"మాయమైపోతున్న మా తెలుగు అమ్మాయి"

చిలకల పలుకుల పిల్లకి

తళుకుల విరిజడ బలముకి తలబరువయితే

కళకళ మెరిసెడి మోమున

అలకలు కలుగగ విసుగున అలసట పొడమే.

.

"మాయమైపోతున్న మా తెలుగు అమ్మాయి" గురించే నేను చెపుతున్నా!. 

ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగమ్మాయిని చూసారా? 

చూస్తే చెప్పండి బాబూ మీకు పుణ్యం ఉంటుంది. 

ఓ! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదు కదూ! ఆనవాలు చెపుతా, వినండీ. 

మా అమ్మాయి అమాయకంగా అందంగా ఉంతుంది.

మా అమ్మాయి పరికిణి ( లంగా) కట్టుకుని ఉంటుంది.అలాగే ఓణి వేసుకుని ఉంటుంది.తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుని,చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదిటిన చంద్రబింబం లాంటి బోట్టుతో, కాళ్లకు పట్టిలతో ముద్దబంతి పువ్వులా ఉంటుంది.ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? మాకైతే గత 10 సంవత్సారాలుగ కనిపించడం లేదు. పండక్కో,పబ్బానికో,అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమై పోతుందంతే.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!