లవణిచే

నక్కళించిన పొట్టమక్కళించి

ఆరకూటచ్ఛాయ నవఘళింపగ చాలు

బడుగుదేహంబున భస్మమలది

మిట్టయురమున నిడుయోగపట్టె మెరయ

చెవుల రుద్రాక్షపోగులు చవుకళింప

కావికుబుసంబు జలకుండికయును పూని

చేరె తద్గేహ మౌషధసిద్ధు డొకడు

.

మౌనినాథ కుటుంబ జంబాల పటల

మగ్న మాదృశ గృహమేధిమండలంబు

నుద్ధరింపంగ నౌషధమొండు కలదె

యుష్మదంఘ్రిరజో లేశమొకటి తక్క..

అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”

“మై గాడ్ బయింగ్ బుక్స్! బార్బేరియస్! వర్స్ దాన్ సెల్లింగ్ గర్ల్స్!..” అన్నాడు గిరీశం. 

.

పుస్తకానికి ఖోపం వచ్చేసింది. 

పుస్తకాలతల్లి సరస్వతమ్మకి (అంటే సరస్వతిగారి అమ్మగారు కాదు – సరస్వతిగారే అమ్మగారు) ఇంకా చాలా ఖొపం వచ్చేసింది. 

హాం ఫట్ అనగానే ముళ్ళపూడి వెంకట రమణ పుట్టాడు.

.

“అమ్మా ఒక పది కాణీలు వుంటే అప్పిస్తావా?” అన్నాడు పుట్టగానే.

.

“నీకు అప్పులిచ్చేవాళ్ళని తిప్పలిచ్చేవాళ్ళని మా ఆయన పుట్టిస్తున్నాడు గానీ నువ్వు నాకొక పని చేసి పెట్టాలి” అన్నది.

,

“ఓస్ అంతే కదా.. ఏమిటో చెప్పు” అన్నాడు రవణ

.

“ఈ టెలుగుస్ వున్నారే వీళ్ళకి పుస్తకం విలువ, చదువుల విలువ, అక్షరం విలువ అట్టే తెలిసినట్టు లేదు.. నువ్వెళ్ళి అలాంటి వాళ్ళందరిచేత పుస్తకం కొనేట్టు చెయ్యాలి..”

.

“హమ్మబాబోయ్.. అంత పని నా వల్ల కాదు నాకు ఎవరైనా తోడు కావాలి..”

.

“తోడుకేం తక్కువోయ్ – ఇదుగో బొమ్మల బాపు, అంత్యప్రాసల ఆరుద్ర, “పొగల”సెగల శ్రీశ్రీ, నండూరి నీకు ఫ్రెండూరి.. అందాల రాముడు అక్కినేని, దుక్కిపాటి, భానుమతి..”

.

“ఇంకా ఇంకా..!!”

.

“కష్టాలు కన్నీళ్ళు.. ఇబ్బందులు సొబ్బందులు..”

.

“విల విల లాడించే సంతోషాలు, పక పకలాడించే కష్టాలు..”

.

“హన్నా..”

.

“హ హ… ఇంకా చెప్తాను చూడు.. బుడుగు, సీగానపెసునాంబ, రెండు జెళ్ళ సీత, గోపాలం, అప్పుల అప్పారావు, జనతా ఎక్స్‌ప్రెస్ జనాలు.. వీళ్ళు నేను పుట్టించిన మనుషులు.. మీ ఆయన పుట్టించిన మనుషులకి నకలు డిటోకి కాపి స్ఫూర్తి..”

.

“ఏమిటా కోతివేషాలు..”

“అమ్మా ఇదేదో బాగుందే.. కోతి వేషాలు, కోతి గెంతులు… కోతి కొమ్మచ్చులు”

“తథాస్తు”

“మరి నువ్వు రావా అమ్మా..?”

.

“పిచ్చినాయనా.. నిన్ను చూసుకోడానికి నేనెందుకూ? నా బదులుగా తొమ్మిదిమంది అమ్మల్ని ఇస్తాను సరేనా?”

.

“సరే”


x

Thursday, September 25, 2014

బాలత్రిపుర సుందరి ...

శుభోదయం... 

.

బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే 

అజ్ఞానం తొలగిపోతుందని విశ్వాసం. 

బాలా శబ్దానికి అన్నెము, పున్నెము ఎరుగని బాలిక అని అర్థం. చిన్న పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అటువంటి హృదయాలలో పరమాత్మిక నివసిస్తుంది. 

కాబట్టి మనం చిన్న పిల్లలలాగా నిర్మలంగా అమ్మవారిని ఆరాధించాలి. 

.

నవదుర్గాస్తోత్రం

శైలపుత్రీ-

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం |

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం ||

బ్రహ్మచారిణీ-

దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలః |

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

చంద్రఘంటా-

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

కూష్మాండా-

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |

దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

స్కందమాతా-

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |

శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

కాత్యాయనీ-

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |

కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

కాళరాత్రీ-

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా |

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |

వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

మహాగౌరి-

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |

మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

సిద్ధిదాత్రీ-

సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |

సేవ్యమానా సదా భూయాత్సిద్ధిదా సిద్ధిదాయినీ ||

“నమిలి మింగిన నా యెంకి”


“నమిలి మింగిన నా యెంకి” 

.ఎంకి నాయుడుబావల ప్రణయానికి, ప్రేమకు పరాకాష్ఠ.!

.

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!

యెంకి నా వొంకింక రాదోయీ రాదోయీ !

మెళ్ళో పూసలపేరు

తల్లో పూవుల సేరు

కళ్ళెత్తితే సాలు

కనకాబిసేకాలు

యెంకి వొంటి పిల్ల లేదోయి…
సెక్కిట సిన్నీమచ్చ

సెపితే సాలదు లచ్చ !

వొక్క నవ్వే యేలు

వొజ్జిర వొయిడూరాలు !

….

రాసోరింటికైన

రంగు తెచ్చే పిల్ల

నా సొమ్ము – నా గుండె

నమిలి మింగిన పిల్ల

నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే

నాకు తెలిసింది అంతా ఏంటంటే తెలుగు వారంటే 

.

ఆవకాయ, తిరుపతి, ఎన్టీఆరు,ఏఎన్ఆరు.. బాపు రమణ ..అంతే. .

తెలుగు ట్రేడ్ మార్కు.తెలుగువాడి ఖ్యాతిని నిలబెట్టిన వారిలో ముఖ్యులు అని చెప్పొచ్చు.

Wednesday, September 24, 2014